అగ్ని మహా పురాణము

204 - అథ మాసోపవాసవ్రతమ్

ఆగ్ని దేవుడు చేప్పెను ; వసిష్ట మహామునీ! ఇప్పుడు అన్నింటికంటెను ఉత్తమమైన మాసోపవాస వ్రతమున గూర్చి చెప్పేదను. వైష్ణవయజ్ఞము చేసి, ఆచార్యుని ఆజ్ఞ గైకొని, కృచ్చైదివ్రతములను ఆచరించుట ద్వారా తన శక్తిని పరీక్షించుకొని, మాసోపవాసవ్రతము చేయవలెను. వానప్రస్థుడు, సన్యాసి, విధవయగు శ్రీ ఈ వ్రతము చేయవలెను.

ఆశ్వయుజశుక్ల ఏకాదశిపాడు ఉపవాస ముండి ముప్పదిదివసములకై ఈ క్రింది విధముగ సంకల్పించి మాసో పవాస వ్రతమును గ్రహించవలేను : “ఓ! మహావిష్ణూ! నేను ఈ దినము మొదలు ముప్పది దినములు నీ ఉత్థానముపర్యంతము నిరాహారుడుగా ఉండి నిన్ను పూజించెదను. సర్వవ్యాపి వైన ఓ హరీ! ఆశ్వయుజశుక్ల ఏకాదశి మొదలు నీ ఉత్తానకాల మైన కార్తికశుద్దఏకాదశి లోగా నేను మరణించినను, నీ కృపచే ప్రతభంగము కాకుండుగాక”. వ్రతము నాచరించువాడు దినమున మూడు పర్యాయములు స్నానము చేయుచు, సుగంధ ద్రవ్యములతోను, పుష్పములతోను, ప్రాతఃకాలమునను, మధ్యాహ్న మందును, సాయంకాలమునందును శ్రీ మహావిష్ణువును పూజించవలెను. తత్సంబంధి-గాన-ధ్యాన-జపాదులు చేయవలెను. వ్యర్థాలాపములను విడువవలెను. ధనాశ పరిత్యజించవలెను. ప్రతహీను నెవ్వనిని స్పృశింపరాదు. శాస్త్రనిషిద్ధ కర్మల నాచరించు వారిని ప్రేరేపించరాదు. ముప్పది దివసముల పాటు దేవాయమునందే నివసించవలెను. వ్రతము చేయువాడు కార్తిక శుక్ల ద్వాదశినాడు శ్రీమహ్మాష్ణువును పూజించి బ్రాహ్మణులకు భోజనము పెట్టి, వారికి దక్షిణ లిచ్చి, తాను కూడ పారణము చేసి, వ్రతసమాప్తి చేయవలెను. ఈ విధముగ పదమూడు మాసోపవాసము చేసిన వాడు భుక్తిముక్తు లను రెండింటిని పొందును.

పిదప వైష్ణవ యజ్ఞము చేసి (పదముగ్గురు బ్రాహ్మణులకు భోజనము పెట్టి వారి ఆజ్ఞచే) ఒక బ్రాహ్మణునకు పద మూడు ఉత్తరీయములను, పదమూడు ఆధ్వస్త్రములను, పాత్ర-ఆసన-చత్ర-పవిత్ర-పాదుకా-యోగ పట్ట-యజ్ఞోపవీతము లను దానము చేయువలెను,

పిదప శయ్య పై తప ప్రతిమను, సువర్ణమయమగు మహావిష్ణు ప్రతిమను పూజించి వాటిని మరొక బ్రాహ్మణ నకు దానము చేసి, ఆతనిని వస్త్రాదులచే సత్కరించవలెను. “నేను సర్వపాపవిముక్తుడనై,  బ్రాహ్మణ శ్రీమహా విష్ణు ప్రసాదముచే విష్ణులోకమునకు వెళ్ళగలను”. అని ఆతడు పలుకగా బ్రాహ్మణులు “ఓ దేవాత్మకా! నీవు రోగ శోక రహిత మగు విష్ణులోకమునకు వెళ్ళి, ఆచట విష్ణురూపధారివై విమానమున విరాజిల్లుము” అని పలుకవలెను. పిదప వ్రతము నాచరించినవాడు ద్విజులకు నమస్కరించి, ఆ శయ్యను ఆచార్యునకు ఇచ్చి వేయవలెను. ఈ విధముగ వ్రత మాచరించిన వాడు తన నూరు కులములను ఉద్దరించి వారిని కూడ విష్ణులోకమునకు తీసికొని వేళ్ళును. మాసోపవానము చేయువాడు నివసించు దేశము పాపరహితమై యుండును. మాసోపవాసవ్రతానుష్టానము చేసినవాడు పుట్టిన కులము మాట చెప్పవలేనా ? వ్రతము నాచరించు వాడు మూర్చ చెందినచో అతనికి నెయ్యి కలిపిన పాలు త్రాగించవలెను. ఈ క్రింద చెప్పిన పదార్థములు వ్రతభంగకరములు కావు. బ్రాహ్మణుని అనుమతిచే గ్రహించిన హవిస్సు, ఆచార్యుని అనుజ్ఞచే గ్రహించిన ఓషధి, ఫలము, మూలము, ఫలము. ఈ వ్రతమునందు “శ్రీమహావిష్ణువే మహౌషధిస్వరూపుడు” అను విశ్వాసముతో వ్రత మాచరించు వాడు వ్రతమును సమాప్తి చేయగలడు.

అగ్ని మహాపురాణమునందు మాసోపవాసవ్రతవర్ణన మను రెండువందలనాల్గవ అధ్యాయము సమాప్తము.