మత్స్య మహా పురాణము

Table of Contents

73 - శుక్రగురు పూజా విధానము

పిప్పలాదుడు యుధిష్ఠిరునితో ఇట్లు చెప్పెను: భూపాలా! ఇక ఇప్పుడు యాత్రారంభావసానములందు ప్రతి శుక్ర (చుక్క ఎదురు) (దోష) ప్రశాంతి కై శుక్రోదయ సమయమందు చేయవలసినది చెప్పెదను. బంగారుతో కాని వెండితో కాని కంచుతో కాని చేసిన పాత్రప ఖైర)మందు తెల్లని వస్త్రము పరచి తెల్లని బియ్యము నింపి శుకుని రజత ప్రతిమను పులు కడిగిన ముత్తెములను దానియందుంచి ఈ అర్థము నిచ్చు మంత్రముతో అవి అన్నియు సామవేదియగు బ్రాహ్మణు నకు దానమీయవలెను. “సర్వలోకేశా! భృగునందనా! కవీ! నీకు నమస్కారము. అర్ఘ్య మందుకొని మ"కు సర్వార్థసిద్ధి కలిగించుము.” ఇట్లు చేసినచో అన్ని కోరికలును( ఇహమున)తీరి విష్ణులోకమున పూజితు డై సుఖించును.

ఇట్లు సోమాలికములు వటుకములు పూరికలు అపూపములు శనగలు వీనితో శుక్రుని పూజించు నంతవరకును ఇంటిలో స్త్రీలును క్రొత్త పంట ధాన్యపు అన్న మును తినరాదు. ఇట్లు నియమమును పాటించినచో సర్వార్థసిద్ధి కలుగును.

యుధిష్ఠిరా! ఇట్టిదే బృహస్పతి పూజయు కలదు. అది చేప్పెదను. బంగారు పాత్రపళ్లైర మందు గురుని స్వర్ణ ప్రతిమను పచ్చని పట్టు వస్త్రము చుట్టి నిలుపవలెను. యజమానుడు ఆవలతో (ఆవపిండి. ఆవనూనెలతో) మోదుగ-రావి. చిగుళ్ల ముక్కలతో కూడిన పంచగవ్య మిశ్రితజలముతో స్నాన మాడి పీతాంబరములు ధరించి నేతితో (బృహస్పతి నుద్దే శించి)హోమము చేయవలెను. బ్రాహ్మణునికి నమస్కరించి గోవును ఈ చేప్పిన సామగ్రిని దాన మీయవలెను. (మంత్రా ర్థము)-“వచస్సులకు నాధా! వాక్పతీ! బృహస్పతీ! క్రూరగ్రహపీడితులను రక్షించువాడా! నమస్కారము.”

సంక్రాంతి బృహస్పతికాని రవికాని రాశియందు ప్రవేశించు) .. సమయమందును యాత్రాకాలమునందును ఆభ్యుదయ (శుభ కర్మారంభములందును బృహస్పతి పూజ చేయు వారికి సర్వకామములును సిద్ధించును. (యాత్ర రాజులు యుద్దముల కై కాని రాచరికపు పనుల కై కాని బయలుదేరుట; లేదా స్త్రీలు పుట్టి నింటికో ఆ త్తవారి ఇంటికో బయలుదేరుట; లేదా వ్యాపారమునకో వ్యవహార మునకో తీర్థ క్షేత్రాది సేవకో బయలుదేరుట)

ఇది శ్రీమత్స్య మహాపురాణమున శుక్రగురు పూజా విధానమును డెబ్బది మూడవ అధ్యాయము.