మత్స్య మహా పురాణము

Table of Contents

274 - హిరణ్య గర్బదానము

హిరణ్యగర్భునకు విశ్వగరునకు చరాచర జగత్తునకు గృహమగు వానికి నీకు నమస్సు; సురో త్తమా! నేను మొదట మనుష్క ధర్మములతోనే జనించితిని కావున ఇపుడు నీ గర్భమునందు జనించి నేను దివ్య దేహుడనయ్యెదను.”

తరువాత బ్రాహ్మణ శేషులు ప్రసన్న దేహులును సర్వాభరణ భూషితులునునయి నలుగురును నాలుగు కలశ ములతో మరల యజమానుని స్నానము చేయింతురు; చేయిం చునపుడు వారీ మంత్రము పఠింతురు; “కనకాసనమందు కూర్చున్న వాడవు ఇవుడే పుట్టినవాడవు నగు నీ ఆంగములను మేము 'దేవస్యత్వా' అను మంత్రముతో అభిషేకించు చున్నాము; ఈ దివ్య దేహము తో చిరకాలము జీవించుము. సుఖవిక మ్ము.”

తరువాత విచక్షణుడగు ఆ యజమానుడు హిరణగర్బునీ (ప్రతిమను) ఆ విప్రులకు.వారినందరను సర్వభావ ముతో పూజ చేసి అందరకుగాని ఇతరులకు కూడ మరికోందరకుగాని గురుని యను మతితో దానము చేయవలెను; అచ్చటి సర్వోపకరణములను ఇంకను తనకు ప్రీతికరములగు పాదుకలు చెప్పులు చ్చత్రము - పీఠము పాత్రలు గ్రామము- దేశము - మొదలగునవియు ఆచార్యునకు దానము చేయవలయును.

ఈ విధానమున పుణ్యకర శుభదినమున హిరణ్య గర్భదానము చేయు వాడు బ్రహ్మలోక మున పూజ్యుడగును; ఒక్కొక్క లోకపాలుని లోకమునందొక్కొక్క మన్వంతర కాలము వసించును; నూరు కోట్ల కల్పములపాటు బ్రహ్మ లోకమున వసించి పూజలందుకొనును; కలి దోష విముక్తుడే సిద్ద సాధ్య పూజితుడై ఆమరలోక చమరీ మృగములనుండి ఏర్పడిన చామర మాలలతో ఆప్పరలచేత వీజింపబడుచుండును; తానొక్కడే నూరుమంది. తన పితరులను బంధువులను పుత్త్ర పౌత్త్రులననేకులను నరక నిమగ్ను లను కూడ తరింపజేయును.

దీనిని లెస్సగా చదువువాడును వినువాడును కూడ మధురాక్షస హంతయగు విష్ణువువలే సర్వ సిద్ధ పూజితు డగును; హిరణ్యగర్భ ప్రీతిగా ఈ దానము చేయువాడు జనులకు ఉ త్తమజ్ఞానముకూడ కలిగించును; విబుధ నాయకులకును నాయకుడగును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున మహా దానాను కీర్తనమున హిరణ్య గర్బదానమను రెండు వందల డెబ్బది నాలుగవ అధ్యాయము.