ఈశ్వరుడు పలికెను. పైన తేజస్సు (ర) కల విశ్వరూపమును (హు) ఉధృతము. చేసి నరసింహము (క్షు) కింద కృతాంతము (య్) వుంచవలెను. దాని చివప్రణవము చేర్చవలెను. ర్ హ్ క్షమోం ఏర్పడినది. దీని పిమ్మట ఊహ కము (ఊ) ఆంశ మత్ ను (0) విశ్వమును (హ) కలుపవలేను. (హూం) ఇవి రెండును వర సగ ఆంతస్థము కంఠ్యోష్టము చెప్పబడును. దీని అంతమున నమః చేర్చుటచే రెండు మంత్రములన నాలుగు అక్షరము కలవవును. విశ్వరూపము కారణ మని చెప్పబడినది. దానిని పిండ్రు మాత్రలచే గుణితము చేయవలయును. ఈ పండ్రెండులో ఐదు హ్రస్వబీజము లతో ఈశావాది పంచ బ్రహ్మమూర్తులను పూజించి దీర్చాత్మకములగు ఆరు బీజములతో వెనుకటి వలెనే అంగన్యాసము చేయ వలెను. హీం వ్రాసి పిదప స్ఫురస్ఫుర వ్రాయవలెను. పిదప ఆ రెండింటికిని ప్రచేర్చవలెను. పిదప “కః” వమ” “బంధ” ఈ మూడు పదములను రెండేసి పర్యాయములు వ్రాసి పిదప ఘాతయ యనునది వ్రాసి ఆంతమున హంఫట్ చేర్చవలేను. ఇది అఘోరాస్త్ర మంత్రము. ఇపుడు శివగాయత్రి చెప్పబడుచున్నది. “మహేశాయ విద్మహే మహాదేవాయ ధీమహీతన్నః శివః ప్రచోదయాత్” ఈ శివగాయత్రి సకల ఫలప్రదము.
యాత్రయందును, విజయాది కార్యములందు శ్రీలాభము నిమిత్తమై ముందు గణపూజ చేయవలెను. చతురస్ర క్షేత్రమున అన్ని వైపుల పండ్రెండేసి కష్టములలో విభజించవలెను. మధ్యనున్న నాలుగు పదములలో త్రికోణము రచించి దాని మధ్య త్రిదళ కమలము వ్రాయవలెను. దాని పృష్ఠమున పథిక వీథి భాగములందు మూడు దళములతో ఆశ్వయుక్త కమలము ఏర్పరుపవలయును. పిదప వసుదేవ పుత్రులతో (వాసుదేవ సంకర్షణ గద) ప్రకాశించుచున్న త్రిదళ కమలమతో పాద పట్టికను నిర్మించవలెను. దాని పై భాగ ప్రమాణముచే ఒక వేది రచించవలెను. పూర్వాది దిశ లందు ద్వార కోణ. భాగములతో ఉపద్వార మేర్పరచినచో ఆమండలము విఘ్ననాశ కమగును. మధ్యనున్న కమలము దాని వెలుపల వున్న కమలములు ఆర క్తవర్ణములై వుండవలెను. వీథి శ్వేత వర్ణపై వుండవలెను. ద్వారముల రంగు ఇష్టము వచ్చినట్లు వుండ వచ్చును. కర్ణికను పీతవర్ణముతోను కేసరములు కూడ ఆదేవర్ణములోను వుండవలెను. దీనికి విఘ్న మర్ధ మండలమని పేరు. దీనిమధ్యభాగమున గణపతిని పూజించవలెను. నామాద్య క్షరము అను స్వారసహితముగపలికి ఆది యందు ఓం ఆంతము నందు నమః చేర్చవలెను. హ్రస్వాన బీజయుక్తములగు ఈశాన తత్పురుషాది మంత్రములతో బ్రహ్మ మూర్తు లను పూజించి దీర్ఘాంత బీజములతో ఆంగన్యాసము చేయవలెను. అమండలము యొక్క పూర్వదిక్కు యందున్న పంక్తి యందు, గజ గజశీర్ష గాంగేయ, గణనాయక , గగ, న్న, గోపతియను పేర్లు వ్రాయవలెను. చివరి రెండు పేర్లను మూడేసి ప్యయములు వ్రాయవలెను.
విచిత్రాంశ, మహాకాయ. లంబోష్ఠ లంబకర్ణ లంబోదర, మహాభాగ వికృత, పార్వతీ ప్రియ, భయవహ, భద్ర భగణ, భయసూదన, యను పండ్రెండు నామములు దక్షిణ దిక్పంక్తి యందు వ్రాయవలెను. పశ్చిమమున దేవగ్రాస మహానాద భాసుర, విఘ్న రాజ, గణాధిప ఉద్భట స్వన ఉదృతండ, భీమ, మన్మథ, మధుసూదన సుందర భావ పుష్ట యను పేర్లులు, ఉత్తర మున బ్రహ్మేశ్వర బ్రాహ్మ మనోవృత్తి సంజయ, లయ, నృత్య ప్రియలోల, వికర్ణ, వత్సల, కృతాంత, కాలదండ, కుంభ, యను పేర్లను వ్రాసి అన్నింటిని పూజించవలేను.. పదివేల జపము చేసి దశాంశ హోమును చేయవలెను. మిగిలిన మంత్రములను పదేసి పర్యాయములు జపించి ఒక్కొక్క హోమము చేయవలెను. సకల మనోరథములు సిద్ధించును. గురువువకు, భూగో, ఆశ్వ, గజ, వస్త్రాదులు ఇచ్చి పూజించవలెను.
ఆగ్ని మహాపురాణమున గణ పూజా నిరూపణమన మూడు వందల పదునెనిమిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 319 of the Agni Purāṇa is as follows:
The system of planetary periods (daśā) — specifically the Viṃśottarī system with its 120-year total — is explained, with the allocation of years to each of the nine grahas. Agni describes how the daśā at birth is determined from the Moon's position in the nakṣatra, and how the sub-period (antardarśā or bhukti) and sub-sub-period (pratyantardarśā) further subdivide the operative influence. The general results expected during the mahādaśā of each planet — from the Sun's authority and health-related themes through to Saturn's separation, loss, and discipline — are enumerated as guiding principles for the astrologer.