మత్స్య మహా పురాణము

Table of Contents

23 - చంద్రవంశ వర్ణనము- చంద్రోత్పత్తి మొదలగు వృత్తాంతములు

ఋషులు సూతునితో ఇట్లు పలికిరి: సూతా! మీరు సర్వ పురాణ శాస్త్రములను బాగుగా ఎరిగిన వారు. సోముడు పితరులకు ఆధిపతి ఎట్లు ఆయ్యెను? ఆతని వంశమునందు లోకమున తమ కీర్తిని వృద్ధి చేసికొ, గలిగిన రాజులు ఎవరెవరు జన్మించిరి? .

సూతుడు ఇట్లు చెప్ప నారంభించేను:  బ్రహ్మ మానస పుత్రుడును ప్రజా పతియును ఆగు అత్రి మిగుల సమర్థుడు. అతనిని బ్రహ్మ ఆదేశించగా అతడు లోక సృష్టిని కొనసాగించుటకై సంకల్పించి సర్వోత్త్రమమగు తపస్సాచరించెను.

పరబ్రహ్మ తత్వము లోకముల కన్నిటికిని క్లేశమును నశింప జేయునది. ఆనందమును కలిగించునది. బ్రహ్మ విష్ణు రవి రుద్రులకును అంతరంగ రూపమయినది. ఇందియములకు గోచరించనిది. శాంతమగు మనస్సు కల వారిని శాంతి నొందించునదీ! గొప్ప వాటికం టెను గొప్పది. తపస్సు వలన కలిగెడి పరమానందమును కలిగించునది. ఇట్టి తత్వము అతి మహాముని తపోమహిమచే అతని కన్నుల యందే నిలిచియుండెను.

దానిని చూచి ఉమాపతి యగు శివుడు ఉమతో కూడి జలమునుండి సంభవమయిన తన ఎనిమిదవ అంశము చే ఆ అతి నేతమును ఆశయించేను. తత్పభావమున కలిగిన ఆనంద బాష్పముల వెంట జలములనుండి పుట్టిన ఆ శివుని అష్ట మా శమగు తేజస్సు అతి మహాముని నేతములనుండి సవించెను. దాని నుండియే సోముడు అను శిశువు ఏర్పడెను. ఆ శిశువు తన వెన్నెలలచే చరాచర పాణులతో నిండిన సమస్త విశ్వమును ప్రకాశింప జేయుచుండెను.

దిక్కులు తాము పుత్తుని కనగోరి స్త్రీ రూపమును ధరించి ఆ తేజస్సును తమయందు నిలుపుకొనెను. అది గర్భము అయి వారి ఉదరముల యందు ముప్పది వేల సంవత్సరముల పాటు ఉండెను. అంతట దిక్కులు ఆ గర్బమును ధరించలేక విడిచి వేసెను. చతుర్ముఖుడగు బహ్మ అంతవరకు దిక్కుల యందు వ్యాపించియున్న ఆ తేజో రూప గర్బమును ఒకటిగా చేసి సర్వాయుధ ధరుడును యువకుడునగు నరునిగా రూపొందించేను. తరువాత మహా శక్తి శాలి యగు బ్రహ్మ దేవశక్తితో ఏర్పడి వేయి అశ్వములచే లాగబడు రథమునందు ఎక్కించి అతనిని తన లోకమునకు తీసి కొని పోయెను. అంతట ఋషులును బ్రహ్మరులును దేవతాత్మక ములగు ఓషధులును దేవ గంధర్వులును ఈ యువకుడు మాకు  ప్రభువగు గాక ! అని కోరుకొని, బ్రహ్మ మొదలగు అచటి వారందరును సోమదేవతాకములగు మంత్రసము ఈ కనబడు చంద్రమండలము ఈ హేతువులచే వేదములకు స్థానమును రసాత్మకమును ఐ యున్నది. ఇదీ నిరంతరమును శుక్లపక్షమున వృద్ధి పొందుచు కృష్ణపక్షమున క్షీణించుచు ఉండును.

అనంతరము దక్షప్రజాపతి రూపమును లావణ్యమును కలవారును శోభనమగు వర్చస్సు కలవారును అగు తన ఇరువది ఏడుమంది కన్యలను సోమునకు ఇచ్చెను.

తరువాత చంద్రుడు విష్ణుధ్యానైక తత్పరుడయి దశ సహస్ర పద్మ సహస్ర సంవత్సరములు (10x1000x 1000x1000000000) తపమాచరించెను. నారాయణుడగు (సమస్త జీవులకు ఆశ్రయమగు) హరీభగవానుడు అతని తపస్సు విషయమున సంతుషి చెందెను. పరమాత్ముడగు జనార్ధనుడు (జనులచే ప్రార్థింపబడు దేవుడు). వరము కోరు కొమ్మని చంద్రునితో ననెను. విష్ణుని వలన వర దానమును పొందిన చంద్రుడు ఆ భగవానుని ఇట్లు కోరెను. నేను ఇంద్ర లోకమునకును వేళ్ళగలుగ వలయును. (ఇంద్ర లోకమును జయించగలుగ వలయును.) నేను జరుపు రాజసూయ యాగ మున దేవతలు ఆందరును ప్రత్యక్షముగా ఆ యజ్ఞమున ఇచ్చు హవిస్సులను భుజించవలయును. బ్రహ్మ మొదలగు వారు నా యజ్ఞమున ఋత్విక్కులగు బ్రాహ్మణులుగా కావలయును. లోకముల లయింపజేయగల దేవుడును శూలధారియునగు శివుడు ఆ యజ్ఞమున మాకు యాగ రక్షకుడై యుండవలయును. అని కోరగా విష్ణువు సరే యనెను.

చంద్రునకు విష్ణువు ఇచ్చిన వర ప్రభావమున అతని రాజసూయయాగములో గురుడు హోతగా భృగువు అధ్వర్యు డుగా బ్రహ్మదేవుడు ఉద్దాతగా న్వయముగా హరి ఉపద్రష్టయగు బ్రహ్మగా సనక సనందనాది మహర్షులు సద స్యులుగా వి శ్వేదేవతలు పది మందియు చమగౌధ్వర్యువులుగా ఉండిరి. అతడు మూడు లోకముల రాజ్యమును ఋత్విక్కులకు దక్షిణగా దానము చేసెను. ఇట్లు యజ్ఞము ముగి సెను. అవభృథ స్నానము జరిగేను. ఆ సమయమున కాముని బాణములచే ములు తపింపగా తొమ్మిది మంగిమ అతనిని చూడగోరి వచ్చిరి. వారు ఎవరనగా లక్ష్మీదేవి నారాయణుని.సి నామె కర్దముని-ద్యుతి ఆ శరీర  సుడను సూర్యుని తుష్టి ఆనునామే అవ్యయుడగు ధాతను -ప్రభా అనునా కరుడను సూర్యుని-కుపున  పతియగు హవిష్మంతుని-కీర్తి ఆనుకామె తన పతియగు జయంతు నామె తన భర్తయగు ధృతి ఆనుసా మే తన పతియగు నంది అనునత సోముని ఆశ్రయించిరి సోముడును వారిని అందరను స్వకీయలనుగా (తాను ధర్మానుసారము పెండ్లాడిన భార్యలను వలె) స్వీకరించేను.

ఆయా దేవుల భర్తలు చంద్రుడు తమకు చేసిన అపచారమునకు ప్రతీకారముగా అతనిని శపించికొని ఆతని పై శస్త్రాస్త్రములు ప్రయోగించి కానీ అతనికి అపచారము ఏమియు చేయజాలక పోయిరి. వారు తనకు ఎన్ని విధముల హాని కలిగింప యత్నించినను శ క్తి సంపన్నుడగు ఆ చంద్రుడు. పది దిక్కులను పది విధములుగా ప్రకాశింపచేయుచు వెలిగెను. ఇట్లు ఆ చంద్రుడు తన తపః ప్రభావము చేత ఋషులు కూడ ఆదరించేడు ఐశ్వర్యమును దేవలోకమునకు ఏకై కాధి పతిత్వమును పొందెను.

చంద్రుడు తార నపహరించుట

ఒకమారు చంద్రునకు ఉద్యానవనములో దేవగురువగు బృహస్పతికి భార్యయగు తార కనబడెను. ఆమె అనేక ములగు పుష్పములతోను ఆభరణములతోను ఉపశోభించుచుండెను. పెద్ద పిరుదులు కలిగి స్తనముల భారముచే వంగి యుండెను. పుష్పములు శిరోలం కారముగా ధరించి యుండెను. మీగుల మదించిన దేహము కలదై యుండెను. మన్మథ బాణములవలే మనస్సునకు హాయి గొల్పుచు విశాలములును మనోహరములునైన కన్నులు కలిగియుండెను.

(దక్షుడు భార్యలుగా ఇచ్చిన) తారలకు (నక్షత్రములకు) (అప్పటికే) అధిపతిగా ఉన్న ఆ చంద్రుడు కామ వశుడై ఏకాంత ప్రదేశమున ఆమె జడ పట్టెను. ఆతని రూపముచే కాంతిచే ఆప్పటికే తన మనస్సు హరింపబడి ఉన్న ఆ తార ఆ స్థితిలో కామ పీడితురాలయి ఆతనితో విహరించి ఆనందించెను. చాల సేపటివరకు ఆమెతో క్రీడించియు తృప్తినొందక చంద్రుడు అక్కడి నుండి తారను స్వగృహమునకు తీసికొని పోయెను. ఆ మేవలన తనకు కలుగు సుఖము లందు అనురక్తుడగు ఆ చంద్రునకు స్వగృహమునందు కూడ ఆమెతో ఎంత కాలము కామ సుఖములనుభవించినను తృప్తి కలుగలేదు.

బృహస్పతియును తన భార్యయగు తారతోడి ఎడబాటు సహించలేక విరహాగ్నితో దగ్గుడగుచు తన మనోధ్యాన మున నిరంతరమును ఆమెనే చూచుచు బాధనొందుచుండెను. కాని అతడు చంద్రుని శపించుటచే కాని మంత్రములతో కాని శస్త్రములతో కాని అగ్ని తో కానీ విషాదీకముతో కాని అపకారము చేయ జాలక పోయేను. తాను వాచస్పతి (వేదాది విద్యలకు అన్నింటికి అధిపతి) ఐయుండియు వివిధములగు ఉపాయములతోను అప(భీ) చారములతోను కూడ బృహస్పతి చంద్రునకు ఏమియు ఆపకారము చేయలేక పోయెను. అతడు కామ బాధ చేతపించి దీనుడై తన భార్యను తనకిమ్మని చంద్రుని వేడుకొనెను. మహేశ్వరుడు చతుర్ముఖుడు సాధ్యులు మరుత్తులు లోకపాలురు మొదలగు వారు ఎవరు ఎవరు వేడి నను తారాసుఖపాశములచే బద్దుడైన ఆ చంద్రుడు తారను బృహస్పతికి తిరిగి ఈయలేదు.

 ఈ కారణమున సదాశివునకు చంద్రుని పై తీవ్రమగు కోపము కలిగెను. అతడు సామాన్యుడా! వామదేవుడు, (కోపించినచో ఎవరికిని అనుకూలుడు కాక హాని కలిగింవ కలవాడు) అని లోకములందు ప్రసిద్ధుడు. అనేకములగు ముద్రలతో (భావ విశేష ప్రకటనములతో) అతని పాదపద్మములను ఎల్లవారును అర్చింతురు. పైగా ఆయనకు బృహస్పతి యందు స్నేహము ఆధికము. ఇట్టి సదాశివుడు త్రిపురాసుర సంహారి. పినాకధనుర్ధారియగు పరమేశ్వరుడు జయముతప్ప ఓటమి నేరుగనీయని అజగవమను ధనుస్సు ధరించి చంద్రునితో యుద్ధమునకై బయలుదేరెను. అతని శిష్యులును విధేయులును అత నివేంట నుండిరి. భూతనాథులును సిద్దులును ఆతనిని పరివేష్టించి వచ్చుచుండిరి. తృతీయ నేత్రము అగ్ని జ్వాలలను ప్రకటించుచుండ అతని ముఖము భయను గొల్పుచుండెను. ఇట్లాయన విశేషముగా దీపించు చుండెను. రథములతోను అశ్వములతోను కూడి గణేశులు ఇరువది అరువది నాలుగు కోట్లమంది (10000 000x20x64) శివుని వెంట బయలుదేరి వెళ్ళిరి. అదే విధముగా కుబేరుడును రథముల నెక్కిన వీరులు అనేక శతకోటి సంఖ్యలో తనకు తోడు రాగా శివుని వెంట వెళ్ళేను. వేతాళులు యకులు ఉరగులు కిన్నరులు పద్మము అర్బుదము సంఖ్యలో (పద్మము = 1000000000, అర్బుదము = 100000000) కుబేరునివెంట నుండిరి. సోముడును అధికమగు కోపముతో మూడు పండ్రెండు లక్షల రథముల పే నక్షత్రులు దైత్యులు అసురులు తనవెంట వచ్చుచుండ శనైశ్చరుడు అంగారకుడు తన తేజస్సును వృద్ధిపర చుచుండ యుద్ధమునకు వచ్చెను. ఈ భయంకర యుద్ధోద్యమమునకు సప్తలోక ములును భయమునందెను. సముద్రములు అన్ని యును వాని నడుమనున్న సమ స్తద్వీపములును అత్యంతముగా చలించు చుండెను. ప్రజ్వలించుచున్న అస్త్రముల నుండి విశాలములగు వహ్ని జ్వాలలు దిక్కుల వ్యాపించుచుండ పినాక ధారియగు శివుడు సోముని ఎదుర్కొనెను.

అంతట భీముని , శివుని) -సోముని- భయంకర సేనలకు రెండింటికిని మహాయుద్ధము జరిగేను. ఆయుద్దము నమస్త ప్రాణులకును నాశము కలిగించునదియు మిగుల క్రమక్రమముగా వృద్ధి పొందుచు పోవుచున్న దియు తీక్షములగు ఆయుధములనుండియు అస్త్రములనుండియు వెలువడు మంటలు దట్టమై గనబడుచున్నదియునై భయంకరముగా ఉండెను. పరస్పరము ప్రయోగించుకొనుచున్న భయంకర తీక్ష శస్త్రములతో ఇరుపక్షములవారి సేనయంతయు తత్ క్షణమే నాశము నొందసాగెను. సేనల పై పడుచుండిన శక్తి సంపన్నములగు ఆయుధములు ఆ సేననే కాక స్వర్గమర్త్య పాతాళ లోకములను కూడ కాల్చి వేయు చుండెను,

రుద్రుడు కోపించి బ్రహ్మశ్రాస్త్రమును ప్రయోగించెను. సోముడు వ్యర్థము కాని శ క్తిగల సోమాస్త్రమును వదలేను. వాటిని ప్రయోగించుటవలనను అవి పరస్పరము డీకొనుటవలనను ద్యు భూమ్యంతరిక్షములకు మూడింటికిని (ఈ మూడు లోక ములందలి సకల భూతములకును) భయము గలిగెను.

ఇట్లా భీమ సోముల యుద్ధము క్రమక్రమముగా వృద్ధి పొందుచుండెను. లోకములు క్షయమునొందునట్లుండెను. ఇది చూచి లోక పితామహుడగు బ్రహ్మ ఎంతో శ్రమతో (దేవతలతో కూడ) లోపల ప్రవేశించి వారి యుద్ధమును నివా రించెను. బ్రహ్మ సోమునితో నిట్లు పలికెను: “సోమా ! నీవిట్లు ఆకారణముగా భూతములకు నాశమును కలిగించు యుద్దమునకు పూనితివి. ఇది చేయరాని దుష్కృత్యము. ఇది కాక నీవు పర స్త్రీహరణము అనెడు ఆకృత్యమునకు సంక ల్పించితివి. అందులకయియే నీవీ భయంకర యుద్ధమును చేయుచున్నావు. నీవు సహజముగ శాంత స్వభావుడవే కావచ్చును. కానీ నీవు చేసిన ఈ దోషమునకు ఫలితముగా జనులయందు పాపగ్సహముగానే ప్రసిద్ధినొందుదువు. నీకు కలిగిన ఈ కోరిక (పరదార హరణవాంఛ) ఇంతటితో చాలింపుము. బృహస్పతి భార్యయగు తారను మరల అతనికి ఆప్పగించుము. పరుల ధనమును హరించిన వారు దానిని మరల దాని సొంతగానీ కప్పగించుటలో అవమానము ఏమియు లేదు.”

పితా మహుని మాటలు విని సోముడు సరేయని అంగీకరించెను. ప్రశాంత భావముతో యుద్ధము నుండి తొలగి పోయెను. బృహస్పతియును భార్యయగు తారను వెంట తీసికొని హరించుచు రుద్రునితో కూడి స్వగృహమునకు పోయెను.

ఇది శ్రీ మత్స్యమహాపురాణమున మత్స్యమను సంవాదమున చందవంశానువర్ణనమున చంద్రుని  ఉత్పత్తి మొదలగు వృత్తాంతములు అను ఇరువదిమూడవ అధ్యాయము.