మత్స్య మహా పురాణము
176 - కాలనేమి విజయము
శ్రీమత్స్య నారాయణుడు మనువునకు "ఇంకను ఇట్లు చెప్పెనని సూతుడు ఋషులకు వచించేను॥ దానవుల సేనల నడుమ కాలనేమి మహా సురుడు వృద్ధినందిన తన మహా తేజస్సుతో నిండియు తన వర్ల ముచే గ్రీష్మాంతమున (వర్షాసమయా॥ రంథమందలి మేఘమువలే కనబడుచుండెను॥ త్రిలోకాంతర్బాగమున నిండియున్న అతనిని చూడగానే ఆదాన వేశ్వరు, లందరును " ఉత్తమమగు అమృతమును త్రాగినందుచేతవలే శ్రమయంతయు తీరి లేచిరి॥ మయుడు తారుడు మొదలగు దొన, వులు ఆ జరుగుచుండిన తారకామయ సంగ్రామమున ॥ అంతవరకు ఎడ తెగని జయము తో ప్రకాశించుచుండిన ట్లే ఇపుడు ఏమాత్రమును భయ సంత్రాసములు లేక యుద్ధము చేయగోరుచు ప్రకాశించిరి॥ వర్షా కాలమందు విజృంభించిన దట్టమగు మేఘములవంటి ఆ దానవులు కొందరు మంత్రములను ఆ వృత్తి చేయుచుండిరి॥ మరి కొందరు వ్యూహములందు ఆటు నిటు పడగెత్తు చుండిరి॥ ॥ వారి కందరకును ఈ కాలనేమిని చూచిన కొలది హరమధికమగు చుండెను॥ మయుని సహచరు లలో అ యుద్ధమున అగ్రగాములును ముఖ్యులును అగు దానవులందరును ఏమాత్రమును భయము లేక హర్షముతోనిండి యుద్ధము చేయుట కె సిద్దులయి నిలిచిరి॥ మయుడు తారుడు వరాహుడు వీర్యశాలియగు హయగ్రీవుడు విప్రచిత్తి దానవుని కుమారుడగు శ్వేతుడు ఖరుడు లంబుడు బలి పుత్తడగు ఆరిష్టుడు కిశోరుడు దేవతలలోనివాడు వలె ప్రకాశించువాడును నోటితో యుద్ధము చేయు వాడునగు స్వర్భాను (రాహు) మహానురుడు॥ ఈ దానవులందరును అస్త్ర వేత్తలును మహా తపో వంతులును కార్యనిపుణులును నగువారు; వీరందరును తమ కే ఆశ్చర్యము గొలుపుచున్న ఆ కాలనేమీ దగ్గరకుపోయి ఆత నిని పరివేష్టించి యుండిరి॥
పారు బరువయిన గదలు చక్రములు రథములు గండ్ర గొడ్డండ్రు యమదండములవంటి ముసలములు వడి నెలలు ముద్దరములు కొండలవంటి రాళ్లు భయంకరములగు గండ శైలములు ( పెద్ద పెద్ద బండలు) పట్టసములు భిండి పొలములు ఉత్తమమగు ఉక్కుతో చేసిన పరిఘలు బరువగు ఘాత నీ ఆయుధములు శతఘ్నులు కాండ్లు॥॥వదలుటకు సిద్దముగా నుంచిన యంత్రములు భయంకరముగా దెబ్బ కొట్టు బాణములు పొడవయి యొప్పు భుజములు పాసములు పాశములు మూర్చనములు (మూర్ఛవచ్చునట్లు చేయుటకు వనికివచ్చు యుద్దసాధన విశేషములు) నాలుకలు క్రోయుచున్న నర్పములు ప్రాకుచున్న పాములవలే కనబడు మెలికలశరములు ప్రహరించుటకు పనికివచ్చు చక్రములు ప్రకాశించుతోమరములు ఒర నుండి తీసియుంచిన తీక్ష ఖడ్గములు తెల్లని నిర్మల శూలములుక లిగి దైత్యులు చురుకయిన మనస్సులతో ధనువులు పట్టి నిలిచిరి॥ ఇట్లా మహా యుద్ధమున దైత్య సేన ప్రకాశించు ఆయుధ శ్రేష్టములు దాల్చి కాలనేమిని ముందుంచుకొని నీల మేఘములు క్రమ్మగా పూర్ణముగా మూతపడిన ఆకాశ మువలె (కారునలుపుతో) ప్రకాశించేను॥
చంద్ర సూర్యుల తెల్లని నల్లని కనుపాపలతోకూడి వాయు వేగముక లిగి సౌమ్యమయి తారాగణములు పతాకలు కాగా మేఘములను వస్త్రములు దాల్చి గ్రహములతో నక్షత్రములతో నవ్వుచు దేవ సేన ప్రకాశించు చుండెను॥ శకుడు పాలించుచుండ యమేంద్ర వరుణకుబేరులు కాపాడుచుండ అగ్ని తన సదనములందు వేదికలందు)॥ ప్రకాశించుచుండ నారాయణుడు పరమశరణమైయుండ ఆ సేన సముద్ర జలరాశివలె దివ్యరూపముతో ఒప్పుచుండెను॥ వారికిని అస్త్రములు కలవు॥ యక్ష గంధర్వులు (తమ చేష్టలతో) పరులకు భయము గొలుపు చుండిరి॥ అంతలో ఆ రెండు సేనలును ప్రళయ కాలమందు భూమ్యంతరిక్షములు తారసిల్లినట్లు పరస్పర మేదుర్కొనేను॥ దేవ దానవులకు జరిగిన ఆ యుద్దము సంకుల మును ఘోర మునునయి ॥క్షమాపరాక్రమములకును దర్పవినయములకును జరుగు రణమువలె నుండెను॥ అందు దేవతలును దానవులును ఇరు సేనలనుండియు తూర్పు పడమటి సముద్రములనుండి వెలికివచ్చి కలియు మేఘములవలె వెలికివచ్చి తారసిల్లిరి॥ వారుకోపావిష్టులును భయంకరులును నై యుండిరి॥
దేవతలును దానవులును అటువంటి రెండు సేనలతో కూడి పర్వతములందలి పూచిన వనద్వయముతో కూడిన గజములవలె అందముగా కనబడుచు నంచరించుచుండిరి॥ ఆంతలో భేరులను మోగించిరి॥ ఆనేకములగు శంఖములను పూరించిరి॥ ఆ ధ్వనితో భూమ్యాకాశములును దిక్కులును నిండిపోయేను॥ అలై లాటిని కంపింపజేయుటచే కలిగిన ధ్వనులును ధనువుల కూతలును దుందుభుల ధ్వనులును దైత్యుల (అరపుల) ధ్వనులను తమయందు ఇముడ్చుకోనేను॥ వారు పరస్పరము ఎదుర్కొనిరి; పడ వేసికొనుచుండిరి॥ భుజములతో భుజములను విరుగగొట్టుకొనుచుండిరి॥ మరి కొందరు ద్వంద్వయుద్ధము చేయగోరి సిద్ధమగుచుండిరి॥ దేవతలు దానవుల పై ఘోరములగు వజ్రములను (పిడుగులను మేలగు ఉక్కుతో చేసిన పరీఘలను ఖడ్గములను బరువగు గదలను యుద్ధమునందు ప్రయోగించుచుండిరి॥ దానవులు గదా పాతములతో ఆవయవములు విరిగి బాణములతో ముక్కలయి మిక్కిలిగా పడిపోవుచుండిరి॥ మరికొందరు చంప బడుచుండిరి॥ ఇంకను కొందరు ఎదురు నిలిచి దేవతలనే కొట్టుచుండిరి॥ వారు శీఘ గమనముగల రథములతోను॥ అశ్వములతోను విమానములతోను సంచరించుచు రోషావిష్ణులే ఆవేశముతో పరస్పరము తలపడి పోరుచుండిరి॥ పేదవు లను కొరుకుచు వికృతముఖములతో వారు రణమున భయంకరులుగా నుండిరి॥ రథికులు రథికులతో పదాతులు పదాతులతో పోరుచుండిరి॥ ధ్వని జనక ములగు ఆ దేవదానవ రథముల తుముల శబ్దము శ్రావణ భాద్రపద మాసము లందు కలుగు వర్షాకాల మేఘముల ధ్వనివలే నుండెను॥ కొందరు రథములను విరుగగొట్టిరి॥ కొందరను రథములు విరుగగొట్టేను॥ కొందరు ఇరుకు ప్రదేశములందు చిక్కుకొని రథములను కదలించలేకుండిరి॥ కవచ ధారులగు వీరులు కొందరు ఒకరినింకొకరు పైకెత్తి వేయుచుండిరి॥ మరికొందరు తమ ఆభరణములు ధ్వని చేయుచుండ కత్తులు పలక లు డాళ్ళు) ధరించిన వీరులను కూడ కొట్టుచుండిరి॥ కొందరు అస్త్రముల దెబ్బలుతిని ర క్తము కక్కుచు చచ్చుచు వర్షి కాలమున నీరు వర్షించు మేఘములవలె కనబడుచుండిరి॥ ఆ దేవ దానవులకు తుములయుద్దము అస్త్రశస్త్రముల" ఆల్లికతో ఎత్తి విసర బడుచున్న గదలతో క్రుద్దులయిన దేవదానవులతో భయంకరమయి యొ ప్పెను॥ అట్టి ఈ యుద్ధమున దాన వులు మహామేఘములును దేవతలు ప్రయోగించు ఆయుధములు ఇంధ్రధనువులుగా పరస్పర ప్రయుక్త శస్త్ర ప్రయో గములు వర్షముగా దుర్దినమయి (మేఘములాకసమావరించిన దినమయి) ప్రకాశించెను॥
ఇంతలో కాలనేమి మహాసురుడు సముద్రజలములు లావిన మబ్బువలే వృద్ధిపొందెను॥ మెరపులవలే చంచల మయి “మెరయు ఆభరణములు కల అవయవము(తో)నుండి ప్రజ్వలించు పిడుగులను వర్షించుచు ఏనుగులవంటివియు పర్వతమంతటివియు మేఘములు వెలువడసాగెను॥ క్రోధమువలన, శ్వాస వదలుచున్న వాని ముఖమునుండి కనుబొమల ముడులను చేమటను వర్షించుచు పొగలతో నిండి అగ్నితో కూడిన జ్వాలలు బయటకు రాసాగేను॥ వాని బాహువులు ఆక నమునందు అడ్డముగను నిలువుగను పెరుగుచు పర్వతములందుండి వెలువడు ఐదుతలలసర్పములవలే కనబడు చుం డేను॥ బహు విధములగు శస్త్రజాలములును ధనువులును పరిఘలును ఆకసమునందంతటను నిండి ఉన్నత పర్వతములవలె కనబడుచుండెను॥ వాడు ఆందు గాలికి చేదరి ఎగురుచున్న వస్త్రముతో యుద్ధ కాంక్షియై సంధ్యాకాలపు ఎండతో వ్యాప్త మయిన శిలలుగల సాక్షాత్ మేరు పర్వతమో యనునట్లు ఒప్పుచుండెను॥ వాడు తన తొడల ఒత్తిడిచే నలుగగొట్టు చుండిన పర్వత శిఖరాగ్రములతోను వృ క ములతోను వజముతో ఇంద్రుడు) మహాగిరులను వలే దేవతలను పడగొట్టు చుండెను॥ ఇట్లు కాలనేమిచే తగులు దేబ్బలతో సురలు అనేక శస్త్రములతో ఖడ్గములతో తమ తలలు పగులగా కేశములు తెగి పోగా బాధపడుచు కదలనైన లేకుండిరి॥ కొందరు వాని పిడికిళులతో గద్దబడియు మరికొందరు చీల్చబడియు పడి పోయిరి॥ దేవతలు తామెంత పరాక్రమవంతులయియును కాలనేమి వలన కలిగిన భయముతో తెలివి తప్పినందున ఆ సమరమునందు ఏ యత్నమును చేయలేకుండిరి॥ సహ సాక్షుడగు శకుడును వానిచే శరబంధనములతో బంధిశు డై ఐరావత గజము పై కదలలేకుండేను॥
వరుణుడును వాని చేత తినిన దెబ్బలతో జలరహిత మేఘమువలేను జల మేండిన సముదమువలేను ఏమియు నేయ షోలకుండెను॥ కామ రూపుడు అగు ఆకాలనేమి విశవః ప్రజాపతి కుమారుడు అగు కుబేరుని పరిఘ లతో చావ మోది ధనదుడు (విత్తమును ఇచ్చువాడు) అనుయోగ్యతకు దూరము చేసెను॥ సర్వుల ప్రాణములను హరించు మృత్యురూపుడగు యముడును వాని దెబ్బలు తిని యముడుగా తనకుగల యోగ్యతను కోల్పోయి తన { దక్షిణ దిశకు పారిపోయేను॥ పాడట్లు లోక పాలురను తరిమి వారివారి అధికార కృత్యములను హరించి తన దేహమును నాలుగు దిక్కులందును నాలుగుగా నిర్మించెను॥ వాడు రాహువు తనకు చూపిన దివ్య నక్షత్ర మార్గమునకుపోయి సోముని లక్ష్మినీ (కాంతిని॥ఐశ్వర్యమును॥ ఆధికారమును) ఆతని పాలన మహాదేశమును హరించేను॥ వాడు స్వర్గ ద్వారమునుండి భాస్కరుని తరిమివేసి ఆతనికి గల ఆయనములను పగళ్ళను ఏర్పరచు ఆధికారమును తన ఆధీనముగా చేసికొనెను॥ దేవతలకు ముఖము (నోరు) ఆగు అగ్ని ని వాయుదేవుని తన శ క్తితో జయించి తన ఇచ్చ చొప్పున నడుచునట్లు చేసెను॥ వాడు తన వీర్య బలము లతో సర్వములగు నదులను సముద్రమును తన దగ్గరకు రప్పించుకొని తన ముఖమునందు తన ఎదుట॥తన అధీనములో) ఉండునట్లు చేసికొనెను॥ సముద్రములన్నియు వాని దేహమయ్యెను॥ భూమ్యంతరీక్ష ద్యులోకములందెక్కడెక్కడ నున్న జలమును తన వశమున నడుచుకొనునట్లు చేసి వాడు భూమినంతను తన యాజ్ఞలో నడుచు పర్వతములతో భద్ర పరచి కదలకుండునట్లు చేసేను॥ వాడు తాను స్వయంభూ బ్రహ్మయు మహాభూతపతియునై నట్లు ప్రకాశించుచు సర్వలోక మయు దై సర్వభూత ॥ భయంకరుడై ప్రకాశించుచుండెను॥ ఇట్లు లోకపాలైక శ రీరుడు చంద్ర సూర్యాది గ్రహ రూపుడు వాయ్వగ్ని శ రీరుడునై ఆయుద్దమునం దాదానవుడు ప్రకాశించు పర మేష్టి బ్రహ్మ స్థానమునందు నిలిచి లోకముల ఉత్పత్తికే తాను మూలకారణుడై ప్రకాశించుచుండగా దేవతలు బ్రహ్మను స్తుతించునట్లు దైత్యులు వానిని స్తుతించిరి॥
ఇది శ్రీమత్స్యమహాపురాణమున దేవదానవ సంగ్రామమున కాలనేమి విజయమును నూట డెబ్బది యారవ యధ్యాయము॥
