ఆగ్ని పలికేను : ఏ ధర్మముల నాచరించి మన్వాదులు భుక్తిముక్తులు పొందిరో వాటిని పుష్కరుడు, పరశు రామునకు, వరుణ్ కప్రకారమున చెప్పెను. పుష్కరుడు చెప్పెను : వాసుదేవాదులకు సంతోషమును కలిగించునవియు, మన్వాదులు చెప్పిన వియు అగు వర్ణ - ఆశ్రమ - సర్వసాధారణధర్మములను నీకుచెప్పెదను; పరశురామా! అహింస, సత్యము, భూతదయ, అనుగ్రహబుద్ది, తీర్థయాత్ర, దానము, బ్రహ్మచర్యము, మాత్సర్యము లేక పోవుట, దేవబ్రాహ్మణ పూజనము, గురువు శ్రూష, సర్వధర్మశ్రవణము, పితృపూజనము, రాజభక్తి, సర్వదా ఉత్తమశాస్త్రము సాహాయ్యముననే విషయములను తెలిసికొనుట, కౌర్యము లేకుండుట, ఓర్పు, ఆస్తిక్యబుద్ది - ఇవి అన్ని వర్ణములకును, ఆశ్రమములకును సాధారణము లగు ధర్మములు. యజనము, యజ్ఞము చేయించుట, దానము, వేదాద్యధ్యాపనము, ప్రతిగ్రహము, ఆధ్యయనము ఇవి బ్రాహ్మణుల ‘ర్మలు. దానము. అధ్యయనము, యజనము - ఇవి క్షత్రియ వైశ్యుల ధర్మములు, పాలనము, దుష్ట నిగ్రహము, ఇవి క్షత్రియుని విశేషధర్మము, ఆట్లే వైశ్యునకు వ్యవసాయము. గోసంరక్షణ, వాణిజ్యము, విశేష ధర్మములు. శూద్రునకు బ్రాహ్మణ - క్షత్రియ - వైశ్యుల శుశ్రూష లేదా వివిధశిల్పములు ధర్మము. బ్రాహ్మణాదులకు ఉప :యన మైనది మొనలు రెండవ జన్మ: ఆనులోమ్యము (తండ్రి పై వర్ణమువాడై, తల్లి క్రింది వర్ణమునకు చెందినపుడు పుట్టినవారి జాతి తల్లి జాతితో సమమగును, ప్రాతిలో మ్య మున పై కులము. స్త్రీ పురుషుడు క్రింది కులము ఆయినపుడు) శూద్రునివలన బ్రాహ్మణస్త్రీకి పుట్టినవాడు చండాలుడు. క్షత్రియునివలన బ్రాహ్మణియందు పుట్టినవాడు సూతుడు. వైశ్యుని వలన పుట్టినవాడు దేవలుడు. క్షత్రియస్త్రీయందు శూద్రునివలన పుట్టినవాడు మాగధుడు. వైశ్యస్త్రీయందు శూద్రునివలన పుట్టిన వాడు ఆయోగవుడు, ప్రతిలోమశ్రీలకు ప్రతిలోమపురుషులవలన వుట్టిన వారు వేలకొలది భేదములలో నుందురు. వారికి వివాహము తమతో సమాన మైన జాతికలవారితోనే జరుగవలెను. అధములతో గాని ఉత్తములతో గాని జరుగరాదు. వధ్యులను చంపుట చండాలుల కర్మ. స్త్రీల కుపయోగించు వస్తువులను తయారుచేయుట, స్త్రీలను రక్షించుట వై దేహకుని కర్మ. సారథ్యము సూతుని కర్మ. వేట చే జీవనము పక్కసుని కర్మ. స్తుతి చేయుట మాగధుని కర్మ. రంగమునందు దిగుట, శిల్పజీవనము ఆయోగవుని కర్మ. చండాలుడు గ్రామముబై ఓ నుండి శవవస్త్రములను ధరించవలెను. ఇతర వర్ణములవారిని స్పృశించగూడదు. గోబ్రాహ్మణుల నిమిత్తము, శ్రీబాలాదుల రక్షణ నిమిత్తము ప్రాణత్యాగము చేయుటచే చండాలాదులకు ఆధ్యాత్మిమకోన్నతి లభించును. సంకరజాతులవారి జాతిని వారి తలిదండ్రులను బట్టియు, జాతిసిద్ధము లగు కర్మలను బట్టియు నిర్ణయించవలెను.
ఆగ్ని మహాపురాణమునందు వర్ణాశ్రవేతరధర్మవర్ణన మను నూట ఏబదియొకటవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 151 of the Agni Purāṇa is as follows:
Dharmas applicable beyond the strict varṇa-āśrama framework—to sādhus, wanderers, mixed castes, and those outside the four varṇas—are discussed. Agni describes the norms for saṃnyāsins without formal initiation, brāhmaṇas fallen from their standards, and householders of mixed lineage. Universal dharmas such as ahiṃsā, satya, asteya, and śauca are declared binding on all without exception regardless of social position. The chapter reflects the Purāṇic concern for inclusivity: even a caṇḍāla who adheres to these sāmānya-dharmas accumulates puṇya, while a brāhmaṇa who violates them degrades spiritually.