మత్స్య మహా పురాణము

Table of Contents

34 - యయాతికి యౌవనప్రాప్తి-పూరు రాజ్యాభి షేకము

(నాలమేకస్య నస్సర్వమితి వశ్య న్న ముహ్యతి)

శౌనకుడు శకానీకునకు ఇంకను ఇట్లు చెప్పెను: రాజర్షియగుయయాతి తన కుమారుడగు) పూరుని సమాధానము విని లోగడ శుక్రుడు చెప్పియున్నట్లు) మహా వేదవత సంపన్నుడగు కావ్యుని-శుక్రుని స్మరించి మహాత్ముడగు (మహా మనస్కుడగు) పూరునియందు తన ముసలితనమును వ్యాపింపజేసెను. పూరుని వనముతో తాను తన యోగ్యతకు తగి నట్లును తన కామమును ఉత్సాహమును ప్రీతిని సుఖమును అనుసరించియు ధర్మమునకు అవిరుద్దముగా తనకు ప్రియములగు విషయసుఖములను అనుభవించి పీతియుక్తుడయ్యెను. దేవతలను వారికి అర్ధములగు యజ్ఞములతోను పితరులను శ్రాద్ధముల తోను దీనులను అనుగ్రహములతోను ద్విజస త్తములను వారికిష్టములగు కోరికలను తీర్చుటతోను అతిథులను అన్న పానములతోను వైశ్యులను వాణిజ్యము కని పెట్టి చూచుటతోను శూద్రులను కరుణా భావనముతోను దొంగలను దోపిడి గాండ్రను నిగ్రహణము (దండించుట) తోను ప్రజలను అందరను ధర్మముతోను ఎవరికి తగినట్లు వారిని అనురంజింప (తృప్తినంద) జేయుచు సాక్షాత్ రెండవ ఇంద్రుడువలే యయాతి పాలించుచుండెను. ఆ రాజు సింహమువలె విక్రమము చూపుచు యువకుడై విషయ సుఖముల ననుభవించుచునే ధర్మమునకు అవిరుద్ధముగా ఉ త్తమమగు సుఖమును అనుభవించెను. ఆ యయాతి రాజు సుఖముగా ఆ యా కోరికలను అనుభవించి, తృప్తి పొందెను. పొందుటతోపాటే వాటీ విషయమున (ఇవి ఎందులకు? ఎన్నాళ్ళు? అని) ఖేద ముకూడ పోందెను. ఇంతలో వేయిఏండ్లు గడచెను. అతడది కూడ జ్ఞాపకము చేసికొనెను. అతడు కాలమును కొలత త్త్వమును ఎరిగినవాడు కావునను వీర్యవంతుడై నను కాలము ఎప్పుడెప్పుడు ముగియునా ఆనీ ఎదురు చూచుచున్న వాడు కావునను తాననిన వేయిఏండ్ల కాలము ముగి సెనని గుర్తించి పుత్రుడగు పూరునితో ఇట్లు పలికెను: “కామము కామములను అనుభవించుట చే ఎన్నటికిని ఉపశమించదు. హవిస్సుతో అగ్ని వలె ఇంకను పెరుగుచునేయుండును. పుడమి మొ త్తము పై గల వరియు యవలును బంగారును పశువులును స్త్రీలును అన్ని యు కలిసినను ఒక నికి కూడ చాలవు. కావున తృష్ణను విడువవలెను. (అన్ని విధములగు) శత్రువులను అణచినవాడా! నేను నా సుఖమునకు కామమునకు ఉత్సాహము నకు తగినట్లు నేను నీ యౌవనముతో విషయసుఖముల ననుభవించితిని. ఇందు నీ యోగ్యత నాకు ఇంత ప్రీతి కలిగించినది. ఇదిగో! నీ యావనము తీసికొనుము. ఇదిగో! రాజ్యము కూడ తీసికొనుము. ఏలయన నాకు ప్రీతి కలిగించు పుత్రుడవు నీవు.”

ఇట్లు పలుకుచునే యయాతి తన వార్ధకమును తీసికొనెను. పూకునకు తన యౌవనము మరల లభించెను.

 పూరుడు కడసారి కుమారుడే యైనను యయాతి అతనికే తన రాజ్యము నీయదలచెను. ఆది తెలిసి బ్రాహ్మణులు మొదలగు ఆయా వర్ణములవారు ఈ విధముగా పలికిరి: "ప్రభూ! శుకునికి దౌహిత్రుడును దేవయానికి కుమారుడును కొడుకులలో పెద్దవాడును అగు యదుని విడిచి రాజ్యమును పూరున కిచ్చుచున్నావు. ఇది ఎట్లు ? క్రమముచే యదువు మొదటివాడు. తుర్వసుడు రెండవవాడు. శర్మిష్ణ కుమారులలో ద్రుహ్యుడు అనుడు పూరుడు అను వారు క్రమముగా కుమారులు. పెద్ద వానిని విడిచి కడసారి వాడు రాజ్యమునకు ఎట్లు అర్జుడగును? ఇది నీకు తెలియజేయుచు హెచ్చరించు చున్నాము. నీవు ధర్మమును అనుపాలనము చేయుట మంచిది.”

యయాతి: “బ్రాహ్మణులు మొదలగు సర్వవర్ణములవారు అందరును నామాట వినగోరుచున్నాను. పెద్ద వానికి ఏవిధముగను రాజ్యము ఈయగూడని హేతువును చేప్పెదను. యదువు నా పెద్దకొడుకు అయి ఉండియు నానీయోగమును అనుపాలించలేదు. అదియు కాక తండ్రికి ప్రతికూలుడగు పుత్రుడు పుత్రుడు కాడని విజ్ఞుల తలపు. తల్లిదండ్రుల మాట పాటించుచు వారికి హితుడు అనుకూలుడు ఐయుండు కుమారుడే పుత్రుడును పుత్రులలో శ్రేష్ఠుడును ఐ తల్లిదండ్రులకు దగ్గర వాడై యుండును. యదువు తుర్వసుడు ద్రుహ్యుడు అనువు ఈ నలుగురును నన్ను లెక్క సేయలేదు. పూరుడు మాత్రము నామాటను అధికమగు ఆదరముతో పాటించినాడు. సౌజరను తాను మోసికొనిన పూరు డే చిన్న వాడై నను నా ఆ స్త్రీని అనుభవించుటకు అధికారి. పుత్రులలో మేటియై అతడే నాకోరికను తీర్చినాడు. అదీ కాక కవి మునికి కుమారుడు అగు ఉశనసుడు శుక్రుడు) స్వయముగా “నిన్ను అనువర్తించు కుమారుడే నీతరువాత రాజు కాదగినవాడు.” అని వరమును ఇచ్చియున్నాడు. కావున పూరుని రాజ్యమునం దభి షేకము చేయుటకు మీకభ్యంతరము లేదను విషయము స్పష్టముగా చెప్పగోరుచున్నాను.” ప్రకృతులు (పౌరులు జానపదులు అగు ప్రజాజనము): “గుణ సంపన్నుడు మాతాపితరులకు ఎల్లప్పుడు మేలు సేయు వాడు అగుకొడు కే ప్రతియొక విధమునను శుభమును పొంద అర్హుడు. కడగొట్టువాడే నను. అత డే ప్రభువు. నీకు ప్రియము నాచరించి నీ ప్రీతికి పాత్రుడై నందున పూరుడే ఈరాజ్యమునకు అర్హుడు. ఈ విషయమున శుక్రుని వరదానము కూడ ఇట్లే యుండుట చేత మరేమియు పైమాట మేము చెప్పు నవకాశము లేదు.”

పౌరులును జానపదులును నగు ప్రజాజనము సంతుష్టులే ఇట్లు పలుకగానే యయాతి పూరుని తన రాజపదమునం దభి షేకించెను. అతనికి తన రాజ్యమును అప్పగించెను. వనవాసమునకై దీక్ష తీసికొనెను. బ్రాహ్మణులును తాపసులును వెంటరాగా పురమును వెలువడి వనమున కేగెను.

యదుని సంతతివారు యాదవులును తుర్వసుని సంతతివారు యవనులును ద్రుహ్యుని సంతతివారు భోజ జాతీ యులును అను సంతతివారు మ్లేచ్చ జాతులవారుసునైరి. పూరుని సంతతివారు పౌరవులని ప్రసిద్ధి నొందిరి. ఈ వంశము నందే నీవు (శతానీకుడు) జనించి వేయి ఏండ్లపాటు రాజ్యము నేలువాడ వయినావు.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున చంద్రవంశాను కీర్తనమున యయాతి చరితమున పూరురాజ్యాభి షేకమను ముప్పది నాలుగవ అధ్యాయము.