మత్స్య మహా పురాణము

Table of Contents

172 - తారకామయాదుల సేనాసంనాహము

మహాగ్రహమగు స్వర్భానుడు (రాహువు) నోటితోను దంతములతోను పెదవులతోను కన్నులతోను యుద్ధము చేయువాడై సేనలకు ముందు భాగమం దుం డెను॥ ఇక మిగిలినదైత్యులు హయములను గజములను సింహములను వరాహములను ఎలుగు బంటు లను ఒంటెలను మేఘములను వాహనములనుగా చేసికొనియు, కొందరు పదాతులు గాను ఉండిరి॥ వారు భయంకరులు వికృతముఖులు ఏక పాదులును ద్విపాదులునయి యుండిరి॥ ॥ వారందరును యుద్ధకాంతులై ఉత్సాహముతో నృత్యము చేయుచుండిరి॥ భుజములను చర చుచు సకిలించుచు గర్జించుచు ॥ పులులవలే ధ్వనులు చేయుచు ఉండిరి॥ భయము గొల్పు గదలను వరిఘలను , శిలలనుము ముసలములను చేత ధరించియు పరిఘలను పోలు భుజము లనే ఎత్తియు ఆ దానవులు దేవతలను భయ పెట్టుచుండిరి; వారెల్లరును పాశములతో ఖడ్గములతో తోమరములతో అంకుశ ములతో పట్టసములతో శతఘ్నులతో ముద్దరములతో పెద్ద శిలలతో శైలములతో పరిఘలతో చక్రములతో ఇంకను ఇట్టి వాడియగు ఉత్తమాయుధములతో ఆడుచు తమ సేనను ఆనందింప జేయుచుండిరి॥ ఈ విధముగా దానవ సేన యంతయు హద్దుమీరిన యుద్దమదముతో ఆద్భుతమగు మేఘనమూహమువలె అమరి దేవతలకు ఎదురుగా నిలిచెను॥ ఆ సేన వేల కొలది దైత్యులతో దట్టమయి వాయువులను , అగ్ను లను శైలములను మేఘములను జలములను పోలి యుద్ద వరంపర యందు జయము పొందవలెనను ఉత్సాహముతో యుదము చేయు కాంక్షతో వెర్రిఎ త్రినదివలె ప్రకాశించెను॥

ఇది శ్రీ మత్య మహాపురాణమున దేవదానవ సంగ్రామమున తారకామయాదుల సేనాసంనాహమను నూట డెబ్బది రెండవ అధ్యాయము ॥