ఆగ్ని రువాచః-
అగ్ని దేవుడు పలికెను: భుక్తి ముక్తి ప్రదాయకము లగు చతుర్దశీవ్రతమును చెప్పెదను. కార్తి కచతుర్దశినాడు నిరాహారడై శివుని పూజించవలెను. అది మొదట ప్రతిమాసము శివచతుర్దశినాడు వ్రతము - శివపూజనము ఒక సంవత్సరము పాటు జరుపవలెను. ఇట్లు చేయువాడు భోగ - ధన - దీరాయుఃసంపన్ను డగును. మార్షశీర్ష శుక్ల పక్షమున అష్టమీ.తృతీయా ద్వాదశీ - చతుర్దశులలో ఒకనాడు మౌనవ్రత మవలంబించి, ఫలములు మాత్రము భుజించుచు దేవతాపూజ చేయవలెను. కొన్ని నలములు త్యజించి, వాటిని దానము చేయవలెను. ఈ విధముగ పలచతుర్దశీవ్రతమాచరించువాడు రెండు పక్షముల చతుర్ధశి-అష్టమి తిథులయందు ఉపవాస ముండి శివునిపూజించవలెను. ఇట్లు రెండు పక్షములందును చతుర్దశీవ్రతము చేయువానికి స్వర్గము లభించును. కృష్ణపక్ష అష్టమి - చతుర్ధశలందు రాత్రిభోజనము మాత్రము చేయువాడు ఇహలోకమున ఆలీష్ట లోగములను పరలోకమున శఠగతిని పొందును. కార్తిక కృష్ణచతుర్దశినాడు స్నానమాచరించి, ధ్వజాకారమగు వెదురు గడపై ఇంద్రుని పూజించువాడు సుఖవంతుడగున పిదప ప్రతిమాసమునందును శక్ల చతుర్దశినాడు కుశలతో విష్ణవిగ్రహము నిర్మించి దానిని జంపూర్ణకలశముపై నుంచి పూజించవలెను. ఆనాడు ఒక ప్రస్థము బియ్యము పిండితో ఆప్పములు వండి సగ ము బ్రాహ్మణునకు దానము చేసి, సగ ముతాను ఉపయోగించవలెను. నదీతటమున ఈ వ్రతహశాదులు చేసి, ఆనంతవ్రతకథ వినిపించవలెను. పదునాలుగు ముడుల గల అనంతసూత్రము నిర్మించి దానిని ఆనంతునీగ పూజించి “ఓ వాసుదేవా! అనంత మైన సంసారమహాసముద్రమునందు మునిగిన మమ్ము ఉద్దరించుము. నీ ఆనంతరూపమునంద మమ్ములను కలుపుకొనుము. ఓ అనంతరూపా! నీకు నమస్కారము” అను ఆర్థము గల ముత్రమ వరించుచు, చేతికి గాని కంఠమునకు గాని కట్టుకొనవలెను. ఈ విధముగ అనంత వ్రతమాచరించువాడు పరమానందసంపన్నుడగును.
అగ్ని మహాపురాణమునందు వివిధచతుర్దశీవ్రతవర్ణన మను నూట తొంబది రెండవ అధ్యాయము సమాప్తము .
Summary of chapter 192 of the Agni Purāṇa is as follows:
Vratas on the fourteenth tithi, associated with Śiva and Viṣṇu's Ananta form, are described. The Kārtika-caturdaśī vrata involves Śiva-pūjā with one year of fasting for the attainment of bhoga, dhana, and āyus. The Phala-caturdaśī on Mārgaśīrṣa-śukla prescribes a fruit-only diet throughout. The Ubhaya-caturdaśī observance of both-pakṣa eighth and fourteenth tithis leads to svarga. On Kārtika-kṛṣṇa-caturdaśī, Indra is worshipped on a bamboo pole with specific decorations. The Ananta-vrata performed on any śukla-caturdaśī involves tying a fourteen-knot Ananta-sūtra on the right wrist with Viṣṇu worshipped in the form of a kūrca, and half of the eight handfuls of rice is given to a brāhmaṇa at the conclusion.