మత్స్య మహా పురాణము
216 - రాజధర్మాః- రాజ్ఞో యుక్త దేశావస్థానమ్ - రాజు ఉండవలసిన స్థానము - (రాజధానీ స్థాన వివేచనము) - దుర్గ వ్యవస్థ - దుర్గము ఉండవలసిన స్థానము.
మత్స్య నారాయణుడు వైవస్వత మనువుతో ఇట్లు చెప్పెను: రాజు తన రాజధానిగా ఏర్పరచుకొని దుర్గము నిర్మించవలసిన చోటున తనకు సహాయులు అందుబాటులో నుండవలయును; ఆదిగడ్డి కట్టెలు సమృద్ధిగా దొరకు చోటు కావ లెను; సామంతులందరు ఆడ కువతోనుండి తన కడకు వచ్చి సేవింప వీలుగా దేశ మధ్యము కావలెను; వైశ్య శూద్ర జనులధికముగా నుండి ఆవశ్యకమయినచో ఇతరులును ఉండుటకు నువగునదియే బ్రాహ్మణులు కొలది మంది యుండి కర్మ కరులు (ఆయా పనులవారు) ఆధికముగా నుండుచోటు కావలెను; పంటల విషయమున దేవమాతృక ము (మెట) కారాదు; నదీమాతృకము (మాగాణి) కావలెను; రమ్యమై అను రక్తులగు జనులతో కూడి యుండవలెను; ఆచటిజనులకు పన్ను లపీడ అధిక ముగా నుండరాదు; పుష్పఫలో పేతమై శత్రు సేనలకు అగమ్యమై ఆపదలు (శత్రు భయాదికము) వచ్చినపుడు శీఘ్రమే ఆశ్రయించి రక్షించు కోన ననుకూలమై సుఖ దుఃఖములు సమానముగా కలిగి (ఈ రెంటిలో ఏవియు అధికముగా లేక) సతతము ప్రీతిదాయకమయి నరీ సృపములు (సర్పాదులు) ర్యాఘములు తస్కరులు లేక యుండవలెను; ఈ ఆనుకూల్య ములలోలభించినన్ని ఉన్న చోటిని రోజు తన నివాసమునకే ఎన్ని కచేసి కొనవలెను; (విషయము = ఆశ్రయము).
దుర్గనిర్మాణక్రమః - దుర్గ నిర్మాణక్రమము
ఇట్టి ప్రదేశమునందు రాజు *ధన్వదుర్గము మహీదుర్గము *నర దుర్గము వృక్ష దుర్గము జలదుర్గము గిరిదుర్గము, ఆను ఆరు విధములగు దుర్గములలో ఏదో ఒక విధమగు దానిని నిర్మించవలెను; వీనిలో ఆరవది చాల మేలు; దుర్గమునకు
చుట్టును గడ్డయు ప్రాకారమును బురుజులును శతఘ్నులు మొదలగు వందల కొల దిగ యంత్రములు తలుపులుగల మనోహరమగు పుర ద్వారము (గోపురము ) దాని పై జెండా కలిగి రా జేనుగు పె దానినుండి ప్రవేశింప దగినంతగా ఉండ వలేను; దుర్గపు లోపల నాలుగు పొడవగు వీథులు వానిలో మొదటి వీథి చివర దృఢ దేవాలయము రెండవ దాని చివర రాజ భవనము మూడవ దాని చివర ధర్మాధికరణ స్థానము నాలుగవ దాని చివర గోపురము (పుర ద్వారము) ఉండ వలేను; పురము ఆయతము (దీర్ఘ చతురస్రము) చతురస్రము వృత్తము త్రికోణము యవమధ్యము దీర్ఘ వృత్తము) ఆర్ధ చంద్రము వజ్రము (అష్టాగ్రము అష్టభుజాకృతి). ఈ ఆకృతులలో దేనిలో నైన ఉండవచ్చును; ఇన్ని టిలోను రాజాజ్ఞ (రాజ పురుషాజ్ఞ లేనిదే జనుల రాకపోకలకవకాశము లేకుండవలెను; నదీ తీరములందు కట్టు దుర్గము అర్ధ చంద్రాకృతిలోనే యుండుట ప్రళ స్తమని శాస్త్రజ్ఞులందురు; (దుర్గముల ఆకృతులు 923 పుటలో పటములో చూడుడు.)
(*ధన్వము అనగా ఎడారి; ఎడారిలో ఐదుయోజనముల భుజముతో ఏర్పడు చతురసమునకు నడుమ కట్టినకోట.)
(* ఇది బహుశ : ‘నడ’ (జమ్ము గడ్డితో నిండిన విశాల ప్రదేశమునందుండు) దుర్గము; ‘నడ’ క్రమముగా 'నర' అని పాఠము మారి యుండును.)
రాజ భవనము సకు దక్షిణముగా కోశ గృహము దానికి దక్షిణముగా గజ స్థానము తూర్పు మొగముగా గాని ఉత్తరపు మొగముగాగాని ఉండవలెను; పురాగ్నేయమున ఆయుధా గారము వంటశాల కర్మశాలలు (కమ్మరము-వడ్రం గము కంచరము మొదలగునవి) రాజ భవనమున కేడమగా పురోహిత గృహము మంత్రి గృహము వేద పండిత గృహము వైద్య గృహము కోష్ఠిగారము (వంట సామగ్రీశాల. ఉగ్రాణము) గోస్థానము ఆశ్వ స్థానము ఉండవలెను; అందశ్వ శ్రేణి ఉత్తరపు మొగమై కాని దక్షిణపు మొగ మైకాని ఉండవలెను; మిగిలిన మొగములు పనికిరావు; అశ్వశాలలలో రాత్రిం బవళ్లు ప్రదీపములు (కాగడాలు) వెలుగుచుండ వలెను. అందు కోళ్లు కోతులు విశేషించి ఎర్రమూతి కోతులు దూడలతోకూడ పాడియావులు మేకలు (ఇవి ఆశ్వరోగములు పోగొట్టు రక్తము మూత్రము మొదలగునవి ఇచ్చును:) ఉండవలెను. గోగ జైశ్వాది శాలలందు పేడ సూర్యాస్తమయమునకు లోపలనే తీసివేయవలెను; వీటి సారథులకు క్రమమెరిగి (ఈ శాలలున్న వరుసననుసరించి) అందరకు గృహములను ఈ శాలలకు దగ్గరలో నిర్మించవలెను; యోధులకును శిల్పులకును మంత్రుల కును దైవజ్ఞులకును ఒకే విధముగా మంచి ఇండ్లు నిర్మించి ఈయవలెను; దుర్గములందు రోగములును ప్రబలముగానుండు అవకాశము కలదు; కావున రాజు గోగజాశ్వాది వైద్యులను తప్పక తగిన వారిని సంపాదించి దుర్గమందు నిలుపుకొన వలెను; కుశీలవులు (గాయనులు) విపులు మొదలగు వారికిని దుర్గమందు వసతి ఉండవలెను; ఐనను పనిలేనిదే వీరెవ్వరును చాలమంది దుర్గములోపల నుండరాదు.
దుర్గే ఆయుధాదిసజ్గ్రహః - దుర్గమందాయుధాది సంగ్రహణము.
దుర్గమందు నానా యుధ యుక్ర యంత్రములు వేల కొలది మందిని చంపగలవియు గుప్త ద్వారములు నుఉండ వలయును. సర్వ విధానేకా యుధములును ధనుపులు వడి నేలలు పిరంగులు తోమరములు ఖడ్గములు కవచములు రాలు ముద్ధర ములు పట్టసత్రిశూల శూల ప్రాసశస్త్రక కి పరశ్వథ చక్ర చర్మ (డాలు) వర్మ (కవచ కుఠార (గొడ్డలి) కుర (చురక తి వేత్ర (పేము క ర్రలు బెత్తములు) పరిఘతుష ధాన్యాదుల పొట్టు దాత్రములు (కొడవళ్లు) అంగారములు (బొగ్గులు) నర్వశిల్పి భాండములు (ఆయా పనివారల పనిముట్లు) సర్వ వాద్యములు ఔషధములు సమృద్ధిగా అనేక విధములగు యవసము లు (మేత గడి తేగలు) వంట క లు బేలము సర్వ తెలములు సర్వ రస సామి. (పాలు పెరుగు తేనె మొదలగునవి) వన (క్రొవ్వువంటిది) మజ్జ-స్నాయువులు (నులినరములు) ఎముకలు ఎద్దుల చర్మముతో చేసిన తప్పె టలు మొదలగు చర్మ వాద్యములు సర్వ ధాన్యములు అభ్ర పటములు (శిబిరముల నిర్మింప పనికివచ్చు వస్త్రములు మొ.) యవలు గోధుమలు రత్నములు సర్వవిధ వస్త్రములు సర్వవిధ లోహములు బఠాణి పెసలు మినుములు శనగలు నూపులు ఇట్టి అన్ని పంట ధాన్యములు ధూళులు గోమయములు జనుపనార సర్జ రసము భూర్జ పత్రము జతులా (అను రెండు విధముల లక్కలు) టంకణము ఇట్టివిం కేన్నీ యో దుర్గ మందు సేకరించి ఉంచవలేను; వీటిలో ముఖ్యముగా రత్నములు సర్వ లోహములు సర్వవిధ వస్త్రములు కొర్రలు పెసలు మినుములు శనగలు నూవులు ఇంకను ఇట్టి సర్వ సస్యములును ధూళులును గోమయమును పాములతో కూడిన కుంభములు (సింహాదులగు) క్రూర మృగములు మృగములు పనులు మొద లగునవి వాటి పరస్పర మైత్రీ ద్వేషముల నెరిగి నిలుపవలెను; పరస్పర విరోధముగల పదార్థములకును ప్రాణులకును ఏర్పరచు స్థానములు అతి రహస్యములయి సురక్షితములయి ఉండవలెను; రాజు ఈ విషయములందు ప్రయత్న పరుడు కావలెను; ఈ చెప్పినవియు ఇందు చెప్పనివియు ద్రవ్యములు పురమందు జనుల హితమున కై సేకరించి రహస్యముగా భద్ర పరచి ఉండవలేను.
దుర్గే సగ్రాహ్యవృక్షాః - దుర్గమందుండవలసిన వృక్షములు మొదలగునవి.
జీవకము ఋషభము కాకోలము ఆమలకి ఆట రూషకము శాలపల్లి పృశ్ని (ష్ఠి) పర్ణీ ముద్ద పల్లి మాష పర్ణీ మేదో జోతి ఓషధులు రెండు శారిబా జాతి మూలికలు రెండు బలాజాతి ఓషధులు మూడు- వీర-శ్వసంతి-వృష్య-బృహతీ-కంట కారిక -శృంగి-శృంగాటకి-ద్రోణి-వర్షాభూ-దర్భరేణుక-మధువర్ణి-విదారి-మహాక్షీర -మహాతపస్-ధన్వనము -సహదేవ -కటుక - ఏరండకము విషము (ఒక మూలిక) పశ తిహ్వ-ద్రాక్ష-ఫల్గు. ఖర్జూరము - అతిమధుర శుక్ర –అతిశుక్రకాశ్మరి-ఛ శ్ర వీరిణి- చెరకు-రకు నుండి ఉత్పన్న వస్తువులు ఫణితము మొదలగునవి సింహి.సహదేవి.వి శ్వేదేవ.అశ్వరోధకము.మధుకము-పుష్పహంస-శతపుష్ప-మధూలిక-శతావరి-మధుకా-పిప్పలము తాళము - ఆత్మగుప్త - కట్పలదార్వికా – రాజశీరకి-రాజ సర్షపములు ధాన్యాకము. ఋష్యపో క-ఉత్కట-కాలకము -పద్మబీజము గోవల్లి-మధువల్లిక – శీతపాకి-కుబేరా- కాకజిహ్వ - ఉరుపుష్పిక-పర్వతము-త్రవునము గుంజాతకము.పునర్నవమిక శేరువు -కరువు కాశ్మీరీ-వల్య - సాలూకము - కేసరము-సుంకు ఉం డెడి అన్ని ధాన్యములు. అన్ని పకు మృగజాతులపాలు-తేనే మజ్జిగ-తైలములు-మజ్జ-వసనేయి -నీపము - రిష్టకము - ఆవోటము-వాతామము. సోమబాణక (బాదా)ము ఈ మొదలగు మధుర (తీయని) గణమునకు చెందిన ఓషధీ-రస జాతి ద్రవ్య ములును.
దాడిమము- ఆమాతకము-తింత్రిణీకము- ఆమ్లము-వేతసము-భవ్యము కర్కంధువు లకుచముకర మర్దకము రూషకము- బీజపూరకము కండూరము-మాలతి-రాజబంధుకము- రెండు తెగల కోలకముల పత్రము రెండు తెగల ఆమ్లాతముల పత్తములు పారావతము నాగరక ము ప్రాచీనోళకము కపిత్తము ఆమలకము చు కఫలము దంతశఠఫలము-జంబూ ఫలము నవనీతము సౌవీరము కలుషోదకము.సుర.ఆసవము మద్యములు మండము తకము దధి మొదలగు తెల్లని ఆమ్ల పుల్లని గణమునకు చెందిన పదార్థములును-
సైంధవము ఉద్భిదము పాథేయము పాక్యము సాముద్రలోమకము కుప్యము సౌవర్చలము బిల్వము బాల కేయము య వాహ్వకము ఔర్వము క్షారము కాలభస్మము - ఈ మొదలగు లవణ గణ పదార్థములును.
పిప్పలి-పిప్పలివేరు -చిత్రకము-నాగరము-కుబేరము-మరిచకము-శీగ్రువు – భల్లాతకము-సరపములు కుష్టము- అజమోద- కిణిహి- హింగువు-మూలక ము-ధాన్యకము-కార వీ-కుంజికా-యాజ్యా-సుముఖా - కాలమాలికా -ఫణిజ్జక ము-లశునము భూసృణము- సురసము-కాయస్థాపయస్థా-హరితాళము – మనశ్శిల-అమృత-రుదంతీ-రోహిషము- కుంకుమము-జయ-ఏరండము-కాండిరము-సల్లకీ-హంజికా-ఈ మొదలగు పిత్తజనక పదార్థములును ఇటువంటివేయగు (పిత్తజనకు ప్రాణుల మూత్ర ములును తరచుగా పచ్చనివియును సూక్ష్మములగు ఫలములును సూక్ష్మేలా-హింగు పత్తము- ఈ మొదలగు కటుక గణపు (కారపు) ద్రవ్యములును రాజు తన పురమునందు సేకరించి ఉంచుకొనవలయును.
ముస్తము చందనము బేరము కృతమూలకము దారవము- హంద్ర ఎనలదము-ఉశీరము-నక్త మాలము –కదంబకము- దూర్వ-పటోలము-కటుకొ-దీర్ఘ త్వక్-పత్రకము-వచాకిరాతతిక్తము- భూనింబము-విష- అతివిషతాళీస పత్రము-తగ రము-సప్తపర్ణము- వికంక తము- కాకోదుంబరికా-దివ్యా-సురోద్బవా-షడ్రంథా రోహిణి-మాంసి –పర్పటము-దంతికా-రసాం జనము- భృంగరాజమ-పతంగిపరి పేలవము-దుస్స్పర్శ గురుణి-కామా- శ్యామాకము-గంధ నాకులి-రూపవర్ణి- వ్యాఘ్రనఖము- మంజిష్టా-చతురంగుళ-రంథ- అంకురా-స్సీతో తాలాస్పోతామహరేణుకా-వై త్రాగ్రము వేతసము- తుంబీ-విషాణి-లోధ్రమంజరి మాలతి-కరకృష్ణా-వృశ్చికా జీవితా-పర్పటము-గళూగుడూచీ- ఈ మొదలగు తిక్త (చేదు) గణపదార్థములును. ఆభయా- రెండు తెగల ఆమలకములు- విభీతకము-ప్రియంగువు- ధాతకీ పుష్పము - మోచా-అర్జునము – ఆసనము- అనంతా-శ్రీ-లువరికా-సోనాకము కట్పలము - భూర్జప తము- శిలాపత్రము-పాటలా-పత్తలోమకము-సమంగా - త్రివృతా మూలము- కార్పాసముగై రికాంజనము-తిందుకము -తేనె మైనము-కుంభీకా -తెల్ల కలువ-నల్ల కలువ న్యగ్రోధము-ఉదుంబరము- అశ్వత్తము- కిండుకము శింశుపాశ మీ-ప్రియాలము-పీలు కొసారి శిరీషము-పద్మకము- బిల్వము, అగ్ని మంథము-ప్లక్ష ముత్యామా కము-వ(బ) - చఘనము.రాజాదనముక రీరము.ధాన్యకము ప్రియకము-కంకోలము ఆశోకము బదరము కదంబము - రెండు జాతుల ఖదిరము - ఈ చేప్పిన జాతుల.పత్రములు సారములు వేళ్ళు పూవులు మొదలగు కషాయ (వగరు) గణ పదార్థ ములును రాజు తన రాజధాని పురమందు సేకరించి ఉంచుకొనవలయును; ఇతరులను చంపుటకును వికలాంగులుగా చేయు టకును ఉపయు క్షములగు పురుగులను మార్గములందు బాధ కలిగించు వాయువులను పొగలను విషములను విషము శమింపజేయు విచిత్రములగు రోగ బాధా నివారక ద్రవ్యములను రక్షోభూత పిశాచములను పాపములను శమింపజేయు సాధనములను పుష్టి వృద్దీకర పదార్థములను కలావిదులగు పురుషులను రాజు యత్న పూర్వకముగా తన రాజధాని యందుంచుకొనవలయును; కుభృత్యులను పాపశీలురగు జనులను భీతురు)లను కుద్దులను ప్రమత్తులను ఆవమానితులగు వారిని రాజు తన పురమందుండ నీయరాదు; ఇట్లు రా జెల్లప్పుడును యంత్రములు ఆయుధములు ఆట్టాలములు. (బురుజులు) సర్వధాన్యములు సర్వౌష ధౌషధులు వణిగ్గనులు నిండినదై సుర క్షితమగు దుర్గమందు రాజు నివసించవలయును.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున రాజ ధర్మములందు దుర్గ వ్యవస్థా విధానమను రెండు వందల పదునారవ అధ్యాయము.
