మత్స్య మహా పురాణము
50 - పూరు వంశమున అజామీడ-దివోదాస-చైద్య-శంతను వంశములును భవిష్యద్రాజ వంశములును
దివోదాససన్తతిః.
సూతుడు ఋషులకు ఇట్లు చెప్పసాగెను: ఆజామీఢునకు నీలినియందు నీలుడు, అతనికి మహా తపఃఫలముగా సుశా నీ అతనికి పుర జిత్ అతనికి పృథుడు అతనికి భద్రాశ్వుడు అతనికి ముద్దలుడు జయుడు వారాహుడు పృథుడు కపి లుడు కలిగిరి. వీరు ఐదుగురు ఐదు భాగములుగా నున్న పంచాల జనపదములకు పాలకు లయిరి. వీరిలో ముద్దలునకు మౌద్గల్యులు అను పేర ప్రసిద్ధులయిన క్ష ధర్ములగు బ్రాహ్మణులు కుమారులై వంశవృద్ధి చేసిరి. వీరు సంవృతాంగి రసుని వంశమునందలి కాణ్వాయనుల కోవలోనివారై కణ్వ ముద్దలు లనబడిరి. ముద్దలునకు బ్రహ్మతత్వవేత్తలలో ఉత్తముడును మహాయశుడును నగు ఇంద్రసేనుడు అతనికి వంధ్యాశ్వుడు అతనికి మేనకయందు దివోదాసుడను రాజర్షియు యశస్వినియగు అహల్యయునను కవలు కలిగిరి. ఆహల్యకు శరద్వంతునివలన ఋషి! శ్రేష్టుడగు శతానందుడు అతనికి సుమహాతపుడు అతనికి ధనుర్వేదపారగుడగు సత్యధృతి కలిగిరి. ధార్మికుడు అమోఘ రేతస్కుడునగు అతడు జలమునందుండి ఒక అచ్చరను చూడగా అతని రేతస్సు స్కన్న మయి ఆ సరస్సునందు పడెను. దానియందే ఆ రేతస్సువలన ఒక స్త్రీ శిశువును ఒక పురుష శిశువును జనించిరి. వేటకు వచ్చిన శంతనుడు ఆ పరిసరములందు తిరుగుచు అచట నడయాడుచున్న ఆ శిశువుల జంటను కృపతో తీసికొని కాపాడెను. (వీరే కృపుడు. కృపి.ద్రోణుని భార్య.అను వారు.) దివోదాసునకు మిత్రాయతి - మైత్రాయణుడు అనువారు వారిలో మిత్రాయతికి మైత్రేయుడు అతనికి చైత్యవరుడు ఆతనికి సుదాసుడు కలిగిరి.
సుదాసునకు సంతతిలేక వంశము క్షీణించు సమయమున అజమీడునకు సోమకుడను కుమారుడు కలిగెను. అతనికి జంతుడు అను కుమారుడు కలిగి సంతతి లేక యే హతుడయ్యెను. ఇట్టి స్థితిలో మరల సోమకునకు నూటొక్క మంది కుమారులు కలిగిరి. అది ఎట్లు జరిగెననగా _ఆజమీఢుడు (అజమీఢుని కుమారుడు) ఆగు ఈ సోమకుని భార్య పేరు కూడ ధూమిని. ఈమె తనకు సంతానము లేక పోయినందున మరల సంతానము పై వాంఛ కలిగినదయి నూరు సంవత్సరములపాటు దుశ్చరమగు తపస్సాచరించేను. విధానము ననుసరించి అగ్ని ని వేల్చెను. పవిత్రమగు హవిష్యా ద్యాహారమునే తినెను. ఉత్తమములగు వ్రతముల నియమముల పాటించుచు అగ్ని హోత్రమునకు అమర్చిన వేదిక చుట్టునున్న) దర్భలయందే నిద్రించేను. ఇట్లామె విధూతపాప (పాపములను దూరము చేసికొన్న ది) కాగా అట్టి ఆమెతో సంగమించిన ఈ ఆజమీఢుడగు సోమకునకు ఆమెయందు మొదట ధూమవర్ణుడగు కుమారుడు కలిగెను. ఆ పొగ రంగుతో తన తేజము ఆ(సం)వదింపబడినందున ఆ క్ష త ఋషి సంవరణుడనబడెను. ఆ తరువాత ఈ సంవరణునకు సోదరులుగా సోమకునకు మరి నూరుమంది కుమారులు కలిగిరి. సంవరణుని కుమారుడు కురువు. ఈ కురువు తమ పూర్వ రాజధానియగు ప్రతిష్టానము (ప్రయాగ) దాటి కురు క్షేత్రము వరకు రాజ్యము విస్తరింపజే నెను. ఎట్లన-అతడు అనేక సంవత్సరములపాటు తాను సేద్యము చేసి ఆ ప్రదేశమును పంట పొలమునుగా చేసెను. అందుచే దానికి కురు క్షేత్రము (కురురాజు చేసిన పంట చేను) అను పేరు వచ్చెను. పంటకు అనుకూలముకాని భూమిని తన కృషిచే పంట పొలముగా మార్చుటకతడు చేసిన యత్నమునకు మెచ్చి ఇంద్రుడు ఆ ప్రదేశము పుణ్యమును రమణీయమునగునట్లు వరమునిచ్చెను. అతనిబట్టి ఆ వంశము చాల గొప్పది. కావుననే ఆ వంశమువారికి కౌరవులను పేరు వచ్చెను. అతనికి సుధన్వన్ జఘ్ను (హ్ను వు పరీక్షిత్ ప్రజనుడు అనువారు కలిగిరి. సుధన్వునకు మతిమంతులలో శ్రేష్ఠుడు చ్యవనుడు అతనికి ధర్మార్థ తత్వవేత్తయు త్యాగశీలుడును మహాతపస్వియు యజ్ఞకర్తయు అగు 'క్రిమి' అతనికి ఇంద్ర సముడు మహావీర్యుడు సమర్థుడు అంతరిక్షమునందు పయనించువాడు అగుటచే ఉపరిచరుడు అనబడు వసువనునతడు కుమారు డయ్యెను. ఇతడు చేది దేశ రాజు కనుక చైద్యుడు. అతనికి గిరిక యందు మహారథుడై మగధరాజుగా ప్రసిద్ధుడైన బృహ ద్రథుడు పుత్రశ్రవసుడు కుశుడు హరివాహనుడు యజువు మత్యుడు - కాలుడు ఆను ఏడుగురు కుమారులు కలిగిరి. వారిలో బృహద్రథునకు కుశాగ్రుడు అతనికి వృషభుడు అతనికి పుష్పవాన్ అతనికి పుప్పుడు అతనికి సత్యధృతి అతనికి సుధన్వుడు. అతనికి సర్వుడు అతనికి భువనుడు అతనికి బృహద్రథుడు అతనికి అతని భార్యలయందు జనించిన రెండు శకలములను 'జర' ఆనునా మే సంధించుటచే కలిగిన జరాసంధుడు కలిగిరి. ఇతడు మహాబలుడై సర్వక్ష త్రి యవిజేత యయ్యెను. అతనికి సహదేవుడు అతనికి సోమవిత్ అతనికి శ్రుతశవుడు కుమారులయిరి. ఇది మాగధుల వంశము.
శంతనువంశః.
(*సార్వభౌమా జ్జయత్సేన పచితిస్తస్య)
ఉప రిచరవసు కుమారులలో ఐదవవాడగు యజువునకు సురధుడు. అతనికి విదూరథుడు. ఆతనికి సార్వ భౌముడు అతనికి జయత్సేనుడు అతనికి రజతుడు అతనికి మహాభౌముడు అతనికి అయుతాయువు అతనికి అ కోధనుడు అతనికి దేవాతిథి అతనికి దక్షుడు అతనికి భీమసేనుడు అతనికి దిలీపుడు అతనికి ప్రదీపుడు అతనికి దేవాపిశంతను బాహ్లికులను ముగ్గురు కుమారులు కలిగిరి. వీరిలో బాహ్లికునకు ఏడుగురు కుమారులు (బాహ్లిక దేశపు రాజులు) బాహ్లి కేశ్వరు లనబడిరి. దేవాపిని ప్రజలు అస హించుకొనుట చే అతడు ముని యయ్యెను.
అనగా ఋషులు సూతు నిట్లడిగిరి: “రాజపుత్తడగు ఆ దేవాపియందు ఏ దోషమున్నందున ప్రజలు అతనిని అసహించుకొనిరి?” అనగా సూతు డిట్లనెను. అతనికి బొల్లి (తెల్ల కుష్టు) వ్యాధి ఉండెను. అందుచే ప్రజలు అతనిని ఆదరముతో చూడక అసహించుకొనిరి. దీనికిని క్షత్రియుల విషయమున దేవతలు సంకల్పించిన ఒకానొక. కార్యమే హేతువయ్యెను. అందుచే మహాభిషక్ అనియు శంతనుడనియు బిరుదనామములు గల రెండవ రాజపుత్రుడు రాజయ్యేను. ఏలయన అతడు మహావిద్వాంసుడు. అతని విషయమున ఈ పురాతన శ్లోకము చెప్పుదురు. “శిథిల (వృద్ధుని కాని) రోగిని కానీ అతడు ఎవరిని తన చేతితో తాకునో అతడు మరల యువకుడు అగును. అందుచే అతనిని శంతనుడు.శ.సుఖమును తనోతి వృద్ధి చేయువాడు.అందురు. అతడు జాహ్న విని వివాహమాడగా ఆమేయం దతనికి దేవవ్రతుడను కుమారుడు కలిగెను. అతనికే పుత్రియగు 'కాలియందు శంతనునకు ప్రీతిపాత్రుడు. శాంతాత్ముడు అకల్మషుడు నగు విచిత్రవీర్యుని క్షేత్రమున (భార్యలగు అంబిక-అం బాలికలయందు) ధృతరాష్ట్రుడు పాండుడు అను కుమారులను (శూద్రియందు) విదురుని కృష్ణద్వైపాయనుడు ఉత్పాదించెను.
ధృతరాష్ట్రునకు గాంధారియందు దుర్యోధనాదులు నూరుగురును పాండునకు పృథ(కుంతి)యందు ధర్మ వాయు దేవేంద్రులవలన యుధిష్ఠిర భీమార్జునులు మాద్రియందు అశ్విదేవుల వలన నకులసహదేవులు కుమారులయిరి. ఈ ఐదు గురికి ద్రౌపదియందు వరుసగా ప్రతివింద్య శ్రుత సేన శతకీర్తి శ్రుతవర్మ శతానీకులు కలిగిరి. వీరుకాక ధర్మజునకు దేవకి అను నా మెయందు యాధేయుడు భీమునకు హిడింబయందు ఘటోత్కచుడు కాశీరాజ పుత్రియగు జలధరయందు సర్వగుడు అర్జునునకు సుభద్రయం దభిమన్యుడు నకులునకు చేదిరాజ పుత్తియగు క రేణుమతియందు నిర మిత్రుడు సహ దేవునకు మాది అను నామె యందు సుహోత్రుడు కుమారులయిరి. అభిమన్యునకు శత్రుధనవిజేతయగు పరీక్షిత్ అతనికి పరమ ధార్మికుడగు జనమేజయుడు కలిగిరి.
జనమేజయుడు ఒక యజ్ఞములో *వాజసనేయియగు బ్రాహ్మణుని బ్రహ్మగా వరించెను. అది చూచి సహించక వైశంపాయన మహర్షి జనమేజయుని నిట్లు శపించెను: “దుర్బుద్దీ! నీ మాట ఈ లోకమునందు (నీ దేశమునందే) చెల్లక పోవుగాక! నీవు ఈ లోకమున జీవించియుండగనే దేశము విడిచి ప్రవాసమునకు పోదువుగాక!” అని మరియు జనమే జయునకు యజ్ఞాధికారము లేదని అతనిని యజ్ఞములు చేయవలదని వైంశపాయనుడు వారించెను. ఈతనికి యాజులు (యజ్ఞములు చేయించినవారు) నశింతురనియు అతడు శపించెను. అయినను రాజిది లెక్క పెట్టలేదు. ఇందు క్షత్రియుడే గెలిచేనని కొందరు బ్రాహ్మణులు అతని నాశ్రయించి యుండిరి. కొందరు వైశంపాయన శాపమున నశించిరి. జనమే జయుడును పౌర్ణమౌ సేష్టితో ప్రజాపతిని (యజేశ్వరుని ఆరాధించేను. తరువాత నాతడు వాజసనేయక విధానముతోనే రెండుమారులు అశ్వమేధయాగము చేసెను. మహావాజసనేయు డనుకీర్తి పొందెను. కానీ వేంశపాయనుతోడి వాదమున అతనిచే అభిశప్తుడై బ్రహ్మగా తన యజ్ఞములందుండిన వాజసనేయ బ్రాహ్మణునితో కలిసి అడవులకు పోయేను. జనమే జయుని కుమారుడు శతానీకుడు. అతడు మహావీర్యవంతుడు. జనమేజయుడు అతనిని రాజ్యమునందభి షేకించెను. శతా నీకుడు చేసిన అశ్వమేధయాగ ఫలముగా అతనికి అధిసీమ కృష్ణుడను కుమారుడు కలిగెను. ఇప్పుడు అతడు పొలన సేయుచున్నాడు. అతని పాలన కాలములోనే మీరీ దుష్కరమగు దీర్ఘసత్రయాగము చేయుచున్నారు. ఇప్పటికిది మూడు సంవత్సరములు పుష్కర క్షేత్రమున జరిగినది. రెండేండ్లపాటు కురు క్షేత్రమున దృషద్వతీనదీ తీరమున జరిగినది. (ప్రస్తుతము నైమిశారణ్యమున జరుగుచున్నది.)
(*శుక్లయజుశ్శాఖీయులను వాజననేయులు అందురు)
భవిష్యద్రాజకథనమ్
(*భవిష్యంశ్రోతుమిచ్చామః ప్రజానాం)
(*నృచకో నగరం త్యక్త్యా)
ఇది విని ఋషులు సూతునిట్లడిగిరి: “రోమహరణా! నీవు ఇంతవరకును గడచిన వృత్తాంతములు చెప్పితివి. ఇక మీదట భవిష్యద్వృత్తాంతములను నీనుండి వినగోరుచున్నాము. ఇక మీదట క్షత ధర్మము ఎవరియందు నిలుచును? కాబోవు రాజులేవ్వరు? వారి ఆయుఃప్రమాణము వారి పేరులు కాలము - యుగ ప్రమాణము యుగ దోషములు యుగ క్షయము యుగములందలి సుఖదుఃఖ ధర్మాధర్మములు విచేష్టితములు ఇవి అన్ని యు మాకు చెప్పవేడుచున్నాము.”
సూతుడు ఋషులకు ఇట్లు చెప్పనారంభించెను: అద్బుతములను చేయగల మహానుభావుడు వ్యాసుడు. నాకు చెప్పియున్న విధమున ఇక రాబోవుచున్న కలియుగమును మన్వంతరములను రానున్న విషయములను తెలిపేదను. ఇక్ష్వాకు పూరు వంశములందు రాబోవు రాజులను వీరుకాక ఆంధ్ర పౌండ్ర కళింగ *చూళిక యవన కైవర్తాభీర శబరులు ఇతర మ్లేచ్చ జాతుల రోజులు ఈ మొదలగు శూద్ర జాతీయులు భారతదేశ మునకు బయటినుండి వచ్చి ఈ దేశమును ఏలనున్న రాజులను క్రమమున పేర్కొందును. వినుడు.
ఇపుడు (ఈ పురాణ కథా కాలమున) పాలించుచున్న అధిసీమ కృష్ణునకు విచక్షుడు కుమారుడయి పొలన చేయును. అతని కాలమున హస్తినాపురము గంగలో కొట్టుకొనిపోగా అతడు కౌసుం (శాం) బిని రాజధానిగా చేసి కొనును. అతనికి భూరి శ్రేష్టుడు అతనికి చిత్రరథుడు. అతని ఎనిమిదిమంది కుమారులలో శుచిద్రథునకు వృష్టిమాన్ అతనికి సుషేణుడు అతనికి సునీథుడు అతనికి నృచముడు అతనికి సుఖీ లవుడు అతనికి పరిష్ణవుడు అతనికి సుతపుడు అతనికి , మేధావి అతనికి పురంజయుడు అతనికి కురుభావ్యుడు అతనికి నిర్మముడు అతనికి బృహద్రథుడు అతనికి వసుధాముడు అతనికి శతానీకుడు ఆతనికి భవిష్యోదయనుడు అతనికి మహీనరుడు అతనికి దండపాణి అతనికి నిరామిత్రుడు అతనికి క్షేమకుడు కుమారులగుదురు.
ఈ క్షేమకుని విషయమున పురాతనులు పలికిన గీతము ఇట్లున్న ది: “దేవతలును ఋషులును సత్కరించు చుండిన బ్రహ్మక్షత్ర జాతుల బ్రాహ్మణులక్షత్రియుల.(బ్రాహ్మణ ధర్మమును అనుసరించి ప్రవర్తించి దానినుద్ధరించు , క్షత్రియులక్షత్ర ధర్మమును పాటించు బ్రాహ్మణుల) ఏయోని (జన్మము) ఏవంశము ( ఈ భారతదేశ మున) కలదో అదియంతయు ఈ కలియుగమున క్షేమక రాజును ఆశ్రయించి వర్దిల్లును.”
ఋషులారా! మీకు ఇట్లు ఈ పౌరవవంశ చరితమును ఉన్నది ఉన్నట్లు వివరించితిని. దీనిలో ప్రధానుడు గాను ఈ చెప్పిన వంశమునకు ఒక మూల పురుషుడుగాను నున్న మహాత్ముడు అర్జునుడు.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున చంద్రవంశానువర్ణనమున పౌరవవంశానుకీ ర్తన మను ఏబదియవ అధ్యాయము-చంద్రవంశ కథనము ముగిసినది.
(*చూశికులు- పఠానులలో ఒక తెగవారు; యవనులు-గ్రీసు టర్కీ మొదలగు దేశములగు; కైవర్తులు-పల్లెకారులు;అభీరాః-అహీర్ అనబడు జాతివారు; శబరాః- చెంచుబోయ మొదలగు జాతులవారు)
