మత్స్య మహా పురాణము
200 - వసిష్ఠ గోత ప్రవరాను కీర్తనము -వసిష్ఠ నిమి చరితము॥
మత్స్య జనార్దనుడు వైవస్వత మనువుతో ఇట్లు చెప్పెను: మహాతేజుడగు వసిష్ఠుడు నిమియను రాజునకు పూర్వ పురోహితుడు; రాజ శ్రేష్ఠా! నిమి ఎల్లప్పుడును అనేక యజ్ఞముల ననుష్ఠించుచుండెడి వాడు; అవి అన్నియు అనుష్ఠింప జేసిచేసి గురుడగు ॥ వసిష్ఠుడు ఆలసి విశ్రాంతికొనెను॥ అట్టి అతని కడకుపోయి నిమి "భగవన్! నేను యజింప సంకల్పించుచున్నాను॥ నీవు వెంటనే వచ్చి నా చే యజనము నిర్వర్తింపజేయు"మనెను॥ మహాతేజుడగు॥ వసిష్టుడా పార్టీ వోత్తమునితో “కొంచెము కాలము ఓపిక పట్టుము; నీవు జరిపిన యజ్ఞములను చక్కని సంస్కారములతో జరిపించి జరి పించి మిగుల బడ లియున్నా ను॥ కావున నృపా! విశ్రమించిన పిదప యజింపజేయుదును॥” అనెను॥ ఇట్లనిన గురునితో నిమి యిట్లు మారు పలికెను: పార లౌకిక కార్యములందు ఎవడు ప్రతీక్షించు (ఎదురుచూచు చుండగోరును? యముడు బలియుడు॥ అతనికి నా పై ఏమియు మైత్రీభావము లేదు॥ జీవితము చంచలమయినది; కావున ధర్మ కార్యాచరణము నందు త్వరపడుటయే ధర్మము॥ ధర్మ కార్యానుష్ఠానమును తన పరలోక యాత్రయందలి దారి బత్తెముగా భద్రపరచి కొనీన ప్రాణి మరణానంతరముకూడ సుఖించును॥ (ఇది కాక లౌకిక కార్యములందు కూడ) రేపటి పనిని నేడే ఆచరించ వలయును॥ అపరాష్ట్రమున చేయవలసిన పనిని పూర్వాహముననే అచరించవలేను॥ మానవుడు తాను ఆ పని చేసినను చేయకున్నను మృత్యువు ఆందుల కై వేచియుండదు॥ పొలములు అంగడులు ఇండ్లు మొదలగువాని యందాస క్తి గలిగి (ధర్మము కాని) ఇతర విషయములందు ,మనస్సుంచి పరధ్యానములో ఉన్న మానవుని సమీపించి మృత్యువు తోడేలు గోరెనువలే తీసికొనిపోవును॥ మృత్యువునకు ‘ ఈ ప్రాణీ నాకు ప్రియమైనది; ఈ ప్రాణీ ద్వేష్యమయినది॥ అనునది లేదు॥ ఆయువునకు సంబంధించిన పూర్వ కర్మ ఫలాంశము ముగియగానే అది ప్రాణిని బలవంతముగా ఎత్తుకొనిపోవును॥ ప్రాణవాయువు చంచలమని నీకును తెలియునుగదా! ఏచోటనో ఏ క్షణమో బదికి తిమి॥ అనినచో అదియు ఆశ్చర్యకరమే॥ విద్యాభ్యాసము విషయమునను ధనార్జనము విషయమునను శరీరము శాశ్వతమనుకొనవలెను॥ ధర్మ కార్యాచరణము చేయు విషయమున శరీరము అశాశ్వతమనుకొనవలెను॥ అని నా తలపు॥ కనుక అటి సంకట రూపమయిన ధర్మ కార్య మున నేను (దేవతలకు) ఋణపడి ఉన్నాను॥ అందువలన నేను సం భార ములు అన్నియు సమకూర్చుకొని నీకడకు వచ్చినాను॥ నీవు వెంటనే నాచేత యజ్ఞమనుష్టింపజేయననినచో మరియొక యాజకుని కడకు పోవుదును॥
అని నిమీ పలుకగా వసిష్ఠుడు తాను బ్రాహ్మణోత్తముడు అయియుండియు క్రోధవశుడై నేను అలసియున్నా ననగా(నాశ్రమ తీరువరకు వేచియుండక) ధర్మజ్ఞుడవయియుండియు నీవు మరియొకని యాజకునిగా చేసికోనవలెననుకొను చున్నావు॥ కావున నీవు విదేహుడవయ్యెదవు॥ (దేహము లేని వాడు- మరణించినవాడు) అని శపించెను॥
నిమి వసిష్ఠునితో ఇట్లు మారుపలికేను: ధర్మ కార్యానుష్ఠానాసక్తుడనైన నాకు విఘ్నము కలిగించుచున్నావు; ఇంకొక చేత యజనము చేయించుకొనుట కొప్పుకోనవు; పైగా నన్నే శపించుచున్నావు; 'కావున నీవే వెంటనే విదేహుడ వగుదువు; అనేను॥ వెంటనే ఇరువురును విదేహులయిరి॥ దేహహీనములగు ఆ ఇరువురి జీవములును బహ్మకడకు పోగా చూచి బ్రహ్మ ఇట్లనెను: నిమజీవా! ఇంతటినుండి నీకు ప్రాణుల కనురెప్పలు స్థానముగా ఇచ్చుచున్నాను; నీవచ్చట నివసింతువు గాని; దాని సంబంధమున ప్రాణు లకు ‘నిమిషము' 'జెప్పపాటు' కలుగును॥ నిమిశ = నిమి॥ దీని యందు శయనించి విశ్రాంతిగొని॥యుండును కావున నీమీశ = నిమిష॥ అను శబ్దము సిద్ధించును॥)॥ ఆ సమయమున మానవులు మొదలగు ప్రాణులు) కను రెప్పలు కదలింతురు, ॥ ఆనీ బ్రహ్మ పలికిన వెంటనే స్వయంభూ 'వర దానమున నిమీ జీవుడు మానవాది ప్రాణుల కను రెప్పలయందంతటను హ్యాపించెను; భగవానుడగు బ్రహ్మ వసిష్ట జీవునితో ఇట్లు పలికేను: వసిష్ణా! నీవు మిత్రావరుణుల నేడు జంట దేవతల) కుమారుడవయ్యెదవు॥ ఆజన్మమునందును నీకు ఇదే నామముండును॥ అపుడును నీకు గడచిన రెండు జన్మల స్మృతియుండును॥ అనెను॥ ॥ అదే సమయమున మిత్రుడును వరుణుడును (వరుసగా ఈ ఇద్దరును ఉదయించు నూర్యునికిని॥ఆ స్తమించు సూర్యునకును ఆధిష్ఠాతృ దేవతలు) బదర్యా శ్రమమును ఆశ్రయించుకొని నిరుపమానమయి నియమమున ఎట్టి మార్పులునులేని తపమాచరించుచుండిరి॥ ఆ కాలమున ఒక వసంతర్తువున వృక్ష వ్యవస్థయంతయు పూచియుండ హాయి గొలుపు గాలి వీచుచుండ ఉత్తమ సుందరియగు ఊర్వశి పూవులు కోయుచు॥ చక్కని బొయగల మిగుల సన్నని వస్త్రము ధరించి ఉండి వారి కంటికగపడుట తటస్థించేను॥ ఆందమగు మోము కనుబొమలు పద్మలోచనములు కల ఆమెను చూచి వారు ఇద్దరును తద్రూప పరిమోహితులయి తమ గుండె నిబ్బరము కోల్పోయిరి॥ తపస్సాచరించుచు కూర్చుండిన వారి వీర్యము వారి మృగాజీనాసనమున పడెను॥ ఇట్లగుట మహాపాపము; కావున పోరు పర స్పరము పొపభీతులయి (సంప్రతిం చుకొని)॥ ఆ శుక్రమును మనోహరమగు జలపూర్ణ కలశమునం(బిందెయం)దు ఉంచిరి॥ ఆ ఇరువుర తేజస్సునను భూమియందే అప్రతిమ తేజోవంతులగు అగస్త్యుడు వసిష్ఠుడు అనువారు మిత్రావరుణ పుత్త్రులయి జనించిరి॥
తరువాత వసిష్టుడు నారదుని ఆక్క యగు అరుంధతియును ఉ తమ సుందరిని వివాహమాడెను॥ వారికి శ క్తి అత నికి పరాశరుడు ఆతనికి సాక్షాద్విష్ణువు ద్వైపాయనుడు పుత్తులయిరి॥ ఆ ద్వైపాయను నుండీయే ప్రకాశ జనకుడగు భారతమను చంద్రుడు ఉదయించెను॥ అజ్ఞానాంధకారమున కన్నులు కనరాని వారికి కన్నులు తెరచి అది చూపునిచ్చెను॥ అట్టి ద్వైపాయనుని పితయగు పరాశరుని వంశమును తెలి పేదను వినుము॥ ఇది చాల ఉత్తమమయినది॥
పరాశరవంశము॥
గౌరపరాశరులు: కాండర్షభుడు వాహనపుడు జైహ్యాపుడు భౌమతాపనుడు గోపాలి -ఐదుగురు; నీలపరా శరులు: ప్రపోహయులు వాహ్యమయులు ఖ్యా తేయులు కౌతుజాతులు హర్వశ్వి-ఐదుగురు; కృష్ణపరాశరులు: కార్షా (ర్షా) యణులు కపిముఖులు కాకేయస్థులు జపాతులు పుష్కరుడు-ఐదుగురు; (ఆ) విష్టాయనులు వాతేయులు స్వాయష్టులు ఉప యులు ఇషికహస్తులు॥వీరై దుగురు శ్వేతపరాశరులు; పాటికుడు పాదరి సందులు కోధనాయనులు క్షామి- ఈ ఐదుగురును శ్యామ పరాశరులు;స్వలాయనులు వారాయణులు తై తేయులు యూథపులు తంతి॥ ఈ ఐదుగురును ధూమ్ర పరాశరులు; అన్ని పర్గముల పరాశరులకును పరాశరుడు శక్తి వసిష్ఠుడు ప్రవర ఋషులు; ఈ గోత్రముల వారెవ్వరును 'పరస్పరము వివాహసంబంధములు చేసికొనరాదు॥
సూర్య సమప్రభావులగు ఈ పరాశర గోత్ర ఋషుల నామస్మరణము చేసినంత మాత్రముననే నరుడు పాప ముక్తుడగును॥
ఇది శ్రీ మత్స్యమహాపురాణమున వసిష్ఠ నిమి చరిత్రము పరాశరగోత్ర ప్రవరాను కీర్తనము అను ఇన్నూరవ అధ్యాయము॥
