మత్స్య మహా పురాణము

Table of Contents

254 - స్తంభమాన వినిర్ణయము.

సూతుడు ఋషులతో ఇట్లు చెప్పెను: ఇక మీదట స్తంభమాన వినిర్ణయమును తెలి పెదను. భవనపు ఎత్తును ఏడుతో గుణించి ఎనుబదితో భాగించగా అగునన్ని మూరలు స్తంభపు మందముగా ఉండవలెను: (స్తంభపు బోదె ఇంకను  ఎక్కువ మందముతో ఉండవలెను; ఆది ఎట్లన: భవనపు ఎత్తును తొమ్మిదితో గుణించి ఎనుబదితో భాగించగానే నన్ని మూరలు సంభపుబోదే మందము. స్తంభపు ఆకృతి చతురస్రమయినచో ‘రుచకము' ఆషాసమయినచో 'వజ్రము' షోడ శాస్రమయినచో ద్వివజ్రము' ద్వాత్రింశానమయినచో ప్రలీనకము' మధ్యప్రదేశమున వృత్తాకృతితోనున్న చో ‘వృత్తము” అనబడును; (చూ. పుట. 923) సర్వవాస్తులందును ఈ ఐదువిధములమహా స్తంభములును ప్రశస్తములు; స్తంభపు ఎత్తులో పది యవవంతు (ప్రదేశము)ను పద్మములు వల్లులు లతలు కుంభములు పత్రములు అద్దములు.వీని శిల్పముతో అలంకరించవలెను; స్తంభమెంత మందముండునో ఆంతే మందమున దూలము (తుల) ఉండవలయును: (ఉవతులలు) చిరుదూలములు (వీనిని ఎల్లవలు అందురు.) ఈ పెద్ద దూలపు మందములో మూడవ వంతుగాని నాలుగవ వంతుకాని క్రమముగ తగ్గుచు పోవలెను; నివాస గృహములను దక్షిణ దిక్కునుండి ప్రవేశించుట ప్రశస్తము; అందులకై ఉండవలసిన ద్వార స్థాన ములు ఏవో తేలి పేదను: తూర్పు దిక్కున ఇంద్ర జయంతస్థానములు దక్షిణమున యామ్య-వితథ స్థానములు పడమట పుష్పదంత వారుణ స్థానములు ఉత్తరమున భల్లాట సోమ స్థానములు మంచివి; నర్వవిధములగు వాస్తులయందును ద్వార వేధ (వాకిటి కెదురుగ ఏదయిన తనది కానిది ఉండుట) లేకుండ చూచుకొనవలయును; రథ్యా (నాలుగు వీథులు కలియు చోటి) వేధ సర్వ వంశ నాశమును వృక్ష వేధ శత్రు విస్తార మును పంక (బురద)వేధ శోక మును కూపవేధ ఆపస్మార రోగమును ప్రస్రవణ ( సెలయేటి నీటిబుగ్గల) వేధ వ్యథను కీల (రెండు వస్తువుల ఆదుకున కై కాని హద్దుల నిర్ణయమునకై కాని నాటిన రాలు దారువులవంటివీథి దీప స్తంభములవంటి వాని) వేధ అగ్నిభయమును దేవతావేధ వినాశ మును స్తంభమున్న చో శ్రీకృతదుఃఖమును గృహవేధగృహస్వామి నాశమును ఆమేధ్యము (పెంట)లతో అవన్కరము (కసవు) లతో వేధ ఇల్లాలికి వ్యభిచారిణీత్వమును, అంత్యజ గృహవేధ అస్త్ర భయమును కలిగించును; ఇంటి ఎత్తు ఎంత యుండునో ఇంటినుండి అంతకు రెట్టింపు దూరములో వేధలు ఉన్న ను వానివలన దోషము కలుగనేరదు.

 (ద్వార నిర్మాణమునందలి దోషమువలన) తలుపు తనంతట తానే తెరచుకొనుచున్నచో ఆ గృహవాసులకు ఉన్మాద మను మూసికొనుచున్న చో కుల నాశమును కలుగును; ద్వారము శాస్తోక్త పరిమాణముకంటే ఆధిక పరిమాణములో నున్న చో రాజభయము-తక్కువ పరిమాణముతోనున్న చో చోరభయము; వాకిటి పై వాకిలియున్న చో - దానికి మృత్యు ముఖమని పేదు; తలవాకిటితం టె లోపలి వాకిండ్లు పెద్దవిగనున్న చో ఆట్టి తలవాకిటికి నంకటమనియు ఈ పెద్దదిగానున్న లోపలి వాకిటికి వజ్రమనియు వ్యవహారములు; ఇట్టిదోషము చే గృహస్వామి సద్యోమృతినందును; ఇట్లు తలవాకిలి ఇతర ద్వారములచే - పీడితమగుట బహుదోషకరము; కావున ఎన్నడును మూల (ప్రధాన) ద్వార ముకంటే ఇతర ద్వారములు ఏవియు పెద్ద విగనుండ రాదు; మూలద్వారమును అనుదినమును పూర్ణకుంభముతో శ్రీపర్తిలతతో ఇతరలతా విశేషము లతో శోభింపజేయు చుండవలయును; బలులతోను అక్షతోదకములతోను పూజించుచు నుండవలయును; ఇంటికి తూర్పున మరి దక్షిణమున ఉదుంబర ము (మేడి) పడమట రావి ఉత్తరమున జువ్విచెట్టు ఉండుట శుభము; ఇవికాక మరేవయినను ముండ్ల చెట్లు చాలుక లచెట్లు ఆనవవృక్షము మరేవయిన నిషిద్ధఫలవృక్షము - ఇంటి ఆవరణమునకు లో పలను చో భార్యా హానియు సంతాన హానియునగును; కాని అవి వానియంతట అవియున్న చో వానిని నరుక రాదు; వానినడుమ మంచి వృక్ష ములను తెచ్చి నాటవలయును; పున్నాగము ఆశోక ము వకుళము (పొగడ) జమ్మి తిలకవృక్షము సం పేగ దానిమ్మ పిప్పలి ద్రాక్ష మరేవయిన పూలపొడలు నిమ్మ పోక పనస మొగలి జాజి తామర నూరు రేకుల తామర మల్లే కొబ్బరి ఆరటి పాటలా . ఇట్టి వృక్షములు లతలు ఇంటి ఆవరణములో నుండుట గృహశోభాకరము.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున వాస్తుశాస్త్రమున స్తంభమాన నిర్ణయాది కథనమను రెండు వందల ఏబది నాలుగవ అధ్యాయము.