హయగ్రీవుడు చెప్పెన : గరుడ - సుదర్శన - బ్రహ్మ-నృసింహమూర్తుల ప్రతిజ్ఞ కూడ, వారి వారి మంత్రములతో, విష్ణుమూర్తిని స్థాపించిన విధముననే స్థాపింపవలెను. ఆ విధానమును వినుము. “ఓం సుదర్శన... సుదర్శనాయ నమః” అను (మూలపులో వ్రాసిన) మంత్రముతో చక్రపూజ చేసిన వీరుడు యుద్ధమునందు శత్రువులను చీల్చివేయగలడు. “ఓం శేం నరసింహ ఉగ్రరూప జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల స్వాహా” అనునది నరసింహ మంత్రము. ఇప్పుడు నీకు పాతాలనృసింహమంత్ర ముపదేశించుచున్నాను.
ఇది పాతాలనృసింహమంత్రము. దీనిని ఈ విధముగ జపించగనే సత్పలము లభించును. శత్రువు ఆపకారము చేయు అసురులుమొదలగువారిని, పరులు ప్రయోగించిన మంత్రములను నశింపచేయుము అని దీని తాత్పర్యము. మధ్యనున్న 'హుం' 'ఫట్' ఆనువాటికి ప్రత్యేకముగ అర్థమేమియు ఉండదు. కాని ఉచ్చారణమాత్రముచేతనే అవి నశింపచేయుటలను ఆర్గమును సూచించును. “ఫట్' అనుదానికి మారకాస్త్రమని పేరు.]
“ప్రకాశించుచున్న కోటిసహస్రసూర్యులతో సమానమైన తేజస్సు కలవాడును, వజ్రము వంటి నఖములు, కోరలు ఆయుధముగా కలవాడును, పైకి విడివడి లేచిన జూలుచేత క్షోభింపచేయబడిన మహాసముద్ర జలముచే ఏర్పడిన దుందుభిధ్వని కలవాడును, సర్వమంత్రప్రయోగ ములనుండి తరింపచేయువాడును అగు భగవంతుడైన నరసింహునకు నమస్కారము. భగవంతుడవైన నర సింహా! రమ్ము; రమ్ము పురుషాః పరాపరబ్రహ్మరూపా! సత్యముచే ప్రకాశించుము ప్రకాశించుము. విజృంభించుము, విజృంభించుము. ఆక్రమించుము, ఆక్రమించుము. గర్జించుము, గర్జించుము. సింహ నాదము చేయుము, చేయుము. చీల్చుము, చీల్చుము. పారద్రోలుము, పారద్రోలుము. ఆవేశించుము, ఆవేశించుము. సర్వ మంత్రరూపములను, మంత్రజాతులను చంపుము, చంపుము. భేదించుము, భేదించుము. సంక్షేపించుము, సంక్షేపించుము. నడుపుము, నడుపుము. చీల్చుము, చీల్చుము. బద్దలుకొట్టుము, బద్దలుకొట్టుము. జ్వాలామాలాసముదాయస్వరూపాః ఆంతటను వ్యాపించిన అనంత మైన జ్వాలలయొక్కయు, వజములయొక్కయు, ఆశనులయొక్కయు సముదాయముచే పాతాలము లన్నింటిని నశింపచేయుము, నశింపచేయుము. అంతటను వ్యాపించిన, అనంత మైన జ్వాలలచేతను, వజ్రముల చేతను, శరపంజరముచేతను పాతాళముల నన్నింటిని చుట్టుముట్టుము. సర్వపాతాలములందు నివసించు అసురుల హృదయము లను లాగుము, లాగుము. శీఘ్రముగ కాల్చివేయుము, కాల్చివేయుము. వండుము, వండుము. మథించుము, మథించుము. ఎండ చేయుము, ఎండచేయుము. వారందరును నాకు వశ మగునంతవరకు ఖండించుము, ఖండించుము. “పాతాలేభ్యః ఫట్, అసురేభ్యః ఫట్, మనరూ పేభ్యః ఫట్, మంత్రజాతిభ్యః ఫట్” భగవంతుడవైన, నరసింహ రూపములో నున్న ఓ విష్ణ! నన్ను సందిగ్ధ స్థితి నుండియు, సర్వాపదల నుండియు, సర్వమంత్ర రూపములనుండియు రక్షింపుము, రక్షింపుము, “హుం”, “ఫట్” నీకు నమస్కారము, నమస్కారవం”.
ఇది శ్రీహరిరూపిణి యగు నృసింహవిద్య, సర్వార్థములను ఒసగునది. త్రైలోక్యమోహన శ్రీ విష్ణుమూర్తి ప్రతిష్ట త్రైలోక్యమోహనమంత్ర సమూహముతో చేయవలెను. ద్విభుజవిగ్రహమునకు ఎడమ చేతిలో గద, కుడి చేతిలో అభయ ముద్ర ఉండవలెను. చతుర్భుజరూప మైనచో పై కుడి చేతిలో చక్రము, పై ఎడమచేతిలో పాంచజన్యము ఉండవలెను. ఈ విగ్రహముతో శ్రీపుష్టులను గాని, బలరామ-సుభద్రలను గాని స్థాపింపవలెను. శ్రీవిష్ణు-వామన - వైకుంఠ-హయగ్రీవఅనిరుద్ధులను ప్రాసాగములో గాని గృహములో గాని, మండపమునందు గాని స్థాపింపవలెను. మల్యాద్యవతారములలో జల శయ్య పై స్థాపించి పరుండబెట్టవలెను. సంకర్షణ - విశ్వరూప-రుద్రమూర్తిలింగ ఆర్ధనారీశ్వర-హరిహర-మాతృకాగణభైరవ-సూర్య-గ్రహ-వినాయకులను, ఇంద్రాదులచే సేవింపబడు గౌరిని, చిత్రజను, బలాబలవిద్యను కూడ ఈ విధముగనే స్థాపింపవలెను.
ఇపుడు నేను గ్రంథ ప్రతిష్టను దానిలేఖన విధానమునుగూర్చి చెప్పెదను, ఆచార్యుడు స్వస్తిక మండలముపై శరయంత్రా సనము మీద నున్న లేఖ్యమును (వ్రాయదగిన దానిని), లిఖిత పుస్తకమును, విద్యను, శ్రీహరిని పూజించవలెను. పిదప యజమానుడు గురువును, విద్యను, శ్రీ మహావిష్ణువును, లేఖకుని పూజించవలెను. పిమ్మట పూర్వాభీముఖుడై పద్మివిని ధ్యానించి వెండి సిరాబుడ్డిలో నున్న సిరాలో ముంచి బంగారు కలముతో ఐదు శ్లోకములు దేవనాగరి లిపిలో వ్రాయవలెను. ఎదట బ్రాహ్మణులకు యథాశక్తి భోజనము పెట్టి, దక్షిణ ఇవ్వవలెను, ఆచార్య-విద్యా-శ్రీ మహావిష్ణువులను పూజించి లేఖకుడు పురాణాదులను వ్రాయుట ప్రారంభింపవలెను. వెనుకటి వలె మండలాదుల పై ఈశాన్యము నందున్న అద్దముమీద పుస్తకము నుంచి, మొదట చెప్పినట్లుగనే కలశ ములచే తడపవలేను. పిదప యజమానుడు నేత్రములను తెరచి, ఆ పుస్తకమును శయ్య పై ఉంచవలెను. పిమ్మట దానిపై పురుషసూక్తవేదాదిన్యాసము చేయవలెను. ప్రాణప్రతిష్టా పూజాచరుహోమములు చేసి, పూజించి, ఆచార్యుని దక్షిణాదులతో సత్కరించి బ్రాహ్మణ భోజనము ఏర్పరుపవలేను. ఆంతమున ఆ పుస్తకమును గృహమునందు గాని, దేవాలయమునందు గాని స్థాపించి పూజించవలెను. గ్రంథమును వస్త్రముతో ఆచ్ఛాదించి పాఠ ప్రారంభమునందును. అంతమునందును దానిని పూజించవలేను. పుస్తకమును చదువువాడు విశ్వశాంతి కలుగవలె నని సంకల్పించి ఒక అధ్యాయమును చదువవలెను. గురువు కుంభములోని జలముతో యజమానుడు మొదలగు వారికి అభిషేకము చేయించవలెను. బ్రాహ్మణునకు పుస్తకదానము చేసినచో అనంతఫలము లభించును. గోదాన భూదాన విద్యాదానము లను మూడు దానములకును అతిదానము అని పేరు. పాలుపిదుకుట, విత్తనములు, చల్లుట అను పనులు చేయగనే ఆ దానములు చేసిన వాడు నరకము నుండి ఉద్ధరింపబడును. సిరాతో రాసిన పత్రములను దానము చేసినచో విద్యాదానఫలము లభించును. ఆ పత్రము లెన్ని యున్నవో, అక్షరము లెన్ని యున్నవో అన్ని వేల సంవత్సరములు దాత విష్ణులోకములో పూజింప బడును. పంచరాత్రము, పురాణములు, మహాభారతము దానము చేసిన వాడు తన వంశములో ఇరువది యొక్క తరము వారిని ఉద్ధరించి తాను పరమ తత్త్వమునందు విలీను డగును.
అగ్ని మహాపురాణమునందు దేవతాప్రతిష్టాకథన మను ఆరువదిమూడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 63 of the Agni Purāṇa is as follows:
This chapter provides installation procedures for Bhagavān's associated divine weapons, forms, and subsidiary deities. The Sudarśana Cakra's own installation as a fierce form of Bhagavān's protective power — circular, blazing with a thousand spokes, attended by six śaktis — is described with its specific pratiṣṭhā mantra sequence. The installation of Garuḍa, the eagle-vehicle, as an independent image in the temple compound, and of Narasiṃha in the Pātāla chamber beneath the sanctum, are also covered, including the powerful Pātāla Narasiṃha mantra given in full. Iconographic and installation procedures for Viṣṇu's twenty-four forms, Śiva, Ardhanārīśvara, Sūrya, and other deities worshipped in subsidiary shrines are described. The chapter concludes with the grantha-pratiṣṭhā — the ritual consecration of scripture manuscripts so that they become worthy objects of worship.