మత్స్య మహా పురాణము

Table of Contents

41 - అష్టక ప్రతర్దనులు యయాతికి తమ పుణ్యలోకముల నిచ్చుట

అష్టకుడు యయాతి నిట్లు ప్రశ్నించెను: "అయ్యా! . మీరు చెప్పిన ఈ రెండు విధములగువారును అంత రిక్షమున పరుగెత్తుచుండు సూర్యా చంద్రమసుల వంటివారు. ఇద్దరును ప్రకాశ స్వరూపులే). ఐనను ఈ ఇద్దరిలో ఎవరు మొదట దేవతలతో సామ్యమును పొందుదురు?” యయాతి: “గృహస్థుల నడుమనుండియు గృహమునందుండని పాడును కామములయందు ప్రవర్తిల్లు వారినడుమ నుండియు ఇంద్రియముల నిగ్రహించు కొనుచు గ్రామములయందు నివసించుచునే సంన్యాసియునై యుండువాడే వీరిద్దరిలో ముందుగా దేవతా సామ్యమును పొందును. ఎక్కువ వయస్సు రాకున్నను తపోవంతునివలే జీవించువాడు మరియొక తపస్సాచరించనక్కర లేదు. వయస్సు ఎక్కువగా వచ్చియును దానికి విరుద్దముగా నడుచువాడు మరే తపస్సు చేసినను ప్రయోజనము లేదు. ఇతరులకు బాధ కలిగించునది అనుసరించరాని మార్గము. అనర్థమేదియో ఎరుగక ఆధర్మమును ఆశ్రయించిన వానికి అర్థము కూడ సిద్దింపదు. ఇట్టి క్రూరత్వమును అధర్మమును విడిచి నడుచుటయే ఋజు ప్రవర్తనము-చిత్త స్టైర్యము. పెద్దలు మెచ్చునది." అష్టకుడు: రాజా! నీవు యువకుడవు; పూలమాలలు ధరించియు న్నా వు; చూడముచ్చటగా నున్నావు. గొప్ప వర్చస్సు గలవాడవు. ఇట్టి నిన్ను ఎవరు పిలిచి పంపగా వచ్చితివి? ఎక్కడినుండి వచ్చితివి? ఏ దిక్కు సందు ఉందువు? నీకు పృథివి పై ఉండదగిన స్థానము ఏదయిన కలదా?” యయాతి: “నేను క్షీణపుణ్యుడనై ఊర్వలోక మునుండియు గగనమునుండియు విసరి వేయబడి ఈ నరకలోకమున ప్రవేశించితిని. మీకు మీరడిగినవి చేప్పిన తరువాత వెంటనే క్రిందికి పడెదను. అదిగో! బ్రహ్మ మొదలగు లోకపాలురు నన్ను త్వర పెట్టుచున్నారు. నరేందా! నేను భూమి తలము పై పడ బోవుచు_సల్ జనుల నడుమ పడునట్లుగా ఇంద్రుని వలన వరము పొందితిని. అట్లే గుణవంతులగు మీ అందరతో సంగతి నాకు లభించినది " అష్టకుడు: “అయ్యా! ప్రపాతమునందు పడకుము. నీవు ధర్మక్షేత్ర తత్త్వము నెరిగిన వాడవని నానమ్మిక. నిన్నొకటి ప్రశ్నించుచున్నాను. నాకు భూమ్యంతరిక్ష దు, లోకములందు ఎచ్చటనైన నేను అనుభవింపదగిన పుణ్యలోకములు గలవా?" యయాతి: “రాజ శ్రేష్టా! పృథివి పై గోవులు అశ్వములు ఆరణ్యములగు పశువులు పక్షులును ఎంత వరకుండునో అంత వరకు అనుభవింపదగిన పుణ్యలోకములు నీకు ద్యులోక మునందు గలవు.” ఆషకుడు: “తండ్రీ! నీవు ప్రపాతమునందు పడవలసిన పనిలేదు. నాకు ద్యులోకమునందు గాని అంతరిక్షమునందుగాని కల ' పుణ్యలోకములన్నియు నీకు ఇచ్చు చున్నాను.” యయాతి: “బ్రహ్మవేత్తయగు బ్రాహ్మణుడు తప్ప నా (మన) వంటివాడు దానమును ప్రతిగ్రహింపరాదు. ఆదికాక నేను ఎట్లు ఎట్లు దానము చేయవలెనో అట్లు ఇంతకు పూర్వము దానము చేసియున్నా నే కాని ప్రతిగ్రహమెన్నడును చేయలేదు. బ్రాహ్మణుడు బ్రహ్మ వేత్త తప్ప మరెవ్వరును-బ్రాహ్మణస్త్రీ కాని క్షత్రియ స్త్రీ కాని దే న్యముతో దానము గ్రహింపరాదు. వివేకవంతుడనై యుండియు ఇదివర కెన్నడును చేయని పనిని నేనిపుడెట్లు చేయుదును? ఇది ఏమి బాగుగా నుండును?' ప్రతర్దనుడు: “రాజా! నా పేరు ప్రతర్దనుడు. నీవు మనోహర రూపుడవు. ధర్మ క్షేత్ర త త్త్వము నెరిగినవాడవు. నాకు అంతరిక్షమునగాని ద్యులోకమునగాని అనుభవింపదగిన పుణ్యలోకములు గలవా? చెప్పుము." యయాతి: “రాజేంద్రా! మధువును స్రవించునవియు నేతితో తడిసినవియు శోకరహితములునగు అనంతలోకములు ఒక్కొక్కటి ఏడేసి దివ్యదినములు అనుభవింపదగినవి కలవు. అవి అన్నియు నీకై ఎదురు చూచుచున్నవి.” ప్రతర్దనుడు: “తండ్రీ! నీవు వివేక శాలివి, నీవు ప్రపాతమునందు పడవలదు. నాకు అంతరిక్షమునందుగాని ద్యులోకమునందుగాని ఉన్న లోకములన్నియు నీకు ఇచ్చుచున్నాను.” యయాతి: “తేజశ్ళాలియగు వాడు తనకు సాటివాడగు తేజశ్శాలినుండి సుకృ తమును ప్రతిగ్రహింపరాదు. రాజు రాజునుండి అతని యోగ క్షేమములను తాను స్వీకరింపరాదు. దేవతల ఆదేశాను సారము విపత్తులనై న పొందవచ్చునుకొని వివేకియగు రాజు నింద్యమగు పనిని చేయరాదు. ధర్మ్యమగు మార్గమును కీర్తి ప్రదమగు మార్గమును ఎరిగి ధర్మఫలమును పొందగోరి తపస్సునే చేయవలెను. కాని నావంటి ధర్మజ్ఞుడు ఎట్టి సమయమునందును నీవు చెప్పినట్టి దీనమగు పనిని చేయరాదు. నేను వివేకవంతుడనై యుండి ఇదివరకు పెద్ద లెవరును చేయని పనిని చేయుట ఏమి బాగుగా నుండును?” అని ఇట్లు పలుకుచున్న యయాతితో అష్టకుని సోదరులలో నొకడగు వసుమాన్ ఇట్లనెను.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున చంద్రవంశానువర్ణనమున యయాతి చరితమున అష్టక ప్రతర్దనులు యయాతికి తమ పుణ్యలోకముల నిచ్చుటయను నలువదియొకటవ అధ్యాయము.