మత్స్య మహా పురాణము

Table of Contents

199 - వసిష్ఠ గోత్ర ప్రవరానుకీర్తనము॥

మత్స్య జనార్దనుడు వైవస్వత మనువుతో ఇట్లు చెప్పెను: వసిష్ఠ వంశజులగు ఋషుల గోత్రములవారికి ప్రవర ఋషి ఒక్కడే; పసిష్ఠులకే వాసిష్ఠులనియు వ్యవహారము; ఈ వసిష్ఠ వంశ జులగు ఋషుల గోత్రములవారు అదే వర్గమునకు చెందిన గోత్రములవారితో వివాహ సంబంధములు చేసికానరాదు॥

 వీరిలో మొదటి వర్గము వారు: వ్యాఘ్రపాదులు ఔపగపులు వై క్లబులు శాద్వలాయనులు కపిష్ఠలులు ఔపలో ములు॥ అలబులు శఠులు కఠులు గౌపాయనులు బోధపులు దాకవ్యులు వాహ్యకులు బాలిశయులు పాలీశయులు వాగ్గంధులు ఆపస్థూణులు శీతవృత్తులు బ్రాహ్మ్యపు రేయకులు లోమాయనులు స్వస్తిశ రులు శాండలి గోడిని పాడోహలి సుమనస్ ఉపా వృద్ధి బౌలి బౌలి బ్రహ్మబలుడు పౌలిశ్రవసుడు పౌలవుడు యజ్ఞదత్తుడు॥ ఈ ఋషుల (గోత్రముల వారల)కు వసిష్టుడు ఒక్కడే ప్రవర ఋషి; ఈ గోత్రములవారు పరస్పరము వివాహ సంబంధములు చేసికొనరాదు॥

రెండవ వర్గమువారు: శై లాలయుడు మహాకర్ణుడు కౌరవ్యుడు కౌధినుడు కపింజలులు వాలఖిల్యులు భాగ విత్తాయనులు కీలాయనుడు కాలశిఖుడు కోరకృష్ణలు సురాయణుడు శాకాహార్యులు శాక ధియులు (శాకధులు) కాణ్వులు ఉపలపులు శాకాయనులు ఉహాకులు మాషశ రావులు దాకాయనులు బాలపులు వాకులు గోరథులు లంబాయనులు శ్యామపులు కోడోదరాయణులు పలం బులు శంకరులు ఔపమన్యులు సాంఖ్యాయనులు ఋషయులు వేద శేరకులు పొలంఘయనులు ఉద్ఘాహులు బలేశులు మాతేయులు బ్రహ్మబలులు పర్ణగారి అను ఈ ఋషుల గోత్రముల వాగల)కు భరద్వసుడు వసిష్టుడు ఇంద్రప్రమదుడు జనువారు ప్రవర ఋషులు; ఈ ఋషుల గోత్రముల వారు పరస్పరము వివాహ సంబంధములు చేసికొనరాదు॥

మూడవ వర్గము వారు: ఔపస్థలులు స్వస్థలులు పాలుడు హాలుడు హలులు మాధ్యందినుడు మాక్షతులు పైప్ప లాది విచక్షుషులు శ్రీశృంగాయనులు శ్రీ వల్క్యులు కుండలులు (కుండినులు) అను నరోత్తములు॥ ఈ ఋషుల (గోత్రముల వారల)కు వసిష్టుడు మిత్రావరుణుడు కుండినుడు అనువారు ప్రవర ఋషులు; ఈ గోత్రములవారు పరస్పరము తమలో తామును దానకాయులు మహాచ(వీ)ర్యులు నాగేయులు పరములు అలంబులు పొయనులు అను వర్గముల గోత్రములవారు పరస్పరమును వివాహ సంబంధములు చేసికొన తగదు॥

 నాలుగవ వర్గమువారు: శివకుడు వయుడు పాదపుడు అను ఋషుల (గోత్రముల వార ల)కు జాతూకర్ణుడు వసిష్ఠుడు ఆత్రి అనువారు ప్రవర ఋషులు; ఈ గోత్రములవారు పరస్పరము వివాహ సంబంధములు చేసి కొనరాదు॥

ఈ చెప్పిన వసిష్ఠ వంశజులగు ఋషుల నామ సంకీర్తనమున నరుడు సకల పాప విముక్తుడగును॥

ఇది శ్రీమత్స్యమహాపురాణమున వసిష్ఠ గోత్ర ప్రవరాను కీర్తనమను నూట తొంబది తొమ్మిదవ యధ్యాయము॥