పరమేశ్వరుడు చెప్పెను. భుక్తి ముక్తి ప్రదమును సౌభాగ్యాది దాయకమును అగు ఉమా పూజను చెప్పెదను. మంతధ్యాన మండల ముద్రా హోమాది సాధనములను కూడ చెప్పెదను. “గౌరీమూర్తయే నమః” యిది గౌరీ దేవి వాచక మూల మంత్రము. “ఓం హ్రీం సః శాం గౌర్యై నమః” వీనిలో మూడక్షరముతో “నమః” ఆదులు చేర్చి షడంగన్యాసము చేయవలెను. ప్రణవముచేత ఆసనమును, హృదయ మంత్రముచే మూర్తిని కల్పించవలెను. కాల బీజ శివ బీజముల ఉద్దా రము చేయవలెను. దీర్ఘ స్వరాక్రాంత ప్రాణముతో (యాం యీం మొదలు) జాతి యుక్త షడన్యాసము చేయవలెను. ప్రణవ ముతో ఆసనన్యాసము హృదయ మంత్రముతో మూర్తి న్యాసము చేయవలెను. ఇంతవరకు యామల మంత్రము చెప్పితిని. ఇపుడు ఏక వీరమును చెప్పెదము. అగ్ని మాయాకుళానువులతో సృష్టిన్యాస యుక్త మగు వ్యాపక న్యాసము చేయవలెను. శివ శక్తి మయ బీజములు హృదయాదులందు వర్ణితములు. బంగారము, వెండి, శిల మొదలైన వాటితో గౌరీ ప్రతిమ చేసి పూజించవలెను. లేదా పంచ పిండ ప్రతిమ చేయవలెను. నలు వైపుల ఆవ్యక ప్రతిమయు, మధ్యమున వ్యక ప్రతిమయు వుంచవలెను. ఆవరణ దేవతా రూపమున క్రమముగా లలితాది శక్తులను పూజించవలెను. మొదట వృత్తాకార మగు అష్ట దళ కమలము ఏర్పరచి ఆగ్నేయాది దళము లందు క్రమముగ, లలితా, సుభగా, గౌరి క్షోభణీలన, పూర్వాది దళము లందు వామాజ్యేష్ణా, క్రియా, జ్ఞానాలను, పీఠ యుక్త వామ భాగము నందు శివుని అవ్యక్త రూపమును పూజించవలెను. దేవి వ్యక్త రూపమున రెండు లేదా మూడు నేత్రము లుండును. ఆమెను శుద్ద రూపుడగు శివునితో కలిపి పూజించవలెను. ఆ దేవి రెండు పీఠము లందు లేదా రెండు పద్మము లందు కూర్చుండును. ఆమెకు రెండు నాలుగు ఎనిమిది లేదా పదునెనుమిది భు జము లుండును. సింహము పై గాని, తోడేలు పై కాని కూర్చుండును. కుడి ప్రక్కన వున్న తొమ్మిది హస్తములలో స్రక్. అక్ష సూత్రకలికా, ముండ, ఉత్పల, పిండికా, బాణ, చాపములు వుండును. వామ హస్తము లందు పుస్తక తాంబూల దండ అభయ కమండలు గణేశ దర్పణ బాణ చాపము లుండును.
ఆమెకు వ్యక్త మద్రలుగాని, అవ్యక్త ముద్రలు గాని చూపవలెను. ఆసన సమర్పణమున పద్మముద్ర చూపవలెను. శివుని పూజించునపుడు లింగముద్ర చూపవలెను. దీనికే శివ మద్రయని పేరు ఇరువురికి ఆవాహనీముద్ర చూప వలెను. శక్తి ముద్రకు యోనియని పేరు. ఇది చతురస్ర మండలాకారము మధ్యనవున్న నాగు కోష్ఠములలో త్రిదళ కమలములను వ్రాయవలెను. మూడు కోణముల ఊర్ధ్వ భాగమునందు రెండేసి పదములలో ఆర్ధచంద్రుని వ్రాయవలెను. మొదటి దాని కంటే రెండవది రెట్టింపుండ వలెను. రెండేసి పదముల ద్వారకంఠ భాగము, దానికి రెట్టింపు ఉపకంఠము వుండవలెను. ఒకొక్క దిక్కు యందు మూడేసి ద్వారములు వుంచి లేదా సర్వతో భద్రమండలము ఏర్పరచి పూజించవలెను. లేదా వేదిక పై దేవతను స్థాపించి పంచగవ్య పంచామృతాదులతో పూజించవలెను. ఉత్తరాభి ముఖుడై పూజించి రక్త పుష్పములను సమర్పించవలెను. ఆజ్యముతో నూరు హోమములు చేసి పూర్ణాహుతి నిచ్చువాడు సర్వసిద్ధులను పొందును. బలి సమర్పించు ముగ్గురు లేదా ఎనమండుగురు కన్యకలకు భోజనము పెట్టవలెను, పూజా నైవేద్యమున శివభక్తులకు ఇవ్వవలెను. కాని, తాము స్వీకరించరారు. ఇట్లు చేయుటచే కన్య కోరువానికి కన్య లభించును. పుత్రులు లేనివానికి పుత్రులు లభించును. దౌర్భాగ్యవంతురాలు సౌభాగ్యశాలిని యగును. రాజు రణము నందు జయమును రాజ్యమును పొందును. ఎనిమిది లక్షలు జపించుటచే వాక్సిద్ధి కలుగును. దేవతలు వశమగుదురు. ఇష్టదేవతకు నివేదించ కుండగ భోజనము చేయకూడదు. ఎడమ చేతిలో కూడ పూజించవచ్చును. విశేషించి అష్టమీ చతుర్ధ తృతీయ లందు ఆట్లు చేయవలెను.
ఇపుడు మృత్యుంజయ పూజను చెప్పెదను. కలశ ముపై పూజ చేయవలెను. హోమమునందు ప్రణవము మృత్యుం జయుని మూర్తి మూల మంత్రము చెప్పుచు కుంభముద్ర చూపవలెను. క్షీర దూర్వా, ఆజ్య, అమృత, పునర్నవా, పాయస పురోడాశములతో హోమము చేయవలెను. హోమమునకు పూర్వము పదివేలు మంత్ర జపము చేయవలెను. మృత్యుం జయునకు నాలుగు ముఖములు నాలుగు భుజములు వుండును. రెండు హస్తములలో కలశమును రెండు హస్తములలో వరదా భయములను ధరించి యుండము. కుంభముద్రచే మృత్యుంజయునకు స్నానము చేయించవలేను. ఆరోగ్యైశ్వర్య దీర్ఘాయువులు లభించును. ఈమంత్రముతో అభిమంత్రించిన ఔషధము శుభకరము మృత్యుంజయుని ధ్యానించినను పూజించి నను అపమృత్యువు తొలగును.
Summary of chapter 327 of the Agni Purāṇa is as follows:
The installation of the Śivalinga is described as one of the most meritorious acts a devotee can perform. Agni enumerates the types of liṅga — svayambhū (self-manifested), bāṇa, daiva, ārṣa, mānuṣa — and the materials from which man-made liṅgas may be fashioned: stone (śaila), metal (dhātu), wood (kāṣṭha), and gem (ratna). The auspicious measurements, the proportions of the pīṭha, and the proper orientation of the mukha (face) on a mukhaliṅga are detailed. The ritual of sthāpanā, including the nayanonmīlana (eye-opening ceremony), nyāsa, and the first abhiṣeka with milk, honey, and pañcāmṛta, is enumerated.