మత్స్య మహా పురాణము

Table of Contents

25 - యయాతి చరితమున కచ వృత్తాంత కథనము

దేవప్రార్థనయా కచకృత శుక్రసమీపగమనమ్

ఋషులు సూతుని ఇట్లు ప్రశ్నించిరి. పూరుడు యయాతి కుమారులలో చిన్న వాడే యైనను అతని వంశము లోకమున శ్రేష్ఠమయినదిగా ఏల ప్రసిద్ధమయ్యెను? యదువు జ్యేష్ఠుడే యైనను అతని వంశము ఏల శోభలో తక్కువది అయ్యెను? కారణము తెలుపుడు. అంతే కాక యయాతి చరితమును కూడ ఇంకను విస్తరించి తెలుపుడు. అది పుణ్యకరమును ఆయుర్వృద్ధికరమును దేవతలు కూడ అభినందించునదియును.

సూతుడు ఈ విధముగా చెప్పెను. “ఋషులారా! మీరు అన్నట్లు ఈ యయాతి చరిత్రము పుణ్యకరమును పవిత్రమును ఆయుర్వృద్ధి కరమును చాల గొప్పదియును. పూర్వము శతానీకుడు (జనమేజయుని కుమారుడు) అడుగగా శౌనకుడు దీనిని అతనికి చెప్పెను.

ఎట్లన- ప్రజాపతినుండి ఎనిమిదవ తరము నకు చెందినవాడును మా పూర్వ పురుషుడును అగు యయాతి మిగుల సౌందర్యవతియు శుక్రుని కూతురును అగు దేవయానిని ఎట్లు వివాహ మాడెను ? తపోధనా? ఇదియంతయు సవిస్తరముగా వినవలెనని నాకు కుతూహలముగా ఉన్నది. యయాతి మొదలుకొని ఆనుపూర్వితో పూరుని వంశమును నిలిపిన రాజుల నందరను నాకు వివరింపుడు: అని శతానీకుడు శౌనకుని అడిగేను.

శౌనకుడు ఇట్లు చెప్పనారంభించెను: యయాతి రాజర్షి. దేవేంద్రునితో సమానముగా ప్రకాశించిన రాజు, శుక్రుడును వృషపర్వుడును ఆతనిని తమ అల్లునిగా చేసికొనిరి ఆ విధమును నీకు తెలి పెదను. రాక్షసగురుడగు శు కుని కూతురు దేవయాని. మానవలోకాధిపతియగు నహుషుని కుమారుడు యయాతి. వీరికిద్దరకును దంపతులుగా కలయిక ఎట్లు జరిగేను? అని నీవడిగితివి. రాజస త్త్రమా! మొదట నీకు ఆది తెలి పెదను.

చరాచరాత్మకమగు మూడు లోకములకు మేమే అధిపతులము. అను భావముతో ఈ విషయమున దేవతలకును అసురులకును పర స్పరము స్పర్ధ పోటీ) ఏర్పడెను. వారు ఒక పక్షము వారు మరొక పక్షము వారిని జయించవలెనను తలంపుతో అంగిరసుని కుమారుడగు బృహస్పతిని దేవతలును కవి వంశీయుడగు ఉశనసుని (శుక్రుని) రాక్షసులును తాము జరి పెడి యజ్ఞములందు పురోహితులుగా నుండునట్లు ఏస్పరచుకొనిరి. ఆ బ్రాహ్మణులు ఇరువురును ఒకరిపై ఒకరు పోటీ పడుచుండిరి. యుద్దములందు దేవతల చేతిలో మరణించిన దానవులను శుక్రుడు తన విద్యా బలము నౌ శయించి పునర్జీవితు లనుగా జేయుచుండెను. వారును మరల జీవించి లేచి దేవతలతో యుద్ధము చేయుచుండిరి. బృహస్పతియు ఉదారమగు బుద్ధి కలవాడే కాని తపో విద్యా వీర్యము కల శు; కునకు తెలిసిన సంజీవనీవిద్య బృహస్పతికి తెలియక పోవుట చేత రాక్షసులచేతిలో మరణించిన దేవతలను తిరిగి బ్రదికింపలేకుండెను. అందుచే దేవతలు మిగుల విషాదమును పొందుచుండిరి. వారు కావ్యుడగు ఉశనసునకు (శుక్రునకు) మిగుల భయపడుచు బృహస్పతి జ్యేష్టపుత్రుడగు కచునికడకు వచ్చి ఇట్లు పలికిరి: అయ్యా! మేము మిమ్ముల ఆశ్రయించుచున్నాము. మాకు మీరు రక్షణ మీయవలెను. మాకు మీరొక సహాయము చేయవలెను. అమిత తేజోవంతు డగు శుక్రునియొద్ద నున్న సంజీవనీ విద్యను శీఘ్రముగా సంపాదించి తే '్చ మా కుపకారము చేయుడు. మేము నీకు మాతోపాటు యజ్ఞ గమును అంగీకరింతుము , నీ పా బ్రాహ్మణుని రాక్షస రాజగు వృషపర్వుని యొద్ద దర్శించవచ్చును. ఆతడచ్చట నుండి రాక్షసులను రక్షించుచు రాక్షసులు కాని వారికి రక్షణ కలుగనీయ కున్నొడు. ఇంతకుముందు ఎవ్వరును అతనిని మెప్పించగలవారు లేకుండిరి. ఆ మహాత్మునకు దేవలయానియను ప్రియపుత్తి కలదు. నీవు తప్ప ఆమెను ఆరాధించి మెప్పించ గల వారు ఇంకెవ్వరును లేరు. నీ శీలము తీయని నడువడి ప్రీతిభావము ఆచారము ఇంద్రియనిగహము వీటితో నీవా మేను ఆరాధించి సంతుష్టురాలనుగా చేయుము. ఆమె సంతుష్టురాలయిన చో నీవు నిశ్చయముగా ఆ విద్యను సంపాదింపగలపు.”

కచకృతశుక్రశుశ్రూషా

బృహస్పతి కుమారుడగు కచుడు దేవతల ప్రార్థన నంగీక రించి దేవతలు తను అభిపూజించుచుండ బయలు దేరి వృషపర్వునిరాజధానికి పోయి అచట శుద్రుని దర్శించి ఇట్లు పలికెను: “నేను అంగిరసుని మనుమడను-బృహస్పతి కుమారుడను. కచుడనువాడను. తాము నన్ను తమ శిష్యునిగా గ్రహింపవలెను. గురుకులమున వేయి సంవత్సరములైనను బ్రహ్మచర్య వ్రతమును ఆచరింపగలను. ఆందులకు నన్న నుమతించుడు.” అనగా శుక్రుడును కచునకు ఆదరముతో స్వాగతము పలికి నాయనా ! నీ కోరిక నంగీకరించుచున్నాను. నీవు అర్చనీయుడవు. కావున నిన్నర్చంతును. నిన్న ర్చించి నచో బృహస్పతిని అర్చించినట్లే. అనెను. కచుడును కవిమునిపుత్తుడగు ఉశనసుడు (శుకుడు) స్వయముగా ఆదేశించిన బ్రహ్మచర్య వ్రతమును స్వీకరించేను. వ్రత కాలమంతయును గురువు చెప్పినట్లు పాటించుచు తన ఉపాధ్యాయుని దేవ అయానీని కూడ ఆరాధించుచుండెను.

కచుడు తానును యువకుడు. దేవయానియు యౌవనమందుండెను. అందుచే ఆమెను మెప్పింపగోరి అతడు నిరంతరమును గానము చేయుట నృత్యము, చేయుట వాద్యములు మోయించుట ద్వారమున ఆమెను సంతోష పెట్టు చుండెను. ఆమె మనస్సును అనుసరించి నడుచుకొనుచు ఆమెకు ఇష్టములగు పూవులు పండ్లు తెచ్చి ఇచ్చుచు ఆమె చెప్పిన పనులు చేయుచుండెను. ఆ విప్రుడు కచుడు ఇట్లు గురుకుల నియమములను ఆనుష్ఠించుచు తన దేహ సంస్కా రమును కూడ మరచియుండెను. ఇట్టి కచుని పై ప్రీతి కలిగి దేవయాని అపుడపుడు ఏకాంతమున అతనితో మాట లాడుచుండెడిది.

ఇట్లు ఐదువందల సంవత్సరములు గడచెను. ఈ విషయమును రాక్షసులు తెలిసికొనిరి. అతడేదో సంకల్పము తో ఇటు తీవ్రమగు బ్రహ్మచర్య వ్రతమును పాటించుచున్నాడని వారు గుర్తించిరి. వారు బృహస్పతి పై పగ తీర్చు కోవలెననియు సంజీవని విద్య రక్షించుకొనవలెననియు సంకల్పించుకొనిరి. ఒక నాడు ఆక చుడు ఒంటిగా అడవిలో గోవులను కాచుచుండుట చూచి వారు అతనిని చంపిరి. నువ్వు గింజలంత ముక్కలు చేసిరి. వాటిని సాలావృకము లను మృగములకు తినవేసిరి.

గో అంతట సాయంకాలమున వులు తమ్ము కాచు కచుడు లేక యే తమ (శుక్రుని) ఆశ్రమమునకు పోయేను. కచుడు లేకయే వనము నుండి మరలివచ్చిన గోవులను దేవయాని చూచెను. కొంత సేపటి తరువాత ఆమె శుకుని కడకు పోయి ఇట్లు పలికెను. “తం డీ! సూర్యుడు ఆ స్తమించినాడు. మీ అగ్ని హోతములందు హోమము ముగిసినది. గోపాలకుడు లేక యే గోవులు మరలివచ్చినవి. కచుడు మాత్రము కనబడుటలేదు. అతనిని ఎవరో చంపుటయో అతడు తానే కారణముననో మరణించుటయో జరిగినట్లు తోచుచున్నది. ఉన్న మాట చెప్పుచున్నాను. అతడు లేనిదే నేను జీవించజాలను.”

అది విని శుక్రుడును "ఇదుగో! ఇదుగో! రమ్ము! అని పలికినంతనే కచుడు జీవించివచ్చును.” అనుచు సంజీవనీ విద్యను ప్రయోగించెను. కచుని పిలిచెను. పిలిచిన వెంటనే అతడు ఆవిద్యకు అంది జీవించివచ్చి ఎదుట నిలిచెను.

మరల ఒక నాడు దేవయాని కోరగా ఆమె కొరకు పుష్పములను తెచ్చుటకై శాశ్వతమగు బ్రహ్మమును. వేదమును(ఏలయన ఆది పరబ్రహ్మమువలెనే శాశ్వతమును-ప్రతి సృష్టియుందురు తనంతట తాను నిష్పన్న మై బ్రహ్మాది ఋషులకు దర్శనమును ఇచ్చుచు లోకమున పరంపరాగతమయి వ్యాపించునదియును) పఠించుచు అరణ్యమునకు పోయెను. అంతట మరల రాక్షసులు రెండవమారు కచుని చంపి చూర్ణముగా చేసి దానిని మద్యములో కలిపి శుక్రునకు త్రోవుట కై ఇచ్చిరి. "

మరల దేవయాని తన తండ్రి కడకు పోయి తండ్రితో ఇట్లు పలికెను. “నాయనా! నేను పూలు తెమ్మని కచుని పంపితిని. ఆ పనికై వెళ్ళిన అతడు తిరిగి కనబడలేదు. బృహస్పతి పుత్రుడు కచుడు మృతుడై పేతల గతికి పోయియుండును.”

శుక్రుడు: “నేను అతనిని మరల విద్యతో జీవింపజేసినను నేను నీకు చేయు ఉపకార మేమున్నది? దేవయానీ! నీవు ఇట్లు శోకింపకుము. ఏడువకుము. ఐనను నీకు మాత్రము తక్కువ ఏమున్నది? ఇందుని సేవించుచుండు దేవరులును బ్రహ్మరులును మునులును ఇంద్రాది దేవతలును వసువులును అశ్వినులును రాక్షసులందరును లోకమునందలి ప్రతియొక పదార్థమును నా తపః ప్రభావమున నీ సేవకై నీ ఎదుట నిలుచును. ఇట్టి నీవంటి ఆమె మర్త్యుని విషయములో శోకించుట తగినది కాదు. అదియును కాక ఈ బ్రాహ్మణుని జీవింపజేయుట సాధ్యముకాదు. ఒక వేళ జీవింపజేసినను అతడు మరల మరణించును.”

దేవయాని: సాక్షాత్ ప్రజాపతియగు - అంగిరసుడు లోకమునందలి వృదతములలోనివాడు ఈ కచునికి తాతగారు. తపోనిధియగు బృహస్పతి ఇతని తండ్రి. బ్రహ్మచర్య వ్రతమును అనుష్ఠించుచున్న వాడు. తపోధనుడు. ఎల్లప్పుడు ఉన్న తమగు చిత్త్రవృత్తితో ఉండువాడు. కార్యములను ఎట్టివానినై నను నిర్వహించుటలో సమర్థుడు. చాల సుందరుడు. నాకు ఇష్టుడు. నేను కచుని మార్గమునే అనుసరింతును. భోజనము చేయను ”

దేవయాని పలికిన మాటలు విని మహర్షియు కవి కుమారుడును అగు శుక్రుడు క్రోధావేశముతో ఇట్లు పలి కెను: ఈ రాక్షసులు నా శిష్యునియందు పగపూని ఇట్లు చంపుచున్నారు. అనిన . వారు నన్ను ను ద్వేషించుచున్నట్లున్న ది. దానవులు ఈ విధముగా చేయుచున్నారనిస.వారు బ్రాహ్మణులనే నశింపజేయదలచుచున్నట్లున్న ది. వారు చేయదలచు చేయు. ఈపని కూడ ఇంతటితోనే ముగియగలదు. బ్రహ్మహత్యా దోషము ఎవనిని కాల్చివేయకుండును? అది ఇంద్రుని కూడ విడువదు.”

ఇట్లు పలికి శు, కుడు విద్యతో కచుని పిలిచెను. దానితో అతడు బ్రది కెను. తరువాత అతనిని దగ్గరకు రమ్మని పిలిచెను. అతడు శుక్రుని ఉదర మందుండియే నెమ్మదిగా మాటలాడెను. శుక్రుడును కచునితో “విప్రా! ఎవరు. చేసిన పని చేత నీవు నా ఉదరములోనికి వచ్చి ఇక్కడ ఇట్లున్నా వో చెప్పుము.” అనెను.

కచుడు: అయ్యా! మీ అనుగ్రహమువలన పూర్వ స్మృతి జ్ఞానము నన్ను విడుచుటలేదు. ఏది ఎట్లు జరిగినదో ఆంతయు స్మృతియందు ఉన్నది. ఇక్కడ నాకు కలుగు చున్న బాధను నా తపో మహిమతో పోగొట్టుకొనగలను. బయటకు రాగలను. కాని నా తపోనాశము జరుగనీయరాడను తలంపుతో ఈ బాధను సహించుచు ఊరకున్నా ను. రాక్షసులు నన్ను చంపి కాల్చి నీ మద్యములో కలిపి నీకు ఇచ్చినారు. మీరు ఇంతటి వారు ఉండగా రాక్షసమాయ కాని మరి ఏ ఇతర ల మాయకాని వేదశ క్తితో సిద్ధించిన బ్రాహ్మణ మాయను మించిపోగలదు?” మ. పు. 14) శుకుడు: “వు తీ: నా మరణము జరుగనిదే కచుడు జీవించుట జరుగదు. నా ఉదరము చీలనిదే నా పొట్టలోని ఈ కచుడు బయటకు వచ్చి కనబడు అవకాశము లేదు. ఈ రెంటిలో నీకు ఏది ప్రియ మో తెలిపినచో అది చేయుదును.''

దేవయాని: “నన్ను అగ్ని వంటి రెండు శ్లోకములు దహించుచున్నవి. వానితో ఒకటి కచుని మరణము. రెండవది మీ నాశము. కచుని నాశము వలన నాధర్మము నశించును. మీరు మరణించినచో నేను - బ్రదుకనే బ్రదుక జాలను.”

శుక్రుడు (కచునితో): “బృహస్పతి కుమారా! నీవు భక్తితో దేవయానిని సేవించి ప్రతిఫలముగా నీవు ఆమె భక్తిని పొందగలుగుట చేత నీవు నీ యత్నములో సంపూర్ణముగా సిద్ధి పొందితివి. ఇదిగో! ఈ సంజీవనీ విద్యను నీకు అందించుచున్నాను. గ్రహింపుము. నీవు కచుని రూపములో నున్న ఇంద్రుడవు ఐనచో మాత్రము నీకు నేను ఈ విద్యనీయను. ఏలయనగా బ్రాహ్మణుడు తప్ప మరెవ్వడును నా ఉదరము నుండి పునర్జీవితుడయి బయటకు . వచ్చు అవకాశము లేదు. నీవు బ్రాహ్మణుడవే కనుక నా కుమారుడవయి నానుండి విద్యను స్వీకరింపుము. అనంతరము ఆ విద్యా గ్రహణముతో దానిని భావనచేసి (ఆ మంత్రమునందు సిద్ధిని పొంది) తరువాతనే నీవు నా శరీరము నుండి వెలుపలికి రావలెను."

ఇట్లు పలికి శుక్రుడు అధర్మపరులయి ప్రవర్తించువారి భేదమును ధర్మపరులకును అధర్మపరులకును 'గల భేదమును) నిందించెను. అంతట కచుడు గురువగు శుక్రునినుండి సంజీవనీ విద్యను అందుకొని విద్యాసహితుడై అతని దక్షిణకు జిని (ఉదరమును చీల్చుకొని ఎప్పటి సుందరరూపముతో వెలుపలికి వచ్చెను. అపుడతడు రాత్రి కాగానే హిమవత్పర్వతపు తెల్లని శిఖరపు చాటునుండి ఉదయించి పైకి వచ్చు పూర్ణిమా చంద్రునివలె ప్రకాశించెను.. కచుడును పడియున్న వేదరాశివంటి శుక్రుని చూచి తన విద్యాబలముచే అతనిని మరల బ్రదికించి లేవదీ నెను. ఇట్లు సిద్ధి పొందిన విద్యను సంపాదించుకొని కచుడు గురుని నమస్కరించి ఇట్లు పలికెను.

“సర్వోత్త్రమమగు బ్రహ్మచర్య వ్రతమును ప్రదానము చేసినవాడును నిధులలో గొప్ప నిధియు గొప్ప వారందరలో గొప్పవాడును పూజింపదగిన వాడును అగు గురుని ఎవరు ఆదరించ రో-వారు అయోగ్యములును పాపానుభవమును కలిగించు నవియును అగు లోకములను పొందుదురు.”

శుక్రుడు తాను సురాపాన ప్రభావమున రాక్షసులవలన వంచనకు పాతుడయ్యెను. తన చిత్త్రమునకు గల తెలివి అంతయు ఘోరమగు నాశమును పొందెను. మిగుల సుందరుడును యోగ్యుడును అగు క చుడు అజ్ఞానముచే మద్యముతో పాటు తనచేత తాగబడిన విషయము నాతడాలోచిం నేను. ఇందుచే ఆ మహానుభావునకు కోపము కలిగి అతడు లేచి నిలువబడెను. సురాపానము విషయమున ఏ సందేహమును లేని నిశ్చయము చేసికొనెను. ఆ కావ్యుడు ఉశ నసుడు బ్రాహ్మణులకు హితము చేయగోరి స్వయముగా ఈ విధముగా పలి కెను. “ఇది మొదలుకొని ఏ బ్రాహ్మణుడైన మంద బుద్దియై అజ్ఞానవశమున మద్యమును త్రావినచో అతడు ధర్మభ్రష్టుడె బ్రహ్మహత్యా పాపమును పొందును. ఇహ లోకమునందును పరలోకమునందును నిందితు డగును. బ్రాహ్మణులు ఆచరించవలసిన ధర్మము విషయము తో నేను చెప్పిన అవధిని ధర్మవ్యవస్థను లోకమునందంతట విప్రులు నిలుపుకొందురుగాక ! వేదములందును శాస్త్రములందును పెద్దల వచనములందును ప్రామాణ్య బుద్ధి కలవారును గురువుల నుండి వేదశాస్త్ర తత్వమును అధ్యయనము చేసిన వారును అగు విప్రులును దేవలోకమునందలి దేవతలును దేవరులును అందరును దీనిని విందురుగాక!”

మహానుభావుడును తపోనిధులలోగూడ ఇంత గొప్పది అని చెప్పనలవికాని గొప్పనిధియును అగు ఆ శుక్రుడు విమూఢ బుద్దులగు దానవులను కూడ పిలిచి ఇట్లు పలికెను. “బాలిశులై న దానవులారా! మీకు ఒక మాట చెప్పుచున్నాను వినుడు. నా శిష్యుడు అగు. ఈ కచుడు నావలన మాయారహితమగు సంజీవనీ విద్యను సంపాదించినా ప్రభావముతో సమాన ప్రభావము కలిగి బ్రహ్మత్వమునే పొందిన బ్రాహ్మణుడై నా సమీపమున నుండును.”

ఇట్లు కచుడు ఋషియు తన గురువును అగు శు కుని దగ్గర వేయి సంవత్సరములు ఉండి గురునినుండి అనుమతిని పొంది స్వర్గమునకు మరలిపోదలచేను.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున చంద్రవంశానువర్ణనమున యయాతి చరిత్రమున

కచ వృత్తాంత కథనము అను ఇరువదియైదవ అధ్యాయము.