హయగ్రీవుడు చెప్పేను: ఇపుడు మత్స్యాది దశావతారముల విగ్రహములను గూర్చి చెప్పెదను. మత్స్యావతార విగ్రహము మత్స్యాకార మునను, కూర్మావతార విగ్రహము కూర్మాకారమునను ఉండవలెను. భూమిని పైకి లేవనెత్తుచున్న వరాహావతార విగ్రహమును మనుష్యాకారమున నిర్మి కపవలెను. కుడి చేతిలో గదా-చక్రములు, ఎడమచేతిలో శంఖపద్మములు ఉండవలెను. లేదా పద్మమునకు బదులు ఎడమ ప్రక్క లక్ష్మీదేవి ఉండవలెను. లక్ష్మి ఆతని ఎడమ మోచేయి ఆనుకొని ఉండును. పృథివి, ఆది శేషుడు చరణములను అనుసరించి ఉండవలెను. వరాహమూర్తి స్థాపించిన వారికి రాజ్యము లభించును; అంతమున వారు, భవసాగరము దాటి మోక్షము పొందుదురు. నృసింహమూర్తి ముఖము తెరచి. ఉండును. తన ఎడమ తొడపై హిరణ్యకశిపుని అణచి ఉండి వాని వక్షమును చీల్చుచుండును. ఆతని కంఠమున మాలయు హస్తముందు చక్ర గదలును ఉండును. వామనుని విగ్రము ఛత్రముతోడను, దండముతోడను ప్రకాశింపవలెచు. నాలుగు భుజములుండవలెను. పరశురాముని చేతిలో ధనుర్బాణములు, ఖడ్గము, గండ్రగొడ్డలి ఉండవలెను. శ్రీ రాముని విగ్రహము ధనుర్బాణఖడ్గశంఖములతో ఒప్పారు చుండును. లేదా, ఆతనికి రెండు భుజములు మాత్రమే ఉండవచ్చును. బలరాముడు గదను, నాగలిని ధరింపవలెను. లేదా ఆతనికి నాలుగు భుజములుండవచ్చును. ఆతనిపై ఎడమచేతిలో నాగలి, క్రింది చేతిలో ఆందమైన శఅఖము, పై కుడిచేతిలో ముసలము, క్రింద చేతిలో సుదర్శన చక్రము ఉండవలెను. బుద్దుడు శాంత స్వరూపముతో, వరద - అభయముద్రలు ధరించి, ఉన్నతమైన పద్మాసనముపై కూర్చుండవలెను. తెల్లని శరీరవర్ణముతో, పొడవైశ చెవులతో, అందమైన పీతవస్త్రముచే కప్పబడి యుండవలెను. కల్కి ధనుస్తూణీరములను ధరించి, మ్లేచ్చులను సంహరించు బ్రాహ్మణుడు. లేదా ఆతని విగ్రహమును గుజ్జముపై ఎక్కి నాలుగు చేతులలో అడ్డ-శంఖచక్ర గదలను ధరించి ఉండవలెను.
ఇపుడు వాసుదేవాదులగు తొమ్మండుగురి మూర్తుల లక్షణము చేప్పెదను. వాసుదేవునకు పై కుడిచేతిలో చక్ర ముండుట ప్రధాన చిహ్నము ఒక పార్శ్వమున బ్రహ్మ, మరొక పార్శ్వమున శివుడు సర్వదా ఉందురు. ఇతర విషయము లన్నియు వెనుక చెప్పినట్లే, శంఖమునుగాని, వరదముద్రను గాని ధరించి యుండును. ద్విభుజుడు కావచ్చును. చతుర్బుజుడు కావచ్చును. బలరామునకు నాలుగు భుజములుండును. కుడి చేతులతో హల–ముసలమును, ఎడమ చేతులలో గదాపద్మములను ధరించి ఉండును. ప్రద్యుమ్నుడు కుడిచేతులలో చక్ర-శంఖములను, ఎడమ చేతులలో ధన్బూణములను ధరించి యుండును. లేదా రెండు భుజములుండి ఒక చేతిలో గదను, రెండవ దానిలో ధనస్సును ధరించి యుండును. ఈ ఆయుధములను ప్రసన్న తా- పూర్వకముగ ధరించి యుండును. లేదా ఒక హస్తమున ధనస్సు, రెండవ హస్తమున బాణము ఉండును. అనిరుద్ద-నారాయణుల విగ్రహములు చతుర్భుజములు. బ్రహ్మహంసారూఢుడు. నాలుగు ముఖములు, ఎనిమిది భుజములు, విశాలమైన ఉదర మండలము, పొడవైన గడ్డము, శిరస్సుపై జటలు ఉండును. - కుడిచేతులలో అక్ష సూత్రమును-స్రవమును, ఎడమచేతులలో కుండికను, ఆజ్యస్థాలిని ధరించి యుండును. ఎడమ ప్రక్క సరస్వతి, కుడి ప్రక్క సావిత్రి ఉండును. విష్ణువు గరుడారూఢుడై ఎనిమిది భుజములతో, కుడి చేతులలో ఖడ్గ-గదా-బాణ-వరదముద్రలను, ఎడమ చేతులలో ధనుస్ఖేటక.చక్ర-శంఖములను ధరించి యుండును. లేదా ఆతని విగ్రహము చతుర్భుజము కూడ కావచ్చును. చతుర్భుజుడై న నృసింహుడు రెండు చేతులలో శంఖచక్రములను ధరించి, రెండు చేతులలో హిరణ్యకశిపుని వక్షము చీల్చు చుండును.
వరాహమూర్తికి నాలుగు బాహువులుండును. ఆది శేషుని చేతితోపట్టుకొనును. ఎడమచేతితో భూదేవిని ధరించును. ఎడమపార్శ్వమున లక్ష్మి ఉండును. లక్ష్మియున్నపుడు భూమీ ఆతని పాదములందు లగ్నమైనట్లు చేయవలెను. త్రైలోక్య మోహనమూ రీయైన శ్రీహరి గరుడారూఢుడు; ఎనిమిది భుజములు. కుడి చేతులలో చక్రశంఖ-ముసల అంకుశములను, ఎడమచేతులలో శంఖ-శార్ణ-గదా-పాశములును ఉండును. వామభాగమున పద్మహస్తయైన , లక్ష్మి ప్రతిమను, దక్షిణ పార్శ్వమున సరస్వతి ప్రతిమను నిర్మింపవలెను. విశ్వరూపుని విగ్రహము ఇరువది చేతులతో ప్రకాశించుచుండును. కుడి చేతులలో చక్ర ఖడ్గ.ముసల-అంకుశ-పట్టిక -ముద్గర పాశ శ క్తి-శూల-బాణములను, ఎడమచేతులలో శంఖ-శార్ణ-గదా. పాశ - తోమర - హల - పరశు - దండ - ఛురికా (దాత) - చర్మలను ధరించి యుండును. కుడి వైపున చతుర్భుజుడగు బ్రహ్మ, ఎడమవై పున, త్రినేత్రుడును . ఉందురు. జలశాయి జలములో శయనించి ఉండును. ఈ మూర్తిని శేషశయ్య పై శయనించి యున్నట్లు చేయవలెను. లక్ష్మీదేవి ఒక పాదము ఒత్తు చుండును. విమల మొదలగు శక్తులు స్తుతించుచుండును. ఈ శ్రీహరి నాభికమలమున చతుర్భుజుడగు బ్రహ్మ ప్రకాశించుచుండును. హరిహరమూర్తి కుడి చేతులలో శూల ఋష్టులను, ఎడమచేతులలో గదా చక్రములను ధరించియుండును. శరీరము కుడిభాగమున రుద్రచిహ్నములు, ఎడమభాగమున కేశవచిహ్నములు ఉండును. దక్షిణపార్శ్వవమున పార్వతి, వామపార్శ్వమున లక్ష్మీ ఉందురు. హయగ్రీవుని నాలుగుచేతులలో శంఖ చక్ర గదా-వేదములుండును. ఎడమపాదము ఆది శేషునిమీదను, కుడిపాదము కచ్చపము వీపు పైనను ఉంచియుండును. దత్తాత్రేయునకు రెండు బాహువులుండును. వామాంకమున లక్ష్మి ఉండును. భగవంతుని పార్షదుడైన విష్వక్సేనుడు నాలుగు చేతులలో చక్ర గదా-హల-శంఖములను ధరించియుండును.
శ్రీ అగ్ని మహాపురాణమునందు మత్స్యాదిప్రతిమాలుక్షణమను నలుబదితొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 49 of the Agni Purāṇa is as follows:
This chapter provides a theological summary of the Āgamic system underlying the preceding ritual chapters. The Āgama is defined as the revealed teaching that descends from Śiva to Pārvatī, from Pārvatī to Skanda, and thence to human teachers (ācārya-s). The four pāda-s (sections) of the Āgama — jñāna (knowledge), yoga (discipline), kriyā (ritual), and caryā (conduct) — are described as the four pillars supporting the entire edifice of Śaiva practice. The hierarchical cosmology of 36 tattva-s (from Śiva-tattva at the summit to the gross earth element at the base), the three categories of souls (vijñānakala, pralayākala, and sakala), and the three bonds (āṇava, māyīya, and kārma mala-s) are introduced. The chapter affirms that Āgamic practice — specifically the consecrated worship of the properly installed image — is the most direct path to liberation in the current age.