మత్స్య మహా పురాణము

Table of Contents

71 - అశూన్యశయన వ్రతము

బ్రహ్మ ఈశ్వరుతో నిట్లనెను. భగవన్! స్త్రీ పురుషులకు విరహ-వ్యాధి- రోగ భయ దుఃఖములు కలుగకుండు ఉపాయమును తెలుపు మనగా ఈశ్వరుడిట్లు చెప్పెను: నారాయణుడు లక్ష్మీ సమేతముగా క్షీరసాగరమున నిరంతరము వసించు చుండునుగదా! ఆయనను శ్రావణ శుక్ల ద్వితీయ నాడు అర్చించినచో అన్ని కోరికలును నెర వేరును. ఆశూన్యశయన ద్వితీయ అనబడు ఈనాడు గోవిందుని కల్పోక్త విధానముతో సంపూజించి గోభూహిరణ్య దానములు చేసినవారు డెబ్బది. వేల కల్పముల కాలము సుఖింతురు.

ప్రార్థనామంత్రము: శ్రీవత్సధారిన్! శ్రీకాంతా! శ్రీవాసా! అవ్యయా! శ్రీపతీ! ధర్మార్థ కామప్రదా! నాగారస్యము హాని చెందకుండుగాక! మా దాంపత్యము భుగము నొందకుండుగాక! మా అగ్నులు దేవతలు పితృదేవతలు పితరులు హాని నొందకుందురు గాక ! మధుసూదనా! నీకు వలెనే నాకును కళత్రముతో నిత్యసంబంధ ముండుగాక! నీ శయన మెల్ల ప్పుడు అశూన్యమయి యుండునటే నో శయనముకూడ ఆశూన్యమై యుండుగాక! పూజా సమయమున గీతవాద్యముల విని పించవలెను. ఇందులకు శక్తి లేనివారు ఘంటానాదమే చేయవచ్చును. ఏలయన ఘంట సర్వ వాద్యరూపమయినది.

ఇట్లు గోవిందుని పూజించి పగలు ఉపవసించి ఆ రాత్రి (న కం) తైలము- ఉప్పు-పులుపు)-కారము లేని ఆహా రము తిని ఆ రాత్రి గడుపవలెను. తెల్లవారిన తరువాత కుటుంబియు వేదపండితుడును శోత్రియుడును సర్వ క్రతు కర్తయు ఎక్కడను ఏ లోపములేనివాడును ఆంగ వైకల్యము లేనివాడును ఆగు విప్రునకు లక్ష్మీ నారాయణ ప్రతిమను దీపములను అన్నపు పాత్రములను మంచమును పరపులను దిండ్లను ఆనుకొను దిండ్లను పాదుకలను చెప్పులను గొడుగు లను చామరములను ఆసనములను ఇంకను ఇష్టములగు సాధన సామగ్రులను తెల్లని గంధపు పూత సామగ్రులను పూల దండల)ను దానము చేయవలయును. ఆ బ్రాహ్మణుని అతని పత్ని ని మంచము పై కూర్చుండ పెట్టి శాస్తోక్త విధాన మున అలంకరించి పత్ని కి భక్ష్య భోజ్య సమన్విత పాత్రను పతికి సర్వసామగ్రీ యుక్తమగు లక్ష్మీ నారాయణుల బంగారు ప్రతిమను చేతితీయవలెను.

ధనమునకై లోభించక యథాశ కిగా కల్ప విధానముగా నారాయణుడే దిక్కనీ ఈ ఆశూన్య శయనవతము చేయువారు దాంపత్యమున వియోగము లేకుండ ఆచంద్రతారార్కము పై రూప్యము శోకము లేక సుఖింతురు. వారికి పడుపు త ధన నాశ మును కలుగదు. ఏడువేల ఏడువందల కల్పములపాటు వారు విష్ణులోకమున సుఖింతురు.

ఇది శ్రీ మత్స్యమహాపురాణమున అశూన్య శయన వ్రత మను డెబ్బది ఒకటవ అధ్యాయము భావేనాపతీతాయచమ.