మత్స్య మహా పురాణము

Table of Contents

187 - ఈశ్వరుడు బాణాసురుని త్రిపురముల దహించుట॥

మార్కండేయుడు ధర్మరాజుతో ఇట్లు చెప్పెను: ధర్మరాజా! నీవు నన్నడిగినది తెలి పెదను వినుము; ఈ నడుమ కాలములో నర్మదాతీరమునందు త్రిలోక ప్రసిద్ధమగు మా హేశ్వరమను స్థానమునందుండి త్రిపురవధ విషయ మాలోచించేను॥ మందర పర్వతమును (గాండీవ) ధనువుగా వాసుకిని ఆల్లే తాటినిగా కుమారస్వామిని శరము నిలుపు స్థానమునుగా విష్ణుని శరమునుగా చేసికొనెను; బాణపు మొనయందు అగ్ని ని పై ప్రదేశమున వాయువును నిలిపేను; దేవత లందరు కూడి రథము కాగా నాలుగు వేదములు గుర్రము లయ్యెను; అశ్వినులు పగ్గములు ఇంద్రుడు ఇరుసు అయ్యెను॥ కుబేరుడిశ్వరాజ్ఞచే ప్రధాన ద్వారమందు నిలిచెను; కుడి చేతి వైపున యముడును ఎడమచేతి వైపున భయంకరుడగు కాలదేవుడును ఉండిరి॥ చక్రమునందు కోట్లకొలదిగా లోకప్రసిద్దులగు దేవతలును గంధర్వులు నుండిరి॥ రథపు ముందు భాగమున ప్రజాపతి యుండెను; బ్రహ్మ సారథి యయ్యెను; ఇట్లా దేవేశుడు సర్వదేవమయమగు రథమును నిర్మించుకొని స్థాణు భూతుడై నిశ్చలుడై ॥వేయి పరివత్సరముల కాలము అట్లే వేచియుండెను॥ ఎపు డా మూడు పురములును ఒకటిగా కూడి అంతరిక్షమునందుండెనో ఆపుడు రుద్రుడు త్రిపురముల మీదకు తన శరమును ప్రయోగించేను॥ ఆది మూడు కణుపులుకు మూడు మొనలును కలది; దానితో రుద్రుడు త్రిపురములను భేదించదల చేను; అప్పటికే త్రిపుర స్త్రీలు తేజో హినలయిరి; వారి బలము శిథిలమయ్యెను; ఆ త్రిపురమందును వేలకొలది ఉత్పాతములు-ప్రాదుర్భవించి కనబడెను; అవి యన్ని యు త్రిపుర వినాశకరములగు కాలపురుషరూప మయినవి; అవి ఏవీ అనిన కొయ్యతో చేసిన గుర్రములు ఆట్టహాస ములు చేసేను; చిత్తరువులలో బొమ్మలును కన్నులు మూయుచు తెరచుచు ఉండెను; కలలో ఎవరికి వారు తాము రక్త వస్త్రము ధరించి యున్నట్లు కనబడిరి॥

అచటివారి కందరకును లోక విరుద్ధములగు ఏయే విషయములు స్వప్న మునందు కనబడెనో అవియే ఉత్పాత ములుగా జాగ్రదావస్థలో జనులకు కనబడసాగెను॥ వారి బుద్ధియు బలమును హరుని కోపమున నాళ మందెను॥ కల్పాంత మందు వలే ప్రళయమారుతము చెల రేగి వీచసాగెను; ఆ వాయువుచే  పేరణ నందిన అగ్నియు అచటి వారి తలల పైగా పరుగే తసాగెను; వృక్షములు మండుచుండెను; భవనములు మొదలగు వాని శిఖరములు పడసాగెను; అంతటను కలవర పాటు హాహాకారము చైతన్యము లేక పోవుట వ్యాపించెను; ఉద్యానములన్నియు భగ్నము లయ్యెను; ఇంత లో ఆ నగర మే ముక్కలు కాసాగెను; ఆ రుద్రుని మూడు మొనల శరములతో సర్వ నగరము పీడితమయ్యెను; వృక్షములు ఉద్యాన భాగ ములు వివిధ గృహములు అన్నియు దగ్గము లయ్యెను; ఈ సమృద్ధిగల యగ్ని మనశ్శిలల రాశివలె వెలుగుచు పది దిక్కులందును పది విధములుగ భాగములయి ప్రవర్తిల్లి వ్యాపించేను; వురముతయు మోదుగ పూవన్నె తో మండుచు కనబడెను; పొగ మూలమున ఒక ఇంటినుండి మరియొక ఇంటికి పోవుటకును శక్యము కాకపోయెను; ఆది హర కోపాగ్ని తో దగ్గమగుచు ఏడ్చుచు దుఃఖించుచు నుండెను; అట్లా త్రిపురపురము పెద్దగా మండుచుండ ఆ మంట లన్ని దెసలకును వ్యాపించెను; వేలకొలదిగా ప్రాసాద శిఖరాగ్రములు శిథిలము లయ్యెను; నానా మణులతో విచిత్రములయి కనబడు అనేక విమానములు (మహాభవనములును॥ ఆకాశ యానములును) రమ్యములగు గృహములును అనేక ములు ఆ ప్రజ్వలించు అగ్ని లో కాలిపోయెను; అచటి జనులందరును తామును కాలిపోవుచు రక్షణకై చెట్ల గుబురులలోనికిని భవనములమీది గూడులవంటి గృహభాగములవలభులలోనికిని పరుగే తసాగిరి; వారా యగ్ని ని చూచి వివిధ స్వరములతో ఏడువసాగిరి; కేకలు వేయ సాగిరి; అచట కొలది సేపటిలో కొండల శిఖరములంతటి బొగ్గుల-నిప్పు కణికెల-కుప్పలు కనబడసాగేను॥

మమ్ము ఇప్పుడు రక్షించుమాయని దేవదేవేశుని వారు ప్రార్థించసాగిరి; వారు ఒకరి నింకొకరు కౌగిలించుకొని అగ్ని మయ బాణజ్వాలలతో జ్వలించ జేయబడుచు వందల-వేలకొలదిగా దానవులు ఆచట దహించబడుచుండిరి॥ హంస లతో కారండవ పక్షులతో వ్యా ప్రములయి పద్మములతో కూడిన సరస్సులును పురో ద్యానములును వాడని పద్మములతో వ్యాపింపబడిన యోజనముల కొలది పొడవు వెడల్పులు కలిగి విశాలములై న నడ బావులును ఆగ్నిచే దగ్గములయి కనబడసాగేను॥ పర్వత శిఖర సమానములును రత్న భూషిత ములును నగు ప్రాసాదములును అగ్నిచే నిః శేషముగా కాల్చ బడి జలములేని మేఘములవలె బూడిదయ్ కసబడుచు క్రింద పడుచుండెను॥  హరుని కోపముచే పేరింపబడిన యగ్ని నిర్దయుడై యువతులయందును దొలుగయందును వృద్దులయందును క్ర మ్మీ వారిని దహించుచుండెను॥ గాఢనిద్రయందును స్వప్న ములందును మునిగియున్న వేలకొలది॥ జనులు తమ తమ పుత్రులను గాఢముగా కౌగిలించుకొని త్రిపురాగ్ని లో కాలిపోవుచుండిరి॥ ఆట్లు దీపించుచున్న ఆ త్రిపురములలో అప్సరసలవంటి స్త్రీలు అగ్ని జ్వాలల తాకిడికి చచ్చియు కొలియు ధరణీతలమున పడుచుండిరి॥ విశాల నయనములు కలదియు ముకాహార విభూషితయు నగు ఒకానొక చామనచాయగల సుందరి (శ్యామ) పొగతో కలత నంది ధరణీత లమున పడెను॥ బంగారుచాయ కలదియు ఇంద్రనీలమణి విభూషితయు నగు ఒక ముత్తైదువ తన భర్త పడిపోవుట చూచి తాను నతని పై పడిపోయెను; గాఢనిద్రలో తన ఇంటి నున్న సూర్యతేజస్కయగు ఒక స్త్రీ అగ్ని జ్వాలాహతయే తెలివి తప్పి పడిపోయెను; గదాహస్తుడై లేచి నిలువబడిన మహాబలుడగు దానవు డొకడు అంతలోనే ఆగ్నిహతుడయి ధరణీ తలమున పడెను; హారములతో కేయూరములతో (బాజూబందులతో) భూషితయగు మేఘ సమచ్ఛాయగల యొక యువతి తెల్లని వస్త్రము ధరించియుండి తన బాలునకు పాలు త్రావించుచుండి ఆంతలో బాలుడు కాలుచుండుట చూచి మేమధ్వనితో ఏడువసాగెను॥ హర క్రోధ పేరితుడగు అగ్ని త్రిపుర మును ఇట్లు దహించ సొగేను॥

వజ్రవైడూర్యభూషితయు చంద్ర సమానకాంతియు సౌమ్య స్వభావయు నగు ఒక యువతి పుత్తుని కౌగిలించు కొని కాలిపోవుచు వణకుచు నేల పై బడెను; సూర్యుని వలెను అద్దమువలెను తళతళ మెరయు వన్నె కలదయి లక్ష్మియే యనదగి శోభిల్లు ఒక యువతి వహ్ని దహ్యమాన యగుచు ధరణి తలమున పడిపోయెను; మొల్లపూవువలేను చంద్రుని వలేను దేహకాంతిగల యొకతె తన గృహమున నిద్రించుచుండగా ఆ గృహము కాలుచుండ ఆగ్ని జ్వాలల తాపమునకు మేల్కాంచి అంతయు మండుచుండుట చూచి ఆయ్యో! నా సుతుడు మరణించేనేయని ఏడ్చుచు కుమారుని కౌగిలించుకొని ధరణి తలమున పడెను; బంగరుబోయ గలదియు నీలరత్న భూషితయు ఆగు ఒక స్త్రీ పొగతో కలవరపడి క్రింద పడి పోయెను; ఆనేక దివ్యరత్నా లంకృతయగు తన బాలిక దహింపబడుచుండుట చూచి దహనుని తాపముచే మోహితురాలయి (దిక్కు తోచక) యుండి తాను తన చెలితోడయి పట్టుకొనియుండగా శిరస్సునందు ఆంజలిఘటించి ఆగ్ని కి ఇట్లు మనవి చేయసాగెను; నీవు అపకారులగు పురుషులందు పగబూనిన పూనేదను కాక ! గృహమను పంజరమందు కోకిలలలవంటి వారగు స్త్రీలు నీ కేమి యపరాధ మొనర్చినారు? పాపా! నిర్గయా! నిర్ల జై! స్త్రీలపై నీకు కోప మేల? నీకు దాక్షిణ్యము లేదు; లజ్జ లేదు; నత్యము లేదు; శౌర్యము లేదు; అనుచు ఈ ఉపద్రవముతో బాధ నందిన ఆ స్త్రీ అగ్ని ని నిందింప సాగెను; శత్రుపక్షమువారినే యేనను స్త్రీలను చంపరాదను మాట నీవు వినలేదా? కాని అగ్నీ ! నీ గుణములన్నియు నాశము విషయమందే ప్రవ ర్తిల్లుచున్నవి॥ నీకు స్త్రీల పై దయలేదు; దాక్షిణ్యము లేదు; కారుణ్యము లేదు; కాలిపోవుచున్న ఆడు వారిని చూచినపుడు మ్లేచ్చుల కై నను దయ కలుగునే? నీవు ఆ మ్లేచ్చులకంటెను నీచతరుడవు; నిన్నెవరు కాని మానుష జాలరు; ఏలయన నీవు బుద్ధిరహితుడవు! ఈ స్త్రీలను ఇట్లు పడగొట్టుటలో నీకు కలుగు లాభ మేమి? దుష్టా! దయా రహితా! సిగ్గు లేనివాడా! వేల్చినదాని నెల్ల తినువాడా! మందభాగ్యుడా! పుణ్యాశలు లేని వాడా! దురాచారా! నీర్గయా! ఆబలలను దహించుచున్నావే! ఆనుచు ఆ స్త్రీలు ఇట్లు బహు విధములుగా విలపించుచు నిందాఐక్యములు వదరు చు ఉండిరి॥

 మరికొందరు స్త్రీలు తమ బాలురు మరణించిన శోకముతో ఏమియు తోచక ఏడ్చుచుండిరి॥ వహ్నీ ! నీవు మా పూర్వ శత్రువువలె నిర్దయుడవయి మహాక్రోధముతో దహించుచున్నా వే? మేచ్చుడా! నీవు పుష్కరిణులయందును బావు లందును గల నీటిని కూడ కాల్చితివి; మమ్ములను కూడ దహించి ఏ గతి పొందింతువో తెలియదు; అని ఇట్లు వారు ప్రలాపములు చేయుచుండ విని అగ్ని ఇట్లు పలికెను: నేను నా ఇచ్చతో మీకు నాశము కలిగించుట లేదు॥ నేను (శివుని) ఆదేశ మాచరింతునే కాని స్వయముగ అనుగ్రహము చూపగలవాడగాను; రుద్రుని క్రోధము నన్నా వేశించగా అతని ఇచ్ఛ ననుసరించి నడుచుకొనుచున్నాను; అనెను॥ అంతట తన ఆసనమందున్న మహాతేజస్కుడగు బాణుడు త్రిపురము జ్వలించు చుండుట చూచి ఇట్లనుకొనెను; దేవతలు నన్ను నాశమందించిరి॥ అల్పసత్వులు (మనస్సున నిబ్బరము అంతగా లేని పొరు) దురాచారులు నయి ఈశ్వరునకు నా మీద నివేదించినారు; శంకరుడు తాను మహాత్ముడయ్యు (గొప్ప మనస్సుకల వాడు అయియు) సరిగా విచారించకయే నన్ను దహించుచున్నాడు; మహేశ్వరుడు తప్ప నన్ను చంపగలవారు ఎవరును లేరు; ఆనుచు ఆతడు లేచి నిలిచి త్రిభువనేశ్వరుడగు లింగరూపుని- శిరమున ధరించి పుర ద్వారము వెలువడేను; పుత్త మిత్రులను మహా విచిత్ర రత్నములను నానా విధ స్త్రీ జనమును విడిచెను॥ లింగమును మాత్రము శిరమున నుంచుకొని గగన మండలములోనికి పోవుచు దేవదే చేశుడును త్రిలోకాధిపతియు నగు శివుని ఇట్లు స్తుతించసాగెను॥ శంకరా! నీ కోపాగ్ని చే నేను నిర్గగుడను అయితిని॥ఆగుచున్నాను; నేను నీకు వధ్యుడనుగా తోచితినేమో! అగుగాక ! మహాదేవా! నీ ప్రసాద ప్రభావమున నొ ఈ లింగము మాత్రము నశించకుండు గాక! దేవా! నేనింతవరకును పరమభ కీతో నీ॥ ఈ లింగ మును అర్చించియుంటిని గదా! కావున నేను నీకు వధ్యుడనుగా తోచినను ఇది మాత్రము నశించకుండవలయును; మహా దేవా! నీ కోపముచే నేను దహింపబడుటయు మెచ్చదగినదే! ప్రతిజన్మమందును నేను నీ పాదములం దాసక్తి కలవాడను కావలయునను నా కోరికను మన్నించి అనుగ్రహించుము; పరమేశ్వరుడవగు నిన్ను దేవా! తోటక ఛందస్సుతో ఇదే స్తుతింతును; అని ఇట్లు బాణుడు తోటక వృత్తములతో శివుని స్తుతించెను॥

బాణాసురకృతశివస్తుతః - బాణాసుర కృత శివస్తుతి॥

“ప్రణవ స్వరూపా! శుభరూపుడవు శుభకరుడవు పాపుల హింసించువాడవు పాపముల హరించువాడపు మన్మథ శరీర నాశకుడవు త్రిపుర నాశకుడవు ఆంధకుని చంపిన వాడవు శూలధరుడవు ప్రియురాలగు పార్వతియందలి ప్రీతితో దేహమును విభజించుకొని సగమామెకిచ్చి ఆమెకు ప్రీతిపాత్రుడయినవాడవు సుందరుడవు సురాసుర సిద్ధగణములచేతను హయకపి సింహగజ ముఖులును మిగుల పొట్టివోపాడవయిననో ఆగు ముఖములు గలవారునగు ప్రమథులచేతను నమ స్కారములందుకొనువాడవునగు నీకు నమస్కారము; వీరు ఇట్టి ॥ న్వభావము గలవారని గ్రహింపనలవికాని దేవతల వలనను అనేక జన్మములందు కలిగిన వందలకొలది శరీరముల వలనను చాల వ్యథలనందితిని॥ భవుడవగు నీయందు భక్తిగల మతిగల వాడనగుచు నిన్ను నమస్కరించుచున్నాను; చలించుచుండు చంద్రకళతో వ్యాప్తుడవగు దేవాః నమ స్కారము; దేవా! నాకు పు తకళత్ర హయాది ధనమువలదు; సతతము నీ స్మరణము కావలయును; ఈ ఆనేక శత బాహుపులతో కూడ నాకు వ్యథయే కలుగుచున్నది; వీని మూలమున నేను నరకగతిని పొందింపబడుదునే కాని పుణ్యగతి నందను; వీనిచే జన్మ నివృత్తి కలుగదు; పాపమతియగువాడు నిబద్దనుగు (శాస్త్ర విహితమగు) పవిత్ర కర్మమును విడిచి పెట్టును; కానీ నామనస్సు వెనువెంటనే మాటిమాటికి కంపించుచున్నది; భ్రాంతి నందుచున్నది; భయమందుచున్నది; అందుచే నన్ను దుష్కర్మమునుండి నివారించుచున్నది॥”

ప్రయతుడయి (స్నా నముచేసి మడుగు వస్త్రముల ధరించి) శుచి మనస్కుడయి ఈ తోటక వృత్త రూపమగు సవమును పఠించువానిని శివుడు॥ బాణు ననుగ్రహించిన బ్లే యనగ్రహించి ఆతనికి వరదుడగును॥ ఈ మహా దివ్య స్తవ మును విని మ హేశ్వర మహాదేవుడు బాణునియందు ప్రసన్ను డే అతనితో ఇట్లనెను: వత్సా! దానవా! భయమందకుము; నీవు నీపుత్ర పౌత్త మిత్రబంధు భార్యా తద్బంధుజనులతో కూడ సువర్ణ నగరమందుందువు; ఇక మీదటను నీవు దేవతలకును ఆవధ్యుడవగుదువు; ఆని ధర్మరాజా! శివుడు అతనికి ఇంకను మరోక వరమును ఎవరి వలనను దేని వలనను భయము లేక ఆక్షయమును అవ్యయమును (నశించనిది మార్పులేనిది) అగు లోక మందు విహరించునట్లును వర మును కూడ ఇచ్చెను॥

 ఆంతట మహాత్ముడగు రుద్రుడు అగ్ని ని నివారించి బాణుని మూడవ పురమును రక్షించేను॥ (స్వర్ణ రజత లోహ పురములలో బంగరు పురము కొంత కాలక మిగిలెను॥) అది దివ్యమయి రుద్ర తేజః ప్రభావమున గగనమున తిరుగుచుండును; మహాత్ముడగు శంకరుడిట్లు త్రిపుర దహన మొనర్చెను; ఆవి జ్వాలామాలలతో ప్రదీ ప్రములగుచు ధరణీ తలమున పడెను; వానిలో ఒకటి శ్రీ శైల సమీపమున త్రిపురాంతకమున పడెను- రెండవది ఆమరకంటక పర్వతమున నర్మదా తీరమున పడెను; త్రిపుర దాహానంతగ మమరకంటక పర్వతమున కోటి రుద్రులు (లింగములు) ప్రతిష్టింప బడిరి; (త్రిపురములలో ఒకటి ఆచట అది జ్వలించుచు పడినందున ఆ ప్రదేశము జ్వాలేశ్వర మనబడెను; ఆ మం డేడు త్రిపుర ఖండపు జ్వాలలు పైకి బయలుదేరి ద్యులోకమునకు పోయెను; అపుడు దేవతలును అసురులును మహా హాహా కారము చేసిరి॥ మహేశ్వరానుగ్రహ పాత్రమయిన బాణుని సువర్ణపురమందలి ఆగ్ని మరి ప్రజ్వలించకుండ రుద్రుడది॥ స్తంభింపజే నేను; రాజా! పూర్వము అమరకంటకమున జరిగిన వృత్తాంతము ఇది; ఈ ఆమరకంటక పర్వతమందు మృతి నందు వాడు వేయియు ముప్పదికోట్ల సంవత్సరములపాటు చతుర్దశ భువన సుఖములనుభవించును; తరువాత భూతలమున ధార్మికుడగు రాజగును; పృథివిని ఏకచ్చతముగా పాలించును; ఇందు సంశయము లేదు; మహారాజా! అమరకంటక పర్వతము ఇంత పుణ్యకరమయినది; చండ్ర సూర్య గ్రహణకాలములందట యాత్ర చేసినచో ఆశ్వమేధ ఫలమునకు॥ పది రెట్ల ఫలము కలుగునని పెద్దలందురు: రవి గ్రహణమున ఆట శివుని దర్శించినచో స్వర్గ ప్రాప్తి బ్రహ్మహత్యా పాప నివృత్తి యగును; ఇట్లందంతయు పుణ్య మే; దానిని మనసాస్మరించినను సమగ్రముగా నూరు చాంద్రాయణ వ్రతములాచ రించినంత ఫలము లభించును; ఇది త్రిలోకప్రసిద్ధ ప్రదేశము॥

పుణ్యకరమగు ఈ ఆమరకంటకము సిద్ధ గంధర్వ సేవితమగు పర్వత శ్రేష్ఠము; నానావృక్షలతా వ్యాప్తము; నానో పుష్పశోభితము; వేలకొలది మృగములును వ్యాఘములును దాని నాశ్రయించియుండును; రాజా! దానియందు దేవితో కూడి మ హేశ్వరుడును ; బహ్మయు విష్ణువును చంద్రుడును విద్యాధరులును ఋషులును యక్ష కిన్నరులును వాసుకియు అతని యనుచరులగు పన్నగ శ్రేష్ఠులును సన్నీ హితులయి దానిని ఆశ్రయించియుందురు; అమరకంటక పర్వతమునకు గిరి ప్రదక్షిణము చేసిన మానవునకు పౌండరీక యజ్ఞ ఫలము లభించును; ఈ అమరకంటకమునకు తరువాతిదియగు జ్వాలేశ్వరమను తీర్థ ము సిద్దులును సేవించునది; దానియందు స్నానమాడినవారు పునరావృతి లేక శాశ్వత స్వర్గ సుఖ మందుదురు; చంద్రసూర్యగ్రహణ సమయములందిందు స్నానమాడినవారు సర్వకర్మ వినిర్ముకులయి జ్ఞాన విజ్ఞాన సంయుతులగుదురు; ప్రళయకాలము వరకు రుద్రలోక వాసులగుదురు; అమరులనగా దేవతలు కావునను వారిచటనుందురు కావునను దీని కమరకటకమని వ్యవహారము; (కటకమనగా వసతి స్థానమనియు ఆర్థము; అమరులకు నివాస స్థానము కావున అమరకటకము అనబడినది; అదియే క్రమముగా వ్యవహారములలో కంటకము అని మారియుండును॥) దేవతాత్మ కమును అమరేశుని స్థానమును అగు ఈ అమరకంటక పర్వతపు రెండు ప్రక్కలందును సువతులగు ఋషీ ముఖ్యులు తపమాచరించుచుందురు; అమరకంటకమునకు చుట్టునుగల యోజన దూరములో నర్మదానదీ శుభజలమునందు స్నాన మాడినవారు పాపముక్తువై రుద్రలోక మందుదురు॥

ఇది శ్రీమత్స్యమహాపురాణమున నర్మదా మాహాత్మ్యమున ఈశ్వరుడు బాణాసురుని త్రిపురములను దహించుటయను నూట డెబ్బది ఏడవ అధ్యాయము॥