మత్స్య మహా పురాణము

Table of Contents

 122 - గోమేద - పుష్కర-ద్వీప వర్ణనము - శాకాది ద్వీప సామాన్య లక్షణము - బ్రహ్మాండమున మహాభూతముల వ్యవస్థ -  అందు - గోమేద ద్వీప వర్ణనము

ఇది దధిసముద్రమునకు ద్విగుణపరిమాణముగల స్వాదూదక (తీయనీటి) సముద్రముచే చుట్టబడినది. ఈ ద్వీపపు విస్తరము శాల్మల ద్వీప విస్తరమునకు ద్విగుణము. దీనియందు జాత్యంజనమయమగు (స్వాభావికమగు కాటుక తో ఏర్పడిన) 1. సోమకము - సర్వౌషధి సమన్వితము మహోన్న తము సువర్ణమయమునగు  కుముదము అను రెండు పర్వతము లున్న వి. హవ్యుడను మను పుత్రునకు ధాతకి 2. కుముదుడు అను కుమారులు ఇద్దరు కలరు. సోమక పర్వతముగల ప్రథమ ఖండము ధాత కి చే పాలితమై ధాతకీ ఖండము. కుముదపర్వతము గలదియు గోమేద వర్షమని ద్వీపనామముతోనే ప్రసిద్దమును సర్వసుఖమయమునగు రెండవ ఖండము కుముదునిచే పాలిత మయి కుముదఖండము-ఆని ప్రసిద్ధములు.

ఈ సోమక కుముద పర్వతములు రెండును వృత్తాకృతులును మహోన్నతములును; సోమకము ద్వీప పూర్వార్ధ మందున్న ది. దీని పాదములు(ప్రత్యంత పర్వతములు) తూర్పునకు సముద్రము వరకు సాగియున్నవి. కుముదము ఇట్లే ద్వీప పశ్చిమ : గమున నున్నది. దీని ప్రత్యంత పర్వతములు పడమటగా సముద్రము వరకు సాగి ఉన్నవి. ఈ పర్వత పాదములు ద్వీపమును రెండుగా ఏభజించుచున్నవి. దక్షిణార్ధము ధాత కీఖండము; ఉత్తరార్ధము కుముద ఖండము. గోమేద ద్వీపము నందు దేశములనినను వర్షములనినను ఈ రెండే. (ఈ ద్వీపము ఆస్ట్రేలియా అని భావింపవచ్చును.)

పుష్కరద్వీపవర్ణనమ్ - పుష్కర ద్వీప వర్ణనము

(*19 ఈ శ్లోకము ప్రకరణముతో అన్వయింపదు.)

గోమేద ద్వీపమునకు ఆవల పుష్కర ద్వీపమున్నది. ఇది ఇక్షురస సముద్రముచే చుట్టబడినది. దీని విస్తరము గోమేదద్వీప వి సరమునకు ద్విగుణము. పుష్కర ద్వీపమున ద్వీప పూర్వార్ధమున శిలాజాలములతో ఉత్పన్న ములై మణిమయములగు శిఖరసులు గలదియు వేలకొలది గుహలు గలదియు ఆగు చిత్రసాను మహాపర్వతము గలదు. దీని విస్తరము ఇరువదియైదు యోజనములు. ఇరువది నాలుగు యోజనములు దీని ఎత్తు. ద్వీపపు పశ్చి మార్గమున సముద్ర వేలా (చెలియలి కట్టకు) సమీపమున అపుడే ఉదయించిన చంద్రునివలె (వక్ర రేఖా రూపములో) మానసమను పర్వతమున్న ది. దీని ఎత్తు ఏబదివేల యోజనములు. ప్రియవ్రత పుత్రుని పుత్రుడు మహావీరుడు ద్వీప పూర్వార్ధ పశ్చిమార్ధములందు రక్షకుడు.

ఈ శాల్మల గోమేద పుష్కర ద్వీపములయందు జనులు పదివేల యేండ్లు జీవింతురు. అచట విపర్యయములేవి. యునులేవు. ఆరోగ్యము సుఖ బాహుళ్యము.ఇది ఆచటి స్వాభావిక స్థితి. వారు మానససిద్ధిని పొందిన వారగుటచే వారిలో సుఖము ఆయువు రూపము. వీనికి కొరతలేదు. రూపశీలములుదు అచట అందరును సమానులు; ఆధమో త్తమత్వములు లేవు. వధ్యులు-వధకులు ఈర్ష్యాసూయాభయ లోభదండ లౌల్యనిగ్రహములు సత్యానృత ధర్మాధర్మభేదములు వర్ణాశ్రమములు పశుపాలన వాణిజ్య కృషిత్రయీ విద్యాదండనీతి శుశ్రూషాదండములు లేవు. వానలు నదులు శీతోష్ణ భేదము లచట లేవు. గిరిప్రస్రవణముల జలమును ఉద్భిజ్జజలమును ఆచటివారి కుపయోగపడును.

అచటి కాలప్రవృత్తి సదా ఉత్తర మేరువులందువలె నుండును. అంతటను కాలము సుఖప్రదమయి జరా క్లేశ ములు లేకయుండును.

ఈ చెప్పినవానిలో గోమేదమునందలి ధాతకీ ఖండమందును పుష్కర ద్వీపమునందలి మహావీరుని ఖండమునం దును సృష్టి ప్రవృత్తి కలదు.

గమనిక : స్వాయంభువమను పుత్రుడగు ప్రియవ్రతునకు పదిమంది కుమారులు కలిగిరి; వారి నామము లన్నియు అగ్ని వాచకములు. వారిలో ముగ్గురు విరక్తులై తపమునకు ఏగిరి. మిగిలిన ఏడు మందికిని ప్రియవ్రతు డేడు ద్వీపములను ఇచ్చెను. వారికిని కుమారులు కలిగిరి. ఈ ప్రియవ్రత పౌత్తుల నామములకును ఈ సప్త ద్వీపములందలి వర్షముల నామములకును సంబంధమున్నట్లు కనబడును. ఈ మత్స్య పురాణమున నామములు పాఠభ్రంశము వలననేమో సరిగా గుర్తింపరాకున్నవి.

                                                                                         -అనువాదకుడు.

ద్వీప సామాన్య విషయములు

ఈ చేప్పిన సప్త ద్వీపములకు చుట్టును సప్త సముద్రములు కలవు; ఏ ద్వీపమునకు సంబంధించిన సముద్ర మయినను దానితో సమానమయినది. అనగా ద్వీప పరిమాణమేంత పెరుగునో ఆ సముద్ర పరిమాణమునుఅం తే పెరుగును.

సముద్ర శబ్ద నిర్వచనము-దానికి సంబంధించిన రహస్యములు

 జలములు దీనియందు సముద్రేకించును గావున సముద్రమునకు సముద్రము అని పేరు. *జరాయుజాండజు స్వేదజోద్భిజ్ఞములను నాల్గు విధములగు ప్రజ లెచ్చట నివసింతురో ఆనందింతురో ఇట్లు వృష్టి వర్షితము వాన) వారి ఆనందపూర్వక స్థితి వర్షితమును ఎచ్చట జరుగునో ఆది వర్షము అనబడును.

ప్రతిదినమునను చంద్రు డుదయించునపుడును చంద్రుడు పూర్ణుడై నపుడు పూర్ణి మాతిథిగుందు)ను సముద్రము పూర్ణమగును. బహుళ వక్షమున చంద్రుడు ప్రక్ష్మణుడగుచుండ సముద్రమును క్రమముగ క్షీణించి సన్నదనమును పొందును. ఆపూర్యమాణ(శుక్ల పక్షమున సముద్రము క్రమముగ స్వంతముగనే వృద్ది పొందును. కనుక ఇట్లు చంద్ర క్షయముతోపాటు సముద్రక్షయమును చంద్రవృద్ధితోపాటు సముద్రవృద్ధియు నుండును. ఏలయన జలవృధిక్షయములు చంద్రవదిక్షయానుసారులు. అందుచేతనే చంద్రుని ఉదయమున వృద్ధినొంది చంద్ర జలముల పరస్పరాతిరేకానుసారము సముద్ర జలముకూడ హసించును. (తగ్గును.) ఇదే విధముగ శుక్ల కృష్ణపక్షములందు చంద్రవృద్ది క్షయముల నను సరించి సముద్రవృద్ది క్షయములును జరుగును. ఈ వృద్ధి పరిమాణము పదునైదు వందల అంగుళములుండును.

రెండు వైపులను నీరుండుటచే ద్వీపము (ద్వి+ ఆప = ద్వీప) అనియు నీటిని నిలుపుకొనునది కావున సముద్ర మునకు ఉదధి (ఉద+ధా - నీటిని ధరించు) అనియు వ్యవహారము కలిగినది. భూమిచేత వెలిగ్రక్క బడినవి కావున కొండ లకు గిరులు( ఉద్ + గృ-వెలిగ్రక్కుట) అనియు పర్వములు కలవి కావున పర్వతములు అనియు (పర్వ = కణుపులు; ఉబ్బెత్తులు) వ్యవహారములు.

(*ఈ శ్లోకమున పాఠభ్రంశమున కనబడుచున్నది)

 శాక పర్వత(వృక్ష) ముండుటచే శాక ద్వీపము -దేశ ము నడుమ కుశ స్తంబము (దర్భరుబ్బు) ఉండుటచే కుక ద్వీపము-క్రౌంచపర్వత ముండుటచే క్రౌంచద్వీపము. శాల్మలవృక్షము (బూరుగు చెట్టు) ఉండుటచే శాల్మల ద్వీపము -గోమేద రత్న పర్వత ముండుటచే గోమేదద్వీపము-న్యగ్రోధవృక్షము (మర్రిచెట్టు) ఉండుటచే పుష్కర (పుష్కర మర్రి) ద్వీపము - ఆని ఆయా ద్వీపములకు వ్యవహారము కలిగినది.

ఈ జంబూద్వీపమునందు అవ్య క్తము(మాయాశ బలము)నకు కూడ మూల కారణమగు బ్రహ్మతత్త్వము కంటే అభిన్న మగు మహాదేవుడు పూజింపబడును. దీనియందే సాధ్యులతో సిద్దులతో కూడ ప్రజాపతియగు త్వష్ట (చతుర్ముఖుడు- హిరణ్యగర్భుడు)నివసించును. ఇచటనే ముప్పది ముగ్గురు దేవతలును ఋషులును ఆరాధింపబడుచున్నారు. దేవదేవోత్తము డగు ఆ దేవుడు నారాయణుడు కూడ ఇచట పూజింపబడుచున్నాడు. ఈ ద్వీపమునందు అనేకములగు రత్నములును వాడుక లో ఉన్న వి. ఈ చెప్పిన ద్వీపములన్నిటను అచటి ప్రజల ఆర్జవము (వక్రత లేని నడువడి) బ్రహ్మచర్యము సత్యము దమము మొదలగువానిని బట్టి వారి వారి ఆరోగ్యాయుః ప్రమాణాచికము ఒక దాని యందు కంటే మరియొక దానియందు రెట్టింపు చొప్పున అధిక మగుచున్నది. ప్రజలును వారీ సద్గుణములచే రక్షింపబడుచున్నారు.. జరామృత్యు పీడితులు కాకున్నా రు. అచటి జనులు అప్రయత్న సిద్ధమగు షడ్రసాహారమును తిని, సుఖముగ జీవింతురు.

పుష్కర ద్వీపమున కావల స్వాదూదక మంచినీటి సముద్ర మున్నది. దాని కావల చుట్టును లోపలివైపు ప్రకాశము (కలుగు కలది) వెలుపలి వైపు అప్రకాశము వెలుగు లేనిది అగు పర్వతము గుండ్రముగ ఆచరించి ఉన్న ది. దీనియందలి ఆలోక విస్తార మాత్రాంశము (ప్రకాశించు భాగము) పృథివీ సంబంధియై దృఢంశముగా ఉన్నది. మిగిలిన అలోక భాగము (అప్రకాశాంశము) ఉదకముతో ఆవరింపబడియున్నది. ఇ బ్లీ భూమండలమునకు చుట్టును ఉదకము క్రమ్మి యుండుటతో ఇదియంతయు ఉదక ముతో ప్రతిచ్చన్న ము (పూర్ణముగా కప్పివేయబడియున్నది) అని చెప్పవలసియున్నది.

పృథివ్యాదిమహాభూతవివరణమ్

భూమికి చుట్టును ఉన్న జలము భూమికి పది రెట్లుండి భూమిని తడుపుచున్నది. దానికి పది రెట్ల పరిమాణముతో ఆగ్ని ఈ జలములను నిలిపియున్నది. దానికి పది రెట్ల పరిమాణముతోనున్న వాయువు అగ్ని ని నిలిపి పట్టియున్న ది. కాని వాయు మండలము తిర్యక్ (అడ్డముగా-Horizontally) ప్రసారము కలది- మిగిలిన పృథివ్య పేజ ఆకాశములు గోళాకృతి వ్యాపి ప్రసారములు కలవి. వాయువునకు పది రెట్ల పరిమాణము - గల ఆకాశము ఇతర భూతములు గాలీచే చెదరిపోకుండి. నీలిపి పట్టు చున్నది. దానికంటే అధికమగు పరిమాణముగల సద సదాత్మకమగు మహత్తు ఈ పృథివ్యాది పంచకమును దానికంటే అధిక . పరిమాణముగల అవ్య క్తము ఈ పృథివ్యాది మహద త షట్కమును ధరించు (నిలిపి పట్టు) చున్నది. ఇట్లవి వికారములు (ఉత్పన్న ములు) వికారిచే (తమ మూలకారణముచే) నిలుపబడుచు పరస్పరాధారాధేయ భావములోనున్నవి. పృథివీ మొదలగునవి అన్ని యువికారములు-ఒక దానికంటె మరియొకటి పరి మాణములో పెద్దవి. ఒక దానినింకొకటి నిలిపి పట్టినవి. అవి పరస్పరాను ప్రవేశము చేసియున్నందుననే స్థిరత రత్వము పొండి కదలకయున్న వి. వీనిలో వృథివి-సీ -అగ్ని -వాయువు-ఇవి పరిచ్చిన్న ములు - ఇదీ ఇంతవరకున్న వి అని చెప్ప శక్యమగును. ఈ నాలుగు ' భూతములకు ఆవలగానున్న వెలుగుకూడ అన్ని వైపుల సమముగా నుండును. కావున ఆకాశమందా వెలుగు వ్యాపించి దానిని దీనియంది యున్నదని చెప్పగలుగుచున్నాము. ఇవి ఇట్లు పెద్ద పాత్ర యందున్న చిన్న పాత్రలవలె నుండి పరస్పర మాశ్రయాశ్రయి భావముతో నుంటచే ఒక దానికంటే ఒకటి చిన్న వన వీలగు చున్నది. అట్లే ఈ ప్రాణులును ఒక విధమగు వాటికంటే మరియొక విధమైనవి అధిక మైనవి అనదగియున్నవి. ఈ భూతముల వ్యాప్తియున్నంత మేర ప్రాణుల.భూతముల ఉత్పత్తియు కలదు. ఈ ప్రాణులు సంస్కార రూపమున భూతములయందంతర్గతములై యున్నవి. ఈ సంస్కారము జడ భూతములను తొక్కిపట్టి తమకు లోబరచుకొని వానితోనే ప్రాణుల ఉత్పత్తిని సాగించు చున్నవి. కాని ఆచటి భూతముల పొళ్ళ పరిమితిని బట్టి 'కార్యవశమున కారణ నిర్ణయ'మను యుక్తిచే ఈ ప్రాణులు ఈ భూతము ప్రధానముగాగల ప్రాణులని నిర్ణయించవలేను. (మానవుల శరీరము . పార్థివము-మత్స్యముల శరీరము జలప్రధానము అన్నట్లు.)

ఇట్లు పృథివ్యాదికము మహదంతము కార్యము ఏదియో కారణము ఏదియో నిర్ణయించవలెను.

ఇట్లు నేను (మత్యుడు) పృథివి ప్రధానముగా ఆక్రమించిన సప్తద్వీపాత్మక భూమండల స్థితిని పరిమాణ విస్తరమును యాథాతథ్యముతో తెలిపితిని. ఇది భూ సన్ని వేశ ప్రకారము.

ఏది ఏమైనను ఈ కనబడు విశ్వమంతయు ప్రకృతి పరిణామమునందలి ఏక దేశము (ఆల్పాంశము) మాత్రమే.

 నేను చెప్పిన ఇంత మాత్రమే వినుటకను చెప్పుటకును శక్యము.

ఇక మీదట సూర్యా చంద్రమసుల గమన ప్రకారము ప్రతిపాదింతును.

ఇడి శ్రీమత్స్య మహాపురాణమున గోమేదాది ద్వీప వర్ణనము-విశ్వమున పృథివ్యాదీ భూత సన్ని వేశ వర్ణనమునను నూట ఇరువది రెండవ అధ్యాయము.

భూగోళ విషయము ముగిసినది.