శ్రీ భగవానువాచః-
హయగ్రీవుడు చెప్పెను :- బ్రహ్మదేవా! ఇపుడు నేను ఇతర లింగాదులను గూర్చి చెప్పెదను; వినుము. లవణముతోను, ఘృతముతోను చేసిన శివలింగము బుద్ధిని వృద్ధి పొందించును. వస్త్రమయ లింగము ఐశ్వర్యదాయకము. ఆది తాత్కాలిక లింగము. మృత్తిక తో నిర్మించిన లింగము పక్వము, అపక్వము అని రెండు విధములు. అపక్వము కంటె పక్వము శ్రేష్ఠము. దాని కంటే కణతో చేసిన లింగము ఆధిక పుణ్య దాయకము, పవిత్రము. దాని కంటే శిలా లింగము శ్రేష్టము. దాని కంటే ముత్యముల శివ లింగము. దాని కంటే సువర్ణ లింగము ఉత్తమములు. వెండి, రాగి, ఇత్తడి, రత్నములు, పాదరసము వీటితో నిర్మించిన శివలింగము భోగ మోక్ష ప్రదము, శ్రేష్టము. రసలింగమును రత్నము లలోగాని, సువర్ణాది లోహములలో గాని బంధించి స్థాపించవలేను. సిద్దాదులచే స్థాపింపబడిన స్వయం భూలింగాదులకు కౌలతలు మొదలగునవి చేయుట యుక్తముకాదు.
బాణ లింగమున విషయమున కూడ (నర్మదోద్భవమునకు) ప్రమాణాదిచింత ఉండ కూడదు. అట్టి లింగములకై ఇచ్చానుసారముగ పీఠ ప్రాసాదాది నిర్మాణము చేయవచ్చును. సూర్యమండలస్థ శివలింగమును అద్దములో ప్రతిబింబింపజేసి పూజించవలెను. లింగ ముపై శివార్చన పరిపూర్ణము, సకలకామప్రదరణ, శివలింగము ఎత్త హస్తము కంటే ఎక్కువ ఉండ వలెను. కాష్టమయ శివలింగము కూడ ఆంతయే ఉండవలెను. చల శివలింగ స్వరూపమును అంగుళమానానుసారమును, స్థిర లింగ స్వరూపమును ద్వార - గర్భ-హస్తమానముల అనుసారమును నిర్ణయింపవలెను. గృహములో పూజింపబడు చల లింగము ప్రమాణము ఒక అంగుళము మొదలు పదునై దు అంగుళముల వరకును ఉండవచ్చును.
ద్వారమానమును బట్టి లింగము మూడు విధములగును. వీటిలో ఒక్కొక్క దానికి గర్భమానమును బట్టి, తొమ్మిదేసి భేదములగును. హస్తమానముచే తొమ్మిది భేదములగును. వీటిని దేవాలయములో పూజింపవలెను. ఈ విధముగ అన్నింటిని కలపగా ముప్పదియారు లింగములు. ఇది లింగ ముం జ్యేష్ఠమానము. మధ్యమమాన-కనిష్ట మానముల చేత కూడ ముప్పదియారు ముప్పదియారు. శివలింగము లగును. ఈ విధముగ అన్ని లింగములను కలుపగానూట ఎనిమిదిలింగము లగును. ఒకటి మొదలు ఐదు అంగుళముల వరకు కనిష్టమ (చిన్నది). ఆరునుండి పది అంగుళములవరకు చల లింగము మధ్యమము. పదకొండు నుండి పదునైదు అంగుళముల వరకు చల శివలింగము జ్యేష్టము. చాలమూల్యముగల రత్నములతో నిర్మించిన లింగము ఆరు అంగుళములు, సాధారణ రత్న నిర్మితము తొమ్మిది ఆంగుళములు, సువర్ణ నిర్మితము పండ్రెండు అంగుళములు ఇతర పదార్థ నిర్మితము పదునైదు అంగుళములు ఉండవలెను.
లింగ శిలను పదునారు భాగములు చేసి పై నాలుగు భాగములలో ప్రక్కనున్న రెండు భాగములను తీసివేయ వలెను. మరల ముప్పది రెండు భాగములు చేసి దాని రెండు కోణములందును ఉండు పదునారు భాగములు తీసివేయవలెను. మరల దానిలో నాలుగు భాగములు కలుపగా కంఠము ఏర్పడును. అనగా ఇరువది భాగములు కంఠముగా ఏర్పడును. రెండు ప్రక్కలను ఉన్న పడ్రెండు భాగములను తీసివేయుటచే జ్యేష్ట చల లింగము ఏర్పడును. ప్రాసాద (దేవాలయ)ము ఎత్తును పదునారు భాగములుగా విభజింపగా, నాలుగు, ఆరు, ఎనిమిది భాగముల ఎత్తుచే వరుసగా కనిష్ట - మధ్య-జ్యేష ద్వారము లేర్పడును, ద్వారము ఎత్తులో నాల్గవ వంతు తగ్గించగా అది లింగము ఎత్తు , అగును.. లింగ శిలాగర్బము ఎత్తులో సగము ఎత్తుగల శివలింగము కనిష్టము. పదునై దు భాగముల ఎత్తు గలది జ్యేష్ఠము. ఈ రెండింటి మధ్య ఏడు చోట్ల సూత్రపాతము చేయవలెను. ఈ విధముగ తొమ్మిది సూత్రము లగును . ఈ తొమ్మిది సూత్రములలో ఐదు సూత్రముల ప్రమాణము గల లింగము మధ్యమము, లింగముల ఎత్తు రెండేసి భాగముల తేడాతో ఉండుమ. ఈ విధముగ లింగముల పొడవు పెరగగా తొమ్మిది లింగములు నిర్మాణమగును. హస్తప్రమాణముచే లింగమును. నిర్మించినచో, మొదటి లింగము ప్రమాణము ఒక హస్తము రెండవ దాని ప్రమాణము మొదటి దాని కంటే ఒక హస్తము ఎక్కువ. ఈ విధముగా తొమ్మిది హస్తముల కొలత పూర్తిఅగు వరకు ఒక్కొక్క హస్తము పెంచుతు పోవలెను. పైన చెప్పిన హీన-మధ్యమ - జ్యేష్ఠ లింగములలో ఒక్కొక్క దానికి మూడేసి భేదము లుండును.
బుద్ధిమంతుడు ఒక్కొక్క లింగమునందు విభాగ పూర్వకముగ. మూడేసి లింగములు నిర్మింప చేయవలెను. ద్వారమానము, గర్భమానము, హస్తమానము అను ఈ మూడు దీర్ఘమానానుసారము స్థిర లింగమును నింపవలెను. పై మూడు ప్రమాణముల ననుసరించి భగేశుడు, జవేశుడు, దేవేశుడు అని మూడు పేర్లు ఏర్పడును విష్కంభ (విస్తార) మును బట్టి లింగమునకు నాలుగు రూపములు గుర్తింపవలెను. దైర్ఘ్య ప్రమాణానుసారము ఏర్పడు, మూడు రూపములలో కావలసిన లింగమునకు శుభమగు ఆయాదికనుండు నట్లు చూచు కొనవలెను. ఈ మూడు విధముల లింగముల పొడవు నాలుగు లేదా ఎనిమిది హస్తము లుండుట మంచిది. ఇవి వరుసగ త్రిగుణ స్వరూపములు. లింగము పొడవు ఎన్ని హస్తములున్నదో ఆ హస్తములను ఆంగుళములలోనికి మార్చి, ఎనిమిది, ఏడు, ఐదు, మూడు సంఖ్యలచే విభజించవలెను మిగిలిన దానిని పట్టి శుభాశుభ నిర్ణయము చేయవలెను.
ధ్వజాద్యాయములలో ధ్వజ – సింహ - గజ - వృషభాయములు మంచివి. మిగిలిన నాల్గును చెడ్డవి. స్వర సంఖ్యచే - ఆనగా ఏడుచేత భాగించినప్పుడు వడ్డ - గాంధార - పంచమములు (శేషము) శుభదాయకములు. భూతములచేత. అనగా ఐదుచేత - భాగించినపుడు శేషము పృథివి, ఆయిన శుభము. అగ్ని చేత- అనగా మూడుచేత భాగించినపుడు శేషము ఆహవనీయాగ్నియైన శుభము. లింగము పొడవును సగము చేసి, దానిని ఎనిమిదిచే భాగించగా శేషము ఏడు. వచ్చినచో ఆలింగము “ఆడ్యము” ఐదు కంటె. ఆధికము. శేషమైనచో “అనాథ్యము” ఆరు అంశల కంటే అధికము శేషమైనచో అది “దేవేజ్యము”. మూడు అంశల కంటె . ఆధికము. శేషించినచో అది. “ఆర్కతుల్యము”. ఈ నాలుగు విధములగు లింగములుమ చతుష్కోణములుగ నుండును. ఐదవది “వర్గమాన లింగము”, దీనికి వ్యాసము కంటే ఆనాహము ఆధికము. ఆవాహము, వ్యాసముతో సమానముగ ఉండుట, దాని కంటే పెద్దదిగా ఉండుట అను దానినిపట్టి, ఈ లింగములలో రెండు భేదము లుండును. విశ్వకర్మ శాస్త్రానుసారము ఈ అన్నింటి భేదము లనేకములు చెప్పబడగలవు. స్థూలత్వాదులచే ఆధ్యాది లింగములలో మరల మూడు భేదము లుండును. వాటికి ఒక్కొక్క యవ చొప్పున పెంచగా మొత్తము ఎనిమిది విధముల లింగము లేర్పడును. హస్తమానమును పట్టి ‘జిన’ మను లింగమునకు గూడ మూడు భేదము లగును. దానిని సర్వ సమలింగమున కలిపివేయవలెను.
ఆనాడ్యము, దేవార్చితము, అర్కతుల్యము అను లింగములకు గూడ ఐదేసి భేదములగుటచే ఇరువదియైడు అగును. ఏక-జిన-భక్త భేదములచే డెబ్బదియైదు భేదము లగును. అన్నియు కలుపగా పదునై దువేల, నాలుగు వందల శివలింగము లగును. ఎనిమిది అంగుళముల విస్తారముగల లింగము కూడ ఏకాంగుళమానము, హస్తమానము, గర్భమానము అను మానత్రయము ననుసరించి తొమ్మిది భేదము లగును. వీటి నన్నింటిని కోణ-అర్ధకోణము. లందున్న సూత్రములచే వీటి కోణములను విభజింపవలెనని ఒక్కొక్క విభాగము యొక్క విస్తారము, లింగ మధ్యభాగ విస్తారతుల్యముగ భావించి మధ్య. ఊర్ధ్వ-అధో విభాగము లేర్పరుపవలేను. మధ్యమ విభాగముపై నున్న ఆష్ట్ర కోణము లేదా షోడశకోణము అగు విభాగము శివుని అంశము. మూల భాగమునుండి జానువు పర్యంతము ఉండు లింగాధోభాగము బ్రహ్మ యొక్క అంశము. జానువు నుండి నాభి వరకును ఉన్న లింగ మధ్యభాగము విష్ణువు యొక్క అంశము.
మూర్ధానభాగము భూతభాగేశ్వరునిది. వ్యక్త-అవ్యక్త లింగ మన్నింటికిని ఇదే పద్దతి. ఐదులింగము ఏర్పాటున్న శివలింగమునకు శిరోభాగమును గుండ్రముగ చేయవలెను. ఈ గోలాకారము ఛత్రమువలె నుండవచ్చును, కోడిగుడ్డువలె నుండవచ్చును, లేదా నవోదితచంద్రుడువలె ఉండవచ్చును. కామ్యభేదమును పట్టి నాలుగువిధములగు నలభేదములను చెప్పుచున్నాను. లింగము శిరోవిస్తారము ఎన్ని అంగుళములుండునో ఆ సంఖ్యను ఎనిమిది చే భాగించవలెను. ఈ విధముగ శిరస్సును ఎనిమిదిభాగములుగ- ఈ విభజించి మొదటి నాలుగుభాగములను విస్తార. ఔన్నత్యములననుసరించి గ్రహింపవలెను. ఒక భాగమును తీసివేసుగా “పుండరీకము” అను లింగ ఘు, రెండుభాగమును తీసివేయగా, “విశాలము” అనులింగము, మూడు భాగములను తీసివేయగా “శ్రీవత్సము” అనులింగము, నాలుగుభాగములను తీసివేయగా, శత్రుకారకలింగము ఏర్పడును. అన్ని ప్రక్కలనుండియు శిరోభాగము సమముగ నున్నది. శ్రేష్ఠము. దేవపూజ్య లింగమునందు లింగ శిరోభాగము కుస్కుటాండమువలె గోలాకారమున నుండవలెను.
చతుర్బాగాత్మక లింగమునందు పై రెండు భాగములను తొలగించగా.”త్రపుష” మను లింగ మేర్పడును. ఇది అనాథ్యమను. శివలింగముయొక్క శిరస్సుగా చెప్పబడుచున్నది.. ఇప్పుడు అర్ధచంద్రాకార శిరస్సు గూర్చి వినుము. శివలింగ ప్రాంతభాగమునందు ఒక అంశమును నాలుగు అంశములుగ చేసి ఒక అంశమును విడిచినచో దానికి “అమృతాక్షరము” అని పేరు. రెండవ-మూడవ-నాల్గవ అంశములను తొలగింపగా, క్రమముగ వాటికి పూర్ణేందు “బాలేను” “కుముద” ము అని పేర్లు. ఇవి.క్రమముగ చతుర్ముఖ - త్రిముఖ - ఏకముఖములు.. ఈ మూడింటికి “ముఖలింగము” లని కూడ పేర్లు. ఇపుడు ముఖలింగమును గూర్చి వినుము. పూజాభాగమును, మూడ్రిపూజ, “ఆగ్నిపూజ- వదపూజ” అని మూడు విధములుగ కల్పించుకొనవలేను.. వెనుక టివలె ద్వాదశాంశమును విడచి, ఆరుభాగముల ధ్వారా ఆరు స్థానములను అభివ్యక్తము చేయవలెను. శిరస్సు ఎత్తుగానుండునట్లు, లలాటనాసికా-ముఖ-మిక కంఠములు -స్పష్టముగ కనబడునట్లు చేయవలెను. ఈ నాలుగు:ఆంశములచే రెండుభుజములను, నేత్రములను ఏర్పరుపవలేను.. ప్రతిమా ప్రమాణానుసారము హస్తము, ముకులాకారముగ ఏర్పరచి, విస్తారములోని ఎనిమిదవ ఆంశముచే నాలుగుముఖముట్రను ఏర్పరుపవలెను. అన్ని ప్రక్కలనుండియు సమముగ ఉండవలెను. ఇంతవరకు చతుర్ముఖ లింగమును గూర్చి చెప్పితిని; వినుము.
చతుర్ముఖలింగముకంటె త్రిముఖలింగమునకు చెవులు, పాదములు ఆధికము. లలాటాదులను వెనుకటివలెనే ఏర్పరుపవలెను నాలుగు అంశలతో రెండు భుజములను నిర్మింపవలెను. వాటి వెనుక భాగము దృఢముగా నుండవలెను. “విస్తారముయొక్క ఎనిమిదవ ఆంశ మురళడు మూడు ముఖములును స్పషముగ కనబడవలెను. - (ఏకముఖ లింగము). ఏకముఖమును తూర్పువైపున నిర్మింపవలెను. దాని నేత్రములు- సౌమ్యుముగా నుండవలెను. దాన్ని లలాటనాసికా-ముఖ కంఠములు పైకి ఉబికి యుండవలెను. బాహువిస్తారములో ఐదవ అంశముచే పైన చెప్పిన 'అవయవముల నిర్మాణము జరుగవలెను. దానిని బాహురహితముగా నిర్మింపవలెను. ఈ ఏకముఖలింగ మునందు విస్తారములో ఆరవ ఆంశమునందు ముఖ నిర్మాణము హితకరమని చెప్పబడినది. ముఖయు క్తములగు అన్ని లింగముల శిరోభాగములును.-త్రపుషాకారమురో గాని, కుక్కుటాండాకారములోగాని ఉండవలెను.
ఆగ్ని మహాపురాణమునందు లింగమానాదివ్యక్తావ్యక్త లక్షణమను ఏబదినాల్గవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 54 of the Agni Purāṇa is as follows:
This chapter describes the ritual of dīpārādhana or nīrājana — the waving of lamps before the deity as the highest form of sākṣātkāra (direct vision) of Bhagavān's presence. The proper types of lamps (clay, brass, gold), the number of wicks (one, five, seven, or sixteen), the type of oil or ghee to use, and the clockwise circular movement of the lamp before the deity are all prescribed. The five-fold nīrājana — using fire, water, cloth, flowers, and earth — as a complete offering of all five elements is described. The bells to be rung, the conch to be blown, and the mantras to be recited during the lamp-waving are given. The chapter affirms that the moment of nīrājana — when the lamps illuminate the deity's face — is the moment of maximum darśana and that the darśana of the lamp-illuminated form of Bhagavān destroys sins accumulated over seven births.