ఆగ్నిదేవుడు పలికెను : నే నిపుడు భుక్తిముక్తి ప్రదము లగు మాసవ్రతములను గూర్చి చెప్పెదను. ఆషాడాది మాసచతుష్టయమునందు అథ్యంగస్నానము చేయరాదు. దీనివలన ఉత్తమబుద్దిమంతు డగును. వైశాఖమున పుష్పములను లవణమును త్యజించి గోదానము చేయువాడు రాజ్యమును పొందును. ఒక మాసము ఉపవాస ముండి గోదానము చేయువాడు ఈ భీమవ్రతప్రభావముచే విష్ణుసాయుజ్యము పొందును. ఆషాఢాదిమాసచతుష్టయమునందు నియమపూర్వకముగా ప్రాత స్నానము చేయువాడు విష్ణులోకము చేరును. మాఘతృతీయడందు లేదా చైతతృతీయయందు గుడ ధేనుదానము చేయుటకు గుడ వ్రత మని పేరు. ఈ మహావ్రతమాచరించువాడు శివస్వరూపుడగును. మార్గశీరాదిమాసములందు నక్త వతమాచరించు వాడు విష్ణులోకమునకు అర్హు డగును. ఏక భుక్త వ్రత మాచరించువాడు ఆ విఢముగ నే వేరుగా ద్వాదశీవ్రతపాలనము కూడ చేయవలెను. ఫలవ్రతము చేయువాడు చాతుర్మాస్యమున ఫలములు పరిత్యజించి వాటిని దానము చేయవలెను. శ్రావణము మొదలు మాసచతుష్టయమునందు వ్రతముల నాచరించుటచే సర్వమును పొందును. చాతుర్మాస్య వ్రతము ఈ విధముగ ఆచరించ వలెను ఆషాఢశుక్లైకాదశినాడు ఉపవాస ముండవలెను. ఆషాఢమున వచ్చు కర్కటసంకాంతియందు శ్రీమహావిష్ణువును పూజించవలెను. “దేవా! నేను నీ ఎదుట ఈ వ్రతము అవలంబించినాను. కేశవా ! నీ యనుగ్రహముచే ఇది నిర్విము ముగ సిద్దించుగాక. దేవాధిదేవా! జనార్ధనా! ఈ వ్రతము ప్రారంభించిన తరువాత ఇదిపూర్తి కాకుండగనే నేను మరణించినచో, నీ కృపచే ఇది పరిపూర్ణ మగుగాక!” అని ప్రార్థించవలెను.
వ్రత మాచరించు ద్వీజుడు మాంసాదులను, తైలమును పర్జించి శ్రీమహావిష్ణువును పూజించవలెను. రోజు విడచి రోజు ఉపవాస ముండుచు తిరాతవత మాచరించువాడు విష్ణులోకము పొందును. చాంద్రాయణము చేయువాడు విష్ణు లోకమును చేరును. మౌనవతము పాటించువాడు మోక్షమునకు అధికారి యగును. ప్రాజాపత్యవతమాచరించువాడు స్వర్గము. పొందును. సత్తువులను, యవలను, తినుచు క్షీరాదులు సేవించుచు, లేదా పంచగవ్యములను, జలములను గహించుచు కృచవతము చేయువాడు స్వర్గము చేరును. శాక-మూల-ఫలాహారము మాత్రము భుజించుచు కృచ వ్రతము చేయువాడు వైకుంఠము చేరును. మాంస - రసములను పరిత్యజించి యవలు మాత్రము భుజించువాడు శ్రీమహావిష్ణసాంనిధ్యము. పొందును. ఇపుడు కౌముదవతమును గూర్చి చెప్పేదను. ఆశ్వయుజ శుక్ల ఏకాదశినాడు ఉపవాసముండి, ద్వాదశినాడు, శ్రీమహావిష్ణువు అవయవములకు చందనాదులు పూసి, ఉత్పలాదులతో పూజించవలెను. పిదప తైలదీపము సమర్పించి మృతపక్వాన్నము నైవేద్యము చేయవలెను. శ్రీమహావిష్ణువునకు మాలతీపుష్పముల కూడ సమర్పించవలెను. “ఓం నమో వాసుదేవాయ” అను మంత్ర ముచ్చరించుచు వ్రతసమాప్తి చేయవలెను. ఈ విధముగ కౌముద వ్రతము చేయువాడు ధర్మార్థ కామమోక్షములను స్వాధీనము చేసికొనును. మాసోపవాసవ్రతము చేయువాడు శ్రీమహావిష్ణువును పూజించి సర్వమును పొందగలడు.
అగ్ని మహాపురాణమునందు మాసవ్రతవర్ణనమను నూటతొంబది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 198 of the Agni Purāṇa is as follows:
Monthly vratas extending over one or more months are described. The Āṣāḍhādi-cāturmāsya (four-month discipline from Āṣāḍha) prescribes abstention from oil-bath (abhyaṅga). Vaiśākha-month purity with abstention from flowers and salt combined with go-dāna yields rājya-phala. The Bhīma-vrata of one complete month's upavāsa followed by go-dāna leads to Viṣṇu-sāyujya. Prātaḥ-snāna daily during the four months from Āṣāḍha rewards the performer with Viṣṇu-loka. The Guḍa-vrata performed on tṛtīyā in Māgha or Caitra with a guḍa-dhenu (jaggery-cow) gift transforms the giver into a Śiva-svarūpa. The Cāturmāsya-vrata procedure is given: beginning on Āṣāḍha-śukla-ekādaśī with a prayer invoking Janārdana's grace to complete the vrata even in the event of the performer's death.