పరమేశ్వరుడు పలికేను : పార్వతీ! ఇపుడు ఆరువది సంవత్సరముల (లోకాన్నింటి) శుభాశుభ ఫలములను చెప్పెదను. సావధానముగావినుము. ప్రథవసంవత్సరమున యజ్ఞకర్మలు అధికముగా జరుగును. ‘విభవ' యందు ప్రజలు సుఖవంతులు. శుక్లయందు సమస్త ధాన్య సమృద్ధి. 'ప్రమోదమున సకలానందము 'ప్రజాపతి' యందు వృద్ధి, అంగిరసమందు భోగవృద్ది శ్రీముఖమున జనసంఖ్యావృద్ది. 'యువ' మందు ప్రచురవరము. 'ధాత' యందు ఔషధుల అధికోత్పత్తి. 'ఈశ్వర” యందు క్షేమ ఆరోగ్యప్రాప్తి. బహుధాన్యమున ప్రచురాధానోత్పత్తి ప్రమాదియందు మధ్యవృష్టి విక్రమ' యందు అన్న సమృద్ధి. 'వృష' యందు సకలప్రజాపోషణము. చిత్రభానువునందు విచిత్రత, సుభానువునందు కల్యాణ ఆరోగ్య ములు. 'తారణ’ యందు శుభకరము లగు మేఘములు. పార్థివమున సస్యసంపత్తి , అవ్యయమున అతివృష్టి, సర్వజిత్తునందు ఉత్త మవృష్టి, సర్వధారియందు ధాన్యాది సమృద్ధి, విరోధియందు మేఘ వినాశము. 'వికృతి' యందు భయము ‘ఖరి యందు పురుషులలో పౌరుషాధిక్యము. నందన యందు ప్రజానందము. 'విజయ' మందు శత్రునాశనము, జయ యందు రోగవినాశనము ‘మన్మథ' యందు జ్వరపీడ. దుష్కరమునందు ప్రజలకు దుష్కర్మప్రవృత్తి దుర్ముఖమున కటు భాషిత్వము. హేమ లంబమున నంపత్రాప్తి, విలంబమున అన్న ప్రాచుర్యము వికారియందు శత్రుకోపము. శార్వరియందు అక్కడక్కడ సర్వ లాభము ప్లవయందు వరదలు. 'శోధన శుభకృతు’ లందు నామానుకూలముగ శుథము. 'రాక్షస యందు ప్రజలలో నిమరత్వము “అనల' యందు వివిధధానోత్పత్తి. 'పింగల' యందు ఆచ్చటచ్చట వృష్టి. కొలయుక్త' మున ధనహాని. “సిద్దార్థమున సకల కార్యసిద్ధి. రౌద్రమునందు ప్రపంచమున రౌద్రభావప్రవృత్తి. దుర్మతి’ యందు మధ్యవృష్టి “దుందుభి యందు మంగలము ధనధాన్య ప్రాప్తి, రుధిరోద్గారి రక్తాక్షులందు రక్త పానము. క్రోధనమున విజయము. 'క్షయ' యందు ప్రజాపక్షయము ఈ విధముగ అరువది సంవత్సరముల (లో కొన్నింటిని) గూర్చి చెప్పబడినది.
అగ్ని మహాపురాణమునందు సంగ్రామజయార్ణవమున షష్టి సంవత్సర ఫలనిరూపణమను నూట ముప్పదితొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 139 of the Agni Purāṇa is as follows:
The fruits corresponding to each of the sixty-year cycle names (saṃvatsaras) of the Indian luni-solar calendar are described. Agni enumerates the sixty names from Prabhava through Akṣaya and assigns to each a presiding deity, a predominant quality (śubha or aśubha), and the probable characteristics of persons born or events begun under that year. Agricultural predictions, rainfall forecasts, and royal fortunes are correlated with the saṃvatsara lord. The chapter serves as a reference for jyotiṣa-based counsel on auspicious timing.