ఆగ్ని దేవుడు చెప్పేను : వసిష్ఠా! భ్రాంత ఉద్ర్భాంత-ఆవిద్ద-ఆప్లుత-విప్లుత-సంపాత సముదీర్ణ-శ్యనపాత-ఆకుల-ఉద్దూత-అవధూత-సవ్య-దక్షిణ-అనాలక్షిత-విస్ఫోట-కరాలేంద్ర-మహాసఖ-వికరాల-నిపాత-విభీషణ- భయానక సమగ్ర-అర్థ-తృతీయాంశ-పాద-పాదార్ధ-వారిజ- ప్రత్యాలిడ-ఆలీడ-వరాహ - లులితములు అనునవి యుద్ధరంగమున చూపు కత్తిడాలతో యుద్ధము చేయునపుడు చూపు ఇరువది రెండు చలనశ్రమములు. వీటిని తెలుసుకొనవలెను. పాశమును విసరుటలో పరావృత్త - అపావృత్త - గృహీత - లఘు - ఊర్ధ్వజిప్త - అధః ప్త - విధారిత - శ్యేనపాత - గజపాత - గ్రాహ్య గ్రాహ్యములు అను పదునొకండు ప్రకారములున్నవి. వ్య స్తపాశమున మహాత్ములు, ఋజు - ఆయత - విశాల - తిర్యక్ థామితములను ఐదుకర్మలు చెప్పిరి. దన - భేదన - పాత - భ్రమణ - శమన - వికర్తన - క ర్తనములను ఏడును చక్ర కర్మలు. ఆస్ఫోట- క్ష్వేడన - భేద - క్రాస - ఆందోలిత - ఆఘాతములను ఆరును శూల కర్మలు. ద్విజోత్తమా! దృష్టిఘాత - భుజఘాత - పార్శ్వమాత - ఋజుపాత - పక్షపాత - ఇషుపాతమలనునవి తోమరకార్యములు.
విప్రశ్రేష్ఠా! ఆహత - విహృత - ప్రభూత - కమలాసన - నతోర్ధ్వగాత్ర - నమిత - వామడక్షిణ – ఆవృత్త - పరావృత్త - పాదోద్ధూత - ఆవప్లుత - హంసమర్ధ - విమర్ధములు గదా కర్మలు. కరాల. అవఘాత దంపప్లుతడి ప్రహస్త స్థిత శూన్యములు పర శుకర్మలు. తాడన-భేదన చూర్ణన-ప్లవవ-ఘాతనములు ముద్గర కర్మలు. సంశ్రాంత - విశ్రాంత గోవిసర్గ-సుదుర్ధరములు భిందిపాల-రిగుడముల కర్మలు. అంత్య-మధ్య-పరావృత్త-నిదేశాంతములు వజ్ర పట్టిశముల కర్మలు. హరణ-ఛేదన- ఘాత- భేదన-రక్షణ-పాతన-స్ఫోటనములు కృపాణకర్మలు. త్రాసన-రక్షణ-ఘాత-బలోద్ధరణ ఆయకములు క్షేపణీకర్మలు; యంత్రకర్మలు కూడ ఇవియే. సత్యాంగ- అవదంశ-వరాహోద్ధూతక-హస్తావహ స్త-అలీన ఏకహ స్తువహస్తక-ద్విహ స్తబాహుపాళ -కటిరేచితక -ఉద్ధత-ఉరోమాత-లలాటమాత- భుజావిధమన- కరోద్ధూత - విమాన - పాదౌహతి - విపాదిక - గాత్రసంశ్లేషణ - శాంత - గాత్రవిపర్యయ - ఊర్ధ్వప్రహార - ఘాత - గోమూత్ర - సవ్య -దక్షిణ - పారక - తారక - దండ - కబరీబంధ - ఆకుల – తిర్యగ్బంధ-ఆపామార్గ - భీమవేగ - సుదర్శన - సింహా క్రాంత - గజాక్రాంత - గర్గభాక్రాంతములు గదాయుద్ధ చలనములని తెలియ వలెను. ఇపుడు మల్లయుద్ద గతులను చెప్పెదను.
ఆకర్షణ - వికర్షణ - బాహుమూల - గ్రీవా పరివర్తన - సుదారుణ పృష్ఠ - భంగ - పర్యాసన – వివర్యాసన-పశుమార - ఆజావిక - పాద ప్రహార - ఆస్ఫోట - కటి రేచితక - గాత్రాశ్లేష - స్కంధగత - మహీవ్యాజన- ఉరోలలాట ఘాత - విస్పష్టకరణ - ఉర్దూత - అవధూత - తిర్య జ్మార్గగత - గజస్కంధ - అవక్షేప - ఆపరాజ్ముఖ - దేవమార్గ ఆధోమార్గ - ఆమార్గ గమనాకుల - యష్టిఘాక - అవక్షేప - వసుధారణ - జానుబంధ - భుజాబంధ - సుదారుణగాత్ర బంధ - విపృష్ఠ - సోదక - శ్వథ - భుజావేష్టితములు (మల్లయుద్ధగతులు) కవచము ధరించి, అస్త్రశస్త్ర సంపన్నుడైన, గజాది వాహనారూఢుడై యుద్ధరంగమున ప్రవేశించవలెను. ఏనుగు మీద, ఇద్దరు మావంటి వాండ్రు ఉత్తమమైన ఆంకు శములు ధరించి ఉండవలెను. వారిలో ఒకడు. మెడమీదను రెండవ వాడు భుజముమీదను కూర్చుండవలెను. వీరు కాక ఇద్దరు ధనుర్గనుర్ధరులు, ఇద్దరు ఖడ్గధారులు కూడ ఏనుగుపై కూర్చుండవలెను. ఒక్కొక్క రథమును, గజమును రక్షించుటకు ముగ్గురేసి ఆశ్వికులుండవలెను. అశ్వమును రక్షించుటకై ధనుర్ధరులేన ముగ్గురేసి కాలి బంటులు ఉండవలెను. ధనుర్ధరుల రక్షణము నిమిత్తము కత్తిడాలు ధరించిన యోధులను నియమించవలెను. ఒక్కొక్క ఆయుధమును దానికి సంబంధించిన మంత్రముతో పూజించి, "త్రైలోక్యమోహన కవచము" పఠించి, యుద్ధరంగమునందు ప్రవేశించువాడు శత్రువులపై విజయము పొంది, భూతలమును రక్షించును.
అగ్ని మహాపురాణమునందు ధనుర్వేదకథనమను రెండు వందల ఏబది రెండవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 252 of the Agni Purāṇa is as follows:
The nine grahas (planets) — Sūrya, Candra, Maṅgala, Budha, Bṛhaspati, Śukra, Śani, Rāhu, and Ketu — are described with their physical characteristics, associated metals, gems, colors, and ruling deities. Agni provides the mantras for propitiating each graha and the specific pūjā materials, days, and flower-offerings appropriate to each. The chapter explains the graha's role as cosmic administrators who mediate karma and distribute the fruits of past actions to embodied souls.