అగ్ని చెప్పెను: ఇపుడు భుక్తి ముక్తి ప్రదము అగు వారవ్రతములను చెప్పెదను. రవివారమునాడు హస్త కాని పునర్వసు కాని వచ్చినపుడు పవిత్ర మగు సర్వోషఫీజలముతో స్నానము చేసి, రౌద్దము చేయువాడు ఏడు జన్మల వరకను రోగములచే పీడింపబడడు. సంక్రాంతి దినమున భానువాసర మైనచో, ఆది పవిత మగు ఆదిత్యహృదయము అని చెప్పణడును. ఆ దినమున గాని, హస్త నక్షత్రయుక్త జానువారమునందు గాని ఒక సంవత్సరము నక్త వ్రతము చేయువానికి సర్వము లభించును. ఏడు చిలానక్షత్రయుక్త సోమవార వ్రతములు చేయువాడు సుఖవంతు డగును. స్వాతీనక్షత్రయుక్త మంగళ వార వతము ప్రారంభించి, ఏడు ముగలవార నక్త వతములు చేయువాడు అన్ని కష్టములనుండియు విముక్తుడగును. విశాఖా నక్షత యుక్త బుధవారమునాడు ప్రారంభించి ఏడు బుధవారనక్త వ్రతము లాచరించువాడు బుధగ్రహపీడ నుండి విముక్తు డగును. అనురాధానక్షత్రయుక్త గురువారమునాడు ప్రారంభించి ఏడు గురువారనక్త వ్రతములు చేయువాడు బృహస్పతి గ్రహపీడనుండి విముక్తు డగును. జేష్టానక్షత్రయుక్త శుక్రవారమునాడు ప్రారంభించి ఏడు శుక్రవాడవక్త వ్రతములు చేయువాడు శుక్రగహపీడనుండి విముక్తుడగును. మూల నక్షత్రయుక్త శనివారమువాడు ప్రారంభించి ఏడు శనివాసర నక్త వ్రతములు చేయువాడు శనిగ్రహాపీడమునుండి విముక్తు డగును.
ఆగ్ని మహావురాణమునందలి వారవ్రతవర్ణనమును నూటతొంబదియైదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 195 of the Agni Purāṇa is as follows:
Vratas assigned to each day of the week and their connection with graha-śānti are described. For Sūrya on Sunday, bathing with sarvauṣadhi when the Hasta or Punarvasu nakṣatra falls on that day is prescribed; on Saṃkrānti-Sūrya-vāra, the recitation of Ādityahṛdayam is recommended. Soma-vāra (Monday) vratas are performed when the Citrā nakṣatra falls on Monday, observed seven times. Maṅgala-vāra (Tuesday) calls for seven nakta-vratas when Svātī nakṣatra falls on Tuesday. The Budha-vāra, Guru-vāra, Śukra-vāra, and Śani-vāra vratas are similarly linked to Viśākhā, Anurādhā, Jyeṣṭhā, and Mūla nakṣatras respectively, each capable of pacifying the corresponding planet's adverse effects.