మత్స్య మహా పురాణము

Table of Contents

185 - నర్మదా మాహాత్మ్యకథనారంభము॥

 [గమనిక : ఈ నూట ఎనుబదియెదవ అధ్యాయపు ఆరంభమందు 'ఓంకారస్య మాహాత్మ్యమ్' అనియు నూట తొంబది నాలుగవ అధ్యాయపు ఆరంభమునందు “ఓంకారస్యాభివర్ణనమ్' అనియు ఈ నర్మదా తీర్థములకు సంబంధించిన పదములున్నవి॥ కాని ఈ నర్మదా తీర్థములలో కాని దీనికి సంబంధించిన క్షేత్రములందు కాని “ఓంకార 'మనునది ఇందు కన బడుటలేదు॥ కానీ ఈ నర్మదా నదీ తీరమందలి తీర్ధములలో ఒకటియగు కుసుమేశ్వర తీర్థ సమీపమున అంకోల (ఊడుగ) వృక్షము కలదనియు అచట పితరులకు పిండదాన మనంతఫలదమనియు చెప్పబడినది (190 అధ్యాయము); అంకోల వృక్షమునకీ ప్రాశస్యము అపూర్వమయినది; నర్మదా సాగర సంగమ సమీపమున కూడ అంకోలేశ్వర మను ప్రదేశము నేడును ఉన్నది

కాని శ్రాద్ధకల్పాధ్యాయమునందు ఈ తీర్థపు ప్రశంస కలదు; ప్రకరణమునుబట్టి ఈ ఓంకార క్షేత్రము నర్మదా తీరమందలి తీర్థ క్షేత్రమే; ఇందలి దేవత నీలగాయత్రి' అనియు॥ ఈ ప్రదేశమునకు ప్రస్తుతము 'ఓంకారేశ్వరము' 'ఓంకార నాథము' అని పేరులు అనియు ఇది నర్మదా తీరమునందు నేటి మధ్యప్రదేశ్ ఎనీమార్ జిల్లాలోని ఖాండ్వాకు 32 మైళ్ళు వాయవ్యముగ 'మాంధాతృ ద్వీపము'లో ఉన్న ఓంకార నాథము అనియు తెలియుచున్నది॥ ఇట్లే ఈ నర్మదా మాహాత్మ్య ప్రకరణమునందలి 'కావేరీ నది కూడ 'కౌబేరీ' నదియని భూగోళ వ్యవస్థా ప్రకరణములలోని వింధ్య పర్వత సంజాత నదుల పట్టిక లో ఉన్నది॥ ఇచ్చటి  ఆధ్యాయపు విషయ ప్రతిపాదనమును బట్టి కూడ ఇది ‘కౌబేరీ' అని ఉండవలెను॥]

ఋషులు సూతుని ఇట్లు వేడిరి: సత్తమా! (సజ్జనులలో ఉత్తమాః) నీవు మాకు ఆవిముక్త క్షేత్ర మాహాత్మ్యమును ఉన్నదియున్నట్లు (మా కన్నులకు కట్టినట్లు తెలిపితివి॥ ఇపుడిక నర్మదా మాహాత్మ్యమును తెలుపవేడుచున్నాము॥ నర్మదా సంబంధి తీర్థ ములందును ఓంకార కపీలా సంగమామ దేశ తీర్థ ముల మాహాత్మ్యము పాపనాశకమందురు॥ పూర్వపు ప్రళయ సమయమందును నర్మద నశించలేదనియు మార్కండేయ భగవానుడు కూడ అపుడు నశింపకుండేననియు ఆది నర్గ వృత్తాంతమున నీవు తెలిపి ఉంటివి॥ ఆది ఎట్లు? మాకు సవిస్తరముగా తెలుపుము ॥

ఆనగా సూతుడు ఋషులకిట్లు చెప్పెను: పూర్వము మహాత్ముడు వనస్థుడు ధీమంతుడునగు పాండవుడు (ధర్మ రాజు) వనమునకు వచ్చిన ఉగ్ర తపోయుక్తుడు మహాభాగుడునగు మార్కండేయ మహామునిని ఈ నర్మదా మాహాత్మ్య విషయమే అడిగేను॥ ఏమనీన ద్విజోత్తమా! నీ యనుగ్రహమున వివిధ ధర్మములను వింటిని॥ సువతా! ఇంకను వినవలెననియున్నది; కావున నాకింకను అని చెప్పుడు॥ నర్మదయసు ఈ పుణ్యనది ఏల సర్వలోకములందును వినబడుచు విఖ్యాతయయ్యెనో॥మునిసత్తమా! నాకు తెలుపుడు॥ అని ధర్మరాజడుగ మార్కండేయు డిట్లు చెప్పసాగెను॥

నర్మద నదులన్నీ టీలో శ్రేష్ఠము; సర్వపాప ప్రణాశనము; స్థిర చర భూతములనన్నిటిని ఆ నది తనయందు ధరించి పోషించును॥ తన్మాహాత్మ్యమును నేను పురాణమందుండి వినినట్లు చెప్పెదను; ఆది యంతయు మహారాజా! - వినుము॥ కనఖల క్షేత్రమునందు గంగయు కురు క్షేత్రమునందు సరస్వతియు ( ఇతర ప్రదేశములందు కంటే) ఎక్కువ పుణ్యవంతములు; నర్మదానదియో-గ్రామమునం దేకానీ॥ఆరణ్యమునందే॥కానిఎచ్చట ప్రవహించుచుండియు పుణ్యకర మే; మూడు నాళ్ళ స్నానాదికము చే సరస్వతీ నదియు ఏడు దినముల స్నా నాదికము చేయ యమునయు పవిత్రత కలిగించును॥ గంగాతీర్థము స్నా సాదికముచే తత్క్షణమే పవిత్రత నిచ్చును॥ నర్మద దర్శన మాత్రముననే పవిత్రత కలిగించును॥

*కళింగ దేశపు 'ఆర్దము' (హద్దు) నందు ఉన్న అమరకంటక పర్వతమున ఈ నర్మద ముల్లోకములందలి అన్నిటి కంటెను మనస్సును ఆకర్షించునదియు ఆనందింపజేయునదియు నయి యున్నది॥ మహారాజా: ఇచట దేవాసుర గంధర్వు లును ఋషులును మునులును తపమాచరించి పరమ సిద్దినందిరి॥ స్నానమాడి నియమస్థుడు జితేంద్రియుడుఐ ఒక రాత్రి ఉవసించిన వాని నూరు తరములవారు తరింతురు॥

(*మత్స్య-185 ఆ॥ శ్లో॥ 12 ‘కళింగదేశ స్యార్దే చ పర్వతేఒమరకంటకే', 'కళింగదేశపు హద్దులలో అమర కంటక           మను వర్వతమున॥ దీనిని బట్టి ఒక నాడు కళింగదేశము నర్మదానదీ ఉద్దమ (నిర్గమ) స్థానము వరకు వ్యాపించి యుండెను॥(ఆంధ్ర దేశమునందు ఉదయగిరి వరకు కళింగ రాజ్యము వ్యాపించినట్లును 16వ శతాబ్దినాడును ఆతః పూర్వమును పిఠాపురము కళింగ దేశాంతర్భాగమయినట్లును) ఆని ఊహించవచ్చును॥ ఈ అధ్యాయములో అమర కంటకమునుండి నర్మదా సాగర సంగమము వర ఏ గల తీర్థము లనేకములు వివరించబడినవి॥)

అమర కంటకమునందలి జలేశ్వరమున స్నానమాడి యథావిధిగ పిండ దానము చేసినచో వాని పితరులకు ప్రళయ కాలము వరకు నిలుచు తృప్తి కలుగును॥ ఈ పర్వతమున అంతటను కలిసి కోటిరుదులు ప్రతిష్టితులయి యున్నారు॥ అచట స్నానమాడి గంధ మాల్యాను లేపనములతో శివునారాధించినచో కోటిరుదులును ప్రీతులగుదురు॥ సందియములేదు॥ ఈ పర్వతపు పడమటి యంచున మహేశ్వరుడు స్వయముగా నున్నా డు, అచట శుచియు బ్రహ్మ చారియు జితేంద్రియుడునై యథావిధిగ పితృకార్యమాచరించినచో నదియందు తిలోదక ముతో పితరులకు తర్పణమిచ్చినచో వాని ఏడు తరములవారు స్వర్గమున ఆనందింతురు॥ తానును అరువది వేల సంవత్సరములపాటు అప్సరోగణ సిద్దచారణ పూర్ణమయిన స్వర్గమున దివ్యగంధ మాల్యానులిపుడే దివ్యాలంకార భూషితుడై పూజ్యతనందును॥ తదుపరి స్వర్గము నుండి భ్రష్టుడయ్యును విమల వంశమున ధనవంతుడు దానశీలుడు ధార్మికుడునయి జనించును॥ మరల ఆ తీర్థ మును స్మరించి అచటికి పోయి సేవించి ఏడు తరముల వారిని తరింపజేయును; తానును రుద్ర లోక మున కేగును॥ నర్మదా నది మొ త్తము నూరు యోజనముల పొడవునను రెండు యోజనముల వెడల్పునను నున్నదందురు॥ అమరకంటక పర్వతమందంతటను ఈ నదికి అరువది కోట్ల ఆరువది వేల తీర్థములున్నవి॥ ఈ అమర కంటక మున నర్మదా తీర్థము నందు బ్రహ్మచారియు శుచియు జితక్రోధుడు జితేంద్రియుడునై సర్వభూత హితాసక్తుడై ఏహింసయు లేక శివారాధన సమా చరణముతో జీవించి అచట ప్రాణ త్యాగము చేసినవానికి లభించు పుణ్యఫలమును వినుము॥

అతడు లక్షసంవత్సరముల కాలము ఆప్సరోగణముతోను దివ్య శ్రీ జనముతోను వ్యాప్తమయిన స్వర్గమున ఆనందిం చును॥ వాడు దివ్యగంధానులిపుడే దివ్య వస్త్రాలంకార, భూషితుడై దేవలోకమందుండి దేవతలతో కూడి విహరించుచు ఆనందించును॥ అనంతరము స్వర్గమునుండి భ్రష్టుడయినను వీర్యవంతుడగు రాజగును॥ సౌమ్యుమును సొనారత్న విభూషితమును వజ్ర వైడూర్య భూషితములగు మణిమయ స్తంభములతో కూడినదియు చిత్తరువులును దాస దాసీజనమును కలదియునగు గృహము కలవాడగును॥ వాని వాకిలి ఇంద్రభవన ద్వారమువలే మత్తగజ ఘీంకారములతోను హయ పౌషితములతోను కల్లోలిత మయియుండును॥ ఆతడు రాజరాజులకును ఈశ్వరుడై సర్వత్రీ జన ప్రీతిపాత్రుడై ఆ ఇంట వసించు క్రీడా విహార భోగ సమన్వితుడయి॥ ఏ వ్యాధులును లేక నిండుగా నూరేండ్లు జీవించును॥ అమర కంటక పర్వ తమున మరణించిన వానికి కలుగు భోగము ఇట్టిది; నాశరహితమగు (విస్తృత మగు) అగ్ని యందు కాని జలమునందుకానివాడు ప్రవేశించినను అతనికి వాయువునకు ఆకాశమునందువలె ఎదురులేని నడక ఉండును॥ ధర్మ రాజా! ఇచటి అమ దేశ మేతమున మరణించిన వారిలో ప్రతియొక ని ఇంటను మూడేసి వేలమంది కన్యలు నిలిచి 'ఏమి యాజ్ఞ' అనుచు పనులు చేయ సం సిద్దలయియుందురు॥ వాడు అక్షయ కాలమువరకు దివ్యభోగ సంపన్నుడయి విహ రించును॥ ఆయా సముద్రముల అవధుల నడుమనున్న వృథివి పై ఎచ్చటను అమరకంటక పర్వతమునందున్న తీర్థ క్షేత్ర ప్రదేశము వంటిది లేదు॥

ఇంతకు లోపలనే ఈ అమరకంటక పర్వతమునకు పశ్చిమముసి త్రిలోక ప్రసిద్ధమగు జలేశ్వరమను హ్రదము (మడుగు) కలదు॥ అచట పిండ ప్రదానము చేసినను సంధ్యోపాసనము చేసినను పితరులు పది ఏండ్లు తృప్తులయియుందురు॥ నర్మదా దక్షిణ తీరమునందు (కలియు) కపిలయను గొప్పనది కలదు॥ ఆది ఆంతటను మద్ది చెట్లతో ఆవరింపబడి చాల దగ్గరలోనే యున్నది॥ మహాభాగయు పుణ్యయునగు ఆ మహా (గొప్ప)నదియు త్రిలోక ప్రసిద్ధము॥ యుధిష్ఠిరా! దాని తీరమున సమగ్రముగా నూరుకోట్ల తీర్థములు కలవనియు వానిలో ప్రతియొకటియు ఇతర ప్రదేశములందలి ఆయాప్రదేశ తీర్థములకు కోటిగుణముగా పుణ్యప్రదములనియు పురాణములందు వినబడుచున్నది॥ ఆ నదీ తీర ముల మొలిచి పెరిగి కాల గతిలో పడిపోయిన (ప్రాణములు వదలిన వృక్షములు కూడ నర్మదానదీ జలన్నర పుణ్యముచే ఉత్తమగతి నందును॥ అచ్చటి మరియొక నది విశల్యకరణి యనునది; దానియందు స్నానము చేసిన తతణము నరుడు॥ విశల్యుడు (బాధలు లేనివాడు) ఆగును॥ మహాభాగయగు ఆ పుణ్యనదియు త్రిలోక ప్రసిద్ధ; ఈ తీర్థములతో కూడిన అమరకంటక పర్వత ప్రాంతమునందు కిన్నర మహోరగ యక్షరాక్షన గంధర్వులును తపోధనులగు ఋషులు మునులును గములు గుములయి ఉందురు॥ వారందరతో కూడినదయిన నర్మదను ఆనుకొని మహాభాగయు సర్వపాప ప్రణాశ నియునగు ఈ విశల్య కరణీనది సృష్టింపబడినది; రాజా! నరుడు దానియందు నమాడి బ్రహ్మచారియు జితేంద్రియుడునై ఒక దినముపవసించినచో వాని నూరు తరములవారు తరింతురు॥

లోకములకు హితము కలిగించు సంకల్పముతో ఈశ్వరుడు పూర్వము ఈ కపిలావిక ల్యానదులు ఇంత పవిత్రములని చెప్పినట్లు వినుచున్నాము॥ అచట స్నానము చేసినచో ఆశ్వమేధ ఫలము లభించును॥ ఆ తీర్థమున అనా శకము (అనశనము-ఉపవాసము) చేసినవాడు నర్వపాపముక్తుడై రుద్రలోకమునందును॥ నర్మదా సంబంధులగు ఆయా తీర్థములందు స్నానమాడిన అశ్వమేధ ఫలప్రాప్తియగునని పురాణమునందు నేను వింటిని॥ నర్మదో తర తీరమున నివ సించువారు రుద్రలోకమునందు వసింతురు॥ సరస్వతీ గంగా నర్మదా నదులయందును స్నా నదానములు మొదలగునవి సమానముగా పుణ్యప్రదములని నాకు శంకరుడు చెప్పెను॥ అమరకంటక పర్వతమున ప్రాణత్యాగ మొనర్చినవాడు నూరుకోట్ల సంవత్సరములు రుద్రలోకమున వసించును॥ నురుగుతో అలలతో సమలంకృతమగు పవిత్ర పుణ్య నర్మదా నది జలమును శిరస్సుతో నమస్కరించువాడు నర్వపాపముక్తుడగును॥ నర్మద నదాపుణ్య; బ్రహ్మ హత్యాదోషాపహారిణి; ఆచట ఒక అహోరాత్రముపసించువాడు బ్రహ్మ హత్యాము క్తినందును॥ పాండునందనా! నర్మద ఇంత రమ్యయును పుణ్య యును; ఈ మహానది త్రిలోక ములందును పుణ్యతమయైనది; మహాపుణ్యములగు వటేశ్వర మునం గ యయం) దును గంగా ద్వార(హరిద్వారమునందును తపోవనమునందును ద్విజులు సంగీత మీగుల పవిత్రములగు) వ్రతములనాచరించి ఎంత పుణ్యమందుదురో-నర్మదా సాగర సంగమమున స్నానాదిక ముస అంతకు పది రెట్ల పుణ్యము లభించును॥

ఇది శ్రీమత్స్యమహాపురాణమున నర్మదా మాహాత్మ్యమున అమర కంటక పర్వతప్రాంత తీర్థ మహిమాను వర్ణనమను నూట ఎనుబది ఐదవ అధ్యాయము