మత్స్య మహా పురాణము

Table of Contents

84 - గుడపర్వత దానము

ఈశ్వరుడు నారదునకిట్లు చెప్పెను : ఇపుడిక మీదట గుడ పర్వత దానవ్రతమును తెలిపెదను. అది ఉత్తమ మయినది. దానినాచరించినవారు సురల పూజలనందుకొనుచు స్వర్గమున సుఖింతురు. దీనికే పది (24 తులములు = 1 సేరు; 5 సేరులు = 1 వీశే;8 వీశేలు = 1మణుగు;20మణుగులు=1 భారువా) బారువలు కాని ఐదు బారువలు కాని మూడు బారువలు కొని తగినంత ధనములేని వారు ఒకటిన్నర బరువలు కానీ బెల్లమును వినియోగించ వలేను. ధాన్య పర్వత దానమందువలెనే ఆవాహనమును పూజయు హేమ వృక్షముల ఆషురికయు విష్కంభ పర్వతము లను సరన్పులను వనములను దేవతలను విన్యాసము చేయవలెను. హోమమును జాగరణమును లోకపాలాధి వాసనమును ( ఆమరికను కూడ ధాన్య పర్వత దానమందువలెనే. దాన మంత్రము:) దేవతలయందు విశ్వాత్ముడగు జనార్దనుడును వేదములయందు ప్రణవమును స్త్రీలయందు పార్వతీయును శ్రేష్టమయినట్లు రసములలో ఇక్షు (చెరకు) రసము  శ్రేష్టము. కావున గుడ పర్వతమా! నాకు మేలగు లక్ష్మిని ఇమ్ము, నీవు పార్వతికి నివాసమవు; కావున నీవు నన్నెల్లప్పుడును కాపా డుము. ఈ విధానమున గుడ పర్వత దానము చేసిన వారు గంధర్వులచే కీర్తిగానము చేయబడుచు గౌరీ లోక మున సుఖం తురు. ఇట్లు నూరు కల్పములయిన తరువాత న ప్రద్వీపాధి పతియై జన్మించి ఆయురారోగ్య సంపన్నుడై శత్రువులకు ఆజేయు డై వర్ధిల్లును.

ఇది శ్రీ మత్స్య మహా పురాణమున గుడ పర్వత దానమాహాత్మ్య కథనమను ఎనుబది నాలుగవ అధ్యాయము.