మత్స్య మహా పురాణము
124 - జ్యోతిర్మండల వ్యవస్థ - ధ్రువస్థితి - తత్పంచార ప్రతిపాదనము
ఈ విధముగా రౌమహరణ చెప్పి దివ్యకథను సూర్యాచంద్రమసుల.సర్వగ్రహముల సంచారమును వేరు. వేరుగ విని ఋషులతనితో ఇటనిం: ఈ జ్యోతిస్సులు అన్నియు రవి మండలమునందు ఏ వ్యూహమును. (అమరిక యు) లేక యే ఒక దానితో మరియొకటి సంకరము (వ్యవస్థ లేని కలయిక) నొందక సంచరించుచున్నవి? ఎవరైన వీనిని త్రిప్పుచున్నో రో-స్వయముగ అవియే తిరుగుచున్న వో-ఎట్లు తిరుగుచున్న వో-ఇదియంతయు తెలియగోరుచున్నాము. పండితో తమా: మాకు అది తెలుపుము. ఈ విషయము భూతముల కేసం మోహమును కలిగించునది. కాని నీవు. విషయమును తెలుపగల వారందరలో ! శేష్టుడవు. కావున మాకది తెలుపవలయును. అనగా సూతుడు వారికి ఇట్లు చెప్పనారంభించెను.
అవును; ఇది మీర నినట్లు భూత సంమోహనమే. ప్రత్యక్షముగ కనబడుచుండియు ఇది భూతములను సం హింపజేయుచున్నది.
*ఇదుగో! ఈ శింశుమారము (శిశుమారము) వేదములందు చెప్పబడినట్లు పదునాలుగు ఋక్షముల పై (జ్యోతీ రూపముల పై) వ్యవస్థ చేయబడి కనబడు చున్న దే: ఈ శిశుమార చక్రమునకు మేఢము*గా ద్యులోకమున ఉత్తానపాద పుత్తుడుగా పురాణములందు పేర్కొనబడిన ధ్రువుడున్నాడు. (అతడు పేరునకు తగినట్లు కదలడనుకొనవలదు.) ఆతడు తాను తన చుట్టు తిరుగుచునే చంద్రాదిత్యులను ఇతర గ్రహములను త్రిప్పుచున్నాడు. ఇతర నక్షత్రములును. తిరుగుచున్న ఆ ధ్రువుని చుట్టు తామును భ్రమించుచు చక్రమును చుట్టు చు భ్రమించు ఇతర చక్రములవలే తీరు గుచున్న వి. ధ్రువుని మనస్సంకల్పానుసారము ఇట్లు తిరుగుచున్న ఈ జ్యోతిర్గణము వాత సమూహమయములగు పాశములతో (కట్ట బడి) ధ్రువము (కదలనిది) ఐ అతని వెంట తిరుగుచున్నది. కాని భేదము వేరగుట) యోగము (కలయిక) కాల ప్రమాణానుసారము వాని సంచారము ఉదయ సమయములు ఉతా తములు దక్షి హో తరాయనములు విషువములు గ్రహ వర్ణములు ఇవి అన్ని యు ధ్రువుని మూలముననే కలుగుచుండును. భేదము యోగము మొదలగునవి సూర్య సిద్ధాంతాది జ్యోతిఃశాస్త్ర గ్రంథములందు ప్రసిద్ధములు.)
(*ఇటువంటి వచనములనుబట్టి ఈ జ్యోతిర్మండల వ్యవస్థా నిషయమంతయు ఋషులు నిర్మలాకాశమున కనబడు వెలుగు ముద్దల వెలుగులను చూచినపుడు కలుగుచుండిన కుతూహలముతో ప్రశ్నించుచుండిరనియు వానికి సమాధానములను గౌమహర్షణుడదే సమయమున ఇచ్చుచుండెననియు స్పష్టమగుచున్నది.)
(*ధాన్యపు కళ్ళములో గడ్డిని నలుగదొక్కుట కై బంతి త్రిప్పు ఎద్దులు ఓ కేవిధముగ తిరుగుట కై కళ్ళము సడుమ పాతిన స్తంభమునకు మేథి -మేడి. మేథము మొదలగునవి పేర్లు)
మేఘమణ్డలకథనమ్
మేఘములనుండియే జీవులు ఉత్పన్నములగును కావున దానికి జీ(వ)మాతములు అని పేరు. సప్త వాయువు లలో రెండవదగు ఆవహ వాయువు నాశయించి మేఘములుండును. ఇక్కడి (మన భూమి) నుండి ఒకటియు ముప్పావు యోజనము దూరమున అవి నిలిచి వానను భూమిపయి వదలుచుండును. దానికే ధారా. ఆసారము- ఈ మొదలగు నామములు.
ఇవికాక పక్షములు మొలచియున్న పుష్కరా వర్తకములను మేఘములు కలవు. మహా సామర్థ్యము కలవగు పర్వతముల పక్షములను ఇంద్రుడు - అవి కాను సంచారములును సమృద్ధి కలవియును నగుట చూచి . భూతహితమునకై నర కేను. కాని ఈ పుష్కరా వర్తకముల రెక్కలనతడు నరుక లేదు.) పుష్కరము అనగా నీరు; అవి తోయ(జల) ధారులై బృంహణము (ప్రాణీ పోషణము) చేయును కావున వానికి పుష్కరా వర్తకములని వ్యవహారము (ఆవర్తకములు. సంపూర్ణముగా వర్తనమును.జీవసమును కలిగించునవి.) ఇవి నానారూప ధరములును మహా ఘోర ధ్వనియుతములును; అవి కల్పాంతమున వానలు కురిసే ప్రళయాగ్ని నుపశమింపజేయును. కాని ఇది సృష్టి స్థితి కాలములందు వాయు వశమున కొట్టుకొనిపోవుచు వానలనీయక కల్ప ప్రవృత్తిని సాగించుచుండును. లోక మున సాధారణముగా అండము పగులగా ఏర్పడిన కుండ పెంకులను కపాలములందురుగదా! ఆట్టే ఏ అండమునందు ప్రభువు సృప్తి వ్యాపార నమల్లుడు) చతుర్ముఖుడునగు బ్రహ్మ గర్భస్థ శిశువుగా నుండి చివరకు దానిని చీల్చుకోని ఉత్పన్ను డయ్యెనో. ఆ ఆండపు కపొలములే మేఘములయ్యెను. ఆ మేఘములేన్నీ యున్నను అన్నిటికిని సమానముగా ఆప్యాయనము కలిగించునది ధూమము. మేమములన్నిటిలో శ్రేష్ఠములు పర్జన్యుడును - నాలుగు దిగ్గజములును? (మేఘములును దిగ్గ జములును వేరుగదా యనిన) గజములు..మేఘములు భోగులు {సర్పములు) వీని కన్నిటికీని మూలతః కుల మొక్కటియే; తరువాత ఈ కులము రెండయినది. (నాగములు అనుసది ఆ రెండవ కులము - కావుననే గజములకును సర్పములకును నాగమని వ్యవహారము) వీని కన్నిటికిని జస్మీకరణము నీరు ఒక్కటియే. ఈ పర్జన్యుడు వర్షరువునందు నీరు ఇచ్చుచు మేముడుగా నుండును. హేమంత రువులో ఇత డే శీతము కలిగించును. ఇవి మరింత వృద్ధినొందినచో మంచుపొనను కురియించును. ఇట్టి పుష్కరావర్తక పర్జన్యా దీకమునకు వాయువులలో ఆరవది యగు పరివహవాయువు ఆశ్రయము.
ఆ పరివహ వాయు భగవానుడే ‘త్రిపథగా!’ ‘ఆకాశమున పోవునది’ అని ప్రసిద్దయు దివ్యామృత జలపూర్ణయు త్రిపథమునకు (అంతరిక్షమునకు) ఉపరిస్థాన్ మున ప్రసరించుచు ఇదిగో: ఈ ఆకాశమున కానబడుచున్న గంగను భరించు (క్రిందకు పడకుండ నిలిపి పట్టుచున్నాడు. అతడు స్రవింప జేసిన జలమును దిగ్గజములు తమ లావగు తోండములతో తుంపురులనుగా వదలుచుండును. ఆ తుంపుకుల సముదాయపు రూపమునే నీహార మనుచున్నాము.
హేమకూట పర్వతమునకు దక్షిణమునను హిమవంతమునకు ఉ తరమునను గల ప్రదేశమునందు-ఆగ్నే యమున.పుర్దూ అను నగరము ఉన్నది. ఇది పూర్వముండెడిది. ఈ చెప్పిన తుషారవరము ఆ నగరము వరకు వ్యాపించి నిలిచిపోవును. అక్కడినుండి హిమపాతమునకు మూల హేతువగు ఈ వాయువు హిమముతో హిమవన్మహా గిరిని తడుపుచు ఆ నీహారమును దక్షిణమునకు తెచ్చును. హిమవత్పర్వతమును దాటి దక్షిణమునకు వచ్చిన ఈ వాయువు వరము తన శేషాంశముగా కలదగును. ఈ వృషి తక్కువదయియు వృద్ధికరము; (వానలను కురియించును.) అంతరిక్షమున మేఘముల ఉనికి తీరును వానివలన ప్రాణులకు కలుగు ఆప్యాయన (సంతృప్తి) ప్రకారమును మీకు తేలిపీతిని.
వాన కురియుటకు సూర్యుడే మూలము అని పెద్దలు సముపదేశించుచున్నారు. కాని వస్తుతః వర్షము - వేడిమి హిమము-రాత్రింబవళ్ళు-సంధ్యాకాలములు - ఇవన్ని యు ధ్రువునినుండియే - ప్రవల్లుచున్న వి. ధ్రువుడు ఆధిష్టాతగా ఉన్న నే రవీయు వాన కురియించుచున్నాడు. సర్వభూత శరీరములందును ప్రాణములకు కూడ నీరే. ఆశ్రయము. స్థిర చర ప్రాణులన్ని టియందును ఆనీరు (అదృష్టమగు అగ్నిచే) దహింపబడగా అది ఆవిరిగా ఆయి బయటికి పోవును. (ఇదియే మరల నీరుగామారినపుడు) ఆయా ప్రాణులు సాసములు (స- అగ్ర-కన్నీటితో కూడినవి) ఆయినవనుచున్నాము. ఇదీ నీటియొక్క స్థానభ్రంశము (ఒక స్థితిని విడిచి మరియొక స్థితిని పొండుట) మాత్రమే రవి సర్వభూతముల నుండియు తేజోమయములగు తన కిరణములతోను సముద్రమునుండి మాత్రము వాయు సహకృతములయిన తన కిరణములతోను ఈ జలమును గ్రహించుచున్నాడు. తరువాత అతడు తన తెల్లని కిరణములతో తెల్లని జలములనుగా ఆ నీటి యావిడని పరివర్తించి, మేఘములకందిగిచుచున్నాడు. తరువాత వాయు. పేరణచే - మేఘములయందంత వరకున్న నీరు క్రిందపడును. ఇట్లు ఆరు మాసములపాటు రవి సర్వభూత వృద్ధీకరముగా అంత యో ఇంతయో వానలు కురియించుచుండును. వాయువు మూలమున ఉరుములును అగ్ని వలన మెరుపులును కలుగును. మిహ్- అను ధాతువునకు తడుపుట-నీరు చిందించుట అని ఆర్థము. నీరు చిందించి తడుపునది కావున (మేహమేఘ) మేఘము అన బడును. - (వాయు శ క్తిచే నిలుపబడి) క్రిందికి జారిపడదు కావున అభ్రము అని ఈ మేఘములకు పేరు (న+భ్ర> (భ్రంశ్)-అభ్ర-(కాని వాస్తవమున-అప్-భ్ర> అప్-భ్ర >ఆ[బ్] భ్ర> అభ్ర -నీటిని మోయునది).
ఇట్లు ధ్రువుడు తన పై ఆధిష్ఠత గా ఉండుట చేతనే (ధ్రువుని శక్తి రవియందు నిలిచి యుండుటచే సూర్యుడు వృష్టికి సష్ట-వాన కలిగించువాడు- అగుచున్నాడు. ధ్రువుడు తనకు ఆధిష్టాతగా ఉండుట చేతనే వాయువు వరమును ఉపసంహరించగలుగుచున్న ది. ధువుడు అధిష్టాత గా ఉండుట చేతనే నక్షత్రమండలము (కుజ బుధ గురు శుక శనులకు తారాగ్రహములని శాస్త్ర వ్యవహారము) నిరంతరముగా రవీ సంచరించేడి త్రోవలో రవితోపాటు అతనికి విదే యులవలె సంచరించుచుండును. ధ్రువాధిష్టానము చేతనే అవి తమతమ నీయతరాశి సంచారానంతరము రవియందు ప్రవేశించు చున్న వి.
సూర్యరథపరిమాణాదికథనమ్
అనంతరము పేదలు సూర్యరథ సన్ని వేశమును ఈవిధముగ చెప్పుచున్నారు. నిలువుగా నిలిచియున్న (ఒక్కటియేయేసను పడిపోకయున్న) ఒకే చక్రము- ఆచకమునకు ఐదు ఆరలు. (ఆకులు)-పృథివ్యంతరిక్ష డ్యులోకములు అనేడు: చూడు నాభులు. చక్రపు మధ్యస్థానములు.కుండలు) బంగారులో చేసిన మీగుల సూక్ష్మ ఋగు అణిచక్రపుచిల) ఎనిమిది చక్రములతో ఏర్పడిన ఒ కేఒక నేమి (చక్రపు పట్టా) కలిగిన ఇట్టి ఏకచక్రమగుచు తీవ్రముగా ప్రసరించగల ప్రకాశ మాన రథముతో సూర్యుడు సంచరించుచుండును. ఆ రథపు నడిమి విస్తారము పదివేల యోజనములు. రథపు ఉపస్థ ప్రదేశము (నడిమి విస్తారమునకు రెట్టింపు కాది పొడవు; ప్రయోజనవశ దృష్టితో ఈ రథమును బ్రహ్మ (వేదము) సృష్టించెను. (సృష్టియందలి ఆయా తత్త్వములను ఆయా రథాంగ ప్రత్యంగములనుగా వేదము రూపించుచున్నది) ఈ రథము దేనికిని అvటక యే సడుచు బంగారు రథము. ఛందస్సులు అనేది శీఘ్రగాములగు అశ్వములు ఈ రథమున పూంచియున్నవి. ఈ స్యందనము దాని చక్రమునకు అనుగుణముగ నిట్టనిలువుగా నున్నది. దీని లక్షణములు వరుణ రథ లక్షణములతో సమానములు. ఈ రథముతో భాస్కరుడు అనుదినమును ద్యులోకమున సంచరించుచుండును.
వాస్తవ స్థితిని ఆలోచించగా రవి రథపు ఆంగ ప్రత్యంగములన్నియు సంవత్సరావయవములతో కల్పింప బడినవే. (ఇచ్చట సంవత్సరమునకు ఆవయవములుగా లోక వ్యవహార ప్రసిద్ధములగు అవయవములు మాత్రమేకాక వేదములందు సంవత్సరాత్మక ప్రజాపతి కిని ఆ ప్రజాపతిని ఆరాధించు విధానమునకును అంగములుగా చెప్పిన వానిని గూడ గ్రహించవలయును.) అది ఎట్లనగా సంవత్సరము చక్రము; పంచ సంవత్సరాత్మక యుగమున ఉండేడి సంవత్సరము పరివత్సరము - ఇదావత్సరము ఇద్వత్సరము వత్సరము అను ఐదు భేదములును ఐదు ఆకులు; వసంత గ్రీష్మ వర్షా శరచ్చి శిరములనేడు ఐదు ఋతువులును ఐదు నేములు. ఐదు పూటీలు రాత్రి వరూథము (రథమును కాపాడు టకు అమర్చిన దారుమయ మైన పంజరము) ధర్మము (యజ్ఞము) నిట్టనిలువుగా ఎగురుచున్న ధ్వజము; అర్థ కామములు రెండును కాడికోనలు; ‘కాష్ఠా’ అను కాలావయవ విశేషములు ఆ రథమును లాగెడి ఏకై కొశ్వపు ముక్కు; క్షణమను కాలావయవ విశేషములు ఆ అశ్వపు దంతపంక్తి; నిమేషములనెడు కాలావయవ వి శేషములు అనుకరము అను రథావ యవము; కలా అనేడు కాలావయవ విశేషములు ఈషా (ఏఁడి) అనేడు రథావయవము. కాడి కట్టుటకుపయోగించు నిలువు దూలమువంటిది. ఇట 'ఏకో అశ్వో వహతి స పనామా' అను శుతి ననుసరించి అశ్వము ఒకటియే అయినను అది ఏడు పేరులతో ఏడు గుర్రములుగా నున్నది; గాయత్రి త్రిష్టుప్-జగతీ-అనుష్టుప్-పం కీ- బృహతీ - ఉష్టిక ఆను ఏడు ఛందస్సులో పాయువేగము గల ఏడు గుర్రములు.
సూర్యుని రథపు చక్రము అక్షమునందు బిగింపబడియున్నది; ఆక్షము ధ్రువునియంధిమిడియున్నది. ఈ మూటిలో చక్రముతోపాటు అక్షమును ఆక్షముతోపాటు ధ్రువుడును తిరుగుచున్నారు. వాస్తవమున ధ్రువుని పేరణతో అక్షము చక్రముతోపాటు తిరుగుచున్నది. .
విషయ ప్రతిపాదనమును ప్రయోజనముగా దృష్టియందుంచుకొని రవి రథ సన్ని వేశ మంతయు రూపింపబడి ప్రతిపాదింపబడినది. ఆ విధముగ కాలావయవముల సంయోగ భావముతో భాస్కరరథ రూపము సిద్ధించుచున్నది. ఆ రథముతో సూర్యదేవుడు ఆంతరీక్ష లోకమునుండి ద్యులోకమునకు సంచరించుచుండును. (ఆనగా.రవి మండలము భౌతికముగా అంతరిక్షమందే కనబడుచున్న ను ఆదేవుని ఆధిదై వతరూపము ద్యులోక స్థాయి అని తెలియవలెను.)
రవి రథపు కాడికిని అక్షమునకును గల దక్షిణపు కొనలు ఏవి కలవో-వానికిగల పగ్గములు పట్టి ధ్రువుడు తన రథమును త్రిప్పుటను బట్టి రవి సంచరించుచుండును. ఆకాశమున ఇట్లు మండలా కార భ్రమణములతో తిరుగు రవి రథమున భానుమండలము అన్ని దిక్కులకును గిరగిర తిరుగు కుమ్మరి సా రేవలే కనబడుచుండును .
ఎప్పుడును క్షమించు. ముందుకు సాగుచునేయుండు రవి రథపు కాడి. ఆక్షముల కొనలు వాయుతరంగ పేరితములగుచు మండల రూపమున అన్ని దిక్కులందును సంక్రమించు వ్యాపించుచుండును. .
ఈ సూర్య రథపు యుగ కోట్యక్ష కోటుల యందు బిగించియున్న రశ్మిద్వయము (రెండు పగ్గములు)ను మండల (భాగం. లేదా డిగ్రీల గణనము చుట్టుకొనుచు మరల విప్పుకొనుచు ఉత్తరాయనమున పొట్టివగును. దక్షిణాయనమున పెద్దవగును. ఇవీ ధ్రువునిచే బిగించి పట్టుకొనబడుచు వదలబడుచు తద్వశమున రవి రథమును వేడెక్కించుచుండు టే ఇందులకు హేతువు. ఈ రెండు రక్కు (పగ్గము)లును ధ్రువునిచే అధిష్ఠితములయి సముస్థితికి వచ్చునట్లును లాగబడును. ఉత్తర దక్షిణ దిశల అర్ధవృత్తములు నూట ఎనుబది మండలములు (భాగలు-డిగ్రీలు) అగును. రథ యుగ కోటళ క్ష కోటులయందలి పగ్గములను ధ్రువుడు సడలించివదలగా రవి వెలుపలగా సంచరించును; లాగిపట్టి చుట్టివేసి నపుడు లోపలగా సంచరించును. దానిని బట్టి రవి వేగమునందు శీఘత్వమందత్వ భేదములు ఏర్పడును. దానిని బట్టి ఉత్తరాయన దక్షిణాయనము లేర్పడును. అని సారాంశము.
[గమనిక: ఇచ్చట మండలము అను పదము భాగలు (డిగ్రీలు) అను అర్థమున ప్రయోగింపబడినది. మరియును రవిని బట్టి రాత్రింబవళ్లు మొదలగు వ్యవస్థ ఏర్పడునని భారతీయ జ్యోతిశాస్త్రముగానీ ఆధునిక పాశ్చాత్య శాస్త్రములు కాని చెప్పుచున్న ను కాలాత్మక ప్రజాపతి వ్యవస్థిత రూపమగు సంవత్సరమునకధీనుడై తదధిష్ఠాతృ త త్త్వము లలో నొకటియగు ధ్రువుని వశమున రవి నడచుచున్నాడను సంప్రదాయ మొకటి భారతదేశమున కలదని సాయన వచ నములబట్టి తెలియుచున్నది. పురాణములందు ఈ సంప్రదాయము ననుసరించియే ధ్రువుడు సూర్యునిమీదను అధికారము వహించినట్లు చెప్పుట జరుగుచున్నదని గ్రహింపనగును.
-అనువాదకుడు]
ఇది శ్రీమత్స్యమహాపురాణమున ఖగోళ వర్ణనమున జ్యోతిర్మండల వ్యవస్థ ప్రతిపాదనమున ధ్రువాధీన రవి సంచార కథనమను నూట ఇరువది నాలుగవ అధ్యాయము .
