మత్స్య మహా పురాణము
107 - ప్రయాగ మాహాత్మ్యము
యుధిష్ఠిరుడు మార్కండేయునితో నిట్లనెను: కీ ర్తించినంతన పుణ్యకరమును తీర్ధ క్షేత్ర విషయక మునగు బ్రహ్మ పోక పురాణమును విని ఉంటిని. దానియందు నూరుల వేల లక్షల కొలదిగ తీర్థములు పేర్కొనబడినవి. అవన్నియు పుణ్యములును పవిత్రములును పరమగతి నిచ్చునవియును; అందునను పృథివి పై నై మిశమును అంతరిక్షమున పుష్కర మును లోకత్రయమునను కురు క్షేతమును విశిష్టములు. అవన్ని యు వీడిచి ఈ ప్రయాగమును ఇంతగ ప్రశంసింతు వేమి? ఇది నాకు విశ్వసనీయముగా తోచుట లేదు. అల్పయత్నముచే బహు భోగప్రాప్తియు పరమగతియు నెట్లు లభిం చును? ఇది నాకు సంశయకరముగ ఉన్నది. కావున మీరు వినినంత క నినంత తెలిపినా సంశయము దీర్ప వేడెదను. ఆన మార్కండేయు డిట్లు చెప్పెను. పాపోపహతచిత్తుడై పెద్దలను శాస్త్రములను విశ్వసించని వానికి ప్రత్యక్షముగ కనబడు విషయము కూడ నమ్మరానిదీగా తోచును. అతనికి ఏదియు చెప్పరాదు. అశ్రద్దధానుడు (ఆ సీక్యముతో విశ్వాసము పెట్టుకోననివాడు) అశుచియు దుర్మతియు అశుభ రూపవచన చిత్తకార్యములు కలవాడును వీరందరును పాతకులు; కావు ననే వీరి కేదియు చెప్పరాదంటిని. ప్రయాగ మాహాత్మ్యము పెద్దలనుండి వినబడునదియు ప్రత్యక్షముగ కనబడునదియు చెప్పెదను; వినుము. శాస్త్రమును ప్రమాణముగా చేసికొని చిత్తమును యోగమున నిలిపినవానికి పరోక్ష విషయము కూడ యథాతథముగ ప్రత్యక్షమగును. శాస్త్రములందు వినబడునదియు లోకమున కనబడునదియు మాత్రమే కాదు; అంతయు నతనికి గోచరమగును. యోగికి అదృష్టము కనబడనిది) ఏదియు లేదు. ఇతరుడు ఆయా విషయముల నేరుగుటకు ఎంతయో శ్రమ పడును. కాని యోగమును పొందజాలడు. (కావున వాడు అతీంద్రియ విషయము ల నేరుగజాల కుండును. ఏలయన జన్మాంతర సహస్రముల పుణ్యమున కాని మానవుడు యోగమును పొందజాలడు. వేలకొలది పుణ్యముల యోగము( కూడిక)చే మానవుడు యోగమును పొందగలుగును. సర్వ రత్నములను తనకున్న ఉత్తమ పదా ర్థములన్నియు) బ్రాహ్మణులకు దానము చేసినవానికి ఆ పుణ్యమున యోగము లభించును. కాని ప్రయాగలో మరణించిన వానికంతమాత్రనే యోగ సిద్ధి కలుగును. విశ్వసించువానికి ప్రయాగ శ్రేష్ఠత్వమును నిరూపించు యుక్తి చేప్పెదను వినుము. సర్వ భూతములయందును బ్రహ్మతత్త్వము చేతన్యరూపమున కనబడు చునే యున్నది. ఐనను బ్రహ్మము లేనే లేదు. అది కనబడుటలేదు. 'అని నా స్త్రీకుడు తలచుచున్నాడు. ఐనను సర్వలోకములందును బ్రహ్మమును విశ్వసించు చునే యున్నారు. పూజించుచునే యున్నారు. అట్లే వివేకులందరును సర్వ తీర్థములందును మిన్న యని ప్రయాగను పూజింతురు. కావుననే యది తీర్థరాజము; బ్రహ్మయు నిత్యమును ప్రయాగను స్మరించుచుండును. ఈ తీర్థరాజమును పొందగలిగినవాడు మరేదియు పొంద నక్కరలేదు. దేవత్వమును పొందినవాడు మానవత్వమును కోరడు గదా! ఈ యుక్తితోనే నీవు ప్రయాగ శ్రేష్ఠత్వము నాలోచింపుము. ఇ టైంతకంటే పుణ్యతర తీర్థ క్షేత్రము మ రేదియు లేదని నీకు తెలిపితిని.
మీరు చెప్పినది విని నాకు మరి మరి ఆశ్చర్యము కలుగుచున్నది. స్వర్గవాసము ఎట్టి యోగముచే ఎట్టి కర్మా చరణముచే లభించును? ఏ కర్మముల ఫలము ఎట్టిది? ఏ భోగములను ఏ కర్మములచే స్వర్గమం దనుభవించి మరల భూ లోకమునకు ఎట్లు ఎట్టి చోటికి చేరును? ఆ కర్మముల స్వరూపమును తెలుప వేడుచున్నాను. అన మార్కండేయు డిట్లు చేప్పెను: రాజా! కర్మ ఫలక్రమమును చెప్పేదను వినుము. భూమిని గోవును అగ్ని ని విప్రుని శాస్త్రమును బంగారమును నీటిని స్త్రీలను తల్లిదండ్రులను నిందించు నరాధముల కూర్ధ్వలోక గతులు లేవని ప్రజాపతి వచనము. ఇట్లే యోగసిద్ది ప్రదమగు స్థానము కూడ దుర్లభము. ఇట్టి పాపకర్ములగు నరులు ఘోర నరకమున పడుదురు. ఏనుగును గుర్రమును గోవును ఎద్దును మణిముక్తి కాంచనములను దాన మీయక పోగా పరోక్షముగా హరించువారు దాతలు పోవు లోకముల కేగి. భోగముల భుజించరు. అట్టి యధములు అనేక పాపకర్మముల ఫలముగా నరకమున ఉడికించబడుదురు.
మహాప్రాజ్ఞా! యుధిష్ఠిరా! యథా శాస్తోకాచార లక్షణమును తెలి పెద వినుము; వివిధములగు రత్నములు గోవులు ముత్తెములు బంగారము పరోపకారమునకై దానము చేయువాడు , స్వర్గ సుఖమును పరమపదమును కూడ పొందును. కావున సర్వ యత్న ములతో తన న్యాయార్జిత ధనమును దానము చేయుటచే నకల శుభములను స్వర్గమును మోక్షమును లభించును. విత్తము నన్యాయముగ నార్జించుటచే దారుణ నరకము నందును. ఇతరుల ధనమును హరించి దానము చేసినచో ఆ పుణ్యము ధనవు సొంతదారునకు చెందును. ఈ దాతకు దొంగతనము చేసిన పాపము చెందును. నీ వడిగినది సం క్షేపమున చెప్పితిని. "మరేదైన నడుగు -మదియంతయు చెప్పెదను. "అన యుధిష్ఠిరుడు మార్కండేయు నిట్లడిగేను: తీర్థయాత్ర కేగినవి డచట నేయే కర్మల నాచరించినచో యాతాఫలము లభించునో తెలుపుము. అన మార్కండేయు డిట్లనెను: రాజా! తీర్థయాత్రా విధాన క్రమములు తెలి పెద; వినుము. ప్రతిగ్రహమున కాసింపక ఏది లభించిన దానితో తృప్తి సందుచు అహంకార రహితుడై అకోపనుడై సత్యవాదియై చిత్తశుద్ధితో కర్మల నాచరించువాడై నర్వభూతములయందు తనయందువలే భావము కలిగియుండు నాతనికి తీర్థయాతాఫలము లభించును. ఇట్లే యోగము ధర్మము దాతృత్వము సత్యము అసత్యము ఆస్తిక త్వము నా స్త్రీకత్వము మొదలగు పదముల నిర్వచనమును (అర్థవిశదీకర ణమును) కూడ నీకు తెలి పెదను.
ఇది శ్రీమత్స్య మహాపురాణమున ప్రయాగ మాహాత్మ్యమను నూట ఏడవ అధ్యాయము.
