మత్స్య మహా పురాణము
182 - ఈశ్వరకృత బ్రహ్మ శిరశ్ఛేదాది వృత్తాంతములు॥ (ఈశ్వరుడు కపాలియయిన కథ)॥
(*సహి త్యక్ష్యామి తత్థ్సానం మహగణశతై ర్వృతం)
దేవి మహాదేవుని ఇట్లడిగేను: హిమవంతము మందరము గంధమాదనము జై లానము నిషధము మహాకాంతి గల మేరుపృష్టము రమ్యమగు త్రికూటము మానన మహాపర్వతము ఆను ఈ పర్వతములను రమ్యములగు నంద నాది దేవోద్యానములను పుణ్యములగు తీర్థసానములను తీర్ధ క్షేత్రములను అన్నిటిని వదలి మీకు ఈ ఆవిముక్త క్షేత్రమందాన కి ఏల? ఇచట సుమహా పుణ్యమేమి కలదు? ఆ పరమ రహస్యము నాకు తెల్పుడు॥ ఏల మీరు సదా భూత గణములతో కూడి ఇట విహరింతురు? ఈ క్షేత్రమునకు కల ! శేష్టత ఏమి? ఇచటనుండు వా రెవరు? వారియందు మీయనుగ్రహమేట్టిది? శం3 రా! ఆదియంతయు తెలుపుడు॥ ఆన దేవదేవుడిట్లు చెప్పెను: భామీనీ! నీవడిగినదిది అత్యద్భుతమగు ప్రశ్న ము; అదియంతయు చెప్పెదను వినుము; నాప్రియా! ఈ పుణ్య క్షేత్రమగు వారాణసియందు సిద్ద గంధర్వ సేవిత త్రిపథగ (మూడు త్రోవలపోవు) పుణ్యనది గంగ ప్రవేశించినది; అందుచే సుందరీ! నాకు గజచర్మ వస్త్రమునందువలెనే దీని యందును ప్రీత్యధిక ము; ఇట్లు సర్వస్థానములందు త్తమము కావున ఈ స్థానమునందు నాకు రతి ( ఆనందము) ఆధికము; సురేశ్వరీ! ఇందుచేతనే ఇచటి లింగమునందును నేను సన్నిధి చేసి ఉందును॥ గుణవతులలో శ్రేష్ట అగు దేవీ! ఈ క్షేత్ర గుణములను చేప్పెదను వినుము; వీనిని విన్న చో సర్వపాప ముక్తులగుట నిస్సంశయము; పాపుడు కాని పాషండుడు (వేద బాహ్యుడు) కానీ ధర్మార్థము లతిక్రమించిన వాడు॥ కాని ఆవిముక్త యాత్ర చేసినచో సర్వపాపముక్తుడగును; శుభ రూపా: సర్వభూత ప్రళయమయి స్థావర చర ప్రాణులును పదార్థములును నశించినపుడు కూడ నేను నాకు ప్రియతరమగు ఈ స్థానమును నేను విడువను; యుగక్షయ (ప్రళయ కాలమున దేవగంధర్వ యక్షరగ రాక్షసులును నానోరు ప్రవే శించుదురు; అపుడును నేను ఇట వారి పూజను సాక్షాత్తుగా ప్రతిగ్రహించుచుందును॥ ఇది నర్వ రహస్యములలో ఉత్తమమును నాకు ప్రియతరమునునగు స్థానము॥
సుశ్రోణి (మంచి పిరుదులు గల సుందరీః) ధన్వులు నా భక్తులగు త్రివర్ణికులు నా భ క్తియే ప్రధానము గాగల ఇతర నరులును అచట ప్రవేశింతురు: ఆచట మరణించి పరమగతినందుదురు; ఆవిముక్తమందుండు నరుడు నదా రుద్రము (నమక చమకముల తో నన్నా రాధించినవాడే; సదా దాన మొనర్చినవాడే; సదా తపస్వియే; (ఆట్టి వానికే ఈ క్షేత్రము లభించునని యర్థము) నన్ను నిరతము పూజించువాని విషయమున నేను తృపుడనగుదును; నర్వదానము లాచరించినవాడు సర్వయజ్ఞములతో దేవతల నారాధించినవాడు సర్వతీర్థ స్నానమాచరించినవాడు ఇటకు వచ్చి నన్ను శరణంద గలుగును; దేవీ! సునిశ్చయముతో ఈ ఆవిముక యాత్ర చేయువారును ఇట నివసించువారును వరమున నాయనుగ్రహమున స్వర్గ మున వసించి ప్రకాశింతురు; శుభలోచనా! అట్టివారు ఎవరికి తిరస్కరించను భరించను ఆలవికానివారై సంతాపర హిఁ" అవిముక్త శుభ క్షేత్రము చేరి కృతనిశ్చయులై నాకు భక్తులయి పాపములను దులుపుకోని విమలులగుదురు; అనగా, మరల ఇట్లనెను: దేవా! ఒకప్పుడు నా ప్రీతి కై దక్ష ధ్వంస మొనర్చితిరి; ఆట్లే ఇపుడు ఆవిముక్త క్షేత్రగుణములను కొంకను తెలిపి నాకు తృప్తి కలిగింపుడు॥ ఆవి ఎంత విన్న ను తృప్తి కల్గుటలేదు॥ ఆన ఈశ్వరుడిట్లనెను: దేవీ! నేను నీప్ర॥॥ క్రుద్ధుడనై దక్షయజ్ఞ వినాశ మొనర్చితిని॥ (ఆట్లే ఇపుడి ఆవిముక్త క్షేత్ర గుణముల తెలిపి నీకు ప్రీతి కలిగింతును! మేలగు ముఖము కలదానా! కృతనిశ్చయులై మద్బక్తులై ఆవిము క్తమందుండువారు శత కోటి కల్పముల తరువాత కూడ పునర్జన్మమునంద రు; ఆన దేవి ఇట్లు పలికెను: దేవా! అవిముక్త క్షేత్రమందు ఇతరత్ర దుర్లభములగు గుణములున్నవని॥ కీర్తించితిరి॥ మహేశ్వరా! వాటినన్నిటిని పాటి తత్వముతో కూడ తెలుపుడు; మహాదేవా! నా హృదయమందీ విష యమున చాల కుతూహలము కలదు; అన ఈశ్వరుడనేను: వరారోహా! ఆవిముక్రవాసులు నా ప్రసాదమున ఆక్షయులు ఆమరులు ఆదేహులు ఆయి నన్ను ప్రవేశింతురు; విశాలాక్షీ ! మరి ఇం కేమి వినగోరుదువు?
దేవి యనెను: దేవా! ఆవిము క్రమహా క్షేత్రమం దద్భుతమగు పుణ్యమును గుణములును గలవు; అవి ఎంత విన్నను నాకు తృప్తి కలుగుట లేదు; దేవా! అవి ఇంకను తెలుపుడు॥ అన ఈశ్వరు డిట్లు వచియించేను: మహేశ్వరీ! వరారోహా! నా ప్రియా! అవిముక్త క్షేత్రగుణములు చేప్పేద వినుము; శాకములు ఆకులు తినువారు ఇంద్రియ నిగ్రహము - కలవారు నిరత స్నాతులు సూర్యకిరణముల తావి జీవించువారు దంతములు రోలుగా చేసికొని ధాన్యములు నమలితిని జీవించువారు రాతిపై ధాన్యము అరగదీసి తిని బ్రదుకువారు నెలకొక మారే దర్భాగ్రమునకు వచ్చినంత నీరు ఆహారముగా గ్రహించి జీవించువారు॥ చెట్ల మొద నివాసముగా రా ళ్లే పడక గా నుండువారు రవితేజస్కులు జితక్రోధులు జితేంద్రియులు గయి ఇట్టి బహువిధ ధర్మములు పాటించి ఇతరత్ర వ్రతము లాచరించుచు తప మొనర్చువారు కూడ మూడు వేళల ధుచుచునే అవిముక్తమందు వసించువారి పదారవ పొలునకు సరిపోలరు; అవిముక్త వాసులు స్వర్గవాసులే; నా వంటి పురుషుడును నీవంటి స్త్రీ యు ఆవిముకమువంటి క్షేత్రమును ఇదివరకు లేవు; ఇకముందుండవు; ఇచట పరమయోగము పరమ పమ మోక్షము లభించును; కావుననే ఇటి క్షేత్రము మరిలేదు; వరవర్షినీ! మహా రహస్యము తెలి పెదను; నూరు జన్మముల కైన యోగసిద్దియు లక్ష జన్మముల కై న మోక్షమును లభించునో లభించదో చెప్పజాలము; కాని సునిశ్చితులై అవిము క్షమును ప్రవేశించి ఆచట వసించువారు ఒక జన్మము తోనే యోగసిద్ధినంది పరమ దుర్లభమగు మోక్ష మందగలరు; - పృథివియందు దీనికి సాటియగు క్షేత్రము మరిలేదు; ప్రియా! ఇచట॥ ధర్మము సదా నాలుగు పాదముల సన్నిధినంది నడుచును; ఈ క్షేత్రము నాలుగు వర్ణముల వారికిని పరమ గమ్యము; అన దేవి ఇట్లనెను: ప్రభూ! నేను నీ వలన ఈ క్షేత్ర గుణములను ఇతరత్ర కల గుణములను తెలిసికొంటిని; విపేంద్రులు (ద్విజులు) యజ్ఞములు చేయునపుడు వారిచే ఆరాధింప " ఓడు దేవత ఎవరు?
దేవితో ఈశ్వరు డిట్లు పలికెను: భావనతోను మంత్రముతోను నన్నే ఎవరు యజింతు ఆరాధింతురో పొరి కీ లోకములందు భయము లేదు; వారు భవుడు (లోక కారణుడు) రుద్రుడు (జ్ఞానావరోధమును తొలగించువాడు) ఆగు నన్నే పొందుదురు; దేవీ! యజ్ఞవిధి సమంత్రకము అమంతక మునని రెండు విధములు; యోగమును॥సాంఖ్యము యోగము ననీ రెండు విధములు; సర్వభూతములం దంతర్యామినై యున్న నన్ను ఏకత్వ భావన నాశ్రయించి సేవించు యోగి సర్వ విధముల లోక సంగముతో నుండియు నా యందున్నవాడే; ఏ నరుడు తనతో సమానముగా అన్ని భూతములను భావించి చూచునో అతనికి నేను కొని నా క త డు కాని లేక పోవుట యుండదు॥ యాగము నిరుణము సగుణము విధములు; సగుణ యోగము విజ్ఞాన (అనుభవ) గోచర మగును; నిర్గుణ యోగము మనస్సున కతీతము; దేవీ! నీ వడిగి నది ఇట్లు నీకు తెలిపినాను॥ ఆన దేవి ఇట్లడిగేను: భక్తు లనుష్టించు భక్తి త్రివిధములని మీరు చాల మారులు చెప్పి యుంటిరి; దాని వాస్తవరూపము తెలియగోరుచున్నాను; నాకు తెలుపుము; అన ఈశ్వరు డిట్లనేను: భక్తుల భ క్తియందు వాత్సల్యముగల మహాభాగా! దేవీ! వినుము; సాంఖ్యమును కాని యోగమును కాని ఆశ్రయించినవాడు దుఃఖాంతమును పొందును; ఎవడు సదా భిక్షా సేవనముతో జీవించునో అతడు భక్తితో రంజితుడై దానిదే భగవ తన్మయత్వమునంది ఆ భ క్రీమంతుడు భగవంతునిలో తల్లీను డగును॥ వరారోహా: దేవీ! శాస్త్రముల బహు కారణ{ హేతువాదములను చూడగలిగిన వారై నను వారు జ్ఞాన సంబంధి వాక్యములతో పొదింతురే కానీ నన్ను చూడజాలరు; యోగముతో చిత్తమున నన్నే నిలిపి పరమార్థ జ్ఞానమునంది తృప్తులగు యోగులును విద్యతా త్విక జ్ఞానము)చే ఆత్మ పరమాత్మతత్వము నెరిగి యోగ తత్త్వము నెరిగిన ద్విజులు మాత్రమే నన్ను దర్శింతురు; ప్రత్యాహారము, విషయ సుఖములనుండి ఇంద్రియములను ఉపసంహరించుట)చే చిత్తమును శుద్ద మొనర్చుకొనవలెను; మరేదియు ఆలోచింపక తత్వము నే ధ్యానించవలయును; గుణ త్రయ సమాయోగమున తత్వ మెరిగిన జ్ఞానవంతుడు మాత్రమే నన్ను దర్శించును; దేవీ! నీ వడిగిన దిది నీకు చెప్పితిని; మరి ఏమి వినగోరుదువు? వరారోహా! సువ్రతా! ఇంకను మరల మరల ఎన్ని మారు లయినను చెప్పెదను; గుహ్యమును పవిత్రమును నగు ఏది విన కుతూహలము నీ హృదియందున్న ను ఆది ఎల్ల చెప్పెదను; ప్రియా! ఏక మనస్కవే వినుము॥
ఆన దేవి ఇట్లనెను: దేవా! ముముక్షువులగు యోగులు దర్శించు నీ రూప మెట్టిది? ఇది నా సంశయము; సుర సత్తమా! నీకు నమస్కారము; నా కిది తెలుపుము; అన భగవాను డిట్లనెను: ఆది వా స్తవమున జ్యోతిరూపమయినది; ఆది మూర్తము (సాకారము) అమూర్తము (నిరాకారము) అని రెండు విధములు; ఆ పరమాత్మానుభవము పొందగోరు విజ్ఞాన వంతుడు అందులకై యత్నించవలయును; నిర్గుణుడగు భూతాత్మ సర్వ భూతాంతర్యామియగు పరమాత్మ తత్వము ఇట్టిదని చెప్ప శక్యము కాదు; దేవతలకు కూడ దివ్య వర్ష శతముల కయినను సాధ్యమో కాదో చెప్పజాలము॥ అన విని దేవి ఇట్లనెను: కృత్తివాసుడు (గజ చర్మధారి) యగు ఈశ్వరుడు ప్రమథ గణములతో నిత్యము నివసించు ఆ ఆవిముక్త క్షేత్రము అన్ని దిశలయందును వ్యాపించిన విస్తార ప్రమాణము ఎంత? అన ఈశ్వరు డిట్లనెను: ఆ క్షేత్రపు తూర్పు పడ మరల పొడవు రెండు యోజనములు; ఉత్తర దక్షిణముల వెడల్పు అర్ధ యోజనము; వారాణసీనది శుక్లనది పర్వత శ్రేష్ఠమగు భీష్మ చండికము అనువాని సమీపముగా ఈ క్షేత్రము వ్యాపించి యున్నది॥ దీనియందు విఘ్న వినాయకులను ప్రమథ గణపతులునుఉన్నారు; వారు కూశ్మాండుడు గజతుండుడు జయంతుడు మొదలగువారు; వారెల్లరును ఆధిక దళాలురు; సింహవ్యాఘముఖులు; - వికటరూపులు; మరుగుజ్జువారు; పొట్టివారు; వీరిలో నంది-మహాకాళుడు చండఘంటుడు మహేశ్వ రుడు దండచండేశ్వరుడు మహాబలుడగు ఘంటాకర్ణుడు॥ వీరు కాక మరియు ఇతరులు అనేకులు గణములవారగు రుద్రులు ఈశ్వరులు ఉన్నారు; వారందరు పెద్ద పొట్టలు పెద్ద దేహములు కలిగి వజ్రము॥శ క్తి మొదలగు ఆయుధముల దాల్చిన వారు; ఈ తపోధనులు శూలముద్ద రాయుధపాణులయి ప్రతి ద్వారమందు నిలిచి ఆవిముక్త క్షేత్రమును రక్షించుచుందురు॥ బంగరు కొమ్ములు వెండి గిట్టలు కంఠమున కదలియాడు గంటలు మూడు వన్నే లు కల పాడియావును వారాణసియందు వేదపారగుడగు బ్రాహ్మణునకు దాన మిచ్చినచో వద్మలోచనా! వరారోహా! ఆదాత తన వంశమందలి ఏడు తరములవారిని పవితుల జేయును॥ నిస్సంశయము,
ఎవడా క్షేత్రమున బ్రాహ్మణునకు బంగారము వెండి వస్త్రములు ఆన్నము మొదలగునవి దానము చేయునో వాని ఆ దానము అక్షయము ఆవ్యయము అగును; ఆ తీర్థపు మాహాత్మ్యమును సమృద్ధిని ఏ స్తవమున తెలి పెదను వినుము; అచట స్నాన మాడిన మానవులకు రోగబాధా నివృత్తియు దశాశ్వ మేధఫలమును లభించును॥ వేదపారగుడగు విప్రున కచట ఏ కొంచెము దాన మిచ్చినను దాత శుభగతి నందును; అగ్ని వలే ప్రకాశించును; వరణా అసియను నదులు జాహ్నవి (గంగ)తో సంగమించు చోట యథావిధానముగ అన్న దానము చేసిన వానికి పునర్జన్మ ముండదు॥ దేవీ! నీ కిది ఇట్లు ఆ తీర్థపు ఉత్తమఫలము తెలిపితిని; సువతవగు ఉమా? మరియొక నిశ్చయమును తెలిపేదను వినుము; ఆచట ఒక రేయిం బవలు ఉపవాసముండి బ్రాహ్మణులను ( ఆన్నా దికముతో) సంతృప్తి పరచినచో సౌత్రామణి యజ్ఞఫలము నందును; వరా ననా! అచట మాసమాత్రము ఏక భుక్త వ్రతము చేసినచో వెంటనే యావజ్జీవము చేసిన పాపమంతయు నశించును; అవిముక్తి క్షేత్రమున యథావిధానముగ ఆగ్ని ప్రవేశము చేసినచో వారు నా ముఖమందు ప్రవేశించిన ఫలమును నిస్సంశయ ముగ నందుదురు; పది బంగారు పూవులను (లేదా పది నవర సుల బంగారు పూవులను) దానము చేసిన వారికి నిత్యాగ్ని హోత్ర ఫల మబ్బును; అచట ధూప-గంధ-దానముచే భూదాన ఫలము లభించును; అచట గుడియందు క సవూడ్చుటచే ఐదు నూర్ల దాన మల ఫలము॥ ఆలుకుటచే వేయి దానముల ఫలము మాల అర్పించినచో లక్ష దానముల ఫలము పొందును; గీతవాద్యముల జరిపించిన చో ఆనంతఫలము లభించును॥
దేవి దేవునితో ఇట్లనెను: దేవా! నీవు చెప్పిన దిది అత్యద్భుతమగు విషయము; నీ వీ క్షేత్రమును విడువకుండుట లోని రహస్య హేతువును తెలుపుము; అనగా ఈశ్వరు డిట్లు తెలుపసాగేను: వరారోహా! సుశ్రోణి! ఈ విషయము ఎట్టిదో తెలి పేద వినుము; మహాత్ముడగు బ్రహ్మకు పూర్వము ఐదవ శిరస్సు జనించెను; ఆది చాల శ్రేష్ఠమయినది॥కాచిన బంగారువలే మంచి కాంతితో జ్వలించునది; ఇట్లుండగా దేవీ! ఆతడు నాతో నీ పుట్టుక నే నెరుగుదు ననేను; అంతట నేను క్రోధవ్యాప్తుడనయి రక్తనేత్రుడనయి నా ఎడమచేతి బొటనవేలి గోటి కొనతో ఆతని తల తెంచితిని; ఆంతట బ్రహ్మ “అనపరాధుడనగు నా తల త్రుంచితివి కనుక నీవు శాపయుక్తుడవయి కపాలధారి వగుదువు; బ్రహ్మహత్యాదోషాకులుడ వయి భూతలమందలి తీర్థములందు తిరుగుచుండుము;” అనెను; దేవీ! నే నంతట హిమవత్పర్వతమునకు పోతిని; అచట నేను నారాయణుని మహాభిక్ష కోరితిని; ఆతడు తన పార్శ్వమును చీల్చగా మహార క్ష ధార స్రవించసాగేను; ఆది ఏబది యోజనముల పొడవయ్యేను; అంతటి దానితో కూడ నాకపాలము నిండలేదు॥ ఆశ్చర్యకరమయి కనబడు ఆ ఘోర రక్త ధార దివ్య సంవత్సర సహస్రముల పాటు ప్రవహించుచునే ఉండేను; అది చూచి విష్ణు భగవానుడు నాతో “దేవేళా! శంకరా! శంభూ! ఇటువంటి ఈ కపాలము ఎచ్చటినుండి లభించేను; ఇది ఆశ్చర్యకరమయినది; నా వీది తేలిపి వంశ యము నివారింపుము;” అనెను॥
ఆతనితో నేను ఇట్లంటిని॥ “ఈ దివ్య కపొలపు ఉత్పత్తిని తెలి పేద వినుము; లక్షల దివ్య వర్షములపాటు బ్రహ్మ సుదారుణ తపమాచరించి దివ్యమును అద్బుతమును గగుర్పాటు కలిగించునదియు దివ్య సువర్ణ కాంతిమంతమును అగు దేహమును సంపాదించుకొనెను; ఆ మహాత్మునకపుడే ఐదవతలయు మొలిచెను: దేవా! నేనది తుంచితిని; ఇది చూడుము॥జయింపనలవి కాక నేను పోయిన చోటి కెల్ల నావెంట వచ్చుచున్నది;” అనగా పురుషోత్తమ దేవుడిట్లనెను: “నీవు బ్రహ్మకు ప్రీతి కలిగించు పని చేయవలయును; నీవు పోయిన ఏచోట అది నిన్ను విడుచునో అది నీవు నీ స్వస్థాన ముగా చేసికొనుము; అది తన తేజస్సుతో తానే నీకు శుభము కలిగించును;” అనెను॥ నేనంతట పరమ రహస్యములగు తీర్థములు క్షేత్రములు అన్ని యు తిరుగసాగితిని; కాని పృథుశోణీ! ఏమియు మేలు కలుగలేదు; అంతట నేను మహా శయా! ఈ అవిముక్తమునకు వచ్చి నా స్వస్థానమున నిలిచితిని; విష్ణు కృపవలన నా శాపము తీరెను; ఆ కపాలము వేయిగా చీలి స్వప్న మున లభించిన ధనమువలె అదృశ్యమయ్యెను; అంతట నేనీది బ్రహ్మహత్యా నీవారక క్షేత్రముగా నిర్ణయించితిని; వరవర్ణినీ! ఇది దేవతల శ్మశానము; ఇకనుండి నేను కాలుడనయి జగమంతయు సృజించుచు సంహరించుచు నుందును; దేవేశీః ఇట్లు ఇది నర్వ రహస్య స్థానములందును నాకు ప్రియతమమైనది; నాయందును విష్ణునందును దీవి కరుడు (పగళ్ళ నేర్పరచువాడు) లోక నాథుడు అగు భాస్కరునియందును భ క్తిగల ఉపాసకులు ఆచ్చటికి పోవుదురు; ఇచట దేహ త్యాగ మొనర్చినవాడు నన్ను ప్రవేశించును; ఆనగా దేవి దేవునితో ఇట్లనెను: దేవా! పద్మయోని (పద్మము జన్మస్థానముగాగల బ్రహ్మయును ॥ఆ పద్మమునకు జన్మకారణుడగు నారాయణుడును) చెప్పిన ఈ విషయములును॥ వాని ననుసరించి జరిగిన ఈ ఘటనలును అత్యద్భుతముగా నున్న వి; మహాతేజశ్శాలీ: త్రిపురాంతక రా! నీవు ఇచట నిత్య సన్ని హితుడగుటవలన ఇతర క్షేతములన్నియు కలిసినను దీనీ పదునారవ వంతునకును సరిపోలవు; దేవేశుడగు శంకరుడుండు ఈ స్థానమునందు కల గంగతో తీర్థ సహస్రములును సరిపోలుతో పోలవో చెప్పజాలము; దేవేశా! ఇట్టి నీవే ఉత్తమథ క్తి రూపుడవు; ఉత్తమగతివి; బ్రహ్మాది దేవతలకును నీవే సనాతన (శాశ్వత) మగు ఉత్తమగతివి; ఇదియంతయు భక్తులగు ద్విజులయందలి అనుకంపతో వారికి వినిపించవలయును॥
ఇది శ్రీ మత్స్య మహాపురాణమున దేవీదేవ సంవాద రూపమగు అవిముక్తి క్షేత్రమాహాత్మ్యమున యోగతతో పదేశము ఈశ్వరకృత బ్రహ్మశిర శ్చేదాది కథనమునను నూట ఎనుబది రెండవ యధ్యాయము॥
