అగ్ని దేవుడు పలికెను. ఇపుడు గ్రహోపహార మంత్రాదులను చెప్పెదను. ఇవి గ్రహ శాంతి నిచ్చును. హర్ష ఇచ్ఛా భయశోకాదుల చేతను పకృతి విరుద్దము అపవిత్రముయైన ఆహారము భుజించుట చేతను గురు దేవాది కోపము చేతను మానవునకు ఐదు విధములగు ఉన్మాదములు కలుగు. వాటికి త్రిదోషజములు, సన్నిపాతజములు, ఆగంతుకములు అని పేర్లు, రుద్రుని క్రోధముచే అనేక విధములగు దేవాది గ్రహము కలుగును. ఈ గ్రహములు నదులు. చెరువులు తటాక ములు శైలములు ఉపవనములు సేతువులు నదీ సంగమము, శూన్య గృహము బిల ద్వారము, ఏకైక వృక్షము, వీటి యందుండి అక్కడికి వెళ్ళిన వారిని ఆవహించుకు నిద్రపోవుచున్న గర్భిణిస్త్రీ, ఆసన్న ఋతుకాలయగుస్త్రీని నగ్నస్త్రీని ఋతు స్నానము చేయుచున్న స్త్రీని కూడ ఆవహించును. ఇవి మానవునకు అవమానము, వైరము, విఘ్నము. భాగ్య విపర్యయము
మొదలగునవిచేయించును. దేవతా గురు ధర్మాది సదాచారాదులను ఉల్లంఘించిన వారిని పర్వత వృక్షాదుల నుండి పడినవారిని మాటి మాటికి జుట్టు దుల్పుకొను వానిని, కండ్లు ఎర్ర చేసి ఏడ్చచు గంతలు వేయుచున్న వానిని ఈ లక్షణములను బట్టి రూప అను గ్రహవిశేషముచే పీవీతుడై నట్లు గ్రహించవలెను ఉద్వేగయు కుకై దాహ శూల పీడితుడై ఆకలి దప్పులతో బాధపడుచు శిరో రోగముతో బాధపడుచు నాకు ఇమ్ము, నాకు ఇమ్ము యని యాచన చేయువాడు బలి కామి యను గ్రహముచే పిపితుడని తెలుపు కొనవళను. స్త్రీ, మాలా, స్నాన, సంభోగముల యందు అధి కేచ్ఛ కల వానిని రతి కామి యనుగ్రహి ఆవహించినట్లు తెలుసు కొనవలెను. ఆకాశ వ్యాపియైన మహా సుదర్శనము, విటప నాశికము, పాతాళ నార సింహాచె మంత్రములు, చుడీ ముత్ర ములు గ్రహ పీడను తొలగించును. గ్రహ పిక నాశనము చేయు సూర్యా రాధన ఈ క్రింది విధముగా చేయవలయును. సూర్యుడు తన దక్షిణ హస్తములందు పాశాంకుశ అక్షమాలా కపాలములను వామ హస్తము లందు ఖట్వాంగ కమల చక్ర శక్తులను ధరించి యుండును. నాలుగు ముఖములు ఎనిమివి హస్తములు, పన్నెండు నేత్రములు కలిగి యుండును. సూర్యుడు సూర్య మండలము లోపం కమలాసనముపై ఆత్యాది దేవగణ పరివృతుడై కూర్చుండి యుండును. ఈ విధముగ సూర్యుని ధ్యాన పూజాదులు చేసి ఉదయ కాలమున అర్ఘ్యము ఇవ్వవలెను. అందులకు మంత్రము శ్వాస (య) విష (ఓం) అగ్నిమాన్ రండి (ర్ - ఓం) హృల్లేఖా (హ్రీం) ఇవి సంకేతాక్షరమలు. వీటిని కలుపగా.యౌః రౌం, ఐ), హ్రీ. కలశార్కాయ భూర్భువః స్వరోం జ్వాలి నీ కుల ముద్ధర" అని ఏర్పడును. సూర్యుడు పద్మాసన గతుడై ఎర్రగా రక్త వస్త్రములు ధరించి యుండున. అతని మండలము జ్యోతిర్మయము. ఉదార స్వభావుడు. రెండు హస్తము లందును పద్మ మును ధరించి అన్ని అవయములందును అలంకారములు ధ్వంచి సౌమ్య మూర్తియై యు:డును. సూర్యాది గ్రహము అన్నియు సౌమ్యములై బలాదాయకములై కమఃములు ధరించి యుండును. వారి వస్త్రములు విద్యుత్పుఁజమువలె నుండును. బృహస్పతి పసుపుపచ్చగాను శుక్రుడు తెల్లగను శని, నల్ల బొగ్గు వలెను. రాహు కేతువులు ధూమ సమాన వర్ణులుగను వుందురు. వీరందరను ఎడమ చేతులను ఎడమ తొడల పైనుని దక్షిణ హస్తము లందు అభయ ముద్రను ధరించి యుందురు. గ్రహముల పేర్ల ఆద్యక్షరములకు బిందువులు చేర్చినచో అవి బీజ ముత్రములగును. "వజ్" యని ఉచ్చరిం చుచు హస్తముం ఛాంచి అంగడ్డము మొదలు కరతం పర్యన్తము, కరన్యాసము నేత్రములు తప్ప హృడమూవి పుదాంగ న్యాసము చేసి సూర్యుని మూల బీజ రూపములగు మూడు అక్షరము తో (హ్రాం హ్రీం సహ) వ్యాపక ! న్యాసము చేయవలయును. పిదప అర్ఘ్య పాత్రమను హస్త్ర మంత్రముతో ప్రక్షాళన చేసి పూర్వోక్త మూల మంత్రమను ఉచ్చరించుచు ఉదకము నింపి గంధ పుష్ప అక్షత దూర్వములు వేసి మరల ఆభిమంత్రించి ఆ జలముతో తనను పూజా ద్రవ్యములను ప్రోక్షణ చేసి కొనవలెను.
పిదప యోగ పీఠమును కల్పించి దాని పాదములుగా ప్రభూత విమల, సార, ఆరాధ్య పరమ సుఖములను కల్పించ వలెను. ఆగ్నేయాది దిక్కులు నాల్గింటి యందను మధ్య భాగము నందను వీటి పేర్లకు చివర నమః చేర్చి వాటికి ఆవహన పూజలు చేయవలయును. యోగ పిఠము పైనను, హృదయ కమలము నందను దిక్కు నందును విదిక్కునందును, దీప్త మొదలగు శక్తులను స్థాపించవలెను. పీఠముపై హృదయ కమలము స్థాపించి దాని కేసరములపై ఎనిమిది శక్తులను పూజించ వలెను. “వాం దీప్తాం” “ఏం సూక్ష్మాం” “వూం జయాం” “వృం భద్రి కాం” “వేం విభూతం” “వైం విమలాం” “వోం ఆసిఘాత విద్యుతాం” “వీం సర్వతో ముఖీం” “వం పీఠమ్”. ఈ విధముగ శక్తులను పూజించి పిదప రవిని పూజించవలెను. ఆవహనము చేసి పాద్యాదులు సమర్పించి హృదయాది షడంగ న్యాస పూర్వకముగ పూజ చేయవలయును. “ఖ కారౌ మొదలు జర ద్వాయుహృదా" వరకు సంకేతము చే సూచించిన రవి మంత్రము సర్వ ఫల ప్రదము. ఆగ్నేయ నై ఋకి ఈశాన వాయవ్య చిక్కులందును, మధ్య యఃదను హృదాదీ పంచాంగములతో వాటి మంత్రములతో పూజించ వను. కర్ణి కామధ్యము నందే పూజించవలెను. తన యెదురుగా నున్న దిక్కు నందు అస్త్ర పూజ చేయవలెను. పూర్వాది దిక్కు లందు క్రమముగా చంద్ర బుధ గురు శుక్రులను ఆగ్నేయాది విదిక్కు లందు మంగళశ నైశ్చర రాహు కేతువులను పూజించవలెను. పుష్ణిహింగు వచా చక్ర శిరీష లగున ఆమయములను మేః మూత్రము నందు నూరి అంజనము నశ్యము తయారు చేయవలయును. ఈ ఓషధులను ఈపిధముగ ఉపయోగించినచో గ్రహబాధ తొలగును. పాఠాపథ్యా వచా, శిగ్రుసింధు వ్యోషములును బొక్కక్క పలము చొప్పున గ్రహించి ఒక కుంచెడు మేక పాళ్ళతో ఉడక పెట్టి ఆ పాలనుండి తీసిన నెయ్యి సమస్త గ్రహబాధలను తొలగించును. వృశ్చికాః, ఫల కష్ట, లవణ శార్జకములను నీటిలో ఉడికించి ఇచ్చినచో అపస్మార రోగము తొలగును. విదారి కుళ కాశ, ఇకు క్వాథములతో చేసిన పాల నురోగికి త్రాగించవలెను. యష్టి కూష్మాండరసమునందు సంస్కృతమైన మృతమును కాని పంచగవ్యమును గాని, ఇచ్చినచో జ్వరము తొలగును. “ఓం భస్మాస్త్రాయ విద్మహే! ఏక దంష్ట్రాయ ధీమహి, తన్నో జ్వరః ప్రచోదయాత్” ఈ మంత్రమును జపించుటచే జ్వరము తొలగును. శ్వాసకోగి కృష్ణాశన, నిశా, రాస్నా, ద్రాక్ష తైల గుడములను సేవించవలెను. లేదా మధు ఘృతముల తో బార్డిని సేవించవలెను. లేదా పాఠా, ఆక, కణ బార్జీలను తేనెతో నాక వలెను. ధాత్రీ విశ్వసితా, కృష్ణా ముస్తా, ఖర్జూర మాగధీ, పీవరా, యివి ఎక్కిళ్ళను తగ్గించును. పైమూడు యోగము లను తేనెతో సేవించవలెను. కామల రోగముకలవాడు జీరమాండూకి నిళా, ధాత్రీ రసములను త్రాగ వలెను. త్రికటు పద్మకాష్ఠ, త్రిఫలా విడంగ దేవదారు రాస్నలను సమమైన పాళ్ళతో గ్రహించి చూర్ణముచేసి పటికి బెల్లముతో సేవించినచో కాసరోగము తప్పక నశించును.
అగ్ని మహాపురాణమున గ్రహహృన్మంత్రాది నిరూపణమను మూడువందలవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 300 of the Agni Purāṇa is as follows:
The final chapter of Part 3 presents mantra-based treatment for graha-possessions (unmāda) — supernatural mental afflictions caused by devas, ṛṣis, and beings born of Rudra's anger. Five types of unmāda are described: those arising from hṛṣa, icchā, bhaya, śoka, and viruddha-āhāra, as well as from tridoṣa, sannipāta, and āgantuka causes. Grahas strike at rivers, lakes, mountains, crossroads, empty houses, and sacred trees, and particularly afflict sleeping persons, pregnant women, and those who violate the conduct of devatā, guru, and dharma. The Mahāsudarśana, Viṭapanāśika, Pātāla-Narasiṃha, and Caṇḍī mantras are prescribed for graha-śamana. A detailed Sūrya-pūjā procedure is described for planetary propitiation: Sūrya is meditated upon as four-faced with eight arms bearing pāśa, aṅkuśa, akṣamālā, khaṭvāṅga, padma, cakra, and śakti, and worshipped in the Yoga-pīṭha with eight Śaktis on the lotus petals. The nine planets from Sūrya to Ketu are worshipped in the cardinal and intermediate directions. Herbal remedies using pṛśni, hiṅgu, vacā, cukra, and śirīṣa in goat's urine, as well as the pāṭhā-pathyā-vacā-śigru-sindhu-vyoṣa preparation boiled in goat's milk, are prescribed for complete graha-śamana.