మత్స్య మహా పురాణము

Table of Contents

162 - హిరణ్యకశిపు వధాది కథనము॥

 సూతుడు ఋషులకింకను ఇట్లు చెప్పసాగెను॥ గోడిదలు పొములు మొసళ్ళు ఈహా మృగములు వరాహములు హంసలు కోళ్ళు సింహములు॥ కాకులు - గ్రద్దలు పావురములు॥ ఈ, ప్రాణుల మోములవంటి మొగములు బొలసూర్యుడు ధూమకేతువు ఆర్ధ చంద్రుడు ప్రజ్వలించు అగ్ని మెరపులు చక్రములు కోరవులు॥ వీటిని పోలిన మొగములు కలిగి నోరులు తెరచుకొని భయంకరులై నాలుకలు కోయుచు బలగర్వితులగు దానవులు కైలాస సదృశ శరీరము కలిగి ఆవధ్యుడగు ఆ మృగేంద్రుని పై యుద్దమందు కురియించిన బాణ వర్షములు అతనికి ఏమియు వ్యథ కలిగించలేదు॥ దాన వేశ్వరులపుడింకను మరికొన్ని ఘోర బాణముల నామృగేంద్రునిపై సర్పములవలే బుసకొట్టుచు కుద్దులయి ప్రయోగించిరి॥ కాని దానవేంద్రులు ప్రయోగించిన ఆ ఘోర శరములన్నియు పర్వతమునందు మెరపులువలె ఆ నృసింహ శరీరమున లయమందెను॥ అంతట దైత్యులు క్రోధ సమన్వితులయి జ్వలించు చక్రములను అన్ని వైపులనుండి శీఘ్రముగా ఆతని పై వినరిరి॥ అన్ని వైపులనుండి పడుచున్న చక్రములతో ఆకాశ ము ప్రళయకాలమున మిగుల ప్రకాశించు చంద్రాదిత్యాది గ్రహములతోవలే వెలుగుచు కనబడెను॥ అగ్ని జ్వాలలవలే చెల రేగు ఆ చక్రములనన్నిటినీ మహాత్ముడా మృగేంద్రుడు మింగేను॥ ఆవి అతని నోటిలోనికి పోపుచు మేఘపు నడుమ అనుగుహలలో చోరు చంద్ర సూర్యాదులవలె నుండెను॥ మరల హిరణ్యకశిపు దైత్యుడు చాల పెద్దదియై ప్రజ్వలించుచు భయంకర మై - శుద్ద మొనర్చబడి తనయందలి ఆయు ధములనుండి వెలువడు మేర పుల కాంతులతో వ్యాప్తమయిన శ క్తిని ప్రయోగించెను॥ తన పైకి వచ్చిపడుచున్న ఆ ఉత్తమ శక్తిని మృగేంద్ర భగవానుడు భయంకర హుంకారముతో వీర చేను॥ అది విరిగి నేలపయి బడుచు నిప్పు రవ్వలతో అంతరిక్షమునుండి రాలిపడు మహోల్కవలే కనబడెను॥ రాక్షసులు ప్రయోగించు) శరవం ! నృసింహునికి దూరమందే నిలిచి ప్రకాశించు రూపముకల నల్ల కలువ పూ రేకుల దండలవలే కనబడెను॥

ఆ దేవుడు యథా న్యాయముగా లోక మందలి ఆన్ని సింహములవలే గర్జించి యథా సుఖముగా లోక సాధా రణ సింహమువలె) విక్రమించి గాలి గడ్డి కొనలను వలె ఆ సేనను నశింపజే నెను॥ అంతట దైత్యేంద్రులు ఆకాశమందుండి మహాకాంతిగల కొండలంతటి శీలా ఖండములతో గిరి శృంగములతో రాల వాన కురియించిరి॥ ఆది ఆ దేవునీ తలపయి పడియు మీణుగురు పురువుల గుంపులవలే వది దిక్కు లకు చేద రెను॥ మరల వారు శత్రు నాశ కుడగు ఆతనిని మేఘములు జలధారలతో కొండనువలె రాలరాసులతో కప్పిరి॥ అయినను భయంకర వేగముగల సముద్రము పర్వత శ్రేష్ఠమగు మందరమును కదల్చలేనట్లే వారా దేవుని చలింపచేయలేక పోయిరి॥ ఇట్లది వ్యర్థమయి పడిపోగా జలవర్షము బండి ఇరుసంత లావగు ధారలతో అన్ని వైపులనుండి పడసాగేను॥ ఆకాశమునుండి తీవ్రవేగము గలిగి అన్ని వైపుల నుండి పడు జలధారలతో ఆకాశము దిక్కులు విదిక్కులు అంతరిక్షము ద్యులోకము భూమి అంతయు క్రమ్మబడెను॥ కాని అవి ఆ దేవుని వాక నేస తోకకుండెను॥ ఆ ధారలు యుద్ధమున మృగేంద్ర రూపమున నిలిచిన అతనికి వెలుపలనే కాని మీద పడ కుండెను॥ ఇట్లు రాల వాన ఆణగగా నీటివాన ఎండగా ఆ దానవుడు అగ్ని, వాయువులను చెలరేపుచు మాయను పన్నెను॥ సహస్ర నేత్రుడగు మ హేంద్రుడా యగ్ని ని మేఘములతో కూడ కురియించిన మహాజల వర్షముతో చల్లార్చేను॥ ఆదియు శమించగా ఆ దానవుడు అన్ని వైపులనుండి ఘోరమయి క్రమ్ము తీవ్రంధకారమును సృజించెను॥ ఇట్లు క్రమ్మిన చీకటి నడుమ దానవు లాయుధములు పట్టి చుట్టు నిలువగా భగవానుడు సూర్యుడువలే తన తేజముచే చుట్టబడి ప్రకా శించెను॥ మరియు దానవు లా దేవుని లలాటమున త్రిశూలపు గురుతులతో మూడుగా చీలిన కనుబొమ ముడి రేక త్రిపథగ యగు మూడు త్రోవల ప్రవహించు గంగవలే కనబడెను॥ ఇట్లు తమ మాయలన్నియు హతములు కాగా దైత్యులు వివర్ణులయి హిరణ్యకశిపుని శరణు వేడిరి॥

హిరణ్యకశిపుని మృతిని సూచించు ఉత్పాతములు॥

ఆ హిరణ్యకశిపుడును తన తేజస్సుతో మిగుల దహించువాడు వలె క్రోధముతో ప్రజ్వలించసాగేను॥ దానితో జగత్తు తమస్సుతో నిండెను॥ ఆవహము ప్రవహము వివహము ఉదావహము పూవహము సంవహము పరివహము అను శ్రీమంతములును మహాబల పరాక్రమములును అగు గగన సంచారులగు ఈ సప్త వాయువులును ఉత్పాత భయమును సూచించుచు క్షోబలైను॥ సర్వలోక క్షయ(ప్రళయ కాలమున ప్రాదుర్భవించు గ్రహములు గగనమున తమ ఇచ్చకు వచ్చి నట్లు తిరుగుచు కనబడెను॥ శత్రు నాశకుడు తారాపతి నిశాకరుడు నగు చంద్రుడు తన సహజ మార్గమును విడిచి గ్రహ నక్షత్రములతో కూడి మరియొక మార్గమున సంచరింపసాగేను॥ పగలు సూర్య భగవానుడు వివర్లు డయ్యెను॥ ఆంతరిక్ష మున నల్లని పెద్ద మొండెము కనబడెను॥ ఆగ్ని భగవానుడు భూమి పై ఉండియు అచట జ్వాలలతో వెలుగక మాటి మాటికి ఆకాశమున మండుచు కనబడెను॥ అంతరిక్షమున పొగ వన్నె తో వెలుగు సప్త సూర్యులు ఉదయించి కనబడిరి॥ అంతరిక్షమున వెలుగు చంద్రుని కొమ్ముల పై (పూర్ణిమ కాని తిథులందు) గ్రహములు - ఎడమ కొమ్మున శుక్రుడు కుడి కొమ్మున బృహస్పతి ఎడమను శనియు కుడి కొమ్మున అంగారకుడును ఈ ఇద్దరును మండు అగ్ని వలే నుండి కనబడిరి॥ యుగాంతమున మాత్రమే ఇట్లు కనబడవలసిన ఆ గ్రహములు మెల్లగ ఇట్లు చంద్ర శృంగముల పై నీలిచి కనబడెను॥ గ్రహములతో నక్షత్రములతో కూడి రోహిణీ సహితుడై లోకపు చీకట్లు పోగొట్టవలసిన చంద్రుడు రోహిణిని మెచ్చక ఆమెకు దూరమయ్యెను॥ ఇది చరాచర లోకనాశ సూచకము, చంద్రుని రాహువు (పూర్ణిమ కాక యే) మింగేను॥ ఉల్కలు , చంద్రుని క్రమ్మెను॥ ఆవి ప్రజ్వలించుచు తమ ఇచ్చ వచ్చిన కక్ష్యలలో చంద్రుని ఆశ్రయించి తిరుగసాగేను॥ దేవతలకు దేవుడు (రాజు) ఆగు ఇంద్రుడు నెత్తుటి వాన కురియించెను॥ గగనమునుండి మహాధ్వనులతో మెరపులవంటి ఉల్కలు పడెను॥ వృక్షము లకాలమందు పూచెను; ఫలించెను॥ (పండ్లు పండని) తీగలు ఫలించెను॥ ఇవన్ని యు ఇట్లు దైత్య నాశ మును సూచించెను॥

పండ్లనుండి పండ్లు పూలనుండి పూలు వచ్చుచుండెను॥ సర్వ దేవతా ప్రతిమలును కన్నులు తెరచును మూయును నవ్వును ఏడ్చును గంభీరము గా అర చును పొగలు గ్రక్కుచు మండును॥ ఇట్లవి మహాభయమును సూచించ సాగెను॥ గ్రామములందుండు మృగపక్షులు ఆరణ్య మృగపక్షులతో కలిసి తిరుగసాగెను॥ యుద్ధ సూచకములయి మృగ ములు భయంకర ధ్వనులు చేసెను॥ నదులు మలిన జలములతో ఎదురు ప్రవహించసాగెను॥ దిక్కులును నెత్తుటితో ధూళితో మలినములై కాంతిహీనములయ్యెను॥ పూజార్హములగు వనస్పతులు పూయక కాయు చెట్టు) వానస్పత్యములు పూచి కాయు చెట్లు) పూజలనందుకొనకుండెను॥ పూజించపోయిన వేళకు) అవి వాయువేగ వశమున వంగుటయే విరుగుటయో నమస్కరించుచున్నట్లు నేలకు లుటయో జరుగుచుండెను॥ ఏ ప్రాణులకును నీడయే కానరాక రవి మధ్యా హ్నము దాటి అపరాష్ట్రమును ప్రవేశించు సమయమున హిరణ్యకశిపుని భవనము మీదను వాని భాండాగారాయుధాగారము లందును తేనెతుట్టెలు పట్టెను॥ ఇట్లు ఇవియు ఇంకను అనేక ములును దైత్యనాశమును దేవజయమును సూచించునవియగు ఘోరోత్పాతములు కాల నిర్మితములై కనబడెను॥ మహాత్ముడగు దే తేంద్రుడు కోపముతో భూమిని కంపింపజేయుచుండ నాలుగు ఐదు ఏడు తలలు కల నాగులును వాసుకి తక్షకుడు కర్కోటక ధనంజయులు ఏలాముఖ కాళియ మహాపద్ములును విషజ్వాలలతో కలత నొందిన తమ నోళ్ల నుండి ఆగ్ని ని కక్కసాగిరి॥ సహస్ర శిర స్కుడు బంగరు తాటి చెట్టు ధ్వజ ముగా కలవాడు మహాసమర్థుడు మహాభాగుడు అనంతుడు ఆగు శేషుడు దేనికిని ఎన్నడును : ఏపింపని వాడు కూడ కంపిం చెను॥ నీటి నడుమను సంచరించుచు ప్రకాశించు అన్ని ప్రాణులును అపుడా దైత్యేంద్ర కోపకంపితము లయ్యెను॥ పాతాళ తల సంచారులయి మేలగు తేజస్సుగల పాతాళమందలి నాగములును అవి ఎంతగా కంపించచేయ నలవి కాని వయ్యును కంపితములుగా చేయబడెను॥

హిరణ్యకశిపు దే త్వుడు ఆపుడు కోపముతో పెదవుల పుటమును కొరుకుచు తన అన్న యు యజ్ఞ వరాహుని చేతిలో మరణించువాడునగు హిరణ్యాక్షుడువలె భూమిని స్పృశించుచునే భూమినే కాక భాగీరథీ కౌశికీసర యూ యమునా కావేరీ కృష్ణవేణి తుంగవేణీ గోదావరీ చర్మణ్వతీసింధు నదులను మేకలమున పుట్టిన శుభ జలముగల నర్మదను మణివంటి నీరుగల శోణమును గోవుల మందలతో నిండిన గోమతిని పూర్ణా సరస్వతీ మహీ కాలమహీ నదులను పూవులతో కూడి ప్రవహించు సరయూనదిని సర్వ రత్నములతో ప్రకాశించు జంబూ ద్వీపమును బంగరు గనులతో అలంకృతమగు సువర్ణపుటక దేశమును మహానదములతో శైల వనములతో శోభించు లౌహిత్య దేశమును ఋషులకు వీరులకు గనియగు దేశమును కోశ కొరుల పట్టణమును మగధ మహాగ్రామాం(రాష్ట్రాం ) ధైంగ కురు సాళ్వవిదేహమాళవ కాళి కోసల దేశ ము లను కూడ తాకినట్లయి ఇన్ని యు కంపించేను॥ కైలాస శిఖరాకారమును విశ్వకర్మచే స్వయముగా నిర్మితమును అగు వైనతేయ (గరుడ) భవనమును ఎర్రని నీరు కలిగి మహాభయంకరమగు రౌహిత్యమను సముద్రమును శతయోజనోన్న తమును బంగరు వేదికలు కలదియు మేఘ పంక్తులకు ఆశ్రయమును సూర్యునివలె ప్రకాశించు బంగరు సాలతొలత మాల పుష్పిత కర్ణికార 'వృక్షములతో అలంకృతమును అగు ఉదయ పర్వతమును గైరిక ధాతువులతో అలంకృతమగు అయో ముఖమను (పై భాగమునందు ఇనుప ధాతు శిలలుకల) పర్వతమును చీకటి చెట్ల అడవుల వాసనలతో నిండిన శుభమగు మలయ పర్వతమును సురాష9 బాహ్లికాభీరపాండ్య క ళింగ వంగ భోజ తామలి ప్రపుండ పౌండవాసశూలదేశములును దేవతలు నప్పరసలును ఆ దైత్యునిచే కంపింపజేయబడెను॥ పూర్వమే ఎల్లరకు చేరరానిదిగా నిర్మించబడినదియు సిద్ధ చారణ సంఘములతో వ్యాప్తమును మనోరమమును ఆగు ఆగస్త్య భవనమును విచిత్ర నానాపకులు పూచిన పెద్ద చెట్లు స్వర్ణమయ శిఖరములు అప్పదోగణ నంగీత నాదములు కలిగి లక్ష్మీ { శోభా యు క్షమయి చూచుటకీంపగు పుష్పితకమను వర్వతమును సముద్రమునే చీల్చుకొని పైకి లేచినట్లుండీ చంద్రసూర్యులకు విశ్రామ స్థానమై చంద్ర సూర్య కిరణ నదృశములగు మహాశృంగములతో ఆకాశమును ఒరయుచున్న దో అనునట్లుండుచు సముద్రజలముతో చుట్టబడి శత యోజనోన్న తమయి ఋషులు పడవేయు ప్రసరింప జేయు) మెరపుల గుములుగల వై ద్యుతమను మహాపర్వతమును శ్రీమంతమగు వృషభ పర్వతమును శుభమగు అగస్త్య గృహముగలదై విశాల కక్ష్యలు గలిగి ఎవరికి ఎదిరించనలవికాని కుంజర పర్వతమును సర్పముల కొవాసమగు భోగవతీపురియు మహాసన గిరియు పారియాత్ర పర్వతమును గిరి శ్రేష్టమగు పర్వతములును లేత చక్రవంతమును వారాహ పర్వతమును సువర్ణ మయమగుచు ఎదిరించనలవి కాని వాడు మేఘ దుష్టాత్ముడు విశాలనేత్రుడు గంభీర ధ్వని కలవాడునగు నరకుడు వసించు శుభ ప్రార్ణ్యోతిష పురమునుఅచ్చటి అరువది వేల సూర్యునివలె ప్రకాశించునది యక్షరాక్షస గంధర్వులు ఎల్లప్పుడు సేవించు (ఆశ్రయించియుండు) నదియు తన నడుమ బంగరు కలదియు మేఘములకు మిత్రమును అగు మేరు పర్వతమును శైలేంద్రమగు కైలాసమును - ఆ దానవేంద్రునిచే కంపింపజేయబడేను॥

బంగరు(వన్నె) నీటితో కప్పబడిన వైఖానస సరస్సు హంసకారండవ (జల) పక్షులతో కలతనొందుచుండు మానస సరస్సు తీశృంగమను పర్వతము కుమారీనది మంచురా శితో కప్పబడియుండు మందర పర్వతము ఉశీర బిందు భద్రప్రస్థ పర్వతములు ప్రజాపతి పుష్కర దేవాభ్రపోలుకొ పర్వతములు క్రౌంచ న పరి॥ధూమవర్ణ-పర్వతములు మరియు ఆయా ఉద్యానములు పర్వతములు దేశములు జనపదములు నదులు సముద్రములు మహీపుత్రుడగు కపిలుడు వ్యాఘ్ర వంతుడు ఖేచరులు (గగన సంచారి దేవ జాతులు) సతీపుత్తులు (నత్ లోక నివాసులు) పాతాళ తల నివాసులగువారు వారు ॥ రౌద్రము ఆను నామముగల దేవగణము అంకుశ మాయుధముగా గల మేఘ నాముడు భయంకర వేగముగల ఊర్ధ్వగుడు॥ ఈ ఆంద రును హిరణ్యకశిపునిచే కంపింపజేయబడిరి॥

అపుడు హిరణ్యకశిపుడు గదా శూలములు దాల్చి భయంకరుడై మేఘముల గణమువలె ప్రకాశించుచు ఆట్లే ధ్వని చేయుచు ఆట్టే వేగము కలిగి దేవశ త్రుడగు ఆ దైత్య వీరుడు నృసింహుని మీదకు పరుగెత్తుకోనుచు వచ్చెను॥ అంతట మృగేంద్ర రూపుడగు హరి ఓంకార మాత సహాయుడై వాని మీదకు దుమికి వాడియగు పెద్దగోళ్ళతో పోరి వానీనిచీల్చి చం పెను॥ ఆ దైత్యుసి నాశముతో భూమి కొలము చంద్రుడు ఆకసము గ్రహములు రవి సకల దిశలు నదులు పర్వతములు మహా సముద్రములు నైర్మల్యము నందెను॥ ఆంతట దేవతలు ఋషులు మునులు సనాదా) తనుడగు శాశ్వతుడగు) ఆ దేవదేవుని దివ్యనామములతో స్తుతించిరి॥ దేవా! నీవు ఏ ఈనార సింహ రూపమును ధరించితివో॥ దానినే పరాపరత త్వ మెరిగినవారు ఆర్చన చేయుదురు॥ అని పొగడిరి॥

బ్రహ్మ ఆ నరసింహు నిట్లు స్తుతించెను: బ్రహ్మ రుద్రుడు దేవస త్తముడగు మహేంద్రుడు లోకములకు కర్తయు ఏక ర్తయు(పరిణామము నొందించువాడు॥లయము నొందించువాడు) కారణభూతుడును నయియుండియు తాను ఏ మార్పును లేకయుండు తత్త్వము నీవే॥ పరుడు॥ (ఉత్కృష్టుడు) అగు సిద్దుడు పరదేవుడు వర మంత్రము పరమ హవిస్సు ( దేవతల నుద్దేశించి అగ్నీ లో అర్పించు ద్రవ్యము) పరమ ధర్మము పరమ పరమ విశ్వము పరను సత్యము పరమ తపము పరమ పవిత్రము పరమ మార్గము (మోక్ష సాధ? ము) పరమ యజ్ఞము పరమ హోత్రము (హోమ సాధనము) పరమ శరీరము పరమ బ్రహ్మము పరమ యోగము పరమ వాణి వాక్కు) పరమ రహస్యము పరమ గతి ( మోక్షము , పరమము కంటే పరమమగు రహస్యము పరమ పరమపదను (స్థానము) పరమ వర మహృద్యము (ప్రీతికరమగు తత్వము) పరమ పరమ దేవుడు పరమ పరమభూతము పరమ పరమ నిదానము (ఆది కారణము ; పరమ పరమ పవిత్రము పరమపరమ దాంతము (అన్ని టిని ఆణచునది) నీవేయని తత్వవేత్తలు చెప్పుచున్నారు॥ ఇట్లు నారాయణ దేవుని స్తుతించి సర్వలోక పితామహుడు భగవానుడు ప్రభువునగు బ్రహ్మ తన లోకమున కేగెను॥ తూర్యములు వ్రాయుచుండ అప్సరసలు నృత్య మొనర్చుచుండ ఈశ్వరుడగుహరి క్షీర సాగరపు ఉత్తర తీరమున కేగెను॥ గరుడ ధ్వజుడగు ఆ దేవు డచ్చట ప్రకాశించుచున్న నార సింహ శరీరమును ఉంచి తన ఎప్పటి రూపము ధరించి అష్ట చక్రములు కలదియు భూతము(పంచ తన్మాత్రలతో కూడి నదియు ప్రకాశించునదియు ఆగు వాహనముతో అవ్యక్త త త్త్వమునకు (మాయాశబలమునకు) కూడ మూలప్రకృతియగు (సర్వసానికి భూత శుద్ధ చైతన్య) రూపముతో ఆ ప్రభువు స్వస్థానమునకు ఏగెను॥

ఇది శ్రీమత్స్య మహా పురాణమున హిరణ్యకశిపూపాఖ్యానమున నరసింహుడు హిరణ్యకశిపుని వధించుటయను నూట అరువది రెండవ అధ్యాయము॥