మత్స్య మహా పురాణము
58 - తటాకాది ప్రతిష్ఠా విధానము
సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను: తటాకములు ఆరామములు (తోటలు) బావులు దిగుడు బావులు సరస్సులు దేవాలయములు వీని ప్రతిష్ట జరుపు 1. విధానమును అచట కావలసిన 2. ఋత్విజులు 3. వేదికలు 4. దక్షిణలు 5. బలులు 6. కాలము 7. స్థానము 8. ఆచార్యుడు 9. ద్రవ్యములు ఏవి ఎట్టివిగా నుండవలెనో తెలుపుము. అని మనువు మత్స్యనారా యణు నడిగేను.
మత్స్యనారాయణుడిట్లు చెప్పెను: మహాబాహు! రాజా! పురుష శ్రేష్టా! వినుము. ఈ విధానమంతయు ( వేది కములగు) పురాణములయందు “ఇతిహాస” రూపమున ఇతి.హ- (ఉండెను అనికాదు. ఇది ఇట్లుండవలెను ఆని ఇచ్చట అర్థము.) అని చెప్పబడియున్నది. 6. (కాలము ఉత్తరాయనము-శుక్లపక్షము - బ్రాహ్మణులు నిర్ణయించిన శుభ దినము ప్రశస్తములు. బ్రాహ్మణులచే స్వస్తి వాచనము జరిపించిన తరువాతనే ఈ ప్రతిష్ఠా కార్యము జరుపవలేను. 7. (స్థానము) తటాకము - ఆరామము -కూపము.పి-దేవాలయము) సమీపమున తూర్పునకు ఉత్తరమునకు వాలుగా ఉన్న ప్రదేశము ప్రశస్తము. 3. వేదికలు) నాలుగేసి మూరల భుజములతో చతురస్రముగా నుండు నాలుగు ముఖములు గల వేదికను పదునారు మూరల భుజములు గల చతుర్ముఖ మండపములో నిర్మించవలెను. వేదికకు చుట్టును మేఖలలతో కూడినవియు పిడిమూర భుజములు లోతునుగల గుంటలు తొమ్మిదికాని ఏడు కాని ఐదు కాని త్రవ్వవలేను. ఇవికాక పండెం డంగుళముల పొడవును ఆడంగుళముల వెడలుపునుగల యోని (ఆధోముఖ త్రిభుజాకృతి వేది)- నాలుగు గుంటలు ఏర్పరచవలయును. ఈ గుంటలలో ప్రతిదానికి చుట్టును మూడు వరుసలలో ఎత్తైన మేఖలలు ఉండవలెను. (మేఖల = చుట్టును ఉండెడి గట్టు) అనేక వర్ణముల పతాక లును జెండాలును తోరణములును) రావి మేడి జువ్వి మర్రి కొమ్మలతో చేసి అమర్చిన ద్వారములును మండపము చుట్టును ఏర్పరచవలెను. 2. (ఋత్విక్కులు మొదలగువారు) ఎనిమిది మంది ద్వారపాలురు-ఎనిమిది మంది హోతలు ఎనిమిది మంది జపకర్తలును వేదపారంగతులయిన బ్రాహ్మణు లుండ వలెను. 8. ఆచార్యుడు) నర్వ వైదిక లక్షణములు కలిగి మంత్రవేత్త జితేంద్రియుడు కులశీలవంతుడు నగు బ్రాహ్మణుడు ఆచార్యుడు(ప్రధాన ఋత్విక్)గా నుండవలెను. 9. (ద్రవ్యములు) ప్రతియొక గుంట దగ్గరను కలశములు యజ్ఞోపకరణ ములు (స్రుక్ స్రువములు దర్భలు మొదలగునవి) విసనకర్ర తెల్లని చామరములు వెడల్పయిన రాగిపాత్ర ఉండవలెను.
(బలులు ప్రతి యొక దేవతను ఉద్దేశించి అనేక వర్ణములు గల బలులు ఏర్పరచి అన్ని విషయములను ఎరిగిన ఆచార్యుడు వాటిని మంత్రసహితముగా వేయవలెను. 9. యూపము) యూప స్తంభము మూడు పిడిమూరల పొడవున గాని యజమానుని ఎత్తునగాని ఉండుట క్షేమప్రదము. ( భూషణములు) ఇరువదియైదు మంది ఋత్విజులకును బంగారుతో కుండలములు భుజకీర్తులు చేతి కడియములు వేళ్ళకు పవిత్రములు చేయించవలెను. వివిధములగు వస్త్రము లీయవలెను. దక్షిణలు అందరకును సమానము గాను ఆచార్యునకు మాత్రము ఒక్కొక్క ఋత్విజునకు ఇచ్చినదానికి ద్విగుణముగాను ఇచ్చుట కేర్పరచవలేను. వారి కీంక ను మంచము పరపు మరింకేదైన తనకు నచ్చినది కాని బంగారుతో చేసిన కూర్మమకరములను వెండితో చేసిన చేపను నీటిపామును రాగితో చేసిన ఎండి కప్పు నీటి కాకి శిశుమారము మత్స్యము ఇట్టివి కూడ చేయించవలెను.
1. ఇట్టివి సమకూర్చుకొనిన తరువాత యజమానుడును అతని భార్య యు సర్వేషధీజలములతో విప్రులు పఠించు వేదమంత్రములతో స్నానమాడి తెల్లని వస్త్రములను తెల్లని గంధములను తాల్చి పుత్ర పౌత్తులతో కూడి పడమటి ద్వార మునుండి యాగ మంటపమును ప్రవేశించవలయును. మంగళ వాద్యములు మ్రోగుచుండ ఐదువన్నెల ముగ్గు పొడితో చతురస్రమును దాని నడుము వృత్తమును దానిలోపల షోడశారచక్రమును దాని నడుమ పద్మమునందు బ్రహ్మను లిఖించ వలెను. ఇట్లలంక రించిన వేది పై ఆయా దిక్కులందును స్థానములందును దిక్పాలకులను గ్రహములను ఆయా మంత్రము లతో నిలుపవలేను. వారుణ మంత్రములతో కూర్మము మొదలగు ప్రతిమలను త్రిమూర్తులను గణపతిని లక్ష్మీపార్వ(సర స్వతీ )తులను సర్వభూత గణములను సిలుపవలెను. మంటపమున పీఠము పై వస్త్రము పరచి దాని పై పుష్పాక్షతఫలము లను ఉంచి రత్నములతో జలములతో నిండిన కలశము లుంచి వాని నడుమనే పై విధముగా గ్రహాదులను నిలువ వలయును.
తరువాత ద్వార పాల ఋత్విక్కులను జాపకులను ఆచార్యుని హోతలను పూజించవలెను. ద్వారపాలురలో ఋగ్వేదులను ఇద్దరను తూర్పున యజుర్వేదులను ఇద్దరను దక్షిణమున సామవేదులను ఇద్దరను పడమట ఆథర్వణులను ఇద్దరను ఉత్తరమున కూర్చుండ పెట్టవలయును. యజమానుడు తాను మంటపములో దక్షిణ దిశను ఉత్తరమునకు తిరిగి కూర్చుండవలెను. ద్వారపాలురను వేదపఠనము చేయుడనియు జాపకులను జపిం చుడనియు హోతలను యజనము చేయించుడనియు ఋత్విగ్వరణము చేసి ప్రార్థించవలెను.
తరువాత అగ్ని కి పరుక్షణము చేసి ఆర్చించవలయును. గ్రహములను ఇంద్రుని ఈశ్వరుని మరుత్తులను ' లోక పాలురను విశ్వకర్మను ఉద్దేశించి వారుణ మంత్రములతో నేతితో సమిధలతో హోమము చేయవలెను. ఈ హోమ కాలము లోనే ద్వారపాలురలో ఋగ్వేదీయులు రాత్రి-రుద్ర -పవమాన-పురుష సూక్తములను పఠింతురు. యజుర్వేదులుశా క రౌద్ర.సౌమ్య-కూశ్మాండ జాతవేదన..సౌర-సూకములు పఠింతురు. సామవేదులు వై రాజపౌరుష. సౌపర్ణ-రౌద్ర- శ్యేత. పంచనిధన-గాయత్ర. జ్యేష్ణసామ-వామదేవ -బృహత్సామగౌరవమరథంతర-గవాంద్రత-వికర్ణ-రక్షోఘ్న -వయన-సూక్తములు పఠింతురు. ఆథర్వణులు వరుణ దేవతాక ములగు శాంతిక పౌష్టిక మంత్రములు పఠింతురు.
ఇంకను గజములు ఆశ్వములు రథములు నిలుచు ప్రదేశములనుండియు పుట్టనుండియు నదీసంగమ ప్రద గోకుల ప్రదేశములనుండియు ఇండ్ల ముంగిళ్ళనుండియు తెచ్చిన మృత్తికను కడవలలో వేసి వానియందు నింపిన నీటితో గోరోచనా యవ సిద్దార్త (తెల్ల ఆవలు) గంధ గుగ్గులు చూర్ణములతో పంచ గవ్యముతో ఆయా మంత్రములతో వరుణు నకు యథావిధానముగ స్నపనము చేయించవలేను. ఇదంతయు తటాక ప్రతిష్టకు ముందటి దినమున చేయవలసిన ప్రక్రియ.
ప్రతిష్టా దినమున ఉదయకాలమున బ్రాహ్మణులకు నూరుకాని ఆరువది ఎనిమిది కాని ఏబదికాని ముప్పది ఆరుకాని ఇరువదికాని గోవుల దానమీయవలెను. తరువాత జ్యోతిషికులు చెప్పిన 'శుభలగ్నమునందు వేద-గాన-వాద్య ధ్వనులనడుమ బంగారుతో అలంకరించబడిన గోవును ( ఈ క్రొత్త తటాక పు) నీటిలో దింపి పిమ్మట దానిని సామ వేదియగు బ్రాహ్మణునకు దానమీయవలేను. పిమ్మట పంచరత్నములు తాపటము చేసిన బంగారు పాత్రలో మకర మత్స్యాది ప్రతిమలను వేసి వేద వేదాంగ పారంగతులై న నలుగురు విప్రులు దానిని పట్టుకొనగా దానిలో నదీ జలములు దధి- అక్షతలు నింపి ఉత్తరాభిముఖులై న ఆ వి! పులచే 'దానిని నీటిలో దింపించవలెను. ఆథర్వణసోమ మంత్రములతో ‘పునర్మామా' ‘ఆపోహిష్ణా' అను మంత్రములతో ఆపాత్రను నీటిలో పడ వేసి మంటపమునకు వచ్చి సదస్సును (సదస్సు లోని పెద్దలను పూజించి మంటపమునకు అన్ని దిక్కులందు బలి వేయవలెను. తరువాత నాలుగు దినములు వరుసగా హోమము జరిపి - నాలుగవనాడు- కర్మ సమాపి జరుపవలేను. వరుణునకు (మంత్ర పూర్వముగ) క్షమాపణము చెప్పి యజ్గ పాత్రములను యజ్ఞాపక రణములను మండప సామగ్రిని దక్షిణలను ఋత్విజులకు సమముగా పంచవలెను. హోమ పాత్రను శయ్యను ఆచార్యునకు ఈయవలెను. తరువాత యథా శక్తిగా వేయి . అష్టోత్తర శతము . ఏబది-ఇరువది మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. ..
ఇది (వైదిక ) పురాణములందు చెప్పియున్న తటాక ప్రతిష్ణా విధానము. బావులు దిగుడు బావులు కోనేళ్ళు మొదలగు జలాశయ ప్రతిష్టలన్ని టియందు ఇదే విధానము. ప్రాసాదములు ఉద్యానములు భూమి ప్రతిష్ఠించుట దాన మిచ్చుట మొదలగు వానిలో మంత్రములు భేదించవచ్చును. శ క్తిలేని వారు దీనిని సంక్షిప్త పరచి ఏకాగ్ని (వానప్రస్థుడు) వలేనే న జరుపవచ్చును. తనకు ధనము విషయమున శక్తి యుండియు కోరత చేయరాదు. ఈ శాస్త్ర విధానమున ప్రతిష్టించిన జలాశయములలోని నీరు ప్రాణుల కుపయోగింపబడి వర్షాకాలము నందుపయుక్తమై అగ్నిష్టోమమను యజ్గము చే కలుగు ఫలమును శరత్కాలమున ఉపయోగపడి ఉక్ట్య యజ్గఫలమును హేమంతమున ఉపయోగపడి వాజపేయ యజ్గఫలమును శిశిరమున ఉపయోగపడి అతిరాత్రయజ్గఫలమును వన స్తమున ఉపయోగపడి అశ్వమేధ ఫలమును గ్రీష్మమునకూడ ఉపయోగపడి రాజసూయముకంటే అధిక ఫలమును ఇచ్చును.
ధనము ఉన్నంతలో నిర్మల బుద్ధి కలిగి ఈ వి శేష ధర్మముల నాచరించినవాడు పవిత్రు డై శివలోకమున కేగును. అనేక కల్పముల కాలము స్వర్గమున నానందించును. రెండు పరార్దములపాటు తన ధర్మపత్నితో కూడ మహర్షనాది లోకములందు సుఖించి యోగసిద్దులకు మాత్రము లభించు విష్ణు పరమపద మును కూడ పొందును..
ఇది శ్రీమత్స్యమహాపురాణమున తటాక ప్రతిష్టా విధాన కథనమను ఏబది ఎనిమిదవ ఆధ్యాయము.
