మత్స్య మహా పురాణము

Table of Contents

178 - ఈశ్వరుడు అంధకాసురుని చంపుట (శివుని భైరవత్వమును తెలుపుకథ)

ఋషులు సూతునితో ఇట్లనిరి: సూతా! నీవు పద్మోద్భవ వృత్తాంతమును విస్తరముగా మాకు చెప్పి వినిపించితివి॥ భై రవమాహాత్మ్యమును సంగ్రహముగా చెప్పి వినిపింపగోరుచున్నాము ॥ ఆన సూతుడిట్లు , చెప్పనారంభించెను; దేవదేవు: డగు భైరవుడు నిర్వర్తించిన ఉత్తమ కర్మమును చెప్పేద వినుడు; అంధకుడను దైత్యుడుండెడివాడు; వాడు అపుడే ॥ పగులగొట్టిన కాటుకరా శివలే మేర యువాడు॥ మహా తపమాచరించినవాడు; దేవతలకును అవధ్యుడు; వాడో ప్పుడు పార్వతితో కూడి విహరించుచున్న విభుని మహా దేవుని చూచి దేవి సపహరింప సమక లైను॥ అవంతీదేశమున ఘోరమగు మహాకాలవనమందు ఈ ఓషయమయి ఆంధకునకు శంభునితో యుద్దము " జరిగేను॥ దానియందు శివుడు అంధకునిచే మిగుల బాధనం దెను॥ ఆపుదీశ్వరుడు పాశుపతమను అత్యుగ్ర దాణమును ప్రయోగించేను॥ రుద్రుడు తనబాణముతో అంధకుని చీల్చగా 'వాని రక్తమునుండి మరల - అట్టివారే మరి కొందరంధకులు జనించిరి॥ వారితో సమస్త జగము వ్యా ప్రమయ్యేను॥ ఇట్లా " యంధకుడు మాయావియగుట చూచి ఆదేపుడు ఆంధ కుని - (రక్తమును)॥ త్రోవుటకుమాతృ కలను దేవతలను సృజించెను॥ (మహాకాలవనము ఉజ్జయిని దగ్గర ఉండెను॥)

మాహేశ్వరి-బ్రాహ్మి-కౌమారి - మాలిని-సౌపర్ణి॥వాయవ్య-శాక్రి వై నాయకి॥సౌరి॥ సౌమ్య శివదూతీ చాముండ॥వారుణీ వారాహి-నారసింహ-వైష్ణవి॥చలచ్చిఖ-శతానంద-దగానంద ॥పిచ్చిల॥భగమాలిని - బల అతిబల-రక్త-సురభి'॥ సుఖమండిక॥ మాతృనంద॥సునంద - బిడాలి॥ శకుని॥ రై వతి శంక రి చంద॥లాంగలి - కుదిని॥జయ విజయ॥జయ'తి ॥ అపరాజిత॥ కాళి మహా కాళీ దూతి-సుభగ దుర్బగ-క రాళి-నందిని ఆదితి॥దితి మారి-మృత్యు - కర్ణ మోటి॥యామ్య-ఉలూఖి ॥ ఘటోదరి-వజ్రహస్త - పిశాచీ॥కపాలి॥రాక్షసి॥భు॥సుండి -శాంకరి - లంబ -చంద్ర-కరభ- ఘాట॥సులోచన ధూమవర వాణి -కరా శిక ॥విశాలదంష్టిణి ॥ శ్యామ "త్రిజటి - కుక్కు టవినాయకి॥వై తాళి, ఉన్మనామబడు॥ సిద్ది - రేహానా॥ కేకరీ గర్గభి ॥ ఉత్కట-బహుపు - పేతయాన విటంకిని-క్రౌంచి॥ శైలముఖి-వినత-సరమ-దను॥ ఉమ రంభ॥ మేనక-సలిల చిత్రరూపిణి॥ స్వధా-స్వాహా - వషట్కార-ధృతి - జ్యేష॥కపర్దిని॥మాయ-విచిత్ర రూప॥ కామరూప-సంగమ-ముఖేవిలాస మంగళ్య-మహానాస మహాము బీ॥కుమారి ॥॥ రోచన॥ భీమ॥ దామమదోద్దత॥లంబాడి - కాలజిహ్వా-కుంభకర్ణ-మహాసురి - కేశిని॥కునఖి॥॥పింగళాక్షి - తామసి-ఉలా ముఖి॥ధూమ్రశాఖా కంపిని-పరికంపిని॥ మోహిని॥॥॥ కుండలి-చంద్రా॥నిర్బయా॥ బాహం శాలిని॥కరకర్ణి॥ఏ కాక్షి -విశోక-నందిని॥ జ్యోత్స్నా ముఖిర భన॥ నికుంభ॥రక్తకంపన॥ అధికార॥మహాచిత్ర॥చంద్ర సేన ॥ మనోరమ॥ అదర్శన ॥ హరూపొ॥మాతంగి - లంబ మేఖలా-ఆటల - వంచన॥కాళి-ప్రాణద॥ లాంగలావతి చిత్ర॥చిత్తజలకోశాణా॥ శాంతీక ॥ధృష్టశాలినీ॥లంబ స్తని॥లంబసటా॥వినటా॥ వానచూ క్లిని స్థలంతీ॥దీర్ఘ కేశి॥సుచిరా॥సుందరీ - శుభ- అయోముఖీ-కద్రుముఖీ -క్రోధని॥ అతని కుటుంబిక ॥ముక్తిక॥చంద్రిక - బాలమో హినీ సామాన్య సహినీ॥లంబా - కోవిదారీ॥ మా వాసవి॥శంకుక స్టీ-మహానాద॥మహాదేవి॥మహోదరి॥హుంకారి॥ రుద్రసు సటారు దేశీ భూతదామరి॥పిండ జిహ్వ-చలజ్జ్వాల॥ శివా ॥ జ్వాలాముఖి (189 ఈ మొదలగు మహా ఘోర మాతృకలు శివునిచే సృజింప బడీ అంధకుల రక్తమును త్రావిరి॥ ఆ అంధక రకములతో పోరందరును మిగుల తృ ప్తినందిరి॥ వారు తృప్తినందిన యనంత రము మరల అంధక పుత్రులు జనించి శూలముద్దరములు చేతుల ధరించి వానితో మహాదేవుని బాధింవసాగిరి॥

'అంధకులతో వ్యాకులీకృతుడై శంకర భగవానుడు - ఆజుడు విభుడు దేవుడు" సగు వాసుదేవుని శరణు వేడెను, అంతట విష్ణు భగవానుడు శుష్క రేవతి యను దేవతను సృజింపగా ఆమె క్షణములో ఆంధకర క్రపానము చేసెను॥ ఆమె ఆంధక ర క్తము త్రావిన కొలదిని ఎండిపోవసాగెను॥ ఆమే॥ ఆట్లు॥ వారి రక్తమును త్రావీన మీదట (క్రొత్తవారు పుట్టక పోగా ఉన్న అంధకులను త్రిపురారి క్షయమందించెను॥ అంతట త్రిలోకధర్తయగు శంకరుడు శర్వుడు విక్రమించి ( మొదటి) మూలాంధకుని మహావేగమున తన శూలాగ్రమున నిలుపగా మహావీర్యుడగు చాడును శంకరుని స్తుతించేను॥ భవోద్భవుడు(సంసార మూలకారణుడు) ఆగు శంకరుడు వాని విషయమున తుష్టుడయి వానికి నిత్యము తన సాంనిధ్య మును గణేశత్వమును ప్రసాదించేను॥ అంతట మాతృకలు శంకరునితో “భగవన్! దేవాసుర మనుషులతో కూడిన సకల జగత్తును భక్షింతుము॥ నీ అనుగ్రహము కావలెను॥ అనుజ్ఞ నీయ వేడుచున్నాము॥” అనిరి॥ శంకరుడు ఇట్లనెను॥ “మీరు ప్రజల నందరను రక్షించవలయును; ఇది నిన్సంశయము కదా! కనుక ఈ ఘోరాభిప్రా యమును మరల్చుకొనుడు॥”

శంకరుడు ఇట్లు పలికినను లెక్క పెట్టక వారు ఏ కలవర మును లేక స్థిరచిత్తముతో సచరాచరమగు త్రైలోక్య మును భక్షించిరి॥ అపుడు శివ భగవానుడు ఆనాదినిధనుడు దేవుడు సర్వరోక సృష్టికి మూలభూతుడు దైత్యేంద్రుని వక్ష మందలి రక్తముతో పూయబడిన గోళ్ల కొనలుకలవాడు మరపువంటి సౌలుక గలవాడు పెద్ద కోరలవాడు మేరయు జూలి రాశి కలవాడు ప్రళయ వాయువుతో కలత పడు మహాసాగరము వలే ధ్వని చేయువాడు పేజములవంటి వాడి గోళ్లపాడు భయంకరుడు చెవుల వరకు తెరచిన నోరివాడు మేరుపర్వతమువలె ప్రకాశించువాడు ఉదయర వినీ పోలు కన్నులపాడు హిమా దీ శిఖరాకారుడు మనోహరములగు కోరలతో ఉజ్వలమగు మొగము కలవాడు గోళ్ల నుండి వేలికి వచ్చుచున్న రోషాగ్ని జ్వాలలనేడు జూలి పంక్తులు కలవాడు బంగారపు భుజకీర్తులు కిరీటము హారములు కటి సూత్రము సొమ్ములుగా దాల్చినవాడు నల్లకలువ రేకులవలే చామనచాయ కలవాడు వస్త్రయుగళ ము ఆలంకారముగా దాల్చినవాడు తన తేజముతో సకల బ్రహ్మాండాంతరాళమను మండపమును క్రమ్మినవాడు వాయుబలముచే త్రిప్పబడుచున్న వియు తమయందు వేల్చ బడిన హవిస్సును కొనిపోవునవియు నగు అగ్ని జ్వాలల సుడులతో సమానాకార ముకల వెంట్రుకలతో కూడినవాడు సర్వ॥॥ వర్ల విచిత్ర పుష్పములతో కూర్చబడిన మహామాలను దాల్చినపోడు నగు నృసింహమూర్తిని ధ్యానించేను॥॥ రుద్రుడు, భక్తి వూర్వక మగు ఏ రూపము కలవానిగా తను ధ్యానించెనో ఆదే రూపమున నృసింహదేవుడు ఆతనికి ధ్యానించినంతనే దర్శన మొసంగెను॥ కాని ఆ రూపము దేవతలకును చూడశక్యము కానిది॥ శంకరుడా దేవుని నమస్కరించి ఇట్లు స్తుతించెను:

జగన్నాథా! నృసింహదేహధారిన్: హరీ: పాపముల హరించువాడా!) దైత్యనాథుని రక్తముతో నిండిన గోళ్ళు అనేడు శ క్త్వాయుధములు కలవాడా! నీకు నమస్కారము॥ సకల జగమునందును వ్యాపించిన బంగారువంటి పచ్చనిచూర్తి కలవాడా! ప్రళయకాల మేఘ ధ్వనివంటి నాదము కలవాడా! పద్మనాభా! దేవతలకును ఇంద్రునకును సమస్త జగత్తునకును తండ్రీ! సహస్ర విధములగు మహాక్రోధము గలవాడా; నహ సేంద్రులంత పరాక్రమము కలవాడా! సహస్ర ముఖముల సమృద్ధి కలవాడా! సహస్రపాదాః సహస్రకాలముల రచించువాడా! సహస్ర సంఖ్యాకములగు ఇంద్రి యములను నిగ్రహించువాడా! సహస్ర భూలోకములకును మంచి ధైర్యము నొనంగువాడా! వేలుకొలదిగా అనంతమూర్తులు కలవాడా! సహస్ర చంద్ర సమానా! సహస్రగ్రహ విక్రమా; సహస్ర రుద్ర సమాన తేజశ్శాలి: సహస్ర బ్రహ్మ పరిస్తుతా! సహస్ర వాయువేగ థయంకరా! సహస్ర నేత్రములతో చూచువాడా! వేలకొలదిగా యంత్రములను మథించు వాడా! సహస్ర బంధనములనయిన విడిపించువాడా! నిన్ను నమస్కరించు చున్నాను॥ అంధకాసుర వినాశమున కై నేను సృష్టించిన మాతృ కలు నామాట లెక్క పెట్టక ఇపుడు లోక ప్రజలను భక్షించుచున్నారు॥ అపరాజితా! నేనే సృష్టించి వారిని పుడు నేనయి సంహరింపజాలకున్నాను॥ అని రుద్రుడు పలికి నది విని నరసింహమూర్తియగు ఆ హరి భగవానుడు తన జిహ్వనుండి వాణీ శ్రీ శ్వరిని హృదయమునుండి మాయను గుహ్యము (రహస్యాంగము నుండి భగమాలినిని సృజించెను॥ ఆ దేవుడు ఇదివరకే తన ఎముకలనుండి కాళిని సృజించియుండెను॥ ఆంధకుల రక్తమును త్రావిన శుష్క రేవతి ఆమెయే॥ ఇట్లు నలుగురను శక్తులను సృజించిన తరువాత వారికి పరివార దేవతలుగా మరి ముప్పది రెండు మంది॥ దేవతాశక్తులను నృసింహుడు తన యవయవములనుండి సృజించెను॥

వారి నామములు తెలిపెదను వినుము: 1॥ మహా భాగయగు ఘంటాకర్ణి 2॥ పుణ్యయగు త్రైలోక్యమోహిని 3॥ సర్వ సత్వవశంకరి 4॥ చక్రహృదయ 5॥ కామచారిణి 6॥ శంఖిని 1॥ లేఖిని 8॥ కాల సంఘర్షణీ-వీరు వాగీశ్వరి అను మొదటి శక్తికి అనుచరలు; 1॥ సంకర్షణి 2॥ అశ్వత 8॥ బీజభావ 4॥ అపరాజిత - 6॥ కల్యాణి 6॥ మధుదంష్టి 1॥ కమలా 8॥ ఉత్సలహ సికా_అనువారు ఎనిమిది మందియు మాయాదేవికి అనుచరలు; 1॥ అజిత-2॥ సూక్ష్మహృదయ 8॥ వృద్ద 4॥ వేశాశ్మదంశనా 6॥ నృసింహభైరవా 6॥ బిల్వా 1॥ గరుత్మవృదయా 8॥ జయా వీరు థగమాలినికి అను॥ చరలు; 1॥ ఆకర్షణీ 2॥ సంభటా శ్రీ॥ ఈ తరమాలికా 4॥ జ్వోలాముఖీ 6॥ భీషణిక 6॥ కామధేను 7, బాలికా 8, పద్మకరా॥ వీరు కాళికి లేదా శుష్క రేవతికి అనుచరలు; ఈ ఎనిమిదేసి మంది (8x4-82)యును నృసింహదేవుని ఆవయవముల నుండి జనించినవారు; త్రైలోక్య సృష్టి సంహార ములు చేయు సమర్థలు; వీరందరును తాము సృష్టింపబడిన వెంటనే మొదట రుద్రుడు సృష్టించిన మాతృగణము విధమున క్రుద్దలయి క్రోధముతో మెరయు కన్నులతో వారి మీదకు పరువె త్తిరి॥ వారి దృష్టి తేజస్సతి దారుణమయి ఎంతమాత్రమును సహింపరానిదిగా నుండెను॥ అంతట ఆ రుద్ర సృష్టమాతృకలు నృసింహదేవునే శరణు జొచ్చిరి॥ వారితో నృసింహుడిట్లు వలి కేను:

మనుష్యులును పశువులును తమ సుతులను చాల కాలము వరకు పోషించుచు పాలించుచునుండును॥ కదా! దేవ తలు కూడ ప్రజలను ఆపై చూడవలయును కదా! కావున మీరును నామాట పాటించి లోక పాలనము సేయుడు: మను జులును దేవతలు కూడ పురాంతకుడగు శివుని ఆరాధించునట్టు చూడుడు; శివ భక్తులకును నా భక్తులకును మీకును బలు లొసంగి పూజించువారికిని ఏ బాధలును కలుగనీయక సర్వకాను ఫలములను ఇచ్చి రక్షించుచుండుడు; నేను చెప్పిన విధానము ననుసరించి ఉచ్చాటనాదికము చేయువారిని నా శాసనమును - కూడ మీరు పాలించవలయును॥ ముఖ్యులగు మహాదేవులారా! మహాదేవుడు ఇంతటి నుండి మీకు ఉగ్రమును ఉ త్తమమును ఆగు రూపమును అనుగ్రహించును; మీరును అతని మాటను పాటించుచు - లోకరక్ష చేయుచుండుడు॥ లోకములకు కలుగు భయమును పోగొట్టగల మాతృకలను కొందరను నేను సృష్టించితిని గదా! తమ విశాల నేత్రములతో వారు సదా ప్రజలను కను పెట్టి చూచుచు నా వెంటనే ఉండి కురు॥ మీరును వారును 'నాతో పాటుగ నే నరులనుండి పూజలనందుకొనుచుండుడు; లోకమున నాతోకాక వేరు వేరుగ కూడ పూజలందుకొనుచు వారికి సర్వకామములను పూరించుచుండుడు; పుత్రార్జులయి ఎవరు ఈ శుష్క రేవతిని పూజింతురో వారికి ఆ దేవి పుత్ర ప్రద యగును; ఇది నిస్సంశయము; ఆమే పూజితురాలయి లోకమునందలి వారికి సర్వ కామప్రదయగును॥

ఆని ఇంతమాత్రము చెప్పి జ్వాలామాలలతో నిండిన శ రీర ముకల నృసింహ భగవానుడు తాను సృష్టించిన మాతృగణముతో కూడ అచ్చటనే అంతర్గాన మందెను॥ అచ్చట కృత శౌచమను తీర్థము ఉత్పన్న మయ్యెను॥ నర్వ జగత్తులకంటెసు ముందే యున్న వాడును జగముల ఆర్తిని హరించువాడు నగు హరుడు అచ్చటనే తాను సృష్టించిన రౌద్ర మాతృవర్గ మునకు రౌద్రమును దివ్యమును నగు మూర్తిని ప్రసాదించి అచ్చటనే మాతృకాగణ మధ్యమున తానును ఉండి పోయెను॥ అర్దము నారిగా నుండిన ఈశ్వరుడగు ఆ శివుడు తాను సృష్టించిన మాతృగణమున ప్రధానలగు సప్త మాతృక లను ఆరుద్రస్థానమునం దుండునట్లు వ్యవస్థ చేసి తానును అచటనే అంతర్ధాన మందెను॥

ఈ వృత్తాంతములు జరిగిన చోటికి సమీపమందే మాతృవర్గముతో కూడ హరుని మూర్తి ప్రతిష్టితమయి ఈ నాటికిని ఉన్నది॥ అచ్చట నేటికిని త్రిపురారియు అంధక శత్రుడునునగు హరుడు సృసింహమూర్తికి పూజ చేయు చుండును॥

 విశేషము: ఈ ఆధ్యాయమున అంధకాసురవధ వృత్తాంత నిమి త్తముగా రౌద్రమాతృకలుగా ప్రసిద్దలగు మాతృకాగణ మును నృసింహ మాతృకాగణమును ఉత్పన్నమయిన విధానము చెప్పబడినది॥ ప్రథమాధ్యాయమున ఋషులు సూతు నడిగిన ప్రశ్న ములలో శివుడు భైరవు డేట్లయ్యెనను ప్రశ్నకు సమాధానము కూడ దీనియందు చెప్పబడినది॥ ఇత గులు చేసిన ఉచ్చాటనాదులచేగాని మరి ఏ ఇతర కారణములచే గాని భూతాది బాధ కలిగినపుడు తన్ని వారణార్థ మారా ధింపబడువారు ఈ మాతృకలు॥ ఇట్లు భీరువుల థయపడువారి భయమును పోగోట్టు భైరవీ మాతృకలను సృష్టించి శివుడు భైరవుడు అయ్యెను॥ ఈ రౌద్ర మాతృకలును నారసింహ మాతృకలును ఉచ్చాటనాది మాంత్రిక తాంత్రిక ప్రక్రియలందు ఉపయోగపడు శ క్తి విశేషములని తెలియదగినది॥ రౌద్ర మాతృకల 189 మందిలో ప్రధానలు ఏడుమంది 1॥ బ్రాహ్మి 2॥ మాహేశ్వరి 8॥ కౌమారి 4॥ వైష్ణవి 5॥ వారాహి 6॥ ఇంద్రాణి (క్రీ) 7॥ చాముండ అనువారు; మిగిలిన 182 మంది (1x26) అనుచర దేవతలు; నారసింహ మాతృకలలో నలుగురు ప్రధానలు ఒక్కొక్కరికి ఎనిమిదేసి మంది అనుచరులు॥

ఇది శ్రీమత్స్య మహాపురాణమున అంధకాసుర వధము-రౌద్రనారసింహ-మాతృకోత్ప త్తియను నూట డెబ్బది ఎనిమిదవ అధ్యాయము॥