మత్స్య మహా పురాణము

Table of Contents

137 - చంద్రోదయాది వర్ణనము

తారకాక్షుడు మరణించిన తరువాత మయుడు ప్రమథులను తరిమి భయావృతులయి యున్న దానవులతో ఇట్ల నేను. దానవేంద్రులారా! ఇపుడు నేనును మీరును ఏమి చేయవలెనో చెప్పుదును వినుడు. చంద్రుడు పుష్యనక్షత్రముతో కలియు పుష్యయోగము వచ్చినపుడు క్షణకాలము త్రిపురములు ఒక టి యగును. ఇది కోకిల ‘కుహూ’ధ్వనికి పట్టునంత కాలము. ఆ సమయమున మనలను వార్ధకము మింగి వేయును. ఇది పుష్యయోగ సమయమని నేను వ్యవస్థ చేసినాను. ఆ ముహూర్తమున ఈ మూడు పురముల ఏకత్వమును గుర్తించిన దేవతలలో ఎవడయినను ఒకే బాణముతో త్రిపుర దుర్గ మును చూర్ణము చేయును. కావున ప్రాణములును జలమును ఉన్నంత వరకును దానవు లందరు యుద్ధము చేసి పురరక్షణ చేయుడు.

మహేశ్వరుని రథ మొక్కటి సర్వప్రాణి భయంకర మైనది. దానిని మీ రెట్లయిన అడ్డగించి అతడు బాణ ప్రయోగము చేయకుండునట్లు చూడుడు. ఏలయన దేవతలు అదే పనిగా పుష్యయోగమున. కెదురు చూచుచుందురు. మీ రది గమనించుడు.

మయుని మాటలు విని యమునివంటి త్రిపుర దాసవులు మాటిమాటికి సింహనాదములు చేసి మయునితో ఇట్ల నిరి: మయా మే మందరమును నీవు చెప్పినట్లు చేసేదము. శివుడు త్రిపుర దుర్గము పై బాణము ప్రయోగించకుండ వారించేదము. రుద్రుని సంహరించుటకై యుద్ధము చేసెదము. ఈ త్రిపుర దుర్గము కల్పాంతము వరకు స్థిరముగ ఉండ నైన వలయును; లేదా. ఈ ఆకాశ సంచారియగు తిపురమున దానపు డొక్కడును లేకుండనై న పోవలయును. నీవు మమ్ములను విడువ నంతవరకును మేమును మా ధర్మమును విడువము. లోకమున దేవతలుగాని దానవులుగానీ లేకుండ పోవుటను మానవులు చూడగలరు. అనీ దానవులు పలికిరి.

చంద్రోదయాదివర్ణనమ్

ఇంతలో ప్రదోష మయ్యెను. శ్రీ పుర దానపు లెల్లరు శృంగార భావపూర్ణులే మన్మథుని సందేశహరులవలే నయిరి. క్రమముగ భగవానుడగు చంద్రుడు ఉదయ పర్వతము పై మిగుల ఎర్రనై ఉదయించుచు చీకటులను పోద్రోలుచు ఆకాశమున విజృంభింపసాగెను. ఆతడు సరోజలములో కలువపూల నడుమ విహరించు హంసవలెను వైడూర్య శిఖరము పై కూర్చున్న సింహమువలెను విష్ణువక్షమునందలి హారమువలేను ఆకాశమున కనబడుచుండెను.

లోకమంతయు గాఢాంధకారములో మునిగియుండగా ఉదయించిన చంద్రుడు తాను అత్రి మహాముని నేత్రము నుండి ఉద్భవించినవాడు అగుటను సార్థకము చేయుచు లోకములను వెన్నెలతో తడుపుచు తాను ప్రకాశించుచు లోకము లను ప్రకాశింపజేయు చు లోకములకు కన్ను లను ఇచ్చెను. ఇట్లు చంద్రోదయ మయ్యెను. త్రిపురము వెన్నెలతో నిండెను. భవనములందును దీపములు వెలిగింపబడెను. ఇట్లా పురమున బయట వెన్నెలతో లోపల దీపములతో ప్రకాశ మయ్యెను. అసురులును తమ తమ ఇండ్లను దేహమున కూడ అలంకరించుకొనసాగిరి. రచ్బలలో రాజమార్గములలో ప్రాసాదములందును గృహములందును నూనెతో నింపిన దీపములు వెలిగింపబడి సంపెగ పూలవలె ప్రకాశించుచుండెను. ధనముతో నిండిన వగు దానవుల నవరత్న మయ గృహములలో దీప ప్రకాశములో ఆయా వస్తువులు ధనములు రత్నములు - చంద్రోదయవశమున ప్రకాశించు గ్రహములవలె ప్రకాశము నందెను. దుష్టపుత్తుల వలన కులమునకు కలిగినట్లు బయటి వైపున వెన్నెలతోను ఇండ్లయందు దీపములతోను చీకటికి పీడ కలిగెను. ఇట్టి ప్రదోష కాలారంభమున చంద్రుని అట్టహాసము (అధిక ప్రకాశము) యౌవనమునంది. రాత్రికి ప్రకాశమునందించుచుండ దానవులు శృంగార సుఖమును కోరి స్త్రీ జనములతో కూడి అలంకరించుకొనుచు ప్రకాశించుచు నుండిరి.

పూర్వము శివుని పై ప్రయోగింపబడి వినోదము ననుభవించిన ఐదు బాణములును ఇపుడు త్రిపుర దానవుల పై ప్రయోగింపబడి అచటి స్త్రీ పురుషులకు తమ రుచిని చూ పెను. మన్మథుడు అచటి దానవ స్త్రీల అవ్యక్త మధుర వచనము లలో వీణాలాపనలలో సంగీత మూర్చనలలో దానవులు చేయు శృంగార మ తవ్రలాపములలో విజృంభించి వారి మనస్సు లను కలవర పరచెను. చంద్రుడాకాశమున తన పత్ని యగు రోహిణీ దేవితో కూడి వెన్నెల కురియుచు రాజ్యము చేయు చుండ ఆతని వెన్నెల అచటి రాత్రి చీకటులను పారదోలుచు జగమునకు హితము చేయుచుండెను. ఆ దానవాంగనలలో ఒక తే మన్మథుని పాదములకడ నిలిచి తన చెక్కిళ్ళయందు విశేష కము అను రంగు పూతతో అలంకరణము చేసికొనుచు దానితో తన ముఖమునకు శోభ సమకూర్చుకొనుచుండెను. తరువాత ఆమె తన ముఖమును గుండ్రని అద్దములో చూచుకొని “నా ముఖమునకు ఎంత యో శోభ కలిగెను కదా యని మురియుచు తన ప్రియుడు కూడ తను ఇట్లు ప్రశం సించునను భావముతో చాల ఆనందించుచుండెను. కొందరు యువతులు గగుర్పాటు చెందిన శరీరములతోను తన ప్రియునితోకూడి రమించవలెనను ఆస క్తితోను చక్కగా అలంకరించుకొని మదపుటేనుగులవలే ఆనందముతో మతిల్లి యుండిరి. ఒకతె శృంగార భావముతో నిండిన మనస్సుతో మద్యము తావుచుండెను. మరియొకతే ప్రసన్న హృద యముతో ప్రియుని వెదకుకొనుచుండెను. మరియొకతే చాల సేపు తన ప్రియుని విషయములో ప్రసన్నురాలయి యుండెను. ఇంకోక దానవస్త్రీ తన ప్రియుడు చేయు ప్రలాపములకే ఆనందపడుచుండెను. గోశీర్ష పద్మములు హరి చందనము మొదలగు ఆలంకరణములతో సుగంధ ద్రవ్యపు పూతలతో చన్నులు బురదతో పులిమినట్లు కనబడుచుండ పెదవులు మెరయుచుండ వారి రూపములు మనోహర ములయి ఆస క్తి గొల్పునపై ప్రకాశించేను. అమృతముతో నిండిన బంగారు కుంభములవలే పోరి రూపము లుండెను. కొందరు దానవులు ప్రియురాండ్రయం దనురక్తులయి వారి పెదవులను గాయపరచి వారు శ్రీ ఘముగా కోపింపగా మరల వారిని బ్రతిమాలి వినోద పెట్టి ఆనందపరచుచు ఆనంద పడుచునుండిరి. కాని వారు తమ ప్రియురాండ్ర మాటలయందుకంటె వీణా వాద్య ధ్వనులయందు ఎక్కువ ఆసకులై అవి వినగోరిరి. కొందరు దానవులు తమ ప్రియురాండ్ర మధుర వచనములు విన్నంత మాత్రాన కామ బాణ వశీభూతు లగుచుండిరి; కొందరు దానవస్త్రీలు మద్యపానశాలా ప్రదేశములందు పానము చేసి తను. ప్రియుడు కౌగిలించుకొనగా అతడు పొడుచుండ తాను వాద్యము వాదించుచుండెను. కొందరు దానవులు తమ ప్రియురాండ్రను బ్రతిమాలుచుండిరి. కొందరు తమ ప్రియురాండ్రు అలుగగా వారికి నచ్చ చెప్పుచుండిరి. ఆ సమయమున త్రిపురములయందలి సుగంధము మన్మధుని బాణపు పూవుల వాసనలను వెదజల్లుచుండెను. (దానవులలో స్త్రీలును పురుషులును - శృంగార భావ పరవశం లగుచుండిరని భావము.) ఒకానొక దానవాంగ శయ్య పై సుఖముగా పండుకొని ప్రియుడు కౌగిలించుకొనగా వులకించి చెమర్చి లేత గడ్డి మొక్కల చిగురాకులతో అంద గించుచున్న భూమి ఆ తృణాంకురముల పై సన్నని మంచు చినుకులు క్రొత్తగా పడినపుడు ప్రకాశించునట్లు ఒప్పా రెను.

 చంద్రుని వెన్నెలలతో శోభించుచున్న త్రిపుర సౌధాగములందు మాధుర్య భావ ప్రకటనవశమున కదలుచున్న ఆభరణములును ఓడాణపు గజైలును మొలనూలు లందలి చిరుగజేలును చేయు ధ్వసులు మన్మథుడు ప్రయోగించిన బాణములు వచ్చి పడునపుడు అయ్యేడు ధ్వనులవలె మనోహరములయి వినబడుచుండెను. ఒక దానవ స్త్రీ తన ప్రియునితో “నీవు ఆసవపానముచే అలసితివి. ఆమీతముగా నా చెక్కిలి ముదాడి యాడి ఇంకను అలసితివి. నా పిరుదులు విశాలమయినవి. అవి బంగారు మొలనూలితో మనోహరమయి మనోహర ధ్వని చేయుచున్నవి. పుష్టితో విశాలమై యున్నవి. నీవు వాని పై కూర్చుండి శ్రమ దీర్చుకొనుము.” అనుచుండెను.

ఇట్లా రాత్రియందు త్రిపురములందలి రథ్యలు (విశాల రాజవీధులును నాలుగు వీథులు కలిసిన తావులును)  వెన్నెలతో నిండి ఒప్పుచుం డేను. రాజమార్గముల మాటయే . అందరును మరచిపోయినట్లు అచట ఎవరును సంచరించక తమ తమ భవనములందును సౌధములందును సుఖించుచుండిరి. కాని కొందరు దైత్యులు పెద్ద గుంపులుగా కూడి సాయం కాలానంతరము చంద్రునితో కూడిన నక్షత్రముల వలె ప్రకాశించుచుండిరి. దానవులు తమ తమ భవనములయందు వెన్నెల ఆట్టహాసముల నడుమ ఊయెలలయందు మద లోలభావములతో ఊగుచు ఆనందించుచుండిరి. వారి మనస్సులు తమ ప్రియురాండ్ర మొలనూలులందలి చిరుగజ్జెల మోతలచే ఆకర్షింపబడుచుండెను. దానవాంగనలు ఆ సమయమున వాడ ని పూలమాలలు ధరించి మిగుల ఉత్సుక భావముతో అతిహరముతో నిండియుండిరి. భవనములందు ఈ దానవ స్త్రీల మధుర వచనములును దిగుడు బాపులందలి కలహంసముల ధ్వనులును ఒకే విధము గా మధురములై వినవచ్చుచుండెను. ఆ పురమందెల్ల చోటులందును. ఒడ్డాణముల అందములు-దానవస్త్రీల మధురాంగ విన్యాసముల శోభలు.ఎప్పుడును నవ్వులు చిం దేడి బాలురు.మన్మథ బాణములకు ప్రియ నివాసములగు దానవాంగనల సౌందర్యములు.ఇవి ఆ పురమునందంతట కన బడుచు డేను.

వన్నె వన్నెల వస్త్రములు పైకెత్తి కట్టిన కేళ పాశములు ధరించిన స్త్రీ పురుషులతో తరంగితమయి మనోహర మగు వస్త్రములు ఆభరణములు ధరించిన జనముతో కూడిన ఆ త్రిపురపురి ఆ రాత్రివేళ చంద్రునితో తారలతో కూడి వెలుగు ఆకాశము వలెనే, ప్రకాశించెను. కదలిక చే ధ్వనించుచు తెగిపడిన మొలనూలులతో ఒడ్డాణములందుండి చెదరి రాలి పడిన రత్నములతో చిత్ర కాంతులతో విరాజిల్లుచు త్రిపుర భవనములందలి శయ్యాభూమి చంద్రుని సమీపమున ప్రకా శించు చిత్రా నక్షత్రమువలె ప్రకాశించుచుండెను. వెన్నెలలతో తళతళలాడు ఉద్యానములందు కోకిలల మనోహర ధ్వనుల నడుమ ఆ దానవుల త్రిపుర భవనములందు మన్మథుడు తన బాణములను ప్రయోగించి ప్రయోగించి ఆ శరములన్నియు వ్యయమయి పోగా ఆతడు ఏమియు తోచక తిరుగుచుండెను.

అంతలోనే దానవ పుంగవుల ఆ త్రిపురములందు రాత్రి ముగియగా వెన్నెలలు తగుచు చంద్రుడు పడమట వాలేను. కొలది సేపటిలో యుద్ధరంగమున నిలువబోవు శివుని తురగములే దేవ శత్రువులగు దానవులకును చంద్రున కును ఒకేసారి ఒకే విధముగా క్షీణదశను కలిగించినట్లయ్యెను. ఆ స్తమించుచున్న చంద్రుడు తరిగిన వెన్నెలలతో వెలవెల పోవుచు మొల్లపూవులను కలువపూలను కర్పూరమును పోలిన కాంతితో కూడి భాగ్యక్షయము కలిగిన ధనవంతుని వలే వివర్ణుడి కనబడుచుండెను. ఆతని ఛాయ అంతయు వ్యయమయ్యెను. వెన్నెల రాసులన్నియు కరగిపోయేను. చివరకు అతని వర్ణము ఆకాశ వర్ణముతో సమానమయ్యెను.

అంతలో సూర్యుడుదయించెను. అతడు తన సారథియగు అరుణునితో చంద్రుని కాంతిని అణగదొక్కెను. అతని బింబము మీగుల కాచిన మేలిమి బంగారు వన్నె తో మెరయుచుండెను. ఇట్లతడు లోకమందలి చీకటులను మేఘ ముల పారదోలుచు ఉదయాద్రి శిఖరమును చీల్చుకొని వెలికి వచ్చి ప్రకాశించసాగినా డిడుగో అని ఆనందించిరి.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున త్రిపురోపాఖ్యానమున చంద్రోదయాది వర్ణనమను నూట ముప్పది ఏడవ అధ్యాయము.