మత్స్య మహా పురాణము
131 - ఈశ్వరుడు త్రిపుర విజయమునకై సన్నాహముతో బయలు వెడలుట
సూతుడిట్లు చెప్పనారంభించెను: బ్రహ్మాదులు తన్నిట్లు స్తుతించుచుండ దేవదేవుడు అగు మ హేశ్వరుడు బహ్మనుద్దేశించి ' దేవతలకు మహాభయ మేవం వలన?' అని యడిగి ఇంకను ఇట్లు పలి కెను; దేవత లారా! మీకు స్వాగతమా! మీమనోగత మేమో చెప్పడు. అది యుదగినదగుగాక.ఈయరానిదగుగాక : సౌకు మా తమది ఈయ రానిది కాదు. సుర శేష్టులారా! మీరు కోరు ఆభీష్ట మేడై నను అది తప్పక ఇత్తును. నేను ఆచరించు మహోగ్ర తపము కూడ మీకొరకే. మీకు ద్వేష్యులు నాకును ద్వేష్యులే; వారు నాకు నీచులు నీచతగులు ( ; ఆపై మీకు శుభమగు విషయము నాకును శుభమయినదే. ప్రీతితో శిపుడిట్లు పలుకగా యజ్ఞమున భాగాస్తులగు బ్రహ్మాది దేవతలందరును రుద్రునితో నిట్లనిరి: భగవన్! రౌద్ర (భయంకర పరాక్రములగు దానవులు రౌద్రమగు తపమాచరించి తద్బలమున - లోకములనే నిర్మూ లించుచుండ భయమంది నిన్ను శరణు జొచ్చితిమి. త్రినే తా! మయుడను కలహ ప్రియుడగు దైత్యుడు రాజార ములగు శ్వేత గోపుర ములుగల త్రిపుర దుర్గము నిర్మించేను. జేష్ఠమగు ఆ దుర్గమా! శ్రయించి దానవులు చర ప్రభావమున నిర్భయులై ప్రభువులు తమ సేవకులనుకలే మమ్ము బాధించుచున్నారు. వారు నందనాది ససములు భగ్న మొనర్చినారు. మేలగు రంభాద్యప్సరసలనెల్ల హరించినాడు. ఇంద్రుని వాహనములగు ఐరావత కుముదాం జున వాయసములను చంద్రుడు మొదలగువారి వాహనములగు అశ్వములను దానవులు హరించినారు. పోరు వానిచే తమరథములు లాగించుకొనుచున్నారు. ఇంత ఏల? మారథములు గజములశములు స్త్రీలు ధనము సమ న్తమును అపహరించు బే కాక దైత్యులు మా జీవితములే సంశయాస్పదములు చేసినారు.
ఈశ్వరారోహణ యోగ్యరథనిర్మాణమ్
ఇంద్రాది దేవత లిట్లు పలుక దేవేశుడు వరదుడు వృషవాహనుడగు త్రినేత్రుడు వారితో ఇట్లు పలికెను: దేవతలారా! మీరు దానవులవలన భయపడవలసిన పని లేదు; నేనది తొలగింతును. అందులకే నేను త్రిపుర దుర్గ మును దహింతును. మీరందుల కై చేయవలసినది చెప్పెద వినుడు; అట్లు చేయుడు. నేను దానవులతో కూడ మయుని తిపుర దుర్గమును దహించుట మీకిష్టమైనచో ఊరకుండక తడవు చేయక నాకు తగిన రథమును సిద్ధపరపుడు. దిగ్వసుడగు శివుడట్లు పలుక బ్రహ్మాది దేవతలు ఆప్లేయని మహాదేవునితో పలికి వారు తను రథమును సిద్దపరచిరి. భూమియే రథము; శివుని పార్శ్వచరులిద్దరు కూబర ములు (కాడి కొనలు); మేరుపర్వత శిఖరము కూర్చుండు స్థానము; మందర పర్వతము ఇరుసు; చంద్రసూర్యులు ఇద్దరును బంగరు వెండి చక్రములు; శుక్ల కృష్ణపక్షములు రథనేమి ద్వయము; నాగులలో మొదటి ఇద్దరు (శ్రేష్ఠుడు –వాసుకి) తక్షకుడు కంబశాశ్వతనాగులు అను నాగులను త్రాళ్ళుగా చేసి శుక్ర బృహస్పతి బుధంగారక శనైశ్చరులను ఆయా రథ భాగములుగా చేసి ఈ భాగముల నా త్రాళ్ళతో బిగించి కట్టిరి. ఆకాశము ఆరథమునకు దారు నిర్మిత రక్షణ పంజరము. మరి ముగ్గురు నాగ శ్రేష్ఠులు బంగారు త్రివేణువు (అను రథపు ముందు భాగమునందలి త్రిభుజాకారపు అమరిక) గంగ సింధు శతద్రు చంద్రభాగ ఇరావతి వితస్త విపాశ యమున గండకి సరస్వతి దేవిక సీత సరయూ అనునదులు అమ్ముల పొదులు; ధార్త రాష్ట్ర కర్కోటక వాసుక్యై యరావత జాతినాగులు తూణీరములందలి శరములు ఆయ్యేను.
సురస-సరమ-కద్రువ-వినత. శుచి-తృష్ణ-బు భుజా- ఉగ్రవేదన-చిత్ర సంభవ బ్రహ్మహత్య. గోహత్య-అశ్వహత్య మొదలగు భయానకత త్వములు గదలుగా శ క్యాయుధములుగా నయి రథమున నిలిచెను. కృతయుగము కాడి-చాతుర్దోత్ర యజ్ఞము సారథి కూర్చుండుస్థానము-చతుర్వర్ణ ములు విలాసవంతములగు వన్నెల కుండలములు అయ్యెను. కృతయుగము వలే ధర్మయుతమై ప్రకాశించు ఆ గొప్పకాడిని రథశీర్షమున (అగ్రభాగమున) నిలిపి విషవంతుడగు ధృతరాష్ట్ర నాగునితో బంధించిరి. ఋకోమయజు గాథర్వణ వేదములు నాలుగు గుర్రము లయ్యెను. అన్నదానాది దానములు అశ్వములకు వేల కోలది భూషణము లయ్యెను. పద్మమహాపద్ములు తక్షకుడు కర్కోటకుడు ధనంజయుడు అను నాగులు గుర్రములను కట్టి వేయు పగ్గము లయ్యెను. ఓంకార మునుండి జనించిన క్రతుప్రియములగు సర్వస్తోమములును పశుబంధ యజ్ఞములందు వినియు కమగు ఉపద్రవ పతీహార్దికముల ఉపవాహ్యములు ఇవన్నీ యు వేలకొలది మణులు ము తైములు పగడములు మొదలగునవి అయ్యెను. ప్రణవము కొరడా వషట్కారము ఆకారడాకొన-సినీవాలీ (చంద్రదర్శనము కల అమావాస్య) గుహూ (చంద్రదర్శనములేని అమావాస్య రాకా (నిండు పున్నమ) భానుమతి (సూర్యు డస్తమించుటకు ముందే చంద్రో దయమగు పూర్ణిమ -ఇట్టి పర్వతిథులన్ని యు గుర్రములను కాడితో కట్టు యో క్షము లయ్యెను. నల్లనివి పచ్చనివి నీలవర్ణము కలవి మాంజిష్ట(ఎర్రని) వర్ణముకలవియగు వ్యజన(విత్రములు (యజ్ఞములందుపయోగించు విసన కర్రలు గాలిలో రెపరెపలాడు జెండా లయ్యెను. నాలుగు ఋతువులలో (వసంత గ్రీష్మము లొకటిగా హేమంత శిశిరము లొకటిగా లెక్కించగా) (ఆరు ఋతువులతో) చిత్రించబడిన సంవత్సరము ధను వయ్యెను. కాలాంశము లన్ని యు గట్టి అంబక (బాణముల మొనలు అయ్యెను. భగవానుడగు రుద్రుడు సాక్షాత్కాలమూర్తియగు సంవత్సర మే. అందుననే సత్వ రూపఉమ కాళరాత్రిరూప కావున ఆమె వింటి నారి యయ్యెను. భగవానుడగు నీలలోహితమూర్తి త్రివురముల దహించ సమర్థుడగు వీరు డయ్యెను. విష్ణు సోమాగ్ని దేవతాత్రయము ఒకటయి ప్రధాన బాణ మయ్యెను. ఆగ్ని రథికూర్చుండు ఆసనము సోముడు పీఠమును రథముతో బిగించు చీల(శల్యము) విష్ణువు; ఆ ఆసనపు శిఖా భాగము బాణమునకు ఆయా తేజస్సులతో పదును పెట్టిరి. బోణపు మొనయందు నాగరాజగు వాసుకి శత్రు సంహార సమర్థమగు తన కోరలయందలి జ్వలించు విషమును విడిచెను.
ప్రమథులు అందరును సజల మేఘములవలె ధ్వని చేయుచు తమ తమ దర్పములతో కూడి దేవదేవుని పరివారించి రథము నకు అన్ని వైపులను క్రమ్మి పోవుచుండిరి. ప్రళయమహార్ణవము వెంట మకర తిమీ తిమింగీలాది జల జంతు సము దాయమువలే వారు వెంట పోవుచుండ ఆ త్రిపుర దాహియగు రథ శ్రేష్టము పిడుగుపాటుతో కూడిన మేఘమువలె ధ్వని చేయుచు ముందుకు సాగుచుండెను.
ఇది శ్రీమత్స్య మహాపురాణమున త్రిపురోపాఖ్యానమున ఈశ్వరుడు త్రిపుర విజయమునకై బయలు వెడలుట యనునూట ముప్పది యొకటవ అధ్యాయము.
