మత్స్య మహా పురాణము

Table of Contents

148 - దేవదానవ యుద్ధారంభము॥

సూతుడు శౌనకాదులకిట్లు చెప్పసాగెను: నురాసురుల ఆ పర మదారుణ సమ్మర్గమునందు ఇరు సేనలయందును గొప్ప తొక్కిసలాటయయ్యెను॥ దేవదైత్యుల గర్జనలతో శంఖ భేరీ తూర్య ధ్వనులతో ఏనుగుల ఘీంకారములతో గుర్రపు గుంపుల సకిలింతలతో రథపు చక్రపు పట్టాల చప్పుడులతో శూరుల విండ్లనారుల మోతలతో మహాతుముల మయ్యేను॥ పరస్పర జయ వాంఛతో అతి రోష పూర్ణులయి జీవిత త్యాగమునకు సిద్ధపడిన ఉభయుల సేనయు ఒకరి సేనను మరియొకటి సమీపించి ప్రక్రమముగాను విలోమముగాను ఎదిరించుకొనసాగిరి॥ రథము పదాతిమీదకు వచ్చును॥ రథము మీదకు గుర్రము దుముకును॥ ఏనుగు పదాతితో పెనగులాడును॥ రథికునితో రథికుడు తలపడును॥ ఏనుగులతో ఏనుగులు ఏనుగులు గుర్రములతో అనేక గజములతో ఒక ఏనుగు అనేక పదాతులతో అనేక గజములు ఒక పదాతి అనేక గజము లతో తలపడుచుండెను॥

ఇంకను ప్రాసవజ గదాభిండి వాలఖడ్డ పట్టిశశ క్రిముల శూలముద్ధర కుణిక గదలతోను చక్రపరశు తోమరాంకుశములతోను కార్షినాళీకాయుధములతోను నారాచబాణములతోను వత్సదంతార్ధచంద్రథల్ల శుక తుండాయుధములతోను ఆకాశమునందు అత్యాశ్చర్యకరమగు ఆయుధ వర్షము ఏర్పడి కనబడెను॥ దానిచే దిక్కులన్నియు కప్పబడి అంధకార మయమయ్యెను॥ దానిలో ఒకరికొకరు గుర్తు తెలియక యు ఆయుధ సముదాయము ప్రయోగించుచుండినను ఎవరు ఏది ఎవరి పై ప్రయోగించిరో తెలియకుండెను, సైనికులు సేనలనడుమ పడుచుండిరి, పరస్పరము చూచు చుండిరి॥

ధ్వజములు భుజములు ఛత్త్రములు కుండలములతో కూడిన శిరస్సులు గజములు తురంగములు పదాతులు తెగిపడియు పడుచునుండగా ఆకాశ మను సరస్సునుండి జారిపడిన పద్మములతో పలె వీనితో రణభూమి వ్యా ప్రమయ్యెను॥ దంతములు విరిగి కుంభములు పగిలి తొండములు తెగి నెత్తురు కారుచు ఏనుగులు కొండలవలే పడిపోయెను॥ కొండు విరిగి చక్రములు ఊడి ఇరుసులు విరిగి రథ ములును ముక్కలుగా తెగిపోయి వేలకొలదిగా అశ్వములును పడిపోయెను॥