అగ్ని పలికెను. ఇపుడు భుక్తి ముక్తి ప్రదాయక మగు ఏకాదశీవ్రతమును గూర్చి చెప్పెదను. దశమియందు నియతాహారవంతుడై మాంసమైథునములను వర్ణించవలెను. రెండు పక్షములందును ఏకాదశులందు భోజనము చేయగూడదు. ఏకాదశి ద్వాదశలు కలిసిన దినమున శ్రీహరి సన్నిహితుడై యుండును. ఆ రోజున ఉపవాసము చేసి త్రయోదశినాడు పారణము చేసినచో నూరు యజ్ఞములు చేసిన ఫలము లభించును. ఏకాదశినాడు కొంచెము ఏకాదశి ఉండి పిదప ద్వాదశి వచ్చినచో, అపుడు ఉపవాసము చేసి త్రయోదశినాడు పారణము చేసినవానికి నూరు యజ్ఞముల ఫలము లభించును. ఏకాదశినాడు దశమి కలసివచో ఉపవాస ముండరాదు. నరకము వచ్చును. ఏకాదశినాడు ఉపవాస ముండి మరుచటి రోజున “పుండరీకాక్షా! నేనీ రోజున భుజింతును; నాకు రక్షకుడవు అగుము” అని ప్రార్థించి భోజనము చేయవలెను. శకైకాదశి యందు పుష్యమీ నక్షత్రము ఉన్నపుడు ఉపవాస మున్నచో అదీ అధికఫల ప్రదము. పాపవినాశకము. ఏకాదశీర్వాదశీతిథులు శ్రవణ నక్షత్రయుక్తము లైనచో అది విజయతిథ. భక్తులకు జయప్రదము. ఫాల్గుణమాసమున పుష్యమీనక్షత్రయుక్త మగ ఏకాదశికూడ విజయాతిథి. అది అనేక కోట్ల రెట్టింపు ఫలము నిచ్చునది. ఏకాదశినాడు విష్ణుపూజ చేయవలెను. ఆదీ అందరికిని ఉపకారకము అట్లు చేసినవాడు ధనపుత్రాదిమంతుడై విష్ణులోకమునందు పూజింపబడును.
ఆగ్ని మహాపురాణమునందు ఏకాదశీవ్రతనిరూపణ మను నూట ఎనుబదియేడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 187 of the Agni Purāṇa is as follows:
The rules and extraordinary merits of the Ekādaśī vrata are detailed, establishing it as the crown of all monthly vratas. Agni declares that fasting on both pakṣa-eleventh tithis is obligatory for all Vaiṣṇavas; when Ekādaśī and Dvādaśī fall together, Hari is especially present and the combined upavāsa with pāraṇa on trayodaśī yields merit equal to one hundred yajñas. An Ekādaśī contaminated by daśamī-taint (vedha) must not be observed; doing so causes naraka. Pauṣa-śukla-ekādaśī with the Puṣya-nakṣatra yields akṣaya-phala, and Ekādaśī or Dvādaśī coinciding with Śravaṇa-nakṣatra is called Vijayā-tithi with hundred-fold merit. Viṣṇu-pūjā on Ekādaśī is guaranteed to grant dhana, putra, and ultimately Viṣṇu-loka.