పాలకాప్యుడు పలికెను. ఓ లోమపాదా! నీకు గజ లక్షణములను, గజ చికిత్సను చెప్పెదను. దీర్ఘములైన తొండము లుండి, దీర్ఘ శ్వాస తీసుకును గజములు సహన శక్తి కలవి. ఇరువది లేదా పదునెనిమిది నఖము లుండి శీత కాల మన మదమును స్రవించునవి ప్రశస్తములు కుడిదంతము ఎత్తుగా వున్న వి, మేమము వంటి బృంహితము కలవి విశాలమైన కర్ణములు కలిపి, చర్మ పై సూక్ష్మ బిందువులు, కలవియు యగు ఏనుగులను సంగ్రహించవలేను. పొట్టి లక్షణ హీనము లగు వాటిని సంగ్రహించరాదు. పార్శ్వ గర్బము గల ఆడ ఏనుగులను మూడోన్మత్త గజములను వుంచుకోన గూడదు. వర్ణము సత్వము, బలము, రూపము, కాంతి సంహననము, జవము యను ఏడు సల్ల క్షణములు గల గజము యుద్ధమున శత్రువులను జయించును. శిబిరమునకు, సేనకును గొప్పథ నిచ్చు నవియు గజములే. రాజులు ఏనుగుల వలననే విజయ మును కోరుకును చుందురు.
ఏనుగుల, అన్ని విధముల జ్వరమునందును ఆనువాసనము చేయవలయును. ఘృత తైలాభ్యంగ యుక్త మగు స్నానము వాత రోగ వినాశకము. స్కంద రోగమునకు కూడ పాలకమునందువలే ఏనుగులకు చికిత్స చేయవలయును. పాండు రోగమున గోమూత్రమును హరిద్రను ఘృతమును ఇవ్వవలెను. కలబంధమునందు శరీరమునకు తైలముపూసి స్నానము చేయించుట మంచిది. ఏనుగుకు పంచల వణయుక్తమగు మదిరను త్రాగించవలెను. మూర్ఛరోగము వచ్చిన ఏనుగుకు వాయు విడంగ, త్రిఫలా, త్రికటు, సైంధవముల గ్రాసమును తినిపించి మధు యుక్త మగు జలము త్రాగించ వలెను. శీరశ్శూల రోగమునందు అభ్యంగము నశ్యము ప్రక సతములు. తె లయుక్త పుటకములతో పాదరోగములకు చికిత్స ప్రారంభించి, పిదప కలకషాయముతో శోధనము చేయించవలెను. కంపన రోగముననున్న గజమునకు 18 తితి రి, లావపక్షుల మాం:మును పిప్పలి మరిచములు కలిపి తినిపించవలేను అతీసాన రోగమునందు బిలబిల్వ లోధ్రధానకీ, శర్కరలతో పిడి తినిపించవలేను, తొండమునకు రోగము వచ్చినపుడు లవణయుక్తమగు ఘృతమును నశ్యముగ ఇవ్వ వలెను. ఉత్కర్లక రోగము నందు మాగధి నాగరాజ జీర, లతో చేసిన గంజి వారాహీకందరసము ఇవ్వవలెను. దళ మూల కులుళ్ల ఆమ్ల కాక మాచి, లతో చేసిన తైలమును మిర్చితో కలిపి ఉపయోగించినచో గల గ్రహరోగము నశించును. మూత్రక్చురోగము నందు అష్టలవణయు క్తములగు సురను మృతమును, త్రాగించవలెను. లేదా త్రాపుష బీజ క్వాథమును ఇవ్వవలెను. చర్మ దోషమునందు నింబ, క్వాథముగానీ, వృషక్వాథ ముగాని ఇవ్వవలెను. కోష్ణ కుములను తొలగించుటకు గోమూత్ర వాయు విడంగ మురు ప్రశస్తములు, గాయములు మాన్పించుటకు శృంగి బేకకణ ద్రాక్ష, శర్కరలతో కాచి 5 జలము ప్రశస్త ము. మాంసరసము కూడ పాతకరము ఆ రుచిరోగమున వ్యోషయుక్తమగు పెసల అన్నము మంచిది త్రివృత్ వ్యోష ఆగ్ని, దంతి, ఆర్క, శ్యామ, క్షీర గజ పిప్పలులతో చేసిన స్నేహము గుల్మరోగములు పోగొట్టును. ఇట్లే గజ చికిత్స కుడు భేన ద్రావణ ఆక్యంగ స్నేహపావ, అనువాసనములతో గూగ అన్ని విధములగు విదధి రోగములను నశింపచేయవలెను.
గజమునకు కట రోగము నందు ముద్ద సూపముతో దష్టికమును కలిపి, బాల బిల్వములతో లేపము చేయవల యును. అన్ని విధముల శూలములను తొలగించుటకు దివ పూర్వ భాగమున పిడంగ, యింద్ర, యవ, హింగు వివిధ హరిద్రా పిండములను ఇవ్వవలెను. ఏనుగులకు ఉత్తమ భోజనము. యితర భక్ష్యములు ఆధమ భోజనము యవలు ఇస్తువు ఏనుగులకు బలమును పెంచును. శుష్క తృణము ధాతు ప్రకోపము కల్గించును. క్షీణించిన మనము గల గజమువకు పాలు త్రాగించుట ఆగ్ని దీప్తిని కలిగించు ద్రవ్యము. వండిన మాంస రసము లాభకరములు. వాయస, కుక్కుర కాక ఉలూక, హరులను కౌద్రముతో కలిపి పిండము చేసి, యుద్దము నందు మహా పద యందును ఇవ్వవలెను. కటు, మత్స్య, విడంగ లవణ కోశాతకీ క్షీర, హరిద్రలతో ధూపము వేసినచో ఏనుగ జయప్రద మగును. పిప్పలి తండులములు బియ్యము తైలము మాధ్వీకము, తనే వీటిని నేత్ర మందు వేసినచో యవి దీపనీయములు. చటక పురీషము, పార్వత పురీషము, క్షీర వృక్షము. మద్యము వీటితో చేసిన అంజనము ఏనుగులకు ఇష్టమైనది. ఈ ఆంజనము నేత్రములకు పూసిన ఏనుగు యుద్ధము నందు శత్రువును మర్దించును. నీని కమలములు ముస్తతగరము, వీటిని, తండు లోదకము నందు నూరి, ఏనుగుల నేత్రము లకు పెట్టినచో పరమ శాంతి నిచ్చును. గోళ్ళు పెరిగినపుడు వాటిని ఖండించ వలెను. ప్రతిచూసము తైలాభ్యంగనము చేయవలయును. ఏనుగులు శయనించు స్థానమున ఎండిన పేడ పరాగము యుండవలెను. శర ద్గ్రీష్మము లందు వీటికి ఘృత సేకము చేయుట ఉపయోగ కరము.
అగ్ని మహా పురాణమున గజ చికిత్స యను రెండు వందల యెనభై ఏడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 287 of the Agni Purāṇa is as follows:
Elephant medicine as narrated by Pālakāpya to King Lonapāda is presented. The characteristics of a superior elephant — twenty or eighteen nails, an elevated right tusk, a deep trumpet resonance like rumbling clouds, wide ears, and mada (musth) occurring in the cold season — are described. The eight genealogical lines of elephants from the aṣṭa-diggajas — Kumuda, Airāvaṇa, Padma, Puṣpadanta, Vāmana, Supratīka, Añjana, and Nīla — are enumerated. The four gaṇa types (bhadra, mandra, mṛga, saṃkīrṇa) classify elephants by character. Treatments for jvara, pāṇḍu-roga, śūla, atisāra, galāgraha, pāda-roga, mūtra-kṛcchra, and unmāda are prescribed, with ṣaṣṭika rice recommended as the finest food for elephants.