మత్స్య మహా పురాణము

Table of Contents

192 - దశాశ్వమేధాది తీర్థ మహిమాను వర్ణనము॥

మార్కండేయుడు ధర్మరాజుతో ఇట్లు చెప్పెను: తరువాత నరక తీర్థము: దానియందు స్నా సమాడినచో నరక దర్శనమేయుండదు: పాండునందనా! ఈ తీర్థపు మాహాత్మ్యమును తెలి పెదను; వినుము: దీనియందు ఎవనివైన ఆస్తులను వైచినచో అవి అందు విలీనమగును; ఇందు స్నానమాడినవాడు రూపవంతుడగును; తరువాత దర్శనమాత్రమున పాపము క్తిని కలిగించు గోతీర్థము; తరువాత కపిలతీర్థము; దానియందు స్నానముచే గోసహస్ర దాన ఫలము లభించును; జ్యేష్ట (శుక్ల) చతుర్దశినాడచట ఉపవసించి భక్తితో కపిలా గోదాన మొనరించినచో॥ ఆది ఎట్లన నేతి దీపము వెలిగించి నేతితోనే శివు సిభి షేకించినచో నేతితో మారేడు ఫలమాహారముగా తినిపించి నివేదించినచో తరువాత శివుని కపీలా గోవును కూడ ప్రదక్షిణించి ఘంటలతో ఆభరణములతో కూడిన ఆ గోవును దానమిచ్చినచో॥శివతుల్య భోగముల ననుభవించును; వాని కీక పునర్జన్మముండదు; చవితి మంగళ వారమున నవమీ మంగళ వారమున అమావాస్యా మంగళ వారమున అచ్చట శివు నభి షేకించినచో రూపవంతుడును స్త్రీలకు ప్రీతిపాత్రుడునగును; అంతమున పుష్పక విమానము పై వేలకొలది మంది పరి వారముతో శివస్థానమునందును; తన కభిమతమగు చోట్ల నెల్ల రుద్ర సమ భోగములతో ఆనంతకాలము సుఖించును; ఫల భోగానంతరము కర్మ సంయోగ వశమున భూలోకమునకు వచ్చినను ఉత్తమ వంశమున రూపవంతుడును ధార్మికుడునగు రాజగును॥

తరువాత ఆనుత్తమము (అంతకంటే గొప్పదిలేనిది) ఆగు గణేశ్వర తీర్థము; శ్రావణ కృష్ణ చతుర్దశినాడందు స్నానమాడినంతనే రుద్రలోక ప్రాప్తుడగును; పితృ తర్పణముతో దేవ ఋషి పితృ ఋణత్రయ మూర్తియగును; తరు వాత అను త్తమమగు ఋషి తీర్థము; తృణ బిందుడను ద్విజ ఋషి అందు స్నానమాడి ఆ తీర్థ ప్రభావమున శాపముక్తు డయ్యెను; గంగేశ్వర సును లింగమునకు దగ్గరలో గంగావదన తీర్థము కలదు; (దాని మహిమ) తెలిసికానీ తెలియక కాని (కోరిక లుండి కాని లేక కాని) స్నానమాడినచో ప్రాణి తన పుట్టుక మొదలు చేసిన పాపములు తొలగును; తుదకు శంకర లోక ప్రాప్తుడగును; అందు ప్రతి పర్వ సమయమందును స్నానమాడి పితృ తర్పణము చేసినచో అశ్వమేద , ఫలము లభించును; ప్రయాగ తీర్థమునకు ఏ ఫలము కలదని మహాత్ముడగు శంకరుడ నేనో ఈ గంగా వదన సంగమ తీర్థము కూడ అంత ఫలము నిచ్చును మ పు॥ 108

దీని పశ్చిమ పార్శ్వమున చాల దగ్గర లో త్రిలోక విశ్రుతమగు దశాశ్వమేధ తీర్థము గలదు; భాద్రపదమావాస్య నాడందు స్నానమాడి ఒక అహోరాత్రముపవసించి పితృ తర్పణము చేయుటచే దశాశ్వమేధ ఫల ప్రాప్తుడగును; దీనికి పశ్చిమమున భృగు తీర్థము గలదు; (దీని ఉత్పత్తి ఇది:) పూర్వము బ్రాహ్మణ సత్తముడగు భృగుడు సహస్ర దివ్య వర్ష కాలము ఇట ఈశ్వరుని ఉపాసించుచుండెను; అతని చుట్టును మీదను పుట్టి పెరిగి చుట్టివే నెను; అందు పక్షులు గూండ్లు పెట్టెను; ఇది చూచి ఉమాశంకరుల కాశ్చర్యము కలిగెను; ఇట్లున్న ఈత డెవ్వడు? దేవుడా! దానవుడా! మ హేశ్వరా! తెలుపుమని గౌరి దేవేశునడిగెను; ఈశ్వరుడును: ప్రియా! ఇతడు భృగుడను ద్విజూ శ్రేష్ఠుడు; మునియును ఋషిప్రవరుడును; ఇతడిందు సమాధిస్థుడయి నన్ను ధ్యానించుచున్నాడు॥ అనెను॥ అంతట దేవి పెద్దగ నవ్వి: “ఇతని పై ఇతని జుట్టుకొన (అగ్ని జ్వాల) పొగవలే (పొగతో కూడినదై) ఏర్పడినది; ఇప్పటికిని నీవతనిని మెచ్చకున్నావు; దీనిని బట్టి నీవు దురా రాధ్యుడవు సులభముగా మెప్పించరానివాడవు); ఇందు సందియము లేదు॥" అనెను: శివుడది విని “దేవీ! ఇతని విష యము నీవు ఎరుగవు; ఇతడు క్రోధ వేష్టితుడు; దీని యథార్థత్వము చూపి నీకు ప్రత్యక్షము చేయుదును; అనెను॥ అంతట మహాదేవుడు ధర్మరూపుడదిగు వృషభమును స్మరించెను; దేవ దేవుడు స్మరించినంతనే శీఘ్రముగా ఆ వృషము వచ్చి ఎదుట నిలిచేను: అది మానుష వాక్కుతో ప్రభూ! ఆదేశ మునిమ్మ నేను: అంత ఈశ్వరుడును ఈ వల్మీక మును తవ్వుము: ఈ విప్రుని క్రిందకు పడ వేయుము; అనెను, యోగస్థుడయి ధ్యానమందున్న భృగుని ఆ ధర్మ రూప వృషభము క్రింద పడ వే నెను॥ తత్క్షణమతడు క్రోధ నంతపుడయి చేయి ఎత్తి ఇట్లు పలుకుచు దానిని శపించెను: “ఓరీ! (సీ!) ఎద్దా! ఎక్కడకు పోయెదవు! వృషమా! నేనిపుడే నాకోపముతో నాశ మొందించును॥” ఆంత వృషభమతనిని ఎత్తివేయగా ఋషి అంత రిక్షమునకు ఎగిరిపోయేను: అచ్చట అతనికా వృషభమంతరిక్షమందున్నట్లు కనబడెను: ఇది అతనికి ఉత్తమమగు అద్భుత మనిపించెను॥

భృగుకృతశివస్తుతిః॥

అంతట రుద్రుడు పెద్దగా నవ్వుచు ఋషి ఎదుట నిలిచేను: మూడవ కన్ను కనబడినంత ఋషి వెలవెల పోవుచు క్రింద పడెను; దండవత్ గా భూమి పైపడి నమస్కరించి పర మేశ్వరునిట్లు స్తుతించసాగెను:

భృగు మహర్షి చేసిన శివ స్తుతి

 కారణ కారణుడవును భూత సాధుడవును దీవ్యరూవుడవునగు నిన్ను నమస్కరింనంతనే నేను నంసారమును దాటితీని; ఐనను ప్రభూ! భువనపతీ! ఏదో కొంచెము మనవి చేయుదును; వేయినోళ్లు గల వాసుకి కూడ ఎన్నటికిని నీ గుణ సమూహమును వర్ణించ జాలడనిన మానుషుడెవ్వడు అది చేయగలడు? ఆయినను భువన పతీ! శంకరా! భ కి తో నిన్ను స్తుతించు తలపు నన్ను వాగునట్లు చేయుచున్నది॥ మహేశా ! భగవన్! నేను పలుకు మాటల లోనీ దోషముల)ను క్షమించుము॥ నీ చరణములయందు నీరతుడ (అత్యంతా సక్తుడ)నగు నన్న ను గ్రహించుము; దేవా! నీవే సృష్టియందు రజో గుణముగా స్థితియందు సత్వముగా ప్రళయ మందు తమముగా నగుదువు; భువనపతీ! భువనేశ్వరా! నీవు తప్ప మరి దేవత ము ఏదియు లేనేలేదు॥ యమ నియమములు (యోగాంగములు) యజ్ఞములు దానములు వేదాభ్యాసములు ధార ణాది యోగములు కాని ఉచ్చిషవిద్యా రసవిద్యారసాయన విద్యా ఖడ్గ విధ్యాం జనవిద్యా పాదు కొవిద్యా వివర-(సురంగా నిధి) విద్యా సిద్ధికాని ఇందేదియు నీ భక్తికి పదునారవపాలునకుకూడ నమ ముకాదు; భవ ! (శివ) ప్రతులగు వారికి దేహములందు ఆ దేహికిగల నీ చిహ్నము పుట్టుకతోనే ప్రకటమయి కనబడును; దేవా! కొంటెతనముతో (నిన్ను పరీ క్షించు తలంపుతో) నమస్కరించినవానికే యైనను నీవు ఐశ్వర్యము కోరిన వారికి అది ఇత్తువు॥ నాథా! జీవులకు సంసార బంధమును ఛేదించి (నశింపజేసి వారికి ముక్తి నీ యదలచి నీ వందులకు సాధనముగా నీయందు భక్తినికూడ నీవే సృష్టించి తివి॥) పర దార పర ధనములందాస క్తిగల వాడను పరులవలన పరాభవమునంది దుఃఖ శోకములచే సంతాప మందిన వాడను ధనాద్యాశ చే పరుల ముఖముల వంగిచూచుట కలవాటు పడిన వాడను అగు నన్ను పర మేశ్వరా! రక్షించుము; మిథ్యాభి - మానముతో దగ్గుడను క్షణభంగురమగు విభపములనంది॥ మిడిసి పడు వాడను క్రూరుడను కుపథా (చెడు తోవలకు) ఆభిముఖుడను పతితుడను అగునన్ను దేవేశా! రక్షించుము; దీనులగు ద్విజ సమూహముల హృదయములయందు మా కేవ రైన ధనమీయవలయుననియు దీనులగు బంధుజనుల హృదయములయందు మమ్ము ధనికులగు మా బంధు జనులు పోషించవలయుననియు ఆశ యుండుట దూషితము (తప్పిదము) కాదు; కాని శంక రా ఋషినగు నన్ను కూడ మూడునిగా జేసి ఆశ నన్ను తనకు వశునిగా చేసికొని వెక్కిరించుచున్న దే! ఇది బాగుగ లేదు; శీఘముగా ఆశ నుహరించుము; సదా నా హృదయమునందు నిలిచియుండు లక్ష్మిని (ఉన్నదే చాలునను హృదయానుభూతిని) ఇమ్ము॥ మద మోహ పాశములను ఛేదించుము; మహాదేవా! నన్ను సంసొర మునుండి దాటిం చుము; కరుణా భ్యుదయమను ఈ దీవ్య స్తోత్రము సర్వసిద్ధి ప్రదము; దీనిని భక్తితో పఠించిన వాని విషయమున శివుడు భృగుని విష యమునందు వలెనే సంతుష్టుడగును॥

ఇది విని ఈశ్వరుడు “విప్రా! నేను నీ విషయమున సంతుష్టుడనయితిని; ఈప్సిత వరము ప్రార్థించుము; అని ఉమతో కూడియున్న ఆ సోమ దేవుడు భృగునకు వర ము ఈయ సిద్దపడెను॥

ఆంతట భృగుడు “దేవేశా! నీవు నాయందు సంతుష్టుడవయినచో నాకు వరమీయ దగినచో నేను రుద్రత త్వ మెరిగిన వాడను కావలయును॥ అను నా కోరిక సంపన్న మగు (నేర వేరు)నట్లు వర మిమ్ము॥ అనెను, ఈశ్వరుడు “వి పేంట్రా? ఆటైయగుగాక! మరియు నీకిక మీదట కోపముండదు; నీ కుమారునకును నీకును ఏకాభిప్రాయముండదు; అనెను; అది మొదలు బ్రహ్మేంద్రులును దేవాసుర కించరాదులును మ హేశ్వరుడు భృగుని విషయమున తుష్టుడైన ఈ భృగు తీర్థ మును సేవించుచున్నారు; ఆట ఆ దేవుని దర్శించినంత నే పాపము క్తియగును; తమ ఇచ్చతోనే కానీ ఇచ్చలేక (తెలియక- ఆప్రయత్నముగా) కాని అచట మరణించిన ప్రాణులకు గుహ్యాతిగుహ్య పరమ రహస్య-ఉత్తమమగు సుగతి కలుగును; ఇది నిస్సంశయము; ఈ క్షేత్రము మహావి స్తర ము; సర్వ పాప ప్రణాశనకరము; ఇచట మరణించినవారికి పునరావృత్తి లేని ద్యులోక ప్రాప్తియగును; ఇచట సూర్యగ్రహణ కాలమున పొదర క్షలు ఛత్రము అన్నము కాంచనము యథాశ క్షిగ దాన మొనర్చినను ఆది ఆక్షయమగును; చంద్ర మార్య గ్రహణకాలములందు ఆమరకంటకమున చేసిన దానాదిక మెంత ఫలప్రద మో ఇచట చేసినది కూడ అంత ఫలప్రదమగును; ఇతరత్ర చేసిన సర్వదాన తపో యజ్ఞాదీ ఫలములయిన ఒక నాటికి క్షీణించవచ్చును॥ కాని భృగుతీర్థమున చేసినవి ఏవియు ఎన్నటికిని క్షీణించవు॥ సాక్షాత్ గ శంభుడు భృగుని ఉగ్రతపముతో తుష్టుడైన ఈ భృగు తీర్థము , తిలోక విఖ్యాతము; ఈ విషయమును స్వయముగా మహాదేవుడే దేవితో పలికినాడు; ఇది అంతగా ఆనుత్తమము॥ అయినను విష్ణువు చూయా విమోహితులగు వారు మాత్రము దీని మహ త్వ మెరుగజాలరు॥ సర్మదా నది (తీర) మందు ఉన్న ఈ భృగు తీర్థ మాహాత్మ్యమును విన్నవారు కూడ సర్వపాపముక్తులై రుద్రలోక మేగుదురు॥

తరువాత గౌతమేశ్వర తీర్థము; ఆందు స్నానము చేసి ఆనాడచట ఉపవసించిన వారు బంగరు విమానము పై బ్రహ్మలోక ప్రాప్తి నందుదురు; తరువాత నర్మదయందుండినదగు దౌత పావతీర్థము; దీనిని ధర్మరూపుడగు వృషభమే ఏర్పర చెను; ఈ తీర్థము తనయందు స్నానమాడినవారి బ్రహ్మహత్యా దోషమును కూడ పోగొట్టును; ఇచ్చట ప్రాణత్యాగ మొనర్చువాడు చతుర్భుజుడును త్రినేత్రుడునునై రుద్ర సమాన బలుడగును; పదివేల కల్పములు సంపూర్ణముగా శివతుల్య పరాక్రముడై శివలోక సుఖమందును; చాలకాలము తరువాత మరల భూలోకమునకు వచ్చినను పృథివి కంతటికి ఏకైక చక్రవర్తియగును; తరువాత ఉత్తమమగు ఐరండి తీర్థము; ఇచ్చట స్నానమాత్రముననే ప్రయాగయందువలే మహాఫల మబ్బును; భాద్రపద శుక్లాష్టమీనాడిచట స్నానమాడి ఒక అహోరాత్రముపవసించినవారు యమదూతల వలన బాధలందక రుద్రలోక మేగుదురు; తరువాత సాక్షాత్తుగ విష్ణున కే సిద్ధి కలిగించినదియు సర్వపాప ప్రణాశనమునగు హిరణ్య ద్వీపమను తీర్థ ము; ఇందు స్నానమాడిన వారు ధనవంతులును రూపవంతులును నగుదురు; తరువాత గొప్పదియగు కనఖల తీర్థము; ఇందు గరుడుడు తపమొనరించెను; యోగినీశ కి ఇందుండునని తిలోక ప్రసిద్దమిది; ఆమే యోగులతో కలిసి విహ రించును; శివునితో కలిసి నృత్యము చేయును; ఇందు స్నానమాడినవారు రుద్రలోక ప్రాప్తులగుదురు; తరువాత హంస తీర్థము; అందు హంసలు పొవ వినిర్ము క్రిములయి ఊర్ధ్వలోక మేగెను; తరువాత వరాహ తీర్థము; అందు విష్ణువు కూడ సిద్ధీనందేను; ఇచట శివుడు వరాహరూపుడై పూజింపబడును; ద్వాదశినాడు ఇందు స్నా సమాడినవారు నరక మును చూడరు; విష్ణులోకమున కేగుదురు; తరువాత అనుత్తమమగు చంద్రతీర్థము; ఇందు పూర్ణిమనాడు స్నానమాడుట ఆధిక ఫలప్రదము; దానిచే చంద్రలోక వాసమును దానిచే మహాసుఖ ప్రాప్తియునగును॥

తరువాత నర్మదా దక్షిణ తీరమందలి క న్యాతీర్థము; ఇది చాల ప్రసిద్ధము; శుక్లపక్ష తృతీయనాడు ఇందు స్నానమాడి ఈశ్వరునికి నమస్కరించి బలి (నివేదనము) ఇచ్చినచో రుద్రుడు ప్రసన్నుడగును; అంతరిక్షమునందు హరిత (ఆకుపచ్చని) కాంతితో చంద్రుని నగరము కనబడుచుండగా ఇంద్ర ధ్వజోత్సవము ముగిసిన తరువాత మాసములో (రాత్రివేళ) నగరములందలి జనము నిదురించు సమయమున-నర్మద తన జల వేగముతో తన తీరములందలి) వృక్షము లను తేల్చివేయు కాలములో॥ ఈ స్థానమునందు నివసించవలయును॥ ఇది ఆధిక ఫలప్రదము; ఆని విష్ణువు స్వయముగా శివునితో పలి కెను; తరువాత ద్వీపేశ్వర తీర్థ ము; అందు స్నానము చేసినచో బహు సువర్ణము లభించును; (ఆధిక సంపద కలుగును॥) తరువాత రుద్రక న్యా (ఉపనది) సంగమ తీర్థము; ఆందు స్నానమాడిన మాత్రమున దేవీస్థాన ప్రాప్తుడగును; తరువాత మహోత్తమమగు దేవతీర్థము; దానియందు స్నానమాడినవారు దేవతలతో కూడి సుఖింతురు; తరువాత అనుత్తమ మగు శిఖినీర్థము; ఆందు చేసిన దానములు ఇతరత్ర చేసిన అదే దానపు ఫలమునకు కోటి రెట్లుగ ఫలమునిచ్చును; ॥ కృష్ణ పక్షమున అమావాస్యనాడు ఆచ్చట స్నానమాడి బ్రాహ్మణునొక్కని భుజింపజేసినను కోటిమంది బ్రాహ్మణులను భుజింప జేసినట్లగును; రాజేంద్రా! ధర్మజా! మొదట చేప్పిన భృగు తీర్థమునందు కోటి తీరముల మహిమమున్నది; ॥ దాని మహి నము ఎట్టిదన ఇది భృగుతీర్థమని తెలిసికొని తెలియక కాని చిత్తములో కోరికలుండికాని లేక కాని ఇందు స్నానము చేసినంత మాత్రముననే మానవులకు నహ సొశ్వమేధ యాగములు చేసినందున కలుగునంత ఫలము కలుగును; వారు దేవతలతో కూడి వారితో పాటుగ సుఖింతురు; ఏలయన ముని పుంగవుడగు భృగుడే మహాసిద్ధి పొందిన ప్రదేశమది; ఆందు మహాత్ము తగు శంకరుడు ఆతనికి సాక్షాత్కరించి తన అవతారము చూ పెను॥

ఇది శ్రీమత్స్యమహాపురాణమున నర్మదా మాహాత్మ్యమున దశాశ్వమేధ తీర్థాదీ మహిమాను వర్ణనమను నూట తొంబది రెండవ అధ్యాయము॥