మత్స్య మహా పురాణము
248 - అమృత మథన కథాఽఽరంభము.
ఋషులు సూతునిట్లడిగిరి: సూతాః యథాక్రమముగా నారాయణ మాహాత్మ్యము నెంత విలీనను మాకు తృప్తి కలుగుటలేదు; కావున ఇంకను ఆది తెలుపుము; పూర్వము దేవతలు విచక్షణులు (వివేకవంతులు) అయి ఆమరత్వమును పొందిరి? ఏ తపస్సుచే ఏ కర్మము నాచరించుట చే ఎవరి యనుగ్రహముచే అమరులయిరి? అన సూతుడిట్లు చేప్పేను. నారాయణ దేవుడును కూలకృత్తగు మహాదేవుడును తామున్న చోటనెల్ల (దేవతలకేకాదు) సర్వులకును అమరత్వమున సహాయులేయని పెద్దల తలంపు; పూర్వము దేవాసుర యుద్ధమున సురులచే వందలకొలదిగ చంపబడిన దైత్యేంద్రులను భృగునందనుడగు శుక్రుడు తన సంజీవినీ విద్యను ప్రయోగించి నిద్ర మేలు కాంచిన వారినివలె జీవించి లేచునట్లు చేయు చుండెను. ఎట్లన ఆతని తపముచే తుష్టుడైన మహాత్ముడగు శంకరుడు మహాప్రథయగు సంజీవినియను విద్యను అతనికి ఇచ్చియుండెను; మహేశ్వర ముఖోదితయగు ఆవిద్య ఆ భార్గవునందుండుట చూచి సర్వదానవులును గర్వముచే మూడు లయిరి; దానితో ధీమంతుడగు శుక్రుడు సర్వలోకములందెవరికిని. దేవయక్ష రాక్షన నాగాదులరును ఋషిఃబ్రహ్మేంద్రో. పేంద్ర విష్ణులకును లేని అమరత్వము దైత్యులకు నంపన్న మొనర్చెను. శంకరునుండి ఆట్టి ఆవిద్యను సంపాదించి శుక్రుడు పరమనిరృతి (ఆనందము) నందెను. ఇట్లు శుక్రుని సంజీవినీ విద్యాప్రాప్తికి తరువాత సుమహా ఘోర దేవాసుర యుద్ధము జరిగేను. అందు దేవహుతులగు దైత్యులను దైత్యేంద్రులను విచక్షణుడగు శుక్రుడు తన విద్యాబలముతో లీలగా లేవదీయుచుండెను; ఈ విధమగు స్థితిని ఇంద్రుడును ఉదార బుద్ధి శాలియగు బృహస్పతియు ఎరుగరు; దేబ్బలు తినుచున్న వందల వేలకొలది దేవులును ఆందరు వికలే-ద్రియులును విషణ్ణవదనులు నయిరి; ఇట్లు వారు విషజ్ఞులు కాగా జగత్ప తియగు పద్మసంభవుడు మేరుపర్వత సానువునందు దేవతలతో ఇట్లనెను. (విచక్షణః = విచష్టే)
బ్రహ్మాదిదేవకృత ఆమృతమథనోద్యోగః.
దేవతలారా! నామాట వినుడు; దానిపై ఆలోచించుడు; ఇపుడు దానవులతో సఖ్యము చేయవలయును; అది జరుగవలయును; అమృతమునకై యత్నించవలయును; వరుణుని సహాయునిగా చేసికొని మందరమును కవ్వమునుగా చేసి శేషుడను కవ్వపుత్రాటితో చుట్టి క్షీర సముద్రము మథించవలయును; చక్రపాణిని మేలుకొలుపవలయును; దానవేంద్రుడగు బలిని మన స్వామిగా చేసికొని మనము కొలది కాలము సేవింపవలయును; అవ్యయుడగు విష్ణుడు కూర్మరూపుడై పాతాళమునందుండునట్లు వేడవలయును; మందర శైలమును కూడ ప్రార్థించవలయును; చిలుకుట కొనసాగవలయును; అనగా ఆమాట విని దేవతలు దానవ మందిరమున కేగిరి; బలితో ఇట్లనిరి: విరోధ భావము మానుదము; ఇక మీదట మేమును నీ బలమందలి భృత్యులము; అమృతమునకై ఉద్యోగింత ము; శేషుడు. కవ్వపు త్రాడగును; దైత్యా! నీవు ఈ మథనమున అమృతమునుత్పాదించగా నీప్రసాదమున మేమందరము ఆసంశయముగ ఆమరులమయ్యేదము; దేవతలిట్లనగా ఆ బలి దానవుడు పంతుష్టుడయ్యేను; దేవత లారా! మీరు చెప్పినట్లే నేనిపుడు చేయుట ఉచితము; ఇందు నేనొక్కడనే క్షీర వారిధిని మథింపశక్తుడను; బాహువులతోనే క్షీర వారిధినంతటను కెలికి మీయందర ఆమృతత్వమున కై ఇపుడే దీవ్యామృతమును తేగలను; కాని శత్రువులనై నను బొల దూరమునుండి చాల కాలమునకు తరువాత వచ్చి తన్నాశ్రయించు వారిని భక్తితో పూజించనివాడు ఇహపరముల రేంటను నాశమందును; కావున స్నేహాశ్రితులగు మిమ్ములనందరను పాలింతును; అనెను.
బలిప్రభృతీనాం విష్ణులోక గమనమ్.
ఇట్లు పలికి ఆ దైత్యేంద్రుడపుడే దేవతలతో కూడ పోయెను; మందరధరాధర మును సహాయత్వమునకై ప్రార్థించెను. ఇపుడమృత మంథనమున నీవు మాకు కవ్వమగుము; ఏలయన ఇది సురాసురులకందరకు కావలసిన మహా కార్యము; అనగా మందరము ఎందు నిలిచి నేను భ్రమింతునో సముద్రమును మథింతునో ఆట్టి ఆధారమున్న చో అట్లే చేయుదును; నహ సఫణలు కల శేషునిందు కవ్వపు తొడుగ చేసికొనుడు; అనెను. అంతట విష్ణుని చతుర్థాంశ రూపులయి ధరణి ధారణ కార్యమందు నిలిచియున్న మహాబలులు శేషుడును కూర్ముడును వెలికివచ్చిరి; వారు గర్వ సంయుక్త వచన మీట్లు పలికిరి; త్రైలోక్యధారణము చే కూడ మాకిందు గ్లాని కలుగుట లేదు; అనగా ఈ విశ్వమందు ముటిక (చిన్న ఉండ) వంటి ముద్ర వస్తువగు మందరము వలన మాకేమి శ్రమము? అనిరి; శేషుడిట్లనెను: బ్రహ్మాండమునే నాయందు చుట్టినను నాలో బ్రహ్మాండమునే మథించినను నాదేహమునకు గ్లాని కలుగదు; ఆనగా మందరము (నాచుట్టు) ఉండుటచే నాకేమి యగును? అంతట తత్ క్షణమే ఆనాగుడు ఆ శైలమును లీలగా ఉత్పాటించి క్షీరసాగరమున ఎత్తి పడవే నేను; అంతట దానిక్రింద కూర్యుడు నిలిచెను; ఎపుడు దేవదానవులు క్షీరోద సాగర మథనమునకై నిరాధార మగు మందరమును ! భ్రమింప జేయుటలో అశక్తులయిరో అపుడు వారు బలి సమన్వితులై స్వయముగ దేవదేవేశుడగు జనార్ధనుడున్న నారాయణ నివా సమున కేగిరి; అచట శ్వేతపద్మ సదృశుడును శుభుడును యోగనిద్రా నిరతుడును పీతాంబరుడును అచ్యుతుడును హార కేయూర భూషితాంగుడును హేమపర్యంక స్థితుడును తన పాదపద్మములతో లక్ష్మీ నాభిమండలమును స్పృశించుచు గరుత్మంతునిచే తన రెక్కల విసనకర్రతో గాలి వీవబడుచు తనక న్ని వైపుల నిలిచిన సిద్ధ చారణ కిం నరులచేతను మూర్తి మంతములగు ఆయుధములచేతను స్తుతింపబడుచు ఎడమ బాహువును దిండుగా పెట్టుకొనియున్న ఆదేవుని దర్శించి దేవదానవులెల్లరు అన్ని దెసల నిలిచి కృతాంజలి పుటులయి ప్రణతులయి ఆతనినిట్లు స్తుతించిరి.
దేవదానవకృత విష్ణుస్తుతిః.
లోకత్రయాధ్యక్షా! తేజోజిత భాస్కరా! విష్ణో జిష్ణో కేటభమర్దనా! నృషి క్రియాకర్తా! జగత్పాలయితాః నమ స్కారము; రుద్రరూపా! శర్వా! సంహార కారిన్! శూలాయుధా! అధృష్యా దానవఘాతిన్! నమస్కారము; పాదత్రయ క్రమాక్రాంత త్రైలో క్యాః అథవా! ప్రచండ దైత్యేంద్రతూల ప్రళయ మహాగ్నీ ! నాభిప్రద సంజాత పద్మగర్భ మహా చలాః పద్మ భూత మహాభూతా? (పొద్మకల్పమున పృథ్వీ మహాభూతము నారాయణుని నాభి పద్మమని చెప్పబడెను.) కర్తా హర్తా జగత్ర్పయా అశేష లోకపాల జనకా! క్రియా కారణ కారిన్! దేవారి వినాశకా! మహా సమర శాలిన్; లక్ష్మీ ముఖ పద్మ మధుపా! కీర్తినివాసిన్ ! నమస్కారము; మాకు అమరత్వము కలిగింప నిశ్చయించుము; సర్వ శైలములలో గొప్పదియు అయుతాయుత యోజన విస్తారమునునగు ఈ మందరమును నీఅనంత బలబాహుద్వయమందలి ఒక బాహువుతో ఒక పాణితో నిలువజేటి ధరించుము; స్వధాస్వాహార్థహవిః కాములగు దేవతలకే అమృతమును మథించవలయును; అన్న స్తోత్ర పూర్వక దేవవచనమును విని మధుసూదనుడు యోగనిద్ర విడిచి ఇట్లనెను: సర్వదేవతలారా! స్వాగతము; మీ ఆగమన కారణమేమి? మనః సంతాపము విడిచి మీరు వచ్చిన పని తెలుపుడు; ఆట నారాయణుడిట్లు పలుకగ విని ది.వొక సులిట్లనిరి; దేవేళా! మాకమరత్వ ప్రాప్తికి చేయు ఈ మహోదధి మథనము చే మాకది లభించునుపోయ మొన రింపుము; మాధవా! కైటభమర్దనా ! విభూ! నీవు లేనిదే మాచే ఆ అమృతము పొంద శక్యముకాదు; కావున నీవు మా ముందుండుము.
దేవతలిట్లనగా ఆప్రధృష్యుడును శత్రు మర్దనుడునగు విష్ణుడు దేవ సహితుడై మందరాచలమున్న చోటి కేగెను; దానిని దేవదానవులు ఆనంతుని భోగరాశితో చుట్టి పట్టుకొనిరి; దేవతలు విష భీతులయి తోక వైపున నుండిరి; సైంహికేయ (రాహు) ప్రముఖ దానవులు ముఖమువే పున నుండిరి; అంతట బలి ఆ నాగుని సహ సవదనమగు శిరమును ఎడమచేతితో మిగిలిన దేహమును కుడిచేతితో పట్టిలాగేను. నారాయణ భగవానుడు తన భుజద్వయముతో అమృత మథన మునకు కవ్వమయిన మందరమును ధరించెను; అంతట దేవాసురులెల్లరును జయ శబ్ద పూర్వకముగా ఆరంభించి సమగ్ర దివ్య శతవత్సరములు క్షీరసాగరమును మథించిరి; దైత్యదానవులు సర్వులు అప్పటికీ శ్రాంతులయిరి. అపుడు దేవేంద్రుడు మేఘుడయి అమృత కల్పములగు జలశీకరముల వరించెను; శీతల వాయువును వీచెను; దేవతలలో చాలమంది చాలవరకు ఆలసినపుడెల్ల కమలాసనుడు మాత్రము ఆ గొంతుడై సముద్రమును మథించుడు; మథించుడు; ఉద్యోగ (యత్న) వంతుల కెప్పుడును అపారయగు శ్రీ లభించును; అని ఎచ్చరించుచుండెను; బ్రహ్మ ప్రోత్సాహితులయి దేవతలు మరల అంబుధిని మథించుచుండిరి; అట్లు అయుత జనోన్నత శిఖరమగు శైలమును వారట్లు తిప్పుచుండ దానినుండి గజ యూథములును వరాహ శర భాది మృగములును ఆయుతలక్ష సంఖ్యలో శ్వాపదములును పుష్పఫల ద్రుమములును పడ సాగెను; ఫలవీర్యము (రసము)ను పుషోషధి రసమును క్షీరముతో సంఘర్షణమంది దధి రూపమందెను: వేలకొలదిగ సర్వ జీపులును చూర్ణీతములు కాగా వానీ మేదస్సు నీటితో కూడి వారుణి (మద్యము) అయ్యేను: ఆ వారుణీ గంధ మాఘ్రాణించి దేవదానవులు మోహితులయిరి; దాని నాస్వాదించి వారు బలశాలురునైరి.
అంతట అతివేగముతో అంతటను ఆసురులా నాగేంద్రుని కవ్వమగు మందరమును కూడ పట్టుకొనీరి; ఆందు మేరుపర్వతము మంథయష్టి కవ్వపు కర్ర)గానయ్యెను; మందరమును తన భుజములయందు, బంధించుకొని ముందు విష్ణువు నిలిచెను; వాసుకి ఫణాలగ్న పాణియగు ఆ కృష్ణుడు పద్మకుముదపుష్పములతోకూడి ఆతి విస్తరమగు బ్రహ్మ దండమువలె ప్రకాశిం చేను; అంతట ఆ మథనముచే జలధినుండి మేఘసహ సధ్వని యుత్పన్న మయ్యెను; సర్పపు ద్వితీయభాగమున మొదట ఇంద్రుడు తరువాత క్రమముగా ఆదిత్యమహోత్సాహి రుద్రవసు గుహ్యకొదులు నుండిరి; ముందు ముఖభాగమున విప్రచిత్తి నముచివృతశంబర ద్వీమూర్ధవజ్రదంష్ట సైంహికేయబలి ప్రముఖులగు బహుదైత్యులుండిరి; దర్పవంతులు బలవంతులు విభూషితులును అగు వీరందరును ఆంబుధిని మథించిరి; సురాసురులచే మందర ముతో ఉదధి మథింపబడుచుండగా మహా మేఘధ్వనిని పోలిన్యమహా ఘోషమయ్యెను; ఆందు మందర మహాద్రిచే చేదర గోట్టబడి వందల వేలకొలదిగ నానో జలచరములు విలయమందెను; ఆ మందర మహీధర ము పాతాళ తలవాసులగు వివిధ జలచర పొణులను విలయమందించేను. అట్లాయద్రి భ్రమింపజేయబడుచుండ పరస్పర సంఘర్షమున ఆ పర్వతోగ్రమునుండి మహావృక్షములు తమమీది పనులతో కూడ పడుచుండెను.
వాటి రాపిడిచే కలిగిన అగ్ని కూడ మిగుల మండుచు తన జ్వాలలతో ఆ మందరపర్వతమును నీలమేఘమును మెరపులతోవలే ఆవరించెను; వెలికివచ్చిన గజములను సింహములను దహించెను; వివిధ సర్వసత్త్వములును అగ్ని చే విగతప్రాణము లయ్యెను; ఎక్కడ పెట్టిన నక్కడనే ప్రదహించుచున్న ఆ అగ్ని ని అమర శ్రేష్టుడగు ఇంద్రుడు అంతటను కురిసిన మేఘజలముతో చల్లార్చెను; ఆంతట ఆటు ఆ పర్వతమునుండి సాగరజలమందు నానారనములును వడెను; మహాద్రుమముల నిర్యాసము(లంక)లును అనేకౌషధి రసములును అట్టివే; అమృత సమాన వీర్యయుక్తములగు రసప్రస వముచే నురలు కాంచనసమాన కొంతీయుతులై అమరత్వమునందిరి; అంతట ఆ సముద్రపు క్షీరరూపజలము రసొంతరము లతో విమిశ్రమయి ఘృత మేర డేను; అంతట (అలసి) కూర్చుండిన బ్రహ్మతో దేవతలిట్లనిరి: బ్రహ్మన్! నారాయణుడు తప్ప మిగిలిన సర్వదే త్యులును దేవో త్తములునునగు మనమందరమును మిగుల అలసిపోతిమీ; ఇంతవరకును ఆమృత ముద్భవించలేదు; సాగరమును మనము మథించుట ఆరంభించి చాలకాలమయినది; అనగా బ్రహ్మ నారాయణ దేవునితో ఇట్లనెను; విష్ణో! నీవే మాకు పరాయణము; (ఉత్తమాశ్రయము;) వీరికి బలము కలిగించుము; ఆనగా - ఎవరు ఈ పని పూనియున్నొరో - వారికందరకును బలము ఇచ్చుచున్నాను; సర్వులును క్రమశః నముద్రమును క్షోభిల్లజేయుచు మందర మును త్రిప్పుచుండుడు. అని నారాయణుడ నేను.
ఇదీ శ్రీ మత్స్యమహాపురాణమున దేవదానవులు అమృతమునకై క్షీరసాగరమును మథించుటయను రెండు వందల నలువది ఎనిమిదవ యధ్యాయము.
