పరమేశ్వరుడు చెప్పెను ; ఇపుడు వశీకరణాదయోగములను చెప్పెదను. భృంగరాజము (16) సహదేవి (8) మయూర శిఖ(8), పుత్రజీవక వృక్షము బెరడు(2), ఆధఃపుష్ప రుద్రదంతిక(4), కుమారి(11) రుద్రజటి), విష్ణు క్రాంత(10), శ్వేతార్కము(ల్), లజ్జాలుక (4), మోహలత(ల), కృష్ణదత్తూరము(6), గోరక్షకర్కటి(14), మేషశృంగి(1) స్నుహి(15) అను ఓషధుల పేర్లను పదునారు కోష్ఠములు గల చక్రమునందు వ్రాయవలెను. ఓషధుల భాగములు ప్రదక్షిణ క్రమమున 16, 11,8,10,6 4,9,6,12,1,15, అను సంఖ్యలలో నిర్దేశింపబడును. మొదటి నాలుగు ఓషధులను చూర్ణము చేసిదాని ధూపమును ఉపయోగించవలెను. లేదా వీటిని నీటితో మర్ధించి, ముద్ద చేసి, శరీరావయములకు పట్టించుకొనవలెను. 8, 10.11,12, సంఖ్యల ఓషధులతో ఆంజనము తయారుచేసి నేత్రములందు ధరింపవలెను. చివరి నాలుగు ఓషధులు కలిపిన జలముతో స్నానము చేయవలెను. 5, 6, 7,8, సంఖ్యల ఓషధులు మర్దించి అనులేపనము ఉపయోగించపలెను. అధఃపుష్పను. దక్షిణపార్శ్వములందును, లాజవంతి మొదలై నవాటిని వామపార్శ్యమునందును ధరించవలెను, మయూరశిఖను పాదములందును ఘృతకుమారిని శిరస్సుపైనను ధరించవలెను. రుద్రజట, గోరక్షకర్కటి, మేషశృంగుల ధూపమును అన్ని కార్యము లందును ఉపయోగించవలెను. వీటిని మర్దించి, ముద్ద చేసి శరీరముపై అలముకొన్నవానిని దేవతలు కూడ గౌరవింతురు. భృంగరాజాద్యౌషధులు నాలుగును ధూపమునకు ఉపయోగించును. వాటిని మర్దించి శరీరమునకు పూసికొనినచో గ్రహాదిజనీత బాధ తొలగును. లజోలుకోద్యోషధులు ఆంజనమునకును, శ్వేతారాదులు స్నానమునకును ఉపయోగించును, మృత కుమార్యాదులు తినుటకును, పుత్రజీవకాదులు నీటితో కలిపి త్రాగుటకును ఉపయోగించును. 16,4,8.2, సంఖ్యల ఓషధులతో తయారు చేసిన తిలకము సకలలోక మోహనము. గోరక్షకర్కటి కృష్ణదత్తూరము, పుత్రజీవకము, అధఃపుష్ప అను ఓషధులనుతన శరీరముపై పూనుకొనుట చే స్త్రీవశ మగును. మేషశృంగి, రుద్రదంతిక, మయూర శిఖ కుమారి అను ఓషధులను యోనియందు లేపము చేయుటచే స్త్రీవశమగును. స్నుహి, అపరాజితా, లాజవంశీ, శ్వేతార్కములతో తయారు చేసిన గుటికలు జనులను వశము చేయును. ఎవనిని వశము చేసికొనవలెనో వాని భక్ష్యభోజ్య. పేయ పదార్థములలో ఈ గుళికలను కలిపి ఇవ్వవలెను. భృంగరాజమోహలతా-పుత్రజీవక-ఆధఃపుష్పాఓషధులను నోటిలో ధరించుటచే శత్రువు లుపయోగించు అస్త్రశస్త్రములు స్తంభితము లగును. అధఃపుష్పా-రుద్రదంతీ.లాజవ స్త్రీ. మోహలతలను శరీరముపై పూసుకున్న వాడు నీటిలో నివసించగలడు. శ్వేతార్క-పుత్రజీవక-రుద్రదంతీ కుమారీ ఓషధులతో తయారు చేసిన వటి ఆకలిదప్పులు మొదలగు వాటిని తొలగించును, సహదేవీ భృంగరాజ-అపరాజితా శ్వేతార్క ఓషధుల లేపముచే దుర్భగ యగు శ్రీ సుభగ యగుమ. కృష్ణదత్తూర-పుత్రజీవక – విష్ణుక్రాంతా_సహదేవీ-ఓషధులను తన శరీరమునందు పూసుకొన్న వాడు సర్పములతో ఆడుకొనవచ్చును. కృష్ణదత్తూర పుత్రజీవక-ఘృతకుమారీ-మయూర శిఖా ఓషధులలేపమును పూసుకొనుటచే శ్రీ సుఖముగా ప్రసవించుమ. ఆధఃపుష్పా- అపరాజితా అధఃపుష్పామోహలతా ఓషధులను వస్త్రమునకు లేపము చేసినవాడు ద్యూతమునందు విజయము పొందును, కృష్ణదత్తూర పుత్రజీవక-ఆధఃపుష్పారుద్రదంతికా ఓషధులను పూసుకొని రతి చేయగా కుమారుడ పుట్టును. మోహలతా-అధఃపుష్పా-గోరక్షకర్కటీ-కృష్ణదత్తూర ఓషధులతో తయారుచేసిన వటి సర్వవశంకరమం. ఈ విధముగ పదునారు పదములలో ఉన్న ఓషధుల ప్రభావము వర్ణించబడినది.
అగ్ని మహాపురాణమునందు వశ్యాదియోగవర్ణన మను నూటనలుబదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 140 of the Agni Purāṇa is as follows:
Astrological yogas conducive to vaśya (attraction of others) and related beneficial purposes are described. Agni explains specific planetary combinations that enhance personal authority, charisma, and the ability to draw others' loyalty. The role of lagna, the Moon's nakṣatra, and auspicious planetary aspects in determining the strength of such yogas is laid out. Remedial mantra-prayogas and gem-wearing recommendations for strengthening weak benefic planets are given. The chapter links astrology with practical dharmic living, treating planetary influence as a dimension of the cosmic order (ṛta) within which the individual must navigate skillfully.