మత్స్య మహా పురాణము

Table of Contents

26 - కచ దేవయానీ సంవాదము

శౌనకుడు శతానీకునితో ఇట్లు చేప్పెను! కచుడు ఇట్లు విద్యాధ్యయన సమాప్తి చేసి సమావర్తన వ్రతము జరిపి స్వగృహమునకు పోవుటకు తన గురుని అనుమతి నందెను. గురుడు అతనికి వీడ్కోలు చెప్పెను. అతడును దేవలోకము నకు పోవుటకు బయలుదేరెను. అప్పుడు దేవయాని కచునితో ఇట్లు పలికెను: “నీవు స్వయముగా ఆంగిరః ప్రజాపతికి పౌత్రుడవు. ఉన్నత వంశము మంచి నడవడి విద్య తపస్సు దమము కలిగి మిగుల ప్రకాశించుచున్నారు. మా తండ్రికి మహాయకుడగు అంగిరోమహర్షి పూజ్యు డై నట్లు మీ తండ్రి బృహస్పతి నాకు అట్లును ఆంతకంటే అధికముగా కూడ మాన్యుడును పూజ్యుడును. ఇది తెలిసి తపోధనా! నేను చెప్పుచున్న విషయము అర్థము చేసికొనుము. నీవు విద్యావతము నందుండి ఆ నియమములు పాటించుచున్న నీ విషయము లో నే నెట్లుంటినో నీవు ఎరుగుదుపు. ఇపుడు నీవు విద్యాధ్యయ నము ముగించి సమావర్తనము చేసికొనినావు. నేనో నీ భక్తురాలను. నన్ను నీవు విడుచుట తగదు. గు థావిధిగా మంత్ర పూర్వకముగా నీవు నా పాణిగ్రహణము చేయుము.”

కచుడు: “నీవు లక్షణవంతమయిన దేహము కలదానవగుటతోపాటు ఉ త మురాలవును పవిత్రురాలవును. భగ వానుడగు మీ తండ్రివలె నీవును నాకు పూజ్యురాలవు. మహాత్ముడగు భార్గపు శుక్రునకు నీవు వా 1 ప్రాణములవలె ఇష్టవు. గురువు త్రివగుటచే పూజ్యురాలా! ధర్మము నను - రించి సీపును సదా నాకు పూజ్యువు. నీకు త డ్రియు నాకు గురుడును అగు శుక్రులవారు నాకు సదా పూజ్యుడే కదా! కనుక నీవును నాకు ఆట్టి దానవే. కనుక దేవయానీ! నీవు ఇట్లు పలు కధగదు.”

దేవయాని: “నాకు గురుడు పూజ్యుడు) అగు అంగిరసుని కుమారుడగు బృహస్పతికి కుమారుడవే కాని నా తండ్రికి పుత్రుడవు కావు. కనుక నీవును నాకు మాన్యుడవును పూజ్యుడవును. అదియుగాక మాటిమాటికిని నిన్ను రాక్ష సులు వధించగా నేను నీ విషయమున ఎట్లుంటినో నీవు ఎరుగుదువా.ఎరుగవా? సౌహార్దముగా గాని అనురాగముగాగాని నాకు నీ యందలి భక్తిని నీవు ఎరుగుదువు, నీవు ధర్మమును ఎగినవాడవు. నేను శక్తురాలను-సౌందర్యవతిని.నీ మనస్సును ఆనంద పెట్టుదానను. నన్ను నీవు విడుచుట తగదు.”

కచుడు: “నీవు శుభములగు కర్మములనే ఆచరించుదానవు. నియోగించకూడని పనిలో నీవు నన్ను నియో గించుచున్నావు. నా పై దయ చూపుము. (అనురాగమును కాదు.) నీవు సుందరివి కాదని నే ననలేదు. కాని నీవు శుభ స్వరూపవు. కావున నీవు నాకు నా గురునికంటెను గురుతరపూజ్యతరవు. నీవు వసించిన శుక్రుని గర్భమునందే నేనును వసించితిని. కోపింపకుము. ధర్మము చే నీవు నాకు సహోదరివి. శుభాననా! నన్నిట్లు పలుక దగదు. నీ దయ చే నే నిచట సుఖముగా ఉంటిని. నిజమే. నీ విట్లడిగితి వని నాకు నీ పై కోపమును లేదు. నాకు సెలవు ఇమ్ము. పోయి వత్తును. నాకు మార్గమున శుభమగునట్లు దీవించుము. ఇక మీదట ఇతర విషయములందును ధర్మావిరుద్ధముగా నడుచు కొనునట్లు ఆశీర్వదించుము. ఏమరుపాటు లేని పూనిక తో నా గురుని నిత్యమును ఆరాధించుచుండును.”

దేవయాని: “నీవు కేవలము ధర్మమునందే దృష్టినుంచి నా అనురాగమును తిరస్కరించుచున్నావు. కనుక నీకు ఈ విద్య సిద్ది నీయదు.”

కచుడు: “నీవు గురుపుత్తివి అను హేతువుచే నేను ..న్ను కాదంటినే కాని నీయందు దోషమున్నదని కాదు. ఒక వేళ మీ తండ్రి అనుమతించినచో నన్ను నీవు భర్తగా ఆశ్రయించినను నేను కాదనను. నేను చెప్పినది ఆరమగు ధర్మము. ఇట్టి నన్ను నీవు ధర్మ దృష్టితో నైను కామదృష్టితోనే యైనను శపించుట న్యాయము కాదు. కనుక నీ కామ పురుషార్థము కూడ అది ధర్మానుకూలముగా నడువకపోవుగాక! (బ్రాహ్మణుడగు) ఋషిపుత్తుడు ఎవ్వడును ఎప్పుడును నిన్ను వివాహమాడకుండుగాక! నీ మాటచే నాకు ఈ విద్య ఫలింపకున్నను నేను దాని నుపదేశించిన దానికి ఫలించును.”,

దేవయానితో ఇట్లు పలికి వెంటనే కచుడు స్వర్గమున కై బయలుదేరిపోయెను. ఇంద్రాది దేవతలును కచుడు స్వర్గమునకు మరలి వచ్చిన సందర్భమున-బృహస్పతి సన్నిధిలో నభ జరిపి దానిలో సంతోషమున కచునితో ఇట్లనిరి: “నీవు , చాల గొప్పదియు అద్భుతమును నగు హితమును మాకు ఆచరించితివి. కావున నీ తేజస్సు ఎన్నటికిని నశింప కుండును. నీకు యజ్ఞములందు భాగము ఉండును.”

ఇది శ్రీమత్స్య మహాపురాణమున చంద్రవంశాను వర్ణనమున యయాతి చరితమున దేవయానీ కచ సంవాదము అను ఇరువది ఆరవ అధ్యాయము.