మత్స్య మహా పురాణము

Table of Contents

253 - చతుశ్శాలాది స్వరూప వివేచనము.

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను: లోగడ చెప్పిన నామక్రమమున మొదట చతుశ్శాల గృహస్వరూపమును తెలి పెదను; 1. ఇది నాలుగువై పులను వాకిండ్లును ఆశిందములును (పంచలు - వసారాలు) కలిగిన నాలుగు శాలా గృహములు కలది; దీనికి సర్వతోభద్రము అని శాస్త్రవ్యవహారము; దేవతలకును నృపులకును ఇదిచాల మంచిది; 2. ఆన్ని విషయములును ఇట్టేఉండి పడమటకు మాత్రము వాకిలిలేని చతుశ్శాలము నంద్యావర్తమనబడును; 3. దక్షిణము నకు మాత్రము వాకిలిలేని చతుశ్శాలము స్వస్తిక ము; 4. ఉత్తరమునకు మాత్రము ద్వారములేని చతుశ్శాలము రుచకము; ఇక త్రిగా లగృహములు: ఉత్తరమున మాత్రము శాలలేనిది (తూర్పు పడమర దక్షిణములందు శాలలుకలది) ధాన్యక మన బడును; ఇది క్షేమవృద్ధికరము - బహుపు తఫలప్రదము; తూర్పున ఈలలేని తొలగృహము ‘సుక్షేత్ర’మనబడును; ఇది శుభమును ఆయువును యశమును కలిగించును; శోక మోహనాశక ము; దక్షిణమున శాలలోని త్రిశాలగృహమునకు ‘విశాల’మని పేరు; ఇది కులక్షయకరమును; వ్యాధి భయావహమును; పశ్చిమమున మాత్రము కాలలేని త్రిశాలగృహ మునకు పక్షఘ్నమని పేరు; ఇది మిత్రబంధుసుతనాళమును సర్పభయమును కలిగించును; (ఇక ద్విశాల గృహములు): దక్షిణ పశ్చిమములయందు శాలలుకలది నర్వధాన్యఫలప్రదము; మవృద్దీకరమును పుతఫలప్రదమును; పశ్చిమోత్తర శాలలుకల ద్విశాలము యమసూర్యమనబడును; రాజభయాగ్ని భయప్రదము - కులక్షయకరము; ఉత్తర పూర్వదిక్మాలలు కల ద్విశాలము ‘దండ’మనబడును; ఆది అకాలమృత్యుపరచక్ర (సేనా) భయజనక ము; పూర్వదక్షిణ కౌలాద్వయము కల ద్విశాలము ‘ధన’మనబడును; అది శస్త్రళయ పరాభవ భయప్రదము; తూర్పు పడమరల శాలలుకల ద్వీశాలము ‘చుల్లీ’ ‘పొయ్యి’ అనబడును; ఇది మృత్యుభయదము - వైధవ్యప్రద ము; ఉత్తర దక్షిణములందు మాత్రము శాలలుకల ద్విశాలము ‘కార్యము’ అనబడును; ఇది భయప్రదము; ఇవికాక సిద్దార్థము - వజ్రము మొదలగు పేరులుకల ద్విశాలా భేదములనుకూడ వివేకులు నిర్మింపరాదు.

రాజభవనాదినిర్మాణ క్రమః.

ఇక మీదట రాజభవనపు కొలతలను చెప్పేదను; ఆది ఉత్తమాది భేదమున ఐదు విధములు (బహుశ  1. ఉత్తమము 2. ఉత్తమమధ్యమము - 3. మధ్యమము- 4. మధ్యమాధమము 5. ఆధమము). వీనిలో మొదటి దాని వేడలుపు 108 మూరలు; మిగిలిన నాలుగింటికిని క్రమముగా దీనినుండి ఎనిమిదేసి మూరలు తగ్గును; పొడవు ప్రతిదాని యందును వెడల్పుకంటె . వెడల్పులో మరియొక చతుర్దంశ మధికము. వే:పొ=1:1+1/4 అనగా 1. పొడవు 135 మూరలు - వెడల్పు - 108 మూరలు 2. పొ.125; వే.100; 3. పొ-115; వే.92; 4. పొ.105; వే. 84; 6. పొ. 95; వే. 76.

యువరాజ గృహమునకు వెడల్పు మొదటిదానికి 80 మూరలు; క్రమముగా మిగిలిన నాలుగింటికినీ చొప్పున మూరలు తగ్గవలయును; పొడవు ప్రతిదానియందును వెడల్పునకు మరల దానిలో మూడవవంతు అధికము వే:పొ= 1. 1+1/3; అనగా 1. వె.80; పొ.106+2 /4; 2. వె.74; -9842/8; 8. వె68; పొ -90+2/3; 4. వె.62; పొ-82+2/3; 5. వే-56; పొ-74+2/3;

సేనాపతి గృహమునకు- 1. వె.84; పొ-7442/8; 2. వె58; పొ67+28; 8. వే-52; పొ. 60+26; 4. వె.46; పొ.582/8: 5. వె.40: పొ46+2/8: అనగా వెడల్పు 64 మూరలు: ఇది క్రమముగా 6 మూరలచొప్పున తగ్గుచు పోవును; పొడవు ప్రతిదానియందును వెడల్పుకంటె మరల దానిలో ఆరవవంతు అధికము పొ:వే =1:1+1/6.

ఇక మంత్రుల గృహములకు. వెడల్పు 60 మూరలు: ఇది మిగిలిన నాలుగింటిలో 4 మూరలచొప్పున తగ్గును. పొడవు వెడల్సుకంటే మరల వెడల్పులో ఎనిమిదవవంతు ఆధికమగును . పొ=1:1+1/8: ఆనగా 1. 2.60: పొ.87 +1/2; 2. 3.56: పొ. 68: 8. వె.52: పొ_58412: 4. 48: పొ.64: 6. వే-44: పొ.4941/2.

ఇక సామంతులు ఆమాత్యులు మొదలగువారి గృహముల ఐదు భేదములు; 48తో ఆరంభించి క్రమముగ 4 చొప్పున తగ్గుచు వెడల్పును వెడల్పుకంటే దానిలో 1/4వంతు కలిసినంత పొడవును; వే:పొ: 1:!1 1/4; ఉండవలయును: 1. వే. 48: పొ.60; 2. 3.44; పొ.65: 8. వే-40; పొ.50; 4. వే-86; .46; 5. వే.82; పొ.40; .

శిల్పి కంచుకి వేశ్యాగృహముల పంచభేదములు; 28 మూరలతో ఆరంభించి వెడల్పు 2 చొప్పున తగ్గుచు పోవును; వెడల్పునకు రెట్టింపు పొడవుండును; వె: పొ–1:2; 1. వే-28; పొ.6; 2. వే-26; పొ$2; 8. వే-50; పొ.100; 4. వె,48; పొ.96; 5. వే. 46; పొ.92;

దూతికలు కర్మాంతికులు (కమతగాండ్రు) మొదలగువారి పంచగృహ భేదములు; 12తో ఆరంభించి 1/4మూర చొప్పున వెడల్పు తగ్గుచుపోవును; వెడల్సుకంటే దానిలో నాలుగవవంతు ఆధికమయినంత పొడవు; వే: పో -1: 1/4: 1. వై.12; పొ.15; 2.3.11 1/2; సొ.14 3/8: 3. వై.11;పొ.13 3/4; 4. 3.10 1/2;పొ.18 1/6; 6. 3.10;పొ-12 1/2;

దైవజ్ఞులు గురువులు వైద్యులు నభిస్తారులు పురోహితులు ఇట్టి వారి పంచగృహ భేదములు; 40తో ఆరంభించి వెడల్పు క్రమముగ 4 మూరలు తగ్గుచుపోవును; వెడల్పు: పొడవు= 6: 7;

చాతుర్వర్ణ్యముల వారికిని గ్రామాంత వాసులవరకు ఒకే విధముగ పంచవిధ గృహభేదములు; వీని వెడల్పులు 32తో ఆరంభించి 17 వరకు 4 చొప్పున తగ్గుచుపోవును; బ్రాహ్మణ గృహముల పొడవు: వెడల్పు =11:10; క్షత్రియు లకు- పొడవు: వెడల్పు =9:8; వైశ్యులకు.పొతవు: వెడల్పు 4:3; శూద్రులకును ఆంత్యజులకును పొడవు: వెడల్పు = 5:4:

సేనాపతిగృహ నృపగృహములకు నడుమ (అతిథులుగా వచ్చిన) నృపులకు గృహములుండవలెను; అచటనే భాండాగారము (ఉగ్రాణము-Store house) నుండవలెను; సేనాపతిగృహ చాతుర్వర్డ్యులగృహములకు నడుమ రాజ పూజ్యులగు పెద్దల బస కై గృహములుండవలెను; ఆందే మంత్రి సేనాపతి ప్రభృతుల కుమారుల గృహములును రాజు పితృగృహము కూడ ఉండవలెను; వనవాసులగు వారి (విడిది)గృహములు ఏబది మూరల వెడల్పుతో నుండవలయును.

ఈ చేప్పిన పొడవులను వెడల్పులను శాలకు కొంతయును అళిందమునకు (పంచకు) కొంతయుసుగా విభజించ వలయును. దాని విభాగము ఎట్లనిన: రాజునకును సేనాపతికిని నిర్మించు గృహములకై చెప్పిన వెడల్పునకు డెబ్బది (మూరలు) చేర్చి ఆ మొ త్తమును పదునాలుగుతో భాగించగా వచ్చినంత వెడల్పు శాలా భాగమునకును అదే గృహపు వెడల్పునకు ముప్పదియైదు చేర్చి దానిని పదునాల్గుతో భాగించగా నై సంత వెడల్పు అళిందమునకును గ్రహించవలయును.

విప్రుల గృహములకు సంబంధించిన మహాశాల ముప్పదియారు మూరల ఏడంగుళముల పొడవుండవలయును; అంతకంటే ఎక్కువ పొడవు ఉండరాదు.

క్షత్త్రియుల గృహముల మహాజాల పొడవు ముప్పది ఆరు మూరల  పది యంగుళములుండవలెను.

వైశ్యుల మహాశాల పొడవు ముప్పదియైదు మూరల పదుమూడంగుళములుండవలయును.

శూద్రుని మహాశాల పొడవు ముప్పదియైదు మూరల పదునై దంగుళములు.

శాలకు ముందు భాగమున వీథిక (శాలయంత పొడవునను ఆవరణముగాని నిర్మాణముగాని లేని 'నడక' ప్రదేశము) ఉన్న చో అట్టి వాస్తును “సోష్ణీషము' వెనుక వైపున వీథిక యున్నచో అట్టి వాస్తును 'శ్రేయోచ్ఛయము' శాలకు రెండువైపులను వీథిక కలవాస్తును 'సావష్టంభము' అన్ని వైపులను - వీథికయున్న వాస్తును సుస్థితము' అందురు: చాతుర్వర్ణ్యులకును ఈ నాలుగు విధములగు వాస్తులలో ప్రతియొక టియు శుభకరము.

* (ఎక్కువ భూమిక [అంతస్తు]లతో భవనములు కట్టునపుడు) భవనపు గర్భపు వెడల్పు (భుజము) ఎంత యుండునో దానిలో పదునారవవంతు ఆగు మూరల ఎతుగ మొదటి యంతస్తు ఉండవలయును; ఆంతకు మించి ఎక్కువ అంతస్తులకు పోవుకొలది మొదటి అంతస్తు ఎత్తులో పండ్రెండవవంతు తక్కువగా రెండవదియు రెండవదానీ ఎత్తులో వండెండవవంతు తక్కువగా మూడవ యంతస్తును ఆను ఈ క్రమములో ఉండవలయును. ఇదీయొక విధము; అథవా-ఆన్ని అంతస్తులు నాలుగు మూరల ఎత్తుతోనే ఉండుట రెండవ పద్ధతి.

గోడలు-కాల్చిన ఇటుకలతో కట్టవలయును; వాని మందము శాలా విస్తారములో (వెడల్పులో) పదునారవ వంతు ఉండవలయును; గోడలు కొయ్య తునుకలతో గాని మట్టితో గాని కట్టవచ్చును.

ఏ విధమగు వాస్తు (నిర్మాణము)ల యందై నను గృహపు మొ త్తపు వెడల్పును నడుమింటి (గర్భపు) వెడల్పును సరియగు అనుపాతములో నుండవలయును.

ద్వారపు వెడల్పు అరువది ఎనిమిది అంగుళములును దాని ఎత్తు అంతకు రెట్టింపు (నూట ముప్పదియారంగు ళములు)ను ఉండవలయును; వాకిటి ఎత్తు ఎన్ని మూరలో ద్వార శాఖల వెడల్పు అన్ని అంగుళములుండవలయును: ఈ మందము అన్ని వాస్తులయందును వర్తించును; ద్వారము పై వేయు ఆడ్డుపడై (ఉత్తరాసి) మందము ద్వార శాఖల వెడల్పులో నాలుగవవంతుండవలయును; ఈ అడ్డుపట్టెను మేడికొయ్యతో చేయవలయును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున వాస్తు శాస్త్రమున చతుశ్శాలాది నిర్మాణక్రమము అను రెండు వందల ఏబది మూడవ అధ్యాయము.

            (* ఇచట ముఖ్యముగా ఈ విషయమును గమనించవలయును. ఒక టికంటె ఎక్కువ అంతస్తులు ఉన్న గృహములు 'ప్రాసాదములు అనబడును. ప్రాసాదము'లలో అన్నిటికంటే కింది నిర్మాణము 'భూమి' (Ground floor);  ప్ర+థమ భూమిక (మొదటి అంతస్తు-First floor) మొదలుగా ఏడు -అంతస్తుల వరకు అంతస్తులను పెంచుట ప్రాచీన భారతీయుల అలవాటు అని కనబడుచున్నది. ఇట్లు అంతస్తులను పెంచునప్పుడు వాని ఎత్తుసరి ఏ ఆంతస్తు నకు ఎంత ఉండవలయును? అనునది ఇచట చెప్పబడినది. ఇచట ఆ కొలతలకు రెండు పద్దతులు చెప్ప బడినవి. అందు మొదటిదాని ననుసరించి చూచునప్పుడు రాజ ప్రాసాదము విషయము ఆలోచింతము. దానికిగల ‘భూమి' భుజపుకొలత 108 హస్తములు; కనుక మొదటి అంతస్తు 108/21=27/4 హస్తములు. రెండవ అంతస్తు = 1 ( 27/4- 27/4 ) )X 1/12= 297/48 హస్తములు; మూడవ అంతస్తు (297/48- 297/48 ) X1/12= 3267/576 హస్తములు. అని ఈ విధముగా గణితము చేయుచు ఏడు అంతస్తుల వరకు పరిమాణము నిర్ణయించుకొనవలెను. అథవా.రాజ ప్రాసాదము కాక మిగిలిన వారిగృహములును లోగడ చెప్పినట్లు రాజ ప్రాసాదములందు కూడ (పంచ విధము లలో మిగిలిన విధములగునవియు 108 హస్తములకంటె తక్కువ హస్తముల భుజముగల ‘భూమి’తో ఉండును: కనుక అట్టివానికి అన్నిటికిని నరిపడు పద్దతిగా అన్ని అంతస్తులకును 4 హస్తములే అను రెండవ విధము చెప్పబడినది. ఈ రెండవ పద్దతిలో ఏడు అంతస్తులును కలిసియు 7x4=28 హస్తములును వానికితోడు అంతస్తుల కప్పు మందమును చేరినంత మాత్రమేయుండును. కాని మొదటి పద్దతి ననుసరించినచో ఏడు అంతస్తులకును కలిసి మరికొంచెము ఎక్కువ ఎత్తు అగును.)