మత్స్య మహా పురాణము

Table of Contents

177 - విష్ణుని గెలువదలచి కాలనేమి అతని కడకుపోవుట॥ వారిరువుర సంవాదము॥

శ్రీమత్సుడు మనువుతో ఇంకను ఇట్లు చెప్పేను: కాలనేమి ఆచరించు ఈ విరుద్ధ కర్మాచరణమునకు భయపడి అతనిని సేవించుటకై అతని కొలువునకు పోక అతనివై పు తీరుగనై న తిరుగక ఉండినవి ఐదు తత్వములు మాత్ర ముండెను॥ అవి 1॥ వేదము 2॥ ధర్మము 8॥ క్షమ 4॥ సత్యము 5॥ శ్రీ (సర్వకామపూర్ణతా సిద్ధమగు సచ్చిదానంద తా లక్షణము) ఈ ఐదును తను సేవింపరానందున ఆ దానవేశ్వరుడు సక్రోధుడై విష్ణు స్థానమును వెదకుకొనుచు (పోయి పోయి) నారాయణుని కడకు పోయెను॥ అతనికీ అచట నారాయణుడు కనబడెను॥ అతడు (ప్రణవరూపుడగు గరుడుని సర్వవా క త మూలరూపుని) ఆధిష్టించియుండెను॥ శంఖచక్ర గదాధరుడు-దానవుల వినాశ మునకై శుభ రూపయగు గదను తిప్పుచున్న వాడు సజల మేఘ సమానుడు॥ మెరపువంటి వస్త్రము ' దాల్చినవాడు॥బంగరు రెక్కలును శిఖయు కలిగి "కశ్యప (వినతా పుత్రుడగు పక్షిని గరుడుని చక్కగా ఆరోహించినవాడు; దైత్య వినాశమున కై నేమ్మదీతో కూర్చున్నట్లు కనబడుచు ఎవరికిని కలవరపరచనల నీకొక రణరంగమునందు ఉన్న విష్ణుని ఉద్దేశించి (నర్వ తత్వము లను తన వశము చేసికొనవలెనని) లుబ్దమానసుడగు ఆ దానవుడు ఇట్లు పలికెను: మా పూర్వులకు ప్రాణనాశకుడగు శత్రువు ఇత డే; సముద్రమునందు వసించు అసురులను-మధుని- కైటభుని॥కూడ చంపినవాడు ఇతడే; మా (దానవులకు) అణచనలవికానిదై (మూర్తీభవించిన) కలహము ఇత డే; (ఇతని మూలముననే మాకు సదా దేవతలతోడి యుద్దములు సంభవించుచున్న వి;) అని మావారు చెప్పుచున్నారు; ఇతనిచే యుద్దములందు దానవులనేకులు హతులయిరి॥ *ఇతడు స్త్రీల విషయము నను బాలుర విషయమునను దయలేక ఆస్త్రీల భర్తలను చంపెను; ఆ బాలుర తండ్రులను చంపెను; కాని ఆ తప్పున కే సిగ్గుపడుటలేదు; ఇతడే దానవ నారుల పాపటలు తొలగించినవాడు; దేవతలకు విష్ణువును స్వర్గ వాసులకు వైకుంఠుడును ఇత డే; నాగులలో అనంతుడును ( శ్రేష్ఠుడును॥ సర్వజీవ జ్ఞాన కర్మాత్మకములగు) జలములందు నీదురించువాడును స్వయం భూబ్రహ్మకు కూడ మొదటివాడును ఇత డే; మా చేతులలో వ్యథ పరచబడిన మనస్సులుగల దేవతలకు రక్షకుడిత డే; ఇతని క్రోధమునకు పాత్రుడయియే హిరణ్యకశిపుడు చంపబడెను; ఇతనీ నీడ నాశ్రయించియే దేవతలు యజ్ఞారంభములందు నిలుచుచున్నారు; మహరులచే ప్రాతర్మధ్యాహ్న సాయం సవనములందు మూడు విధ ములుగా హవనము చేయబడిన ఆజ్యమును వారు గ్రహించి ఆమభవింపగలుగుచున్నారు; దేవ శత్రువులకు అందరకు మరణ హేతు భూతుడీతడే కదా! దేవతల నిమిత్తమయి యుద్ధములందు ప్రాణత్యాగమున కైన సిద్దపడి సూర్య సమాన తేజోవంతమగు చక్రము ప్రయోగించువాడితడే కదా! దైత్యులు కాలయముడై యుండు కాలాత్మకుడు ఈతడే కదా! ఈ కేశవుడు గడచిన కాలమున చేసిన తన పనులకు ఫలమనుభవించును లెమ్ము॥

*( ఆ॥177శ్లో॥8 ;విలక్షణమగు సమాహార ద్వంద్వము॥(అపాణినీయముక్తిమత్స్య-

177॥8 శ్లో॥ ఆయం స నిర్ఘృణో లోకే- శ్రీబాలనిరపత్రపః - ఇచట॥అయం లోకే శ్రేషు బాలేషు చ విషయే నిర్ఘృణః॥ నిరపత్రపశ్చ॥ అని అన్వ యము రావలయును- కాని 'శ్రీబాలవిషయే నిరపత్రపః' అని చెప్పరాదు; కాని ఈ పాఠము అన్ని ప్రతులందును ఇబైయున్నది॥ ఇది కుదురదు; 'ఇతడు స్త్రీలయందును బాలురయందును దయలేనివాడై ఆ స్త్రీల భర్తలను ఆ బాలుర తండ్రులను చంపెను॥ కాని తాను చేసిన ఆ పనులకు సిగ్గుపడడు॥ అని చెప్పవలెను॥ అందుల కై స్త్రీబాలే' అను పాఠముండవలెను॥ శ్రియశ్చ బాలాశ్చ- ఏతేషాం సమాహారః శ్రీ బాలమ్'-ఇది ఆపాణినీయము॥)

నా అదృష్టముకొలదిని ఈ విష్ణువు ఇపుడు నా ఎదుటనున్నాడు॥ ఇపుడు " నా భుజములనడుమ నలిగిపోయి ఇతడే నన్నే నమస్కరించును॥ నా అదృష్టవశమున ఇపుడు యుద్ధమున దానవభయావహుడగు ఈ సొరాయణుని చంపి నా పూర్వులకు పూజ జరి పెదను॥ తరువాత శీఘ్రముగా అసుర గణములను చం పెదను॥ మాకు పర జాతివారగు దేవతల పక్షమవలంబించీ ఇతడు దానవులను యుద్ధమున బాధ పెట్టు చున్నాడు॥ ॥ ఇతడు అనంతుడుగా ॥ పూర్వముండుచునే తన నాభియందు జన్మించిన 'పద్మము వలన పద్మ నాభుడని ప్రసిద్ధినొందీ ఆ సమయమందే ఘోరమగు ఏకార్ణవమున మధు కైటభులను సంహరించెను॥ పూర్వము సగము నరుడుగ సగము సింహముగా రెండు విధములగు దేహము ధరించి మాతండ్రియగు హిరణ్యకశిపుని సంహరించెను॥ దేవతలనేడు ఆగ్ని కి ఆరణియగు అదితి ఇతనిని తన శుభగర్భముగా ధరించి కనెను॥ ఆపుడతడు చూడడుగులతో ముందునకు అడుగులు వేయుచు తానొక్కడే చూడు లోకములను హరించెను॥ మరల ఇపుడు గూడ ఈ తార కామయ సంగ్రామము తటస్థించినది॥ దీనిలో నితడు నాతో తారసిల్లుచున్నాడు॥ ఇప్పు డి దేవుడు నశించి తీరును॥ ఇట్లా రణరంగమునందు నారాయణుని సాటిలేని అనరాని మాటలతో బహువిధములుగా ఆతనితో యుద్దము చేయుటకు ఇష్టపడెను॥ అనురేంద్రుడు తను దిట్టుచున్నను ఆ గదాధరుడు కోపింపలేదు॥ మహాక్షమాబలముతో ఉండి చిరునవ్వుతో ఇట్లు పలికేను: దైత్యా: దర్పముతో కూడిన బలము ఆల్పమయినది; ఆక్రోధముచే (క్షమ) సిద్ధించినబలము స్థిరమయినది; నీవు క్షమను విడిచి మాటలాడుచున్నావు కావున నీదర్పము వలన కలిగిన దోషములతో నీవు తప్పక చత్తువు; నీవు ధీరుడవుకావని నాకు తోచుచున్నది; ఛీ! నీవాగ్బలము పనికిమాలినది; మగవారు లేనిచోట మాత్రమే స్త్రీలు గర్జిల్లుచుందురు॥ దైత్యా! నీవును నీపూర్వుల మార్గమునే యనుసరింతువని నాకు కనబడుచున్నది; ప్రజాపతి ఏర్పరచిన ధర్మ సేతువును భేదించినవాడెవ్వడు శుభము పొందును? దేవతల ప్రవృత్తులనే భంగపరచుచున్న నిన్నిపుడే చంపుదును॥ దేవతలను వారివారి స్థానములందు నిలుపుదును॥

శ్రీవత్సధారియగు విష్ణువు ఆరణరంగమందు ఇట్లు పలుకుచు ఉండగనే దానవుడు క్రోధముతో నవ్వెను; తన ఆన్ని హస్తములతోను ఆయుధములు గ్రహిం చెను॥ వాడు సాయుధములగు తననూరు భుజములను పైకెత్తి క్రోధముతో రెండింతలుగ కనులేర్ర జేయుచు విష్ణుని రొమ్మున కొటైను॥ మయతా రాది॥ దానవులును తమ తమ ఆయుధములనో ఖడ్గములనో ఎత్తిపట్టుకొని విష్ణునక భిముఖులయి పరుగెత్తిరి॥ అతిబలులగు దైత్యులందరు తమ తమ సర్వాయుధము లతో ఉద్యతులై కొట్టుచున్న ను కదలని కొండవలెనే విష్ణువు చలించకుండెను॥ కాలనేమి మహాసురుడు గరుడుని పై తలపడి తన పూర్ణ బలముతో ఘోర మును మండు ప్రకాశించుచున్న దియు పెద్దదియు ఆగుగదను భుజములతో ఎత్తి కుద్దుడగుచు గరుడుని పై విడిచెను॥ డై త్యుని ఈపని నారాయణునకు ఆశ్చర్యము కలిగించెను॥ గరుడుని తల పై ఆగద పడగనే అతడు బాధను పొందుటయు తన శరీరము కూడ గాయపడుటయు చూచుకొని వైకుంఠుడు క్రోధర క లోచనుడై చక్రము పూనెను; గరుడుడు(త్సాహమున) వృద్ధినందగా ఆతనితోపాటు ఆవకుడు తానును వృద్ధినందెను॥

ఆతని భుజములు దశ దిశలనిండ వ్యాపించుచు వృద్ధినందెను॥ ప్రదిశలను దిశలను భూమ్యంతరిక్షములను కూడ కేశవుడు తన మూర్తితో నింపివే నేను॥ మరల ఒక మారు లోకములను తన తేజస్సుతో ఆక్రమింప గోరువాడువలె అతడు వృద్ధినం దేను॥ అసురేంద్రుల భయ పెట్టుట క్రై వర్ధిల్లుచున్న మధుసూదనుని చూచి ఆంతరిక్షమందుండి ఋషులును॥ గంధర్వులును అతనిని స్తుతించిరి॥ శ్రీధరుడు గదాధరుడునగు నారాయణుడు తన పాదములతో భూమినాక్రమించి బాహువులతో దిక్కులాక్రమించి సూర్యకిరణ సమతేజోవంతమును వేయి ఆరలు కలదియు శత్రునాశకమును దీపాగ్ని సమానమును ఘోరమును అయియు చూచుటకు ఇంపుగోలుపుచుండుటచే సుదర్శనమను పేరుకలదియు తన అంచులందు॥ బంగారు రేణువుల పూతక' ,దియు నాభియందు నడుమ భాగమునందు వజముకలదియు భయజనకమును దానవులనుండి కలిగిన మేదస్సు (మెదడు కాదు) ఎముకలు మజ్జర క్తము - నీటితో తడిసినదియు ఆయుధములలో సాటిలేనిదియు పొడి, యగు అంచులతో ఏర్పడిన మండలాకారము కలదియు పూలదండల మాలికలతో వ్యా ప్రమును (నారాయణుని) సంకల్పా నుసారము పోవునదియు కామరూపమును స్వయంభూబ్రహ్మ స్వయముగా సృష్టించినదీయు సర్వదేవశత్రువులకును భయ ప్రదమును మహరుల రోషమును ప్రవేశించినదియు సర్వదా దేవదానవ యుద్దములందు విజృంభించునదియు తను విసరి నంతమాత్రమున స్థావర చర భూతములకు బుద్ధి మోహము కలిగించునదియు మహాయుద్దములందు మాంసాహారి ప్రాణుల కును భూతములకును తృప్తి కలిగించునదియు సాటిలేని పనులు నెరవేర్చునదియు సూర్యసమాన వర్చశాలియు ఆగు॥ చక్రమునే త్తి తన తేజముతోనే దానవుల తేజస్సులను హరించుచు కోపదీప్తుడయి దానితో కాలనేమి దానవుని బాహువులను॥ ఛేదించేను॥ హరి ఆచకముతోనే భయంకరములును అగ్ని తో నిండినవై మండుచున్నట్లు అట్టహాసము చేయుచున్న వియు॥ ఆగు॥ ఆ దానవుని నూరుముఖములను { శిరములను) మథించెను (నర కేను॥ కాని తలలును భుజములును తెగినను ఆ దానవుడు చలించలేదు॥ కొమ్మలు తెగిన చెట్టువలె వాని మొండెమ బై యుండెను॥ అంతట గరుడుడు వాయుసమాన వేగ ముతో వచ్చి తన మహాపక్షములను విప్పి వచ్చి తన వక్షముతో కాలనేమిని పడగొట్టేను॥ బాహువులును ముఖములును॥ లేనివాని శరీరము ఆపుడు ఆంతరిక్షమును విడిచి భూతలమును కలవర పెట్టుచు నేలబడెను॥ ఆదే త్యుడు వడగానే దేవతలును ఋషులును 'సాధు సాధు' అనుచు ఒక్కుమ్మడిగా వైకుంఠుని తమ వాక్కులతో పొగడి పూజించిరి॥

అంతవరకును యుద్ధమున తమతమ పరాక్రమము చూపిన దైత్యులందరును నారాయణుని బాహువులు తమ పై కమ్ముకొనగా రణమున కదలనే న లేక పోయిరి॥ విష్ణువు కొందరను జుట్టుపట్టియు మరికొందరను చేవులు పట్టియు బాధించేను॥ ఒక ని ముఖమును నర కేను॥ ॥ ఇంకొకని నడుము పట్టివేసెను॥ ఇట్లు వారందరును చక్రముతోను గద తోను నిర్లగులయి బలము తరిగి ప్రాణములు పోయి గగనము నుండి తమ దేహములు జారిపోగా ధరణీతలము పై పడిరి॥ ఇట్లా దైత్యులందరును హతులు కాగా గదాధరుడగు పురుషోత్తముడు ఇంద్ర ప్రీతి కలిగించి కృతకృత్యుడై తన పని తాను చేసి) రణరంగమున నిలిచేను॥

ఇట్లు ఆ తారకామయమను యుద్ధము ముగియగానే లోక పితామహుడగు బ్రహ్మ బ్రహ్మర్షి గంధర్వాపరో గణములతో కూడ అచటికి వచ్చెను॥ అతడు ఆ దేవదేవుడగు హరిని పూజిం( స్తుతించుచు ఈ వాక్యము పలికెను: దేవా! ఈ దానవ వధతో నీవు మహాకార్యము నెరవేర్చితివి॥ దేవతల హృదయమునుండి శల్యము పెకలించినట్లయినది॥ మేమును సంతసించితిమి॥ నీవు చంపిన ఈ కాలనేమిని చంపగలవాడు నీవు తప్ప మరి ఎవ్వరును లేరు॥ వీడు సచరాచర లోకముల నవమానపరచుచు బాధించుదు ఎవరిని లెక్క పెట్టక ఋషులకు నాశమును వ్యథను కలిగించి నా మీద కూడ విజృంభించి గర్జించుచున్నాడు॥ వాడు అట్టివాడు కావునను నీవు అంతటి వానిని చంపితివి కావునను నీవు చేసిన మహా కార్యముతో నేను పరితుష్టి చెంది నాను॥ కాలునితో (కాల పురుషునితోను) సమానుడగు కాలనేమి మరణించినాడు; కావున మనమిక ఉత్తమమగు ద్యులోకమునకు పోవుదము; లోక క్షేమమునకు గాను నీకును శుభమగుగాక ! పూజ్యుడగు భగవన్! అచ్చట ద్యులోకమునందు ( ఆందునను బ్రహ్మలోకమున సదస్సు (మునులు ఋషులు మొద గువారు సమావిష్ణులగు తావునందు ఉన్న బ్రహ్మరులు నీకై వేచియున్నారు॥ మరియు ఒక విషయము; వరములను కోరువారలలో ఉత్తముడవు నీవు; ఏలయన నీవు వామనావతారమునందు వలే ఎవరినైన ఏదయిన వేడినను లోకకళ్యాణము కొరకే యాచింతువు॥) దేవతలకును దానవులకును వరములనిచ్చువాడవుకూడ నీవే; ఇట్టి నీకు నేను కూడ వర మీయ దలచియు ఏమీయగలను? ఇపుడిట్లు నిష్కంటకమయి సర్వ సంపత్సమృద్ధమగు ఈ త్రైలోక్యమును సుమహాత్ముడగు ఇంద్రునకు ఈ యుద్దరంగ మందే అప్పగించుము॥ అని ఇట్లు భగవానుడగు బ్రహ్మ పలుకగా అవ్యయుడగు హరి ఇంద్రాది దేవతలనందరనుద్దేశించి శుభ వాక్కుతో ఇట్లు పలికెను:

ఇచ్చట కూడియున్న సర్వదేవతలారా!, ఇంద్రుడు ప్రధానుడుగా ॥ మీరందరును వినుటకు ఆవహితములగు చెవులతో సరిగ వీనుడు॥ మేము కాలనేమి ప్రభృతి - దానవులనందరను ॥ సంహరించితిమి॥ వారందరును॥ విక్రమవంతు లును ఇంద్రునికంటే గొప్పవారును; ఈ మహా సంగ్రామమందు తప్పించుకొనినవారు దైత్యేశుడగు విరోచనుడును మహా బలుడగు స్వర్భానుడు (రాహువు)ను॥ ఈ ఇద్దరు మాత్రమే; ఇంద్ర యమ వరుణ కుబేరులు తమతమ దిక్కులకు పోయి వానిని పాలింతురుగాక ! నక్షత్రముల అమరికతో కూడి చంద్రుడును పోయి యథాకాల యోగముగ వానితో ' వర్తిల్లుగాక! సూర్యుడు " ఋతువులతో ఆరంభించుచు అయనములతో కూడ సంవత్సరమునాశ్ర యించియుండుగాక! (మూర్తుడగు రవికి అమూ రమగు సంవత్సరమును దాని అవయవములగు కాలపరిమాణ విశేషములును ఆత్మ - తదంశ భూత॥తత్వములు) సదస్సులు యజ్ఞశాలయందలి ఋత్విక్కులు) మంత్రములతో అభిపూజించి వేల్చు హవిస్సులు ఎప్పటివలె ప్రవర్తిల్లుగాక ! వేదమునందు కనబడు విహితకర్మ విధానానుసారము విప్రులు ఆగ్ను లందు వేల్లురుగాక ! దేవతలు బలి హోమములతో ఋషులు స్వాధ్యాయముతో పితరులు శ్రాద్ధముతో యథాసుఖముగా నుండి తృ పినందుదురుగాక ! వాయువు తన - సప్త మార్గములందు నిలిచి ప్రవర్తించుగాక ! తనకు స్వాభావిక ములగు న త్వరజస్తమోగుణత్రయముతో కూడి వానికి ప్రతీకము లగు శుక్ల రక్త కృష్ణ వద్దత్రయముతో కూడి వెలుఁగుచు అగ్ని ఆ మూడు వర్ణములను మూడు లోక ములను కూడ తృప్తి నందించుగాక ! దీక్ష ణీయులగు॥ (యజ్ఞములందు ఋత్వికు లుగాను యజమానులుగాను దీవాగ్రహణమున॥ కధికారులయి యుండి ఆ అధికారమునకు తగినట్లు దీక్ష వహించి యజ్ఞముల ప్రవర్తిల్లజేయు) ద్విజాతులు క్రతువులను ప్రవర్తిల్ల జేయుదురుగాక! యజ్ఞములందు యాజ్ఞికులకు వేరు వేరుగా శ్రిత శాస్త్రమునందు నిర్ణయించినట్లు ఆయా దక్షిణలును లభించుచుండుగాక! (ఏలయన సద్భాహ్మణ గృహస్థులకు గల జీవన వృత్తులలో ముఖ్యమయినది యాజనము॥ అది వారికి లభించనిచో వారి జీవనము ప్రతిబద్దమగును॥ రవి గోవులను (ఆవులవంటి పశువులు-గ్రహములు॥ తేజఃకిరణములు॥ వేదాత్మక వాక్కు - ఇవియన్నియు గోశబ్దమునకు అర్థముగా ఇచట చెప్పుకొనవలయును॥) చంద్రుడు రసద్రవ్యములను వాయువు ప్రాణుల ప్రాణములను తమతమ విషయమునందు వేద ములచే చెప్పబడిన మంత్రార్థానుసారముప్రవ రిల్లు సుకర్మ ములకు ఫలరూపముగా తృప్తినందింతురుగాక ! మహేంద్ర మలయాది పర్వతములనుండి ప్రభవించిన త్రైలోక్య మాతృ మూర్తులగు నదులన్నియు ఎప్పటివలె తమతమ క్రమముతో సముద్రమునకు పోవుగాక ! దేవతలారా! మీరు దైత్యులనుండి భయములేక యుండుడు; శాంతిపొందుడు; మీకందరకును " శుభమగుగాక ! సనాతనమగు { శాశ్వతమగు) బ్రహ్మలోకమునకు పోవుచున్నాను; పోయిషత్తును; ఒక ముఖ్య విషయము చెప్పుచున్నాను; స్వగృహమందే కానిండు; స్వర్గలోకమందే కొనిండు; విశేషించి సంగ్రామ రంగమందే కానీండు; మాకు ఏమి - లెమ్మను నమ్మిక తో నుండగూడదు; ఏలయన దానవు ఎల్లప్పుడును శుద్ర స్వభావులుగా నుందురు; ఛిద్రములందు ( అవకాశము దొరకినప్పుడెల్ల॥ అవకాశము లభించిన ప్రతియొక చోట) దెబ్బతీయుదురు; వారు తిన్న గా నుండుట॥ స్థిర మయినది కాదు; (వారి చిత్తవృత్తి అస్థిర మయినది॥) మీరు అందరును సౌమ్యులు; ఋజు (అవక్ర) థావులు; ఇట్టి మీకు ఆర్జవము (ఋజుత్వము-క పటములేని వర్తనము ధము; అని ఇట్లు దేవతలతో పలికి మహా యకుడును సత్య పరాక్రముడునుఅగు విష్ణువు బ్రహ్మతో కూడి బ్రహ్మలోకమునకు పోయెను దానవులకును విష్ణువునకును జంగిన తార కామయమను సంగ్రామమునందు జరిగిన ఆశ్చర్యము ఇది; నీవు నన్న డిగిన విషయము నీకు ఇట్లు తెలిపితిని॥

(గమనిక: ఈవృత్తాంతమునందలి కాలనేమి విషయ వర్ణనమంతయు వేదిక ధర్మమునకు విరుద్ధముగా నడుచుచు ప్రకృతి ధర్మములను తమ వశము చేసికొని లోకకల్యాణము సాధింతుము॥ ఆను ఈనాటి వైజ్ఞానీకులవంటి వారిని సూచించుచున్న దనీ ఆ భావనతో ఆధ్యయనము చేయవలయును; కాలనేమిన్ - కొలనియ మీన్ - కొలదేశాత్మక మగుప్రకృతిని వశీక రించి నియమించి తన ఆదుపులో ఉంచుకొనగోరువాడు॥)

ఇది శ్రీమత్స్య మహాపురాణమున తారకామయమను దేవదానవ సంగ్రామమున విష్ణుకృత కాలనేమి వధమను నూట డెబ్బది ఏడవ అధ్యాయము॥

నారాయణనాభి వద్మోద్భవ వృత్తాంతము ముగిసినది