మత్స్య మహా పురాణము

Table of Contents

19 - శ్రాద్ధముచే పితరులకు తృప్తి కలుగు విధము 

ఋషులు సూతుని ఇట్లు ప్రశ్నించిరి: “లోకమున పితృ కర్మలయందు పితృదేవతలను ఉద్దేశించి జనులు ఇచ్చిన వ్యములును (పితృ దేవతలకు ఇచ్చిన ద్రవ్యములు అన్న ము మొదలైనవి) హవ్యములును (విశ్వదేవులు మొదలగు రిని ఉద్దేశించి ఇచ్చిన ద్రవ్యములు అన్న ము మొదలగునవి పితృలోక మునందున్న పెద్దలకుగాని పితృదేవతలు మొద గు వారికి గాని ఎట్లు చేరును ? ఈ పదార్థముల వలన కలుగు తృప్తిని అచ్చటికి చేర్చువారు ఎవరు ? ఇక్కడ ఈ నార్థములను తినువారును ఆనుభవించువారును మానవులగు బ్రాహ్మణులు గదా! హోమము చేయునది ఆగ్ని హోత్రమునందు నా! పేతలనుద్దేశించి ఇచ్చిన ఈ పదార్థములు శుభాశుభ రూపులై పుణ్య హే పాపమో చేసియుండి ఈ లోకమును విడిచిపోయి న్న ఆ పేతలు ఏ విధముగా అనుభవింతురు ?”

సూతుడు ఆ ఋషులతో ఈ విధముగా చెప్పనారంభించెను : పితృ శ్రాద్దములను ఆచరిందు ప్రక్రియలో పితను మాతను వసు రూపులనుగా పితామహుని పితామహిని రుద్రరూపులనుగా ప్రపితామహుని ప్రపితామహిని ఆదిత్య రూపు లనుగా చెప్పుదురు. ఇట్లని శ్రుతి ప్రమాణము. వారిని వారిని ఈ ఈ రూపములతో ఉన్నట్లు పేర్కొనుటతోబాటు పితరుల నామమును గోత్రమును కూడ చెప్పుదురు. ఇవియే శ్రాద్ధకర్త ఇచ్చిన హవ్యకవ్యములను ఆయా పితరులకు చేర్చును. ఇదికాక శ్రాద్దపు మంత్రములను శ్రద్ధను భక్తి పూర్వకముగ శ్రాద్ధమున ఉపయోగించవలెను. ఆగ్ని ష్వాత్తులు మొద లగు పితృదేవతా గణములవారు పితరులకును వారినుద్దేశించి ఇచ్చిన దవ్యములకును అధిపతులై యుందురు. పితరుల నుద్దేశించి చెప్పిన ఈ వసురుదాదిత్య రూప నిర్దేశములును వారికి ఆహారముగా ఇచ్చిన దానిని వారికి అందజేసి తృప్తి కలిగించును.  'ఎట్లన ఒకానొక శ్రాద్ధకర్తయొక్క తండ్రి తన శుభకర్మ బలమువలన దేవత్వమును పొందెను. అను కొందము. ఈ లోకమునందలి అతని కుమారుడు అతనినుద్దేశించి ఇచ్చిన అన్నము అమృతమై దేవత్వములో ఉన్న ఆ తండ్రికి చేరును. ఆ తండ్రియే రాక్షసుడై యున్నచో ఈ కుమారుడు శ్రాద్ధమున ఇచ్చిన అన్నము అతనికి తగిన భోగ ముగా అందును. పశువుగా ఉన్న వానికి గడ్డియే అందును. పామయియున్న వానికి గాలియై చేరును. యతులై యున్న పితరులకు పానీయమై గ్రద్దగానున్న వారికి మాంసమయి దనుజులై యున్న వారికి మాయగా అయి పిశాచములుగా అయి యున్న పితరులకు రక్తపానీయమయి మనుష్య జన్మము పొందియున్న పితరులకు అన్నము పానము భోగము రసద్రవ్య ములునయి వారివారికి చేరును.

ఆనందానుభవము శక్తి స్త్రీలు కాంతి భోజ్య ద్రవ్యములు భుజించు శ క్తి దానము చేయు శక్తి విభవము రూపము ఆరోగ్యము ఇవి అన్ని యు శ్రాద్దపు పూవులు-బ్రహ్మత్వ పాప్తి ఫలము. మానవులు జరిపిన శాద్ధమువలన తినొందిన పితృదేవతలు శ్రాద్ధకర్తకు ఆయువును పుత్తులను ధనమును విద్యను స్వర్గమును మోక్షమును సుఖములను రాజ్యమును కూడ ఇత్తురు. కౌశిక గోతమునందలి బ్రాహ్మణులు లేదా కౌశికుని కుమారులు) wడు చే పితృదేవతలకు తృప్తి కలిగించినందువలన తత్ఫలితముగా ఐదు జన్మలతోనే మోక్షమును పొంది విష్ణు స్థానమును చేరుకొనిరి. అని పరంపర లో వినబడుచున్నది.

ఇది శ్రీ మత్స్యమహాపురాణమున మత్స్యమను సంవాదమున శారిద్దముచే పితరులకు తృప్తి కలుగు విధము అను పందొమ్మిదవ అధ్యాయము.