శాలిహోత్రుడు చెప్పెను సుస్రుతా ! అశ్వ లక్షణములను చికిత్సను చెప్పెదను హీన దంతము విదంతము, కరాళము, కృష్ణ తాలుకము, కృష్ణ జిహ్వము, యుగ్మజము, అజాత ముష్కము. రెండు డెక్కలు గలది శృంగ యుక్తము త్రివర్ణము వ్యాఘ్రవర్ణము గర్దభ వర్ణము, భస్మ వర్ణము సువర్ణవర్ణము మూపు కలది. శ్విత్రము కలది, కాకులచే ఆక్ర మింపబడునది ఖరసారము. వాన రాక్షము కృష్ణ గుహ్యము, కృష్ణ సటము. కృష్ణ ప్రోథము, కఠోర రోమము తిత్తిరి తుల్యము, విషమాంగము, శ్వేత పాదము, ధృవా వర్తములు లేనిది అశుభా వర్తములు కలది యగు అశ్వమును త్యజించ వలెను ముక్కు మీద, ముక్కు దగ్గర రెండేసి సుడులు శిరో వక్ష స్థలము లందు రెండేసి, లలాట కంఠ దేశము నందు రెండేసి, ప్రాయణము నందున రెండు ఈ విధముగ పని సుడులు శుభకరములు. ఓష్ఠ ప్రాంతము నందును. లలాటము వందును, కర్ణ మూలము నందున మెడ, ముందు కాళ్ళు కంఠము వీటి యందును సుడులు శ్రేష్ఠములు. ఇతర అంగములపై అశుభములు. చిలుక ఇంద్ర గోపము, చంద్రుడు వీటితో సమానమైన కాంతి కలవియు కాక వర్ణములను, సువర్ణ వర్ణములును స్నిగ్ధములను యగు ఆశ్వములు సర్వదా ప్ర స్తములు పొడవైన కంఠము. లోపలికి జొచ్చుకొనిన నేత్రములు చిన్న చెవులు వుండి చూచుటకు ఆందముగా నున్న గుర్రములు గల రాజు విజయాభిలాషను విడువవలెను. గుర్రములను గజములను పాలించుట శుభప్రదము కాని ఉచిత పాలనము చేయనిచో దుఃఖ ప్రదమగును. లక్ష్మీ పుత్రులైన గంధర్వాశ్వ ములు ఉత్తమ రత్నము. అశ్వము పవిత్రమగుటచే ఆశ్వమేధమున ఉపయోగ పడుచున్నది.
మధువుతో, గుడూచి, నింబ బృహతులు వీటి ముద్ద చేసి తినిపించినచో శిరః స్వేదము, నాశికా మొలము తొలగించును. హింగు పుష్కర మూలము శుంఠి ఆమ్ల వేతసము, పిప్పలి, సైంధవ లవణము వీటిని ఉష్ణ, జలముతో ఇచ్చినచో శూల రోగము నశించును. శుంఠి అతి విషముస్త అనంత, బిల్వ, ముల క్వాథమును త్రావించినచో ఆశ్వము యొక్క వివిధ ఆతిసార దోషములు నశించును ప్రియంగు సారివలతో కాచిన మేక పాలు కలిపి తగినంత శర్కర వేసి త్రాగించినచో అలసట తీరును. ఆశ్వమునకు తొట్టి యందు తైల బస్తి ఇవ్వవలెను. లేదా కోష్టము నందు పుట్టిన శిరల వేధనము చేయ వలయును. అట్లు చేసినచో దానికి సుఖము కలుగును. దాడిమ త్రిఫలా, వ్మోష గుడములను సమ భాగములుగ గ్రహించి చేసిన పిండమును అశ్వమునకు తినిపించిన కాస దోషము నశించును. ప్రియఁగు లోధ్ర పదవులతో కలిపిన యూష రస ములు కాని, క్షీరమును గాని, పుచ కోలాదికములు గాని యిచ్చినచో కాస రోగ విముక్తి యగును. అన్ని విధముల ప్రస్కందములకును మొదట శోధనము మంచిది. పిమ్మట అధ్యఁగ ఉద్వర్తన స్నేహ, వశ్య, వర్తి కల ప్రయోగము చేయవలయను. జ్వరము వచ్చిన గుర్రమునకు పాలతో చికిత్స చేయవలయును. లోధ్ర మూల కరంజ మూల, మాతు. లుంగ, అగ్ని, నాగర, కుష్ఠ హింగు, వచా, రాస్నలతో చేసిన లేపము శోధను తొలగించును. గుర్రమును నిరాహార ముగ వుంచి మంజిష్ఠామదుక , ద్రాక్ష, బృహతీ, రక్తచందన త్రపుషి బీజ మూల శృంగాటక కశేరుకములు కలిపిన కాచిన మేక పాలను చల్లార్చి శర్కర వేసి ఇచ్చినచో దానికి రక్త ప్రమేయము తొలగును.
మవ్యా, హను గ్రీవల యందున్న నాడులు వాచినను గల గ్రహ రోగము వచ్చినను ఆయా స్థానము లందు కటుతైలాభ్యంగము ప్రశస్తము. సాధారణముగ గల గ్రహ శోధ రోగములు గల దేశము నందే వచ్చును పతక్పుష్పీ చిత్రక సైంధవ సౌర సరస పిప్పల హింగువులతో పశ్యము ఇచ్చినచో ఆళ్వమునకు ఎన్నడును విషాదము కలుగదు. హరిద్రా జ్యోతిష్మతీ, పాఠా, కృష్ణా, కుష్ఠ, వచా, మధువులను గుడ గోమూత్రములతో కలిపి జిహ్వపై వ్రాసినచో జిహ్వా స్థంభము తొలగును. తిల, యష్టి, హరిద్రా నింబ పత్రములతో చేసిన ముద్దను తేనెతో ఉపయోగించిన వ్రణము శోధిత మగును. ఘృతముతో ఉపయోగించినచో వ్రణము మారును. దెబ్బ తగిలి తీవ్ర వేదసతో కుంటు గుర్రములకు తైముతో పరిషేక క్రియ చేసినచో ఆ బాధ తొలగును. వాత పిత్థ కఫ దోషములచే కాని, కోపముచే గాని దెబ్బ తగిలి గాయపడినచో అది మానుటకు ఈ క్రింది చికిత్స చేయవలయును. అశ్వత ఉదుంబర, ప్లక్ష, మధూక, వటములను ఆధిక జలముతో కలిపి చేసిన క్వాథము కొంచెము ఉష్ణముగ వున్నచో వ్రణ శోధనము చేయుము. శతాహ్వ, నాగర, రాస్నా, మంజిష్టా, కుష్ఠ, సైంధవ, దేవదారు వచా, ద్వివిధ హరద్ర, రక్త చందనముల స్నేహమును క్వాథముగ చేసి గుడూచి జలముతో గాని పాలతోగాని ఉద్వర్తనము బస్తి లేదా సశ్యము ఇచ్చినచో అన్ని లింగిత దోషములును పోవును నేత్ర రోగము గల అశ్వము యొక్క నేత్రాంతమున జలగను పట్టించి అభిస్రావణము చేయవలయును. ఇది ర ఉదుంబర, అశ్వత్థ కషాయటొలతో నేత్ర శోధము చేయవలయును.
యుక్తావలంబియగు ఆశ్వమునకు ధాత్రీ దురాలభా, తిక్తపియంగు, కుంకుమ, గుడూచులను సమ భాగముగ గ్రహించి, చేసిన కల్కము హితకరము ఉపద్రవమునందు కర్ణ దోషమునందును శిలయందును శుష్క శోధము వందున, ఆమ్ల హానికరమగు దోషమునందును వెంటనే వేధనము చేయవలయును. గోమయ మంజికా కుష్ఠ రజనీ తిల సర్జపములను, గోమూత్రము నందు నూరి మర్దనము చేసినచో దురద తగ్గును. శాల క్వాథము చల్లబడిన పిమ్మట మధుశర్కరలు కలిపి ముక్కులో వేసి త్రాగించినచో రక్తపిత్తము నశించును. ప్రతి ఏడవ రోజునను ఆశ్వమునకు లవణము తినిపించవలెను. ఎక్కువ ఆహారము తిన్న అశ్వమునకు, శరదృతువునందు జీవనీయ గణమునకు చెందిన ద్రవ్యములను మధు మృద్వీగా శర్కర, పిప్పలి, పద్మకములు కలిపి ప్రతిపానము చేయించవలెను. హేమంత ఋతువునందు వాయువిడంగ పిప్పలీదాస్య, శతాహ్వ, లోధ్ర, సైంధవ, చిత్రకముల ప్రతిపానము చేయించవలెను. వసంత ఋతువునందు లోధ్ర ప్రియంగు ముస్తా పిప్పలీ శుంఠ మధువులతో కూడిన ప్రతిపానము కఫనాశనము. గ్రీష్మ ఋతువునందు ప్రియంగు పిప్పలీ లోధ్ర యష్ట శుంఠ గుడములతోకూడ మద్యము ప్రతిపానముగ ఇవ్వవలెను. వర్షఋకువునందు లోధ్ర కాష్ఠలవణ పిప్పలీ హింగుతై లములు ప్రతిపానముగ ఇవ్వవలెను. గ్రీష్మమునందు కలిగిన పిత్తప్రకోపముచే పీడింపబ 3న ఆశ్వమునకును శరత్కాలమున రక్త మనత్వముతో బాధపడుచున్న ఆశ్వమునకును వర్షకాలమున, భిన్న పురీషములుగల ఆశ్వమునకును మృతము త్రాగించవలెను. కఫ వాతములు అధిక మైనపుడు తైలము త్రాగించవలెను. స్నేహతత్వము అధికమగుటచే శరీరమునకు బాధఏర్పడిన అశ్వములకు విరూక్షణము చేయించవలెను. మజ్జిగతో భోజనము మూడుదినములు గంజి ఇచ్చినచో రూక్షణము అగును. శరదీష్మ ఋతువులందు ఘృతమ, హేమంత వసంతములందు తైలము, వర్షాశిశిర ఋతువులందు మృతతై లములు రెండును ఇవ్వవలెను. స్నేహపానము చేయించిన గుర్రములకు గురువయినదియు, అభిష్యందియు అగు భోజనము వ్యాయామము ప్నానము ధూపము వాయురహిత స్థానములు వర్ణితము. వర్షఋతువునందు గుర్రమునకు ఒక ర్యాయము స్నానము పానము చేయించవలెను. దుర్దినసమయమున కేవలపానము ప్రశస్తము. సమశీతోష్ణ ఋతువునందు రెండు పర్యాయములు పానము, ఒక పర్యాయము స్నానము మంచివి. గ్రీష్మ ఋతువునందు మూడు పర్యాయములు స్నానము ప్రతిపానము చేయించ వలయును. పూర్ణజలమునందు చాల సేపు నిలిపి స్నానము చేయించవలయును. గుర్రములకు ప్రతిదినము పొట్టులేని యవలు నాల్గు ఆడకములు తినిపించవలెను. శనగలు, ధాన్యము, పెసలు, బటానీలు కూడ తినిపించవలెను. రాత్రిం బవళ్ళు ఐదుశేర్లు పాలు త్రాగించ వలయును. ఎండిపోయినచో ఎనిమిది ఫేర్లు పొట్టువున్నచో నాలుగు శేర్లు ఇవ్వవలెను. దూర్వ పిత్తమును, యవలు కాసమును, పొట్టుక ఫాధిక్యమును, అర్జునము శ్వాసను మానకందము బలక్షయమును తొలగించును దూర్వలు తిను గుర్రమునకు వాతపిత్తక ఫజములగు రోగములు, సన్నిహిత రోగములు కలుగవు. దుష్టమైన ఆశ్వములను వెనుకకు ముందును రెండు త్రాళ్ళతో కట్టవలెను. మెడకు కూడకట్టవలెను. ఆ స్తకణమువున్న ధూప ధూపితమగు స్థానమున దానిని కట్టవలెను. అచట ఉపాయపూర్వకముగ గట్టివుంచవలెను. అచట దీపము వుంచి. స్థానమును సురక్షితము చేయవలయును. అశ్వశాలయందు మయూరములు మేకలు వానరములు, మొదఁగు మృగములను ఉంచవలెను.
అగ్ని మహాపురాణమువ అశ్వచికిత్సా కథనమను రెండువందలయెనుబదితొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 289 of the Agni Purāṇa is as follows:
Horse characteristics and veterinary treatment are described. Inauspicious physical signs — a black tongue, split hooves, ash-colored coat, vitiligo, or monkey-like eyes — are enumerated as contraindications for royal use. Auspicious āvarttas (whorls) in ten specific body locations and favorable coat colors — parrot-green, Indragopa-hued, moon-white, and golden — are prescribed for a royal horse. Diseases and their treatments are detailed: śūla with hiṅgu-saindhava-pipalī; atisāra with indraya-ativiṣā-bilva; kāsa with dādima-triphala-vyoṣa; galāgraha with daśamūla-kuluttha-kāñjika; and vrana with a Śatāhvā-nāgara-rāsnā-mañjiṣṭhā taila.